దిల్లీ: రెజ్లర్ల ఆందోళన, అరెస్టులు, ఉద్రిక్తతలు - 11 చిత్రాలలో...

ఫొటో సోర్స్, @SAKSHIMALIK
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న ఒలింపిక్ పతక విజేతలైన రెజ్లర్‌లతో సహా పలువురు నిరసనకారులను దిల్లీ పోలీసులు జంతర్ మంతర్ వద్ద అదుపులోకి తీసుకుని వివిధ ప్రాంతాలకు తరలించారు.

ఫొటో సోర్స్, @SakshiMalik
దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కొద్దిరోజులుగా ధర్నా చేస్తున్న రెజ్లర్లు కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా అక్కడికి మార్చ్ చేపట్టారు. దీంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

ఫొటో సోర్స్, @SakshiMalik
రెజ్లర్లు పార్లమెంట్ భవనం వద్దకు మార్చ్ నిర్వహించడానికి, వారికి మద్దతుగా ఖాప్ పంచాయతీలు కొత్త పార్లమెంట్ వద్ద మహిళా మహాపంచాయత్ నిర్వహించనున్నట్లు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగారు.

ఫొటో సోర్స్, @SakshiMalik
ఆదివారం మార్చ్ ప్రారంభించిన రెజ్లర్లు, నిరసనకారులను దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకుని వివిధ పోలీసుస్టేషన్లకు తరలించారు. పలువురిని వసంత్ కుంజ్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు

ఫొటో సోర్స్, @BajrangPunia
ఏ ప్రభుత్వమైనా తమ దేశంలోని చాంపియన్‌లతో ఇంత దారుణంగా వ్యవహరిస్తారా? మేం చేసిన నేరం ఏమిటి? అని రెజ్లర్ భజరంగ్ పునియా ప్రశ్నించారు.

ఫొటో సోర్స్, @SakshiMalik
“రెజ్లర్లు, మహిళలందరినీ అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు పోలీసులు జంతర్‌మంతర్ వద్ద మా దీక్షా శిబిరాన్ని తొలగించడం ప్రారంభించారు. మా సామగ్రి తీసివేస్తున్నారు. ఇది గూండాయిజం కాదా ?'' అని రెజ్లర్ సాక్షి మాలిక్ ట్విట్టర్‌లో ప్రశ్నించారు.

ఫొటో సోర్స్, @mandeeppunia1
వసంత్ కుంజ్ పోలీస్ స్టేషన్‌లో ఇరవై మంది మహిళలు, 50 మంది పురుషులను నిర్బంధంలో ఉంచారని హరియాణా నివాసి డాక్టర్ సిక్కిం నైన్ బీబీసీ హిందీతో చెప్పారు.
''మాకు న్యాయం జరిగే వరకు ధర్నా కొనసాగిస్తాం. మా సహచరులను పోలీసులు వివిధ పోలీస్ స్టేషన్లలో ఉంచారు. ఈరోజు జంతర్ మంతర్ వద్ద ఆడబిడ్డలపై ప్రభుత్వ వ్యహహార శైలి గుర్తుంటుంది'' అని అన్నారు.

ఫొటో సోర్స్, @SakshiMalik
‘‘భారత క్రీడలకు ఇది బాధాకరమైన రోజు. లైంగిక వేధింపులకు పాల్పడిన గూండా బ్రిజ్ భూషణ్ ఈరోజు పార్లమెంటులో కూర్చొని మమ్మల్ని రోడ్డుపైకి లాగుతున్నారు'' అని సాక్షి మాలిక్ చెప్పారు.

ఫొటో సోర్స్, @SakshiMalik
రెజ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్న వీడియోను సాక్షి మాలిక్ ట్విట్టర్‌లో పంచుకున్నారు. దీనిపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్విటర్‌లో స్పందిస్తూ.. దేశానికి కీర్తిప్రతిష్టలు తెచ్చిపెట్టే మన క్రీడాకారుల పట్ల ఇలా వ్యవహరించడం చాలా ఖండనీయమని తెలిపారు.

ఫొటో సోర్స్, @SakshiMalik
రెజ్లర్ వినేష్ ఫోగాట్ చేతిలో త్రివర్ణ పతాకంతో నేలపై పడుకున్న ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ చిత్రాన్ని ట్విట్టర్‌లో పంచుకున్న కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ “ఆటగాళ్ల ఛాతీపై ఉన్న పతకాలు మన దేశానికి గర్వకారణం. ఆ పతకాలు, క్రీడాకారుల కృషితో దేశ గౌరవం పెరుగుతుంది. బీజేపీ ప్రభుత్వ దురహంకారం ఎంతగా పెరిగిపోయిందంటే ప్రభుత్వం కనికరం లేకుండా మన మహిళా క్రీడాకారుల గొంతులను బూటు కింద తొక్కేస్తోంది. ఇది పూర్తిగా తప్పు. ప్రభుత్వ దురహంకారాన్ని, చేస్తున్న అన్యాయాన్ని దేశం మొత్తం చూస్తోంది'' అని తెలిపారు.

ఫొటో సోర్స్, ANI
అయితే, నిబంధనలు ఉల్లింఘించిన వారినే అడ్డుకున్నామని దిల్లీ పోలీసులు తెలిపారు.
‘‘ఎవరైతే, బ్యారికేడ్లు దాటుకుని ముందుకు వచ్చేందుకు ప్రయత్నించారో వారిని అడ్డుకున్నాం. అడ్డుకుని ఈ ప్రదేశం నుంచి వారిని వేరే ప్రదేశానికి తరలించాం. వారిపై చట్ట ప్రకారం ఏం చర్యలు తీసుకోవాలి అన్నది, వారు ఏయే నియమాలు ఉల్లంఘించారు అన్నది విచారించి చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటాం’’ అని దిల్లీ పోలీస్ కమిషనర్ దీపేందర్ పాఠక్ అన్నారు.
ఇవి కూడా చదవండి
- రూ. 2,000 నోట్ల వాడకాన్ని ఆపేసిన ఆర్బీఐ.. మీ దగ్గర ఉన్న నోట్లను ఎలా మార్చుకోవాలి?
- నాసిక్: త్రయంబకేశ్వర ఆలయంలో ముస్లింలు ధూపం సమర్పించారా... వైరల్ వీడియోలో ఏముంది, అసలేం జరిగింది?
- జనసేన: పార్టీలకు ఎన్నికల గుర్తులను ఈసీ ఎలా కేటాయిస్తుంది?
- కరీంనగర్ - ఆశ: ఒకప్పుడు భిక్షాటనతో బతికిన హిజ్రా.. ఇప్పుడు ఫొటోగ్రాఫర్ ఎలా అయ్యారు?
- టెన్జింగ్ నార్గే, ఎడ్మండ్ హిల్లరీ: ‘ఎవరెస్ట్‌పైకి సాధారణ వ్యక్తులుగా వెళ్లి, ప్రపంచ హీరోలుగా తిరిగొచ్చారు’
( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














