లఖీంపుర్ ఖీరీ: దళిత అక్కాచెల్లెళ్ళు చెట్లకు వేలాడుతూ కనిపించారు, అసలేం జరిగింది?

వీడియో క్యాప్షన్, లఖీంపుర్ ఖీరీ: దళిత అక్కాచెల్లెళ్ళు చెట్లకు వేలాడుతూ కనిపించారు, అసలేం జరిగింది?

ఉత్తరప్రదేశ్‌లోని లఖీంపుర్ ఖీరీ జిల్లాలో దళిత కుటుంబానికి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్ల మృతదేహాలు చెట్టుకు వేలాడుతూ కనిపించిన ఘటన కలకలం రేపింది.

ఇద్దరూ మైనర్ బాలికలే. ఈ కేసులో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశామని పోలీసులు చెప్పారు.

అయితే, బాలికలను అపహరించినట్టు లేదా ఊరి బయటకి బలంతంగా ఎత్తుకెళ్లినట్టు వస్తున్న ఆరోపణలు అవాస్తవమని పోలీసులు అంటున్నారు.

బాలికల మరణవార్త వెలుగుచూడగానే నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్థులు గంటల తరబడి రోడ్డుపై బైఠాయించారు.

ఉత్తరప్రదేశ్‌లో శాంతిభద్రతలపై ప్రశ్నిస్తూ ఇతర రాజకీయ పార్టీలు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని నిలదీశాయి.

ఇది ప్రభుత్వ వైఫల్యమని మాజీ ముఖ్యమంత్రులు అఖిలేష్ యాదవ్, మాయావతి, కాంగ్రెస్ అధినేత్రి ప్రియాంక గాంధీ ఆరోపించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)