రెజ్లర్లతో అలాగే వ్యవహరిస్తారా? డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం జరపాలి: ఐఓసీ

రెజ్లర్ల ఆందోళన

ఫొటో సోర్స్, @BAJRANGPUNIA

    • రచయిత, అభినవ్ గోయల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భారత్‌లో నిరసన తెలుపుతున్న రెజ్లర్లతో పోలీసులు వ్యవహరించిన తీరు బాధించిందని ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ(ఐఓసీ) ఒక ప్రకటనలో పేర్కొంది.

రెజ్లర్లు చేస్తున్న ఆరోపణలపై స్థానిక చట్టాల ప్రకారం నిష్పాక్షికంగా దర్యాప్తు చేయాలని ఐఓసీ కోరింది.

క్రిమినల్ ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా తొలి దశ చర్యలు తీసుకున్నట్లు తెలుసని, అయితే, తదుపరి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది.

దర్యాప్తు వేగంగా పూర్తిచేయాలని, దర్యాప్తు జరుగుతున్నంత కాలం రెజ్లర్లకు భద్రత ఉండాలని ఐఓసీ కోరింది.

రెజ్లర్ల భద్రత విషయంలో అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం జరిగిలా చూడాలని భారత ఒలింపిక్ సంఘానికి ఐఓసీ సూచించింది.

రెజ్లర్లపై దిల్లీ పోలీసుల కేసు, మళ్లీ ఆందోళనకు దిగుతామన్న సాక్షి మలిక్

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్‌ సింగ్‌కు వ్యతిరేకంగా గత నెల రోజులుగా నిరసనలు చేస్తున్న ఒలింపిక్ పతక విజేతలైన రెజ్లర్లను ఆదివారం దిల్లీ పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు.

వారిని దిల్లీలోని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.

ఆ తర్వాత రెజ్లర్లకు, ఇతర నిరసనకారులకు వ్యతిరేకంగా దిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు.

బజ్‌రంగ్ పూనియా, సాక్షి మలిక్, వినేష్ ఫోగట్, నిరసనలు చేసిన ఇతర రెజ్లర్లపై కేసు దాఖలు చేసినట్లు దిల్లీ పోలీసులు తెలిపారు.

రాత్రి పూట నిరసన చేసేందుకు కొంత మంది రెజ్లర్లు తిరిగి జంతర్ మంతర్ వద్దకు వచ్చారని, కానీ, వారికి అనుమతిని నిరాకరించి, వెనక్కి పంపించినట్లు దిల్లీ పోలీసులు చెప్పారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 1

‘‘లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంలో పాల్గొనడం నిజంగా దురదృష్టకరం. మాపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు దిల్లీ పోలీసులకు కొన్ని గంటలు కూడా పట్టలేదు. అదే బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై ఎఫ్ఐఆర్ దాఖలు చేసేందుకు వారం పట్టింది. మేం తిరిగి ఇంటికెళ్లడం సరైన ఆప్షన్ కాదు. ఇతర రెజ్లర్లను నేను కలుస్తాను. తర్వాత ఏం చేయాలన్న దానిపై మేం నిర్ణయం తీసుకుంటాం’’ అని రెజ్లర్ బజ్‌రంగ్ పూనియా ట్విటర్‌లోొ చెప్పారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 2

కొత్త పార్లమెంట్ భవనం ముందు నిరసనకారులు మహిళల మహాపంచాయత్ నిర్వహించాలనుకున్నారు. కానీ, రెజ్లర్లను పార్లమెంట్ భవనం వైపు వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. రెజ్లర్లను బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించారు.

అలాగే, జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేస్తున్న రెజ్లర్ల టెంట్స్‌ను, ఇతర సామగ్రిని కూడా అక్కడి నుంచి తొలగించారు.

దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత మాట్లాడిన సాక్షి మలిక్, తమ నిరసనలు ఇంకా ముగియలేదని అన్నారు. మళ్లీ ఆందోళనకు దిగుతామన్నారు.

పోలీసు కస్టడీ నుంచి విడుదలైన తర్వాత, జంతర్ మంతర్ వద్ద తమ ‘సత్యాగ్రహ్’ నిర్వహిస్తామని సాక్షి మలిక్ చెప్పారు.

ఘాజీపూర్ బోర్డర్‌లో రైతుల నిరసన
ఫొటో క్యాప్షన్, ఘాజీపూర్‌లో రైతుల నిరసన

ఘాజీపూర్ బోర్డర్‌లో రైతుల నిరసన

రెజ్లర్ల ఉద్యమానికి మద్దతు తెలిపిన రైతు సంస్థలు, ఈ పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని చెప్పాయి.

రైతు నాయకుడు రాకేశ్ టికాయత్ నేతృత్వంలో రెజర్లకు మద్దతుగా రైతులు కూడా ఘాజీపూర్ బోర్డర్‌లో తమ నిరసనను తెలియజేశారు.

కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం రోజే మహిళా రెజ్లర్లను అవమానపరిచినట్లు చరిత్ర పేజీల్లో నిలిచిపోతుందన్నారు.

మహిళా రెజ్లర్లకు మద్దతుగా కొన్ని గంటల పాటు నిరసన తెలిపిన రైతులు, సాయంత్రం 6 గంటలకు తమ ఆందోళనలను నిలిపివేశారు.

‘‘ప్రస్తుతం నిరసనలను ఆపివేశాం. కొన్ని రోజుల్లో ఒక సమావేశం నిర్వహిస్తాం. ఆ సమావేశంలో దీనిపై తదుపరి నిర్ణయం తీసుకుంటాం. ఇక్కడికి వచ్చిన వారికి ధన్యవాదాలు’’ అని రాకేశ్ టికాయత్ అన్నారు.

ఫైజాబాద్, అమ్రోహలలో రైతుల సమావేశాలు నిర్వహిస్తామని, ఖాప్ పంచాయతీలు, స్పోర్ట్స్ కమిటీలు తీసుకునే నిర్ణయాలను తాము అంగీకరిస్తామని చెప్పారు.

రెజ్లర్ల టెంట్లు తొలగింపు

ఫొటో సోర్స్, ANI

జంతర్ మంతర్ వద్ద రెజ్లర్ల టెంట్లు తొలగింపు

జంతర్ మంతర్ వద్ద నిరసనలు జరిగే ప్రదేశానికి వెళ్లేందుకు మీడియా ప్రతినిధులకు కూడా పోలీసులు అనుమతి ఇవ్వలేదు.

రెజ్లర్ల నిరసనల ప్రాంతం నుంచి టెంట్లను, ఇతర సామగ్రిని దిల్లీ పోలీసులు తొలగించారు. అక్కడ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.

ఆదివారం జంతర్ మంతర్ వద్ద గందరగోళ పరిస్థితులు నెలకొన్న సమయంలో, కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తున్నారు. నిరసనలు జరుగుతున్న ప్రాంతం, కొత్త పార్లమెంట్ భవనానికి ఒకటిన్నర కి.మీ. దూరంలోనే ఉంది.

ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ప్రధాని మోదీని మహిళా రెజ్లర్లు కోరారు. ప్రధానిగానీ, ఏ మంత్రిగానీ ఇప్పటివరకు దీనిపై స్పందించలేదు.

రెజ్లర్ల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై ఒలింపిక్ పతక విజేత నీరజ్ చోప్రా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇది చూసిన తర్వాత తనకు చాలా బాధేసిందన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 3

రెజ్లర్లను, నిరసనకారుల్ని కస్టడీలోకి తీసుకున్న తర్వాత, వారిని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. చాలా మంది నిరసనకారుల్ని దిల్లీలోని వసంత్ విహార్ పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లారు.

‘‘రెజ్లర్లకు సపోర్ట్ చేసేందుకు శనివారం రాత్రి 8 గంటలకు జంతర్ మంతర్ వద్ద మీరట్ నుంచి మేం ఐదారుగురం మహిళలం వచ్చాం. మా ఇతర సహచరులను వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. పోలీసులు చేసింది చాలా తప్పు. మమ్మల్ని ఈడ్చుకెళ్లారు. మోదీ ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోంది. రెజ్లర్లకు న్యాయం లభించే వరకు, వారు తిరిగి ఇంటికి వెళ్లరు’’ అని మీరట్ నుంచి వచ్చిన గీతా చౌదరి చెప్పారు.

‘‘మా క్రీడాకారులకు న్యాయం జరిగే వరకు నిరసనలు కొనసాగుతాయి. మా కామ్రేడ్లను వివిధ పోలీసు స్టేషన్లలో ఉంచారు. జంతర్ మంతర్ వద్ద మా కూతుర్లతో ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఎప్పటికీ గుర్తుంటుంది’’ అని దిల్లీలోని వసంత్ కుంజ్ పోలీస్ స్టేషన్‌లో ఉన్న హరియాణా వాసి డాక్టర్ సిక్కిం నైన్ అన్నారు.

వినేశ్ ఫోగట్ ఫోటో వైరల్

చేతిలో జాతీయ జెండాతో రోడ్డుపై కింద పడిపోయిన రెజ్లర్ వినేశ్ ఫోగట్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

‘‘క్రీడాకారుల ఛాతిపై మెరిసే పతకాలు దేశానికి గర్వకారణం. ఈ పతకాలతో మన దేశ గౌరవం పెరుగుతుంది. క్రీడాకారుల పట్టుదల, కృషి వల్లనే ఇది సాధ్యమవుతుంది. కానీ, బీజేపీ ప్రభుత్వ అహంకారం విపరీతంగా పెరిగిపోతోంది. మహిళా క్రీడాకారుల గొంతుల్ని వారి బూట్ల కింద నొక్కి పెడుతోంది. ఇది చాలా తప్పు. ప్రభుత్వ అహంకారాన్ని, ఈ అన్యాయాన్ని దేశమంతా చూస్తోంది ’’ అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 4

రాజకీయ సమస్య కాదు: కాంగ్రెస్

రెజ్లర్లతో పోలీసులు వ్యవహరించిన తీరుపై కాంగ్రెస్ మండిపడింది. ‘‘నెల రోజులకు పైగా మహిళా రెజ్లర్లు శాంతియుతంగా కూర్చుని నిరసన చేస్తున్నారు. ఇప్పుడు నిరసన చేయాలనుకుంటే, వారితో ఈ విధంగా వ్యవహరించారు’’ అని పార్టీ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాతే అన్నారు.

ఈ విషయంపై కాంగ్రెస్ రాజకీయం చేస్తోందా అని జర్నలిస్ట్‌లు ఆమెను ప్రశ్నించగా.. ‘‘ఇది దేశ జనాభాలో సగం మంది గుర్తింపుకు చెందిన ప్రశ్న. ఇది మహిళల హక్కులకు చెందినది. రాజకీయ సమస్య కాదు. విపక్షాల ఐక్యతకు సంబంధించిన విషయం కాదు.’’ అని అన్నారు.

దిల్లీ పోలీసుల చర్యను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా విమర్శించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 5
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 5

రెజ్లర్లకు మద్దతుగా బెంగళూరులో కూడా క్రీడాకారులు, ఇతరులు నిరసనలను తెలియజేశారు.

రీత్ అబ్రహ్మం(అర్జున అవార్డు గ్రహీత, అథ్లెట్), నిషా మిల్లెట్(స్విమ్మర్, అర్జున అవార్డు గ్రహీత), శారదా ఉగ్ర(రచయిత)లు ఫ్లకార్డులు పట్టుకుని నిరసనను తెలియజేశారు.

రెజ్లర్లు ఏప్రిల్ 23 నుంచి జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేస్తున్నారు.

రెజ్లింగ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ, ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ రెజ్లర్లు కోరుతున్నారు.

అయితే, రెజ్లర్లు చేస్తున్న ఈ ఆరోపణలను బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తోసిపుచ్చుతున్నారు. ఇవన్నీ నిరాధారమైనవని అంటున్నారు.

రెజ్లర్ల ఆరోపణలపై విచారణ చేసేందుకు ఐదుగురు సభ్యులతో కమిటీ కూడా ఏర్పాటు చేశారు.

వీడియో క్యాప్షన్, జంతర్ మంతర్ వద్ద రెజ్లర్లను బలవంతంగా అదుపులోకి తీసుకున్న పోలీసులు

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)