రాహుల్ గాంధీపై క్రిమినల్ పరువునష్టం కేసు పెట్టిన సావర్కర్ మనమడు
వినాయక్ దామోదర్ సావర్కర్‌ను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అవమానించారని ఆరోపిస్తూ సావర్కర్ మనవడు ఫుణేలో క్రిమినల్ పరువు నష్టం కేసు దాఖలు చేశారు.
లైవ్ కవరేజీ
ముకరం జా: ఈ ఏడో నిజాం వారసుడి రూ.4,000 కోట్ల సంపద ఎలా ఆవిరైంది?
శాకుంతలం మూవీ రివ్యూ: శకుంతలగా సమంత, భరతుడి పాత్రలో అల్లు అర్హ మెప్పించారా?
విశాఖ రుషికొండపై నిర్మాణాలు: హైకోర్టు కమిటీ ఏం తేల్చింది, తెలుగు మీడియా కథనాలు ఏం చెబుతున్నాయి?
లైవ్ అప్‌డేట్స్ సమాప్తం
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల తాజా అప్‌డేట్స్‌తో రేపు ఉదయం కలుద్దాం.
ఈ మామిడి పండ్లను ఈఎంఐలో కొనుక్కోవచ్చు
వజైనల్ ఆట్రఫీ: సెక్స్‌లో నొప్పికి కారణమయ్యే ఈ రుగ్మతకు చికిత్స ఏమిటి?
సింగపూర్ చంగీ ఎయిర్‌పోర్ట్: ప్రపంచంలోనే ఇది అత్యుత్తమ విమానాశ్రయమని ఎందుకు అంటున్నారు?
హైదరాబాద్: హుస్సేన్ సాగర్‌లో బుద్ధ విగ్రహం మునిగిపోయినప్పుడు ఏం జరిగింది?
'హెల్త్ యాంగ్జైటీ' లక్షణాలు ఏమిటి? దీనికి చికిత్స ఎలా?
ఆంధ్రప్రదేశ్‌లో మామిడి దిగుబడి ఎందుకు తగ్గుతోంది? ఉపాధిపై ఎలా దెబ్బ పడుతోంది?
కోడికత్తి కేసు: దాడి ఘటనలో కుట్ర లేదన్న ఎన్‌ఐఏ

ఫొటో సోర్స్, UGC
శంకర్ వడిశెట్టి
బీబీసీ కోసం
విశాఖ విమానాశ్రయంలో 2018 అక్టోబర్ 25న జరిగిన ‘కోడికత్తితో దాడి’ ఘటనలో కుట్ర లేదని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) విజయవాడలోని ప్రత్యేక కోర్టుకు తెలిపింది.
ప్రధాన నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావు టీడీపీ సానుభూతిపరుడంటూ సాగిన ప్రచారంలో వాస్తవం లేదని చెప్పింది. విమానాశ్రయ క్యాంటీన్ నిర్వాహకుడు హర్షవర్ధన్‌కు దాడితో సంబంధం లేదని తెలిపింది.
ఈ కేసు విచారణపై జగన్ తరపున వేసిన పిటిషన్ కొట్టేయాలని కోర్టును కోరింది. ఎన్‌ఐఏ వాదనలపై కౌంటర్ వేసేందుకు జగన్ తరపు న్యాయవాదులు సమయం కోరారు. కేసును కోర్టు సోమవారానికి వాయిదా వేసింది.
కేసు విచారణ తుది దశకి వచ్చిందని, త్వరలోనే తీర్పు వెలువడే అవకాశం ఉందని ఆశిస్తున్నట్టు నిందితుడు శ్రీనివాస్ తరుపు న్యాయవాది సలీం మీడియాతో అన్నారు.
జైలులో నిందితుడు
‘కోడికత్తితో దాడి’ ఘటన తర్వాత అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మీద హత్యాయత్నం జరిగిందంటూ విశాఖ విమానాశ్రయం పోలీసు స్టేషన్‌లో తొలుత కేసు నమోదైంది. తర్వాత జనవరి 1, 2019న కేసును ఎయిర్‌పోర్ట్ అథారిటీ సిఫార్సుతో ఎన్‌ఐఏకి బదిలీ చేశారు. ఆర్‌సీ-01/2019/NIA/HYD నంబరుతో ఈ కేసు రిజిస్టర్ చేశారు. విచారణ ప్రారంభించారు.
నిందితుడు శ్రీనివాసరావుది డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని ముమ్మిడివరం మండలం ఠాణేలంక గ్రామం. రిమాండ్‌లో భాగంగా ఆయన రాజమహేంద్రవరం జైలులో ఉన్నారు.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ: ప్రస్తుతానికి ముందుకెళ్లమన్న కేంద్ర మంత్రి.. కేసీఆర్ దెబ్బ ఇలాగే ఉంటుందన్న కేటీఆర్

ఫొటో సోర్స్, FB / Kalvakuntla Taraka Rama Rao - KTR
ఫొటో క్యాప్షన్, తెలంగాణ మంత్రి కేటీఆర్ విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై ప్రస్తుతానికి ముందుకెళ్లడం లేదని కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ చెప్పారు. ప్రైవేటీకరణ కంటే ముందు ఆర్‌ఎన్‌ఐఎల్‌ను బలోపేతం చేసే పనిలో ఉన్నామన్నారు.
పూర్తి సామర్థం మేరకు ప్లాంట్ పనిచేసే ప్రక్రియపైనే దృష్టి కేంద్రీకరించామని ఆయన చెప్పారు. వీటిపై యాజమాన్యం, కార్మిక సంఘాలతో చర్చిస్తామన్నారు.
బిడ్‌లో తెలంగాణ ప్రభుత్వం పాల్గొనడం ఎత్తుగడ మాత్రమేనని ఫగ్గన్ సింగ్ వ్యాఖ్యానించారు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో తాత్కాలికంగా ముందుకు వెళ్ళడం లేదంటూ కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కేటీ రామారావు స్పందించారు.
సింగరేణి నుంచి అధికారులను పంపించి విశాఖ స్టీల్ ప్లాంట్ పై అధ్యయనం చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారని ఆయన చెప్పారు. దాంతో కేంద్రం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తాత్కాలికంగా ఉపసంహరించుకున్నట్లు ప్రకటించిందని, కేసీఆర్ దెబ్బంటే ఇట్లాగే ఉంటుందని వ్యాఖ్యానించారు.
యూపీ: ‘ఎన్‌కౌంటర్’లో గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్ కొడుకు మృతి.. పోలీసులకు సీఎం యోగి అభినందన

ఫొటో సోర్స్, Abhishek Dwivedi
ఫొటో క్యాప్షన్, అతీక్ అహ్మద్ కొడుకు అసద్ న్యాయవాది ఉమేశ్ పాల్ హత్య కేసులో నిందితులైన గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ కొడుకు అసద్ అహ్మద్, గులాం మొహమ్మద్ ఎన్‌కౌంటర్‌లో చనిపోయినట్లు పోలీసులు తెలిపారు.
ఉత్తర్ ప్రదేశ్‌లోని ఝాన్సీలో ఈ ఎన్‌కౌంటర్ జరిగిందని పోలీసులు చెప్పారు. చనిపోయిన నిందితులిద్దరి వద్ద నుంచి విదేశీ ఆయుధాలు స్వాధీనం చేసుకుంటున్నట్లు తెలిపారు.
ఉమేశ్ పాల్‌పై కాల్పులు జరిపింది ఈ ఇద్దరేనని సీసీటీవీలో రికార్డైనట్లు వారు చెప్పారు. సీసీటీవీ ఫుటేజీలో అసద్ స్పష్టంగా కనిపించారని, ఆయన చేతిలో తుపాకీ ఉందని చెప్పారు.

ఫొటో సోర్స్, Abhishek Dwivedi
ఫొటో క్యాప్షన్, అసద్ ఫిబ్రవరి 24న ప్రయాగ్ రాజ్‌లో పట్టపగలు నడిరోడ్డుపై ఉమేశ్ పాల్ హత్య జరిగింది.
హత్య అనంతరం అసద్ అహ్మద్ పేరును పోలీసులు మోస్ట్ వాంటెడ్ లిస్టులో చేర్చారు. ఆయనతోపాటు మరో నిందితుడు గులాం కోసం గాలింపు చేపట్టారు.వీరిపై ఐదు లక్షల రూపాయల రివార్డును కూడా ప్రకటించారు.
రాజకీయ నాయకుడిగా మారిన గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ చిన్న కొడుకే అసద్ అహ్మద్.
అసద్ అహ్మద్‌పై ఫిబ్రవరి 24కి ముందు ఎలాంటి క్రిమినల్ కేసులూ లేవు. ఆయన వయసు 20 ఏళ్లు. ఈ ఏడాది ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులయ్యారు.
పోలీసులను అభినందించిన సీఎం యోగి
ఈ ఎన్‌కౌంటర్ తర్వాత ఉత్తర్ ప్రదేశ్‌లో శాంతిభద్రతలపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమావేశం నిర్వహించినట్లు సీఎంవో తెలిపింది. ఎన్‌కౌంటర్ జరిగిన విషయాన్ని హోం శాఖ ముఖ్యకార్యదర్శి ముఖ్యమంత్రికి తెలియజేశారని, యూపీ ఎస్టీఎఫ్, డీజీపీ, లా అండ్ ఆర్డర్ స్పెషల్ డీజీ, పోలీసు సిబ్బందిని సీఎం అభినందించారని చెప్పింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలతో ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించినట్లు వివరించింది.
ఏడీఆర్ రిపోర్ట్: అప్పుడూ, ఇప్పుడూ తెలుగు నేతలే కుబేరులు
హైదరాబాద్: 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం గురించి 10 ఆసక్తికర అంశాలు
ఈ ఫుడ్ డెలివరీ బాయ్ తన భార్యను ఎందుకు వెంట తీసుకువెళ్తున్నారు?
పోలీసుల ఘోర తప్పిదంతో టీనేజర్‌కు మరణశిక్ష, 28 ఏళ్లు జైల్లోనే..చివరికెలా బయటపడ్డారంటే?
భారత్‌లో 10వేల కోవిడ్ కేసులు

ఫొటో సోర్స్, ANI
భారత్‌లో గడచిన 24 గంటల్లో 10,158 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించినట్లు పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.
ఇండియాలో మొత్తం కేసుల సంఖ్య 44,998కి చేరింది. దేశ రాజధాని దిల్లీలో 1149 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కోవిడ్ కారణంగా ఒకరు చనిపోయినట్లు దిల్లీ ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌లో తెలిపింది.
భారత్‌లో పది వేలకు పైగా కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదవడం గత ఏడున్నర నెలల తర్వాత ఇదే మొదటిసారని పీటీఐ పేర్కొంది.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
రాహుల్ గాంధీపై సావర్కర్ మనవడి క్రిమినల్ డిఫమేషన్ కేసు

ఫొటో సోర్స్, SAVARKARSMARAK.COM
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై సావర్కర్ మనవడు పూణె కోర్టులో క్రిమినల్ డిఫమేషన్ కేసు వేశారు.
వినాయక్ దామోదర్ సావర్కర్‌ను రాహుల్ గాంధీ అవమానించారని ఆయన ఆరోపిస్తున్నారు.
ఇప్పటి వరకూ జరిగింది చాలు అని సావర్కర్ మనవడు సత్యకి సావర్కర్ ఏఎన్‌ఐ వార్తా సంస్థతో అన్నారు.
''గత నెలలో రాహుల్ గాంధీ ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లారు. అక్కడ ఆయన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ముస్లిం వ్యక్తిపై ఐదు, ఆరుగురు కలిసి దాడి చేసి ఎంజాయ్ చేశామని సావర్కర్ ఒక పుస్తకంలో రాసినట్లు చెప్పారు. ఆ మాటలు సావర్కర్‌ను అవమానించేలా ఉన్నాయి. పెన్షన్, పిటిషన్ గురించి కూడా రాహుల్ గాంధీ, ఇంకా ఆయన మద్దతుదారులు చాలా మాట్లాడుతున్నారు. నిజానికి అది భరణం, క్షమాభిక్షకు సంబంధించిన పిటిషన్. మేం కోర్టును ఆశ్రయించాం'' అని సత్యకి సావర్కర్ చెప్పారు.
అంతకుముందు, సంఘ్ ప్రతిష్టకు భంగం కలిగేలా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారంటూ ఆర్‌ఎస్ఎస్ కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు హరిద్వార్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది.
జనవరిలో జరిగిన ఓ ఘటనపై కేసు నమోదు చేశారు. ఆర్ఎస్ఎస్ ను 21వ శతాబ్దపు కౌరవ సేనగా రాహుల్ వ్యాఖ్యానించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
