డోనాల్డ్ ట్రంప్ అరెస్ట్ అయినట్లు నకిలీ ఫోటోలు, ఇవి ఏఐ జనరేటెడ్ చిత్రాలని గుర్తించడమెలా?

ఫొటో సోర్స్, TRUTH SOCIAL
- రచయిత, కైలీన్ డెవ్లిన్, జోషువా ఛీతం
- హోదా, బీబీసీ న్యూస్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ(ఏఐ) టూల్స్‌తో రూపొందించిన డోనాల్డ్ ట్రంప్ అరెస్ట్‌కు సంబంధించిన నకిలీ ఫోటోలు గత వారం రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఫోర్న్ నటితో సంబంధం కలిగి ఉన్నట్లు ఆయనపై ఆరోపణలున్నాయి. అంతేకాక, అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో వారి సంబంధం బయటికి రాకుండా ఉండేందుకు ఆమెకు పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించారని ఆరోపణలున్నాయి. దీనిపై విచారణ కూడా సాగుతోంది.
ఈ నేపథ్యంలో, అమెరికా మాజీ అధ్యక్షుడు అరెస్ట్ అయినట్లు నకిలీ ఫోటోలు వెలుగులోకి వస్తున్నాయి. కాగా, ఈ కేసు విషయంలో ఆయనపై ఇప్పటి వరకు ఎలాంటి అభియోగాలు నమోదు కాలేదు.
సోషల్ మీడియాలో షేర్ అవుతున్న ఫోటోలు చాలా వరకు ఫేక్ అని వెల్లడవుతోంది. ఈ ఫోటోలు నిజమనుకుని కొంతమంది నమ్మగా, చాలా మంది వ్యక్తులు మాత్రం వీటిని నమ్మడం లేదు.
గురువారం డోనాల్డ్ ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్‌పై ఒక ఏఐ జనరేటెడ్ ఇమేజ్‌ను షేర్ చేశారు. ఈ ఫోటోలో ట్రంప్ మోకాలిపై కూర్చుని ప్రార్థన చేస్తున్నట్లు ఉంది. ఈ ఫోటోను నిశితంగా పరిశీలిస్తే ఆయన చేతి వేళ్లు కనిపించవు.
ఏఐ జనరేటెడ్ ఫోటోలు ఏం చెబుతున్నాయి? నకిలీ, నిజమైన ఫోటోలని గుర్తించడమెలా?

ఫొటో సోర్స్, TWITTER
సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతోన్న, పైన ఉన్న ఫోటోను చూడండి. అది చూడటానికి నిజమైనదిలా ఉంది.
కానీ, ఆ ఫోటోను చాలా దగ్గరగా చూడండి, అది నిజం కాదని అర్థమవుతోంది.
ఆ ఫోటో మధ్యన చూస్తే, ట్రంప్ చేయి చాలా చిన్నగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఎడమవైపున పోలీసు ఆఫీసర్ మనిషి చేతి కాకుండా దేన్నో పట్టుకుని లాగుతున్నట్లు అనిపిస్తోంది.
అదేవిధంగా, ట్రంప్ మెడను చూస్తే, ఆయన తలభాగం, శరీరంతో కలిసున్నట్లే లేదు. ఇదేదో భాగాలు, భాగాలుగా అతకబెట్టి విడుదల చేసిన ఫోటో మాదిరిగా అనిపిస్తుంది.
‘ది ఫ్యూచర్ విల్ బి సింథసైజ్డ్’ పేరుతో చేపట్టిన బీబీసీ రేడియో సిరీస్‌లో మాట్లాడిన ప్రజెంటర్, ఏఐ నిపుణుడు హెన్రీ అజ్డెర్.. ప్రస్తుత టెక్నాలజీ మానవ శరీరంలో వివిధ భాగాలను ముఖ్యంగా చేతులను సరిగ్గా అమర్చడం లేదని అన్నారు.
ఒకవేళ మీరు ఆ ఫోటోలను జూమ్ చేసి చూస్తే, వాటిల్లో తేడాలను చూడొచ్చని, చేతి వేళ్ల సంఖ్యలో తేడాలను కూడా గమనించవచ్చని హెన్రీ చెప్పారు.
ప్రజలేం చెబుతున్నారు?
కొన్ని న్యూస్ సైట్లలో చెక్ చేయడం ద్వారా డోనాల్డ్ ట్రంప్ అరెస్ట్ కాలేదని లేదా అధికారికంగా ఆయనపై ఎలాంటి అభియోగాలు మోపలేదని తెలుసుకున్నామన్నారు ప్రజలు.
ఒకవేళ డోనాల్డ్ ట్రంప్‌పై ఏమైనా అభియోగాలను మోపితే, ప్రపంచవ్యాప్తంగా అన్ని న్యూస్ ఛానల్స్‌లో ఆయన అరెస్టే ప్రధాన వార్తగా ఉంటుందన్నారు.
అంతేకాక, పోలీసుల నుంచి పారిపోతే, మీడియా హడావుడి ఎలాగుంటుందో మీరు ఊహించుకోవచ్చు.
ఏ సందర్భంలో ఈ ఫోటోను షేర్ చేస్తున్నారో కూడా ఆలోచించడం మంచిది.
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్న ఈ ఫోటోను ఎవరు షేర్ చేస్తున్నారు? దాని వెనుకున్న ఉద్దేశాలేమిటి? అన్న విషయాలను కూడా తెలుసుకోవాలి.
ఫోటోలు నిజమైనవో కాదో నిర్ధారించుకోకుండానే కొంతమంది వ్యక్తులు తమ రాజకీయ అభిప్రాయాలను పంచుకునేందుకు వీటిని షేర్ చేస్తూ ఉంటారని అజ్డెర్ అన్నారు.
‘‘ఫేక్ ఫోటోలకు సంబంధించిన ఎన్నో ఉదాహరణలను మనం చూశాం. హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీకి సంబంధించిన నకిలీ వీడియో ఒకటి ఇలానే చక్కర్లు కొట్టింది.’’ అని అజ్డెర్డ్ చెప్పారు. ఆ వీడియో వల్ల చాలా మంది ప్రజలు తెలివి తక్కువ వారయ్యారని అన్నారు.
ఈ ఫోటోలను దగ్గరగా చూస్తే మరిన్ని వింతైన వివరాలు తెలుస్తాయి.
స్కిన్ టోన్లు అసహజంగా ఉండటం, ముఖాలు సరిగ్గా లేకపోవడం లేదా జూమ్ చేస్తే బ్లర్ అయిపోవడం వంటి వాటి ద్వారా ఈ ఫోటోలు నకిలీవని చాలా బలంగా చెప్పొచ్చు.

ఫొటో సోర్స్, ELIOT HIGGINS
పైన పేర్కొన్న ఫోటోను చూసి చెప్పొచ్చు అది నకిలీదని. ఆయన ముఖం మసక మసకగా కనిపించడం మనకు స్పష్టంగా కనిపిస్తోంది. అలాగే ఆయన జుట్టు కూడా బ్లర్‌గా ఉంది. అదేదో అతకపెట్టిన మాదిరి అనిపిస్తోంది.
నిజమైన కళ్లను చూపించడంలో ఏఐ టెక్నాలజీ ఇంకా నిపుణత సాధించలేదు.

ఫొటో సోర్స్, ELIOT HIGGINS
పైన కనిపిస్తోన్న ఇమేజ్‌లో, అధికారులు ట్రంప్‌ను పట్టుకోవడానికి పరిగెడుతున్నట్లు అనిపిస్తుంది. కానీ, వారిని నిశితంగా గమనిస్తే వారు పూర్తిగా వేరే వైపుకి పరిగెడుతున్నట్లు తెలుస్తుంది.
ఈ ఫోటోల వల్ల రాబోయే రోజుల్లో సవాలేంటి?
నకిలీ ఫోటోలను సృష్టించడమన్నది ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదని ఏఐ నిపుణులు బీబీసీకి తెలిపారు. వేగంగా పెరుగుతోన్న ఏఐ ఫోటోలు, దుర్వినియోగానికి అవకాశం ఉండటంతో దీనిపై ఆందోళన చెందాల్సి ఉంది.
‘‘ఏఐ జనరేటెడ్ కంటెంట్ వేగంగా పెరుగుతోంది. నిజమైన లేదా నకిలీ కంటెంట్‌కి మధ్య తేడాను అర్థం చేసుకోవడం చాలా కష్టం’’ అని డిజిటల్ కంటెంట్ అనాలసిస్ కంపెనీ ట్రూపిక్ మౌనిల్ ఇబ్రహ్మిం అనారు.
డోనాల్డ్ ట్రంప్ ప్రముఖ వ్యక్తి కావడం వల్ల ఆయన నకిలీ ఫోటోలను తేలిగ్గా గుర్తించవచ్చని నిపుణులు అన్నారు. కానీ, తెలియని వ్యక్తులు ఫోటోలను గుర్తించడం కాస్త కష్టతరమన్నారు. టెక్నాలజీ నిత్యం మరింత మెరుగ్గా రూపొందుతుందన్నారు.
ఇవి కూడా చదవండి:
- రాహుల్ గాంధీ: ‘‘అదానీ మీద మళ్లీ నేను ఏం మాట్లాడతానోనని మోదీ భయపడ్డారు’’
- ‘కులదురహంకారమే’ కాకినాడలో దళిత యువకుని ప్రాణాలు తీసిందా?
- రాహుల్ గాంధీ: కాంగ్రెస్ నేత ముందున్న మార్గాలు ఏంటి?
- పగలు క్లర్క్... రాత్రి ఆటో డ్రైవర్... ఆదివారం బట్టల వ్యాపారి... ఒక వ్యక్తి మూడు పనులు
- పాకిస్తాన్: అహ్మదీయులు ముస్లింలు కారా... వారి మీద దాడులు ఎందుకు జరుగుతున్నాయ్...
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














