ధన్యవాదాలు
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.
డీఆర్‌డీవో, సైన్యానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని సేకరించి, విదేశీ గూఢచార సంస్థలకు చేరవేశారనే ఆరోపణలతో ఒక ఫ్రీలాన్స్ జర్నలిస్టుపై సీబీఐ కేసు నమోదు చేసింది.
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.

ఫొటో సోర్స్, Getty Images
డీఆర్‌డీవో, సైన్యానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని సేకరించి, విదేశీ గూఢచార సంస్థలకు చేరవేశారనే ఆరోపణలతో ఒక ఫ్రీలాన్స్ జర్నలిస్టుపై సీబీఐ కేసు నమోదు చేసింది.
వార్తా సంస్థ పీటీఐ తెలిపిన దాని ప్రకారం, వివేక్ రఘువంశీ అనే వ్యక్తికి సంబంధించిన 12 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు చేసింది.
అమెరికాలోని ఒక డిఫెన్స్ వెబ్‌సైట్‌కు భారత ప్రతినిధిగా రఘువంశీ పనిచేస్తున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
రఘువంశీపై ‘‘అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్’’ కింద సీబీఐ కేసు నమోదు చేసింది.
సోదాల్లో చాలా కీలకమైన పత్రాలు లభించాయని, విచారణ కోసం వాటిని పంపించామని అధికారులు తెలిపారు.డీఆర్‌డీవో ప్రాజెక్టులకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని రఘువంశీ సేకరిస్తున్నారని సీబీఐ ఆరోపించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2

ఫొటో సోర్స్, Getty Images
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్‌ల మధ్య వాగ్వాదం నేపథ్యంలో కాంగ్రెస్ ప్రతినిధి పవన్ ఖేడా స్పందిస్తూ, సమర్థులైన నాయకులు ఎందరు ఉన్నా ముఖ్యమంత్రి అయ్యేది ఒక్కరేనని అన్నారు.
‘‘చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి ఒకరి కంటే ఎక్కువ మంది సమర్థులైన నాయకులున్నారు.రాజస్థాన్‌లో పరిస్థితి కూడా ఇలాగే ఉంది. అక్కడ కూడా ఇద్దరు, ముగ్గురు సమర్థులైన నాయకులు ఉన్నారు. కానీ, ఒక్క నాయకుడు మాత్రమే ముఖ్యమంత్రి అవుతారు. మిగతా వారికి కూడా ఆశలు ఉంటాయి. ఉండాలి కూడా’’ అని హైదరాబాద్‌లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో పవన్ ఖేడా అన్నారు.
ఈ ఏడాది డిసెంబర్‌లో రాజస్థాన్‌లో ఎన్నికలు జరగనున్నాయి.
రాజస్థాన్‌లో మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ సోమవారం, ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు.
మే నెలాఖరులోగా తన డిమాండ్‌ను నెరవేర్చకపోతే, రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలను ప్రారంభిస్తామని సోమవారం సచిన్ పైలట్ అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, ANI
తమిళనాడులోని విల్లుపురం, చెంగల్పట్టు జిల్లాల్లో కల్తీ మద్యం మృతుల సంఖ్య 19కి పెరిగింది.
విల్లుపురం జిల్లా మరక్కణం పరిధిలోని మత్స్యకార గ్రామం ఎక్కియార్ కుప్పానికి చెందిన 14 మంది కల్తీ మద్యం తాగి ప్రాణాలు కోల్పోయారు.
సోమవారం నాటికి 13 మంది ప్రాణాలు కోల్పోగా, ఈరోజు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శరవణన్ అనే మరో వ్యక్తి చనిపోయారు.
కల్తీ మద్యం తాగి అస్వస్థతకు గురవడంతో ఎక్కియార్ కుప్పంకు చెందిన 40 మంది ఈ నెల 13న ఆస్పత్రిలో చేరారు.
చెంగల్పట్టు జిల్లాలోని మధురాంతగంలోనూ కల్తీ మద్యం తాగి ఆస్పత్రి పాలైన సంఘటన ఆదివారం జరిగింది.
ఈ రెండు ఘటనల్లో మొత్తం 19 మంది చనిపోయారు.
అయితే, ఈ రెండు ఘటనలకు సంబంధమున్నట్లు ఎలాంటి ఆధారం లభించలేదని పోలీసులు చెప్పారని ఏఎన్ఐ తెలిపింది.
ఈ కేసులో అమరన్ అనే నిందితుడిని అరెస్టు చేశారు. అతని నుంచి మద్యం స్వాధీనం చేసుకున్నారు. మద్యం శాంపిళ్లను పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించారు.
ఈ ఘటనలపై దర్యాప్తు కొనసాగుతోంది.

ఫొటో సోర్స్, ANI
కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరనేది తేల్చే వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు సమావేశం నిర్వహిస్తున్నారు.
ముఖ్యమంత్రి పీఠం కోసం పోటీ పడుతున్న కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ , మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యలు ఇప్పటికే దిల్లీ చేరుకున్నారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో జరుగుతున్న ఈ సమావేశానికి రాహుల్ గాంధీ హాజరయ్యారు.
ఈ సమావేశానికి కొత్త ఎన్నికైన కర్ణాటక ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారని ఏఎన్ఐ వెల్లడించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, WELLINGTON CITY COUNCIL
హాస్టల్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఆరుగురు మృతి చెందారని, చాలా మంది ఆచూకీ లభించలేదని న్యూజిలాండ్ ప్రధాన మంత్రి స్థానిక మీడియాకి తెలిపారు.
వెల్లింగ్టన్‌లోని నాలుగంతస్తుల హాస్టల్ భవనంలో మంటలు చెలరేగినట్లు అర్ధరాత్రి 12.30 గంటల తర్వాత ఎమర్జెన్సీ సేవల విభాగానికి ఫోన్ చేశారు.
భవనంలో చిక్కుకుపోయిన పదుల సంఖ్యలో బాధితులను సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. అయితే, కనిపించకుండా పోయిన వారి సంఖ్య తెలియడం లేదని పోలీసులు చెప్పారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు.
తెల్లవారుజామున నాలుగు గంటలకు అత్యవసర సిబ్బంది చేరుకునేసరికి భవనం పై అంతస్తులో మంటలు ఎగసిపడుతున్నాయి. దాదాపు 20 ఫైరింజన్లు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి.
ఇది వెల్లింగ్టన్ చరిత్రలో ఒక పీడకల అని అగ్నిమాపక, అత్యవసర సేవల కమాండర్ నిక్ ప్యాట్ చెప్పారు.
భవనంలోకి వెళ్లేంత వరకూ మృతుల సంఖ్యపై స్పష్టత వచ్చే అవకాశం లేదని పోలీసులు తెలిపారు.
భవనంలో ఆస్బెస్టాస్ ఉండడంతో విషవాయువుల బారిన పడకుండా అందరూ మాస్కులు ధరించాలని, తమ ఇళ్లలోని కిటికీలు మూసివేయాలని చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశామని ప్యాట్ చెప్పినట్లు న్యూజిలాండ్ హెరాల్డ్ తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు పంజాబ్ కోర్టు సమన్లు జారీ చేసింది.
బజరంగ్‌దళ్, ఇస్లామిక్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాపై నిషేధం విధిస్తామని కర్ణాటక ఎన్నికల సందర్భంగా విడుదల చేసిన మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది.
దానికి వ్యతిరేకంగా విశ్వ హిందూ పరిషత్ ఖర్గేపై వంద కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేసింది.
విశ్వ హిందూ పరిషత్ అనుబంద సంస్థ అయిన 'బజరంగ్ దళ్ హిందూస్తాన్' అధ్యక్షుడు హితేశ్ భరద్వాజ్ పంజాబ్‌లోని సంగ్రూర్ జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం మల్లికార్జున్ ఖర్గేకు సమన్లు ఇచ్చింది.
అధికారంలోకి వస్తే కులం, మతం పేరుతో విద్వేషాలను రెచ్చగొడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కర్ణాటక ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, బజరంగ్‌దళ్ వంటి సంస్థల పేర్లను అందులో చేర్చింది.
అయితే, బజరంగ్‌దళ్‌ను పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా వంటి సంస్థలతో కాంగ్రెస్ పోల్చడం వివాదానికి దారితీసింది.
బజరంగ్‌దళ్‌ను పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, సిమి, అల్ ఖైదా వంటి సంస్థలతో పోల్చడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. నిషేధిస్తామంటూ చేస్తున్న బెదిరింపులకు బజరంగ్‌దళ్ భయపడదని విశ్వహిందూ పరిషత్ తెలిపింది.
బీబీసీ వార్తలకు స్వాగతం.
స్థానిక, జాతీయ అంతర్జాతీయ వార్తల అప్డేట్ కోసం లైవ్ పేజీ చూస్తూ ఉండండి.
నిన్నటి లైవ్ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.