‘‘ప్రిన్స్ హ్యారీ, మేఘన్‌ల కారును 2 గంటల పాటు వెంబడించారు’’- హ్యారీ ప్రతినిధి
హ్యారీ ప్రతినిధి వార్తా సంస్థ రాయిటర్స్‌తో మాట్లాడుతూ, ‘‘ఇది చాలా ప్రమాదకరంగా మారి ఉండొచ్చు. వారి కారును దాదాపు 2 గంటల పాటు అనుసరించారు. వారు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు’’ అని చెప్పారు.
లైవ్ కవరేజీ
ప్రధాని మోదీ చేతుల మీదుగా మే 28న కొత్త పార్లమెంటు భవనం ప్రారంభం
తిరుపతి - వేమన ఇండ్లు: ఈ గ్రామంలోకి దళితులను రానివ్వరు.. ఇక్కడ ఎవరూ చెప్పులు వేసుకోరు
ధన్యవాదాలు
బీబీసీ తెలుగు లైవ్ పేజీని ఇంతటితో ముగిస్తున్నాం. మళ్ళీ రేపు తాజా వార్తలతో కలుసుకుందాం.
సెలవ్. నమస్తే.
భారత రికార్డును బ్రేక్ చేయడానికి 90 గంటలు వంట చేసిన నైజీరియా షెఫ్
బ్లడ్ ప్రెషర్ ఎందుకు పెరుగుతుంది... ఎలా అదుపులో పెట్టుకోవాలి?
‘‘ప్రిన్స్ హ్యారీ, మేఘన్‌ల కారును 2 గంటల పాటు వెంబడించారు’’- హ్యారీ ప్రతినిధి

ఫొటో సోర్స్, Getty Images
ఫొటో క్యాప్షన్, ప్రిన్స్ హ్యారీ, మేఘన్ బ్రిటన్ రాజకుటుంబానికి చెందిన ప్రిన్స్ హ్యారీ, ఆయన భార్య మేఘన్ మర్కెల్ ప్రయాణిస్తోన్న కారును అమెరికాలో వెంబడించారు.
హ్యారీ ప్రతినిధి ఒకరు వార్తా సంస్థ రాయిటర్స్‌తో మాట్లాడుతూ, ‘‘ఇది చాలా ప్రమాదకరంగా మారి ఉండొచ్చు. వారి కారును దాదాపు 2 గంటల పాటు అనుసరించారు. వారు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు’’ అని చెప్పారు.
గత రాత్రి న్యూయార్క్‌లో ఈ ఘటన జరిగినప్పుడు తమ కారులో మేఘన్ తల్లి డోరియా కూడా ఉన్నట్లు ప్రిన్స్ హ్యారీ, మేఘన్ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
కింగ్ చార్లెస్ పట్టాభిషేకం తర్వాత మేఘన్, హ్యారీ తొలిసారి ఒక పబ్లిక్ ఈవెంట్‌కు హాజరయ్యారు.
ఎంఎస్ ఫౌండేషన్ విమెన్ ఆఫ్ విజన్ అవార్డుల కార్యక్రమానికి ప్రిన్స్ హ్యారీ, డోరియాతో కలిసి మేఘన్ వెళ్లారు.
ప్రిన్స్ హ్యారీ తల్లి ప్రిన్సెస్ డయానా 1997లో పారిస్‌లో జరిగిన కారు ప్రమాదంలో మరణించారు.
డయానా ప్రయాణిస్తున్న కారును కూడా ఇలాగే వెంబడించారు.
ఈ ప్రమాదంలో డయానా సహచరుడు డోడీ ఫాయెద్, కార్ డ్రైవర్ హెన్రీ పాల్ కూడా మరణించారు.
హిందూజా గ్రూప్ చైర్మన్ ఎస్పీ హిందూజా కన్నుమూత

ఫొటో సోర్స్, Getty Images
హిందూజా గ్రూప్ చైర్మన్ శ్రీచంద్ పర్మానంద్ (ఎస్పీ) హిందూజా కన్నుమూసినట్లు వార్తా సంస్థ పీటీఐ తెలిపింది.
ఈ మరణవార్తను ఆయన కుటుంబ ప్రతినిధి ధ్రువీకరించినట్లు వెల్లడించింది.
87 ఏళ్ల ఎస్పీ హిందూజా ఈరోజు అనారోగ్యంతో లండన్‌లో మరణించారు. హిందూజా యూకే పౌరసత్వం తీసుకున్నారు.
నలుగురు హిందూజా సోదరుల్లో ఎస్పీ హిందూజా అందరికంటే పెద్దవారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
సూడాన్: 'గుర్రాలపై వచ్చే దెయ్యాల'ను ఎదుర్కోవడానికి ఏకే-47 పట్టుకున్న అకౌంటెంట్
కర్ణాటక ముఖ్యమంత్రి ఎంపిక గురించి రణదీప్ సూర్జేవాలా ఏమన్నారంటే...

ఫొటో సోర్స్, Getty Images
కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రిని త్వరలోనే ప్రకటిస్తామని కాంగ్రెస్ నేత, ఆ పార్టీ కర్ణాటక ఎన్నికల ఇన్‌చార్జి రణదీప్ సూర్జేవాలా అన్నారు.
బుధవారం మీడియాతో ఆయన మాట్లాడారు.
‘'కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రస్తుతం చర్చలు జరుపుతున్నారు. కాంగ్రెస్ ఒక నిర్ణయానికి రాగానే వెంటనే మీకు తెలియజేస్తాం. ఆ తర్వాత 48-72 గంటల్లోగా కర్ణాటకలో కొత్త మంత్రివర్గం ఏర్పాటు అవుతుంది’’ అని అన్నారు.
18వ తేదీన ప్రమాణస్వీకారం అంటూ వస్తోన్న వార్తల గురించి ఆయన బీబీసీతో మాట్లాడారు.
‘‘ప్రమాణ స్వీకారం తేదీని ఇంకా నిర్ణయించలేదు. ఎందుకంటే, ఎవరు ముఖ్యమంత్రిగా నియమితులైతే వారే ప్రమాణ స్వీకార తేదీని నిర్ణయిస్తారు. పుకార్లను పట్టించుకోవద్దు. సీఎం గురించి వస్తున్న వార్తల్లో లేదు. అవి నిజమని నమ్మవద్దు. బీజేపీ తప్పుడు వార్తలను ప్రచారం చేస్తోంది’’ అని చెప్పారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
'ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ హ్యాలూసినేషన్' అంటే ఏంటి... ఇది ఎందుకంత ప్రమాదకరం?
పబ్లిక్‌లో సన్నిహితంగా ఉండడం, ముద్దు పెట్టుకోవడం నేరమా, చట్టాలు ఎలా నిర్ణయిస్తాయి?
70 అడుగుల లోతులో నీరు, తాగునీటి కోసం ప్రాణాలకు తెగిస్తున్న మహిళలు
హిందూ మహాసముద్రంలో చైనీస్ నౌక మునిగి 39 మంది గల్లంతు

ఫొటో సోర్స్, ANI
హిందూ మహాసముద్రంలో చైనా మత్స్యకార నౌక మునిగి 39 మంది గల్లంతయ్యారని చైనా ప్రభుత్వ మీడియా సంస్థ సీజీటీఎన్ ( చైనా గ్లోబల్ టెలివిజన్ నెట్‌వర్క్ ) రిపోర్ట్ చేసినట్లు ఏఎన్‌ఐ వార్తా సంస్థ తెలిపింది.
మంగళవారం జరిగిన ఈ ఘటనలో ఇప్పటి వరకూ సిబ్బంది ఆచూకీ లభించలేదు.
మత్స్యకారుల నౌకలో 17 మంది చైనీయులు, ఇండోనేషియాకు చెందిన 17 మంది, ఫిలిప్పీన్స్‌కి చెందిన ఐదుగురు గల్లంతైనట్లు సీజీటీఎన్ పేర్కొన్నట్లు ఏఎన్‌ఐ తెలిపింది.
గల్లంతైన సిబ్బంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
చైనా కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3 గంటలకు ( భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 12.30 గంటలు ) నౌక మునిగిపోయినట్లు చెబుతున్నారు.
సహాయక చర్యలు చేపట్టాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అధికారులను ఆదేశించారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
చైనా ఆయుధ సంపత్తికి దీటుగా భారత నౌకాదళం ఎలా సిద్ధమవుతోంది?
పశ్చిమ బెంగాల్ : బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు, 9 మంది మృతి

ఫొటో సోర్స్, ANI
పశ్చిమ బెంగాల్‌లో బాణాసంచా అక్రమ తయారీ కేంద్రంలో జరిగిన పేలుళ్లలో 9 మంది మృతి చెందినట్లు ఏఎన్ఐ తెలిపింది. ఈస్ట్ మిడ్నాపూర్ జిల్లాలోని ఇగ్రాలో ఈ పేలుళ్లు జరిగాయి.
''ఫ్యాక్టరీలో అక్రమంగా టపాసులు తయారు చేస్తున్నారు. గతంలో ఈ ఫ్యాక్టరీపై దాడులు చేసి కేసు కూడా నమోదు చేశాం. గత వారం కూడా ఈ ఫ్యాక్టరీలో తనిఖీలు చేశాం. కానీ, అప్పుడు ఏమీ కనిపించలేదు.'' అని పుర్బా మెదినిపూర్ ఎస్పీ అమర్నాథ్.కె తెలిపారు.
తొమ్మిది మంది మృతదేహాలను గుర్తించామని, గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు.
నమస్కారం
బీబీసీ వార్తలకు స్వాగతం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల అప్డేట్ కోసం లైవ్ పేజీ చూస్తూ ఉండండి.
నిన్నటి లైవ్ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సెక్స్‌కు, గుండెపోటుకు సంబంధం ఉందా?
