ప్రధాని మోదీ చేతుల మీదుగా మే 28న కొత్త పార్లమెంటు భవనం ప్రారంభం
లోక్‌సభ సెక్రటేరియ్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం కొత్త పార్లమెంటు భవనం నిర్మాణం పూర్తయింది. ఈ భవనం స్వావలంబన భారత్ స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని ఆ ప్రకటన పేర్కొంది.
లైవ్ కవరేజీ
కేసీఆర్ వారంలో ‘సమస్య తీరుస్తా’ అన్నారు. ఏడేళ్లయినా పోస్టింగులు రాలేదు. ఎందుకు?
ధన్యవాదాలు
బీబీసీ లైవ్ పేజీని ఇంతటితో ముగిస్తున్నాం. తాజా అప్డేట్స్‌తో మళ్ళీ రేపు ఉదయం కలుసుకుందాం.
ధన్యవాదాలు.
ప్రధాని మోదీ చేతుల మీదుగా మే 28న కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభం

ఫొటో సోర్స్, Getty Images
నూతన పార్లమెంటు భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 28న ప్రారంభిస్తారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ కింద ఈ కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించారు.
పీటీఐ వార్తా సంస్థ అందించిన సమాచారం ప్రకారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా గురువారం నాడు ప్రధానమంత్రి మోదీని కలిసి కొత్తగా నిర్మించిన పార్లమెంటు భవనాన్ని ప్రారంభించాలని కోరారు.
లోక్‌సభ సెక్రటేరియ్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం కొత్త పార్లమెంటు భవనం నిర్మాణం పూర్తయింది. ఈ భవనం స్వావలంబన భారత్ స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని ఆ ప్రకటన పేర్కొంది.
గత మార్చి నెలలో ప్రధాని మోదీ కొత్త పార్లమెంటు భవనాన్ని సందర్శించి, నిర్మాణ కార్మికుల్ని కలుసుకున్నారు. ఈ సరికొత్త పార్లమెంటు భవనం అత్యాధునిక సౌకర్యాలతో, అన్ని కార్యాలయాలకు, సమావేశాల నిర్వహణకు అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు.
ఇందులో విశాలమైన లైబ్రరీ, కమిటీ రూమ్, డైనింగ్ హాలు వంటి సౌకర్యాలున్నాయి. వాహనాల పార్కింగ్ కోసం కూడా తగినంత స్థలాన్ని కేటాయిచారు. విశాలమైన రాజ్యాంగ భవనంతో పాటు ఎంపీల లాంజ్‌లు కూడా ఏర్పాటు చేశారు. ఈ భవనంలో ఇంకా మూడు గ్యాలరీలు ఉన్నాయి. టెక్స్‌టైల్స్, వివిధ రాష్ట్రాల చారిత్రక కట్టడాలు ఈ గ్యాలరీలో కనిపిస్తాయి.
కొత్త పార్లమెంటు భవనంలో లోక్‌సభ, రాజ్యసభల మార్షల్స్‌కు కొత్త డ్రెస్ కోడ్ అమలు చేయబోతున్నారు.
ది కేరళ స్టోరీ: అదా శర్మకు బెదిరింపులు వస్తున్నాయా... తాజా వివాదాలపై ఆమె ఏమంటున్నారు?
వాకింగ్: రోజూ నడవడం వల్ల కలిగే 10 లాభాలు
డబ్బులు ఇస్తామన్నా పిల్లలను కనట్లేదు
ప్రాచీన హీబ్రూ బైబిల్‌కు రూ. 314 కోట్లు

ఫొటో సోర్స్, Reuters
ఫొటో క్యాప్షన్, హీబ్రూ బైబిల్ అత్యంత పురాతనమైన హీబ్రూ బైబిల్ 314 కోట్లకి అమ్ముడుపోయింది. న్యూయార్క్‌లోని సోతిబీస్‌లో ఈ ప్రాచీన గ్రంథాన్ని వేలం వేశారు.ఈ వేలంలో అమ్ముడుపోయిన అత్యంత విలువైన పుస్తకం ఇదే.
సుమారు 1,100 సంవత్సరాల క్రితం రాశారని భావిస్తున్నారు. విరామ చిహ్నాలు, అచ్చులు, ఉచ్చారణ వివరాలతో కూడిన 24 పుస్తకాల సంకలనమైన హీబ్రూ బైబిల్ అత్యంత ప్రాచీనమైనది.
అమెరికా న్యాయవాది, మాజీ రాయబారి ఆల్ఫ్రెడ్ మోసెస్ దీనిని ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌లోని ఏఎన్యూ మ్యూజియం ఆఫ్ జ్యూయిష్ ప్రజల కోసం కొనుగోలు చేశారు. "హిబ్రూ బైబిల్ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైనది. పాశ్చాత్య నాగరికత పునాదిగా ఉంది. ఇది యూదు ప్రజలకు చెందడం నాకు సంతోషంగా ఉంది" అని మోసెస్ ఒక ప్రకటనలో తెలిపారు.
పాకిస్తాన్ అస్తవ్యస్తంగా మారితే భారత్ ఆందోళన చెందాలా వద్దా?
'జల్లికట్టు'కు ఆమోదం తెలిపిన సుప్రీం కోర్టు

ఫొటో సోర్స్, ANI
జల్లికట్టును అనుమతిస్తూ తమిళనాడు ప్రభుత్వం చేసిన చట్ట సవరణకు సుప్రీం కోర్టు ఆమోదం తెలిపింది. పిటిషన్లపై విచారణ జరిపిన ఐదుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం ఈ మేరకు తీర్పు చెప్పింది.
జల్లికట్టు చట్టం రాజ్యాంగబద్దతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను కూడా సుప్రీం కోర్టు కొట్టివేసింది.
జల్లికట్టు ఆట తమ రాష్ట్ర సాంస్కృతిక వారసత్వమని తమిళనాడు ప్రభుత్వం కోర్టులో వాదనలు వినిపించింది.
ఈ చట్టాన్ని సమర్థించిన సుప్రీం కోర్టు, కొన్ని శతాబ్దాలుగా ఈ సంప్రదాయం కొనసాగుతోందని వ్యాఖ్యానించింది.
చట్టానికి రాష్ట్రపతి ఆమోదం లభించిందని, ఇప్పుడు ఇందులో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.
చట్టంలో ఎలాంటి లోపాలు లేవని, అది పూర్తిగా చెల్లుబాటు అవుతుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఏది సాంస్కృతిక వారసత్వమో, ఏది కాదో నిర్ణయించడానికి చట్టసభ ఉత్తమమైనదని, వాటిని న్యాయ వ్యవస్థ నిర్ణయించదని కోర్టు అభిప్రాయపడినట్టు బీబీసీ ప్రతినిధి సుచిత్ర మొహంతి తెలిపారు.
అమ్మ దూరమైన బాధ తట్టుకోలేక ఇంట్లోనే ఆరడుగుల అమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్న కూతుళ్లు
‘అన్నీ మంచి శకునములే’ రివ్యూ: నందినీ రెడ్డి సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ పండాయా?
కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రిగా డీకే శివకుమార్

ఫొటో సోర్స్, ANI
ఫొటో క్యాప్షన్, డీకే శివకుమార్, ఖర్గే, సిద్ధరామయ్య కర్ణాటక సస్పెన్స్‌కు తెర పడింది. ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బాధ్యతలు చేపడతారని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.
వచ్చే లోక్‌సభ ఎన్నికల వరకూ కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా డీకే శివకుమార్ కొనసాగనున్నారు.
గత ఐదు రోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్‌కు కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ తెరదించారు. మీడియా సమావేశంలో ఆయన ఈ మేరకు ప్రకటన చేశారు.
ముఖ్యమంత్రి పదవి కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య తీవ్ర పోటీ కొనసాగింది.
కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో 224 నియోజకవర్గాలకుగానూ 135 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది.
ఎన్నికల్లో విజయం అనంతరం బెంగళూరులో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశం జరిగింది. అయితే, ఆ సమావేశంలో సీఎం ఎవరనే విషయంపై ఏకాభిప్రాయం రాలేదు.
ఎమ్మెల్యేలు డీకే శివకుమార్ వర్గం, సిద్ధరామయ్య వర్గాలుగా విడిపోయారు.

ఫొటో సోర్స్, SIDDARAMAIAH/FACEBOOK
సిద్ధరామయ్య ప్రత్యేకతలు
2013 నుంచి 2018 వరకు సిద్ధరామయ్య కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేశారు.
1983లో ఆయన తొలిసారి కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1994లో, అప్పటి జనతాదళ్ ప్రభుత్వంలో కర్ణాటక డిప్యూటీ సీఎం పదవి చేపట్టారు.
హెచ్‌డీ దేవెగౌడతో వివాదాలు తలెత్తడంతో జనతాదళ్ (ఎస్)ను వీడి 2008లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత 2013లో ముఖ్యమంత్రి అయ్యారు.
ఇప్పటి వరకూ 12 సార్లు ఎన్నికల్లో పోటీ చేసిన సిద్ధరామయ్య, 9 సార్లు విజయం సాధించారు.
ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా పేదల కోసం ప్రవేశపెట్టిన అనేక పథకాలు ప్రజల మన్ననలు పొందాయి. స్కూల్‌కి వెళ్లే విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన 7 కేజీల బియ్యం, పాలు అందజేసే 'వలన్న భాగ్య యోజన', ఇందిరా క్యాంటీన్ వంటి పథకాలను ఆయన ప్రవేశపెట్టారు.

ఫొటో సోర్స్, ANI
కాంగ్రెస్ పార్టీ ప్రకటనకు ముందు, సిద్ధరామయ్య కొత్త ముఖ్యమంత్రి కాబోతున్నారా? అని డీకే శివకుమార్‌ను ఇండియా టుడే ప్రశ్నించగా ''పార్టీ ప్రయోజనాల కోసం.. అలా ఎందుకు కాకూడదు?'' అని ఆయన వ్యాఖ్యానించారు.
పోస్ట్ X స్కిప్ చేయండి, 1X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
డీకే శివకుమార్ సోదరుడు, ఎంపీ డీకే సురేశ్ ఏఎన్‌ఐతో మాట్లాడారు.
''నేను పూర్తిగా సంతోషంగా లేను. కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం, మా నిబద్ధతను నిరూపించుకోవాలనుకుంటున్నాం. అందువల్ల డీకే శివకుమార్ ఒప్పుకున్నారు. భవిష్యత్తులో చూద్దాం. ఇంకా చాలా ప్రయాణం ఉంది. డీకే శివకుమార్ సీఎం కావాలని కోరుకుంటున్నా.'' అని డీకే సురేశ్ చెప్పారు.
''ముఖ్యమంత్రి కావాలనుకున్నాం. కానీ అది జరగలేదు. భవిష్యత్తులో చూద్దాం'' అన్నారు.
పోస్ట్ X స్కిప్ చేయండి, 2X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
హెయిర్ హ్యాంగింగ్ టెక్నిక్.. అలవాటును వృత్తిగా మార్చుకున్న యువతి
కిరణ్ రిజిజును న్యాయశాఖ నుంచి తప్పించిన మోదీ

ఫొటో సోర్స్, Getty Images
కేంద్ర మంత్రి కిరణ్ రిజిజును న్యాయశాఖ నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తప్పించారు. న్యాయవ్యవస్థపై చేస్తున్న వ్యాఖ్యలతో కిరణ్ కొద్ది రోజులుగా వార్తల్లో నిలుస్తున్నారు.
సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్‌కు ఇప్పుడున్న శాఖలకు అదనంగా న్యాయశాఖ బాధ్యతలను అప్పగించారు. స్వతంత్ర హోదా(ఇండిపెండెంట్ ఛార్జ్) గల సహాయ మంత్రిగా ఆయన ఈ బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
కిరణ్ రిజిజుకు భూవిజ్ఞాన శాస్త్రాల శాఖ బాధ్యతలను అప్పగించారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.

ముంబయి 26/11 పేలుళ్ల కేసు: తహవుర్ రాణాను భారత్‌కు అప్పగించేందుకు అమెరికా కోర్టు ఆమోదం

ఫొటో సోర్స్, YEARS
అమెరికా జైల్లో ఉన్న 2008 ముంబయి పేలుళ్ల కేసులో నిందితుడు తహవుర్ రాణాను భారత్‌కు అప్పగించేందుకు యూఎస్ కోర్టు ఆమోదం తెలిపింది.
రాణాను అప్పగించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్లలో ఉన్న నేరాల తీవ్రతను బట్టి ఆయన్ను అప్పగించవచ్చని కాలిఫోర్నియా కోర్టు తన ఆదేశాల్లో చెప్పింది.
2008 నవంబర్ 26న పాకిస్తాన్‌కు చెందిన లష్కరేతోయిబా తీవ్రవాదులు ముంబయిపై దాడులు చేశారు.
ఈ కేసులో పాకిస్తాన్ మూలాలున్న కెనడా వ్యాపారి తహవుర్ రాణా పాత్రపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) దర్యాప్తు చేస్తోంది.
ముంబయి పేలుళ్ల కేసులో ఆయన పాత్ర ఉందంటూ భారత్ చేసిన విజ్ఞప్తి మేరకు అమెరికా ఆయన్ను అరెస్టు చేసిందని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.
పోస్ట్ X స్కిప్ చేయండి, 1X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
''తన చిన్ననాటి స్నేహితుడు పాకిస్తానీ అమెరికన్ డేవిడ్ కొలెమన్ హెడ్లీకి లష్కరేతోయిబాతో సంబంధముందని రాణాకు తెలుసు. హెడ్లీకి సాయం చేయడం ద్వారా తీవ్రవాద సంస్థలు, వాటితో సంబంధమున్న వ్యక్తులకు ఆయన సాయం చేశారు'' అని అమెరికా ప్రభుత్వ న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు.
ముంబయి దాడుల ఘటనలో 166 మంది చనిపోయారు. వారిలో ఆరుగురు అమెరికన్లు కూడా ఉన్నారు.
భారత్, అమెరికా మధ్య నేరస్థుల అప్పగింత ఒప్పందం ఉంది. రాణాను భారత్‌కు అప్పగించడం పూర్తిగా ఒప్పందం పరిధిలోని అంశమేనని న్యాయమూర్తి తన తీర్పులో రాశారు.
పోస్ట్ X స్కిప్ చేయండి, 2X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
నమస్కారం
బీబీసీ వార్తలకు స్వాగతం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల అప్డేట్ కోసం లైవ్ పేజీ చూస్తూ ఉండండి.
నిన్నటి లైవ్ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య: ‘పశువుల కాపరి’ నుంచి రెండోసారి ముఖ్యమంత్రి అయ్యే వరకు.. ఒక సోషలిస్ట్ బీసీ నేత కథ
