మనిషి మంచం మీద పడుకోవడం ఎప్పటి నుంచి మొదలైంది, అది ఎన్ని రూపాలు మారింది?

రాళ్ల మంచాలు, నిద్ర

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రాళ్లతో చేసిన మంచాల మీద నిద్రించిన పూర్వీకులు

రోమ్‌లో కొత్తగా పెళ్లైన వారి బెడ్ల నుంచి 19వ శతాబ్ధంలో కార్మికులు నిద్రించే బెంచ్‌ల వరకు- మనిషి రాత్రి పూట హాయిగా కునుకు తీసే మంచం ఎలా రూపాలు మార్చుకుంటూ వచ్చింది?

స్కాట్లండ్‌లో ఆర్నే ఐలండ్‌ పశ్చిమ తీరంలో బలమైన గాలులు వీస్తున్నాయి. ఇక్కడో పురాతన గ్రామం ఉంది. దాని పేరు స్కారాబ్రే. పచ్చిక పరిచినట్లు ఉన్న గడ్డి మైదానాలు, పెద్ద పెద్ద రాళ్లు ఒకదాని మీద ఒకటి పేర్చి నిర్మించిన ఒకే గది ఉండే ఇళ్లు, వాటి చుట్టూ మందంగా ఉండే గోడలు ఇళ్ల మీద పచ్చిక, రాళ్లతో నిర్మించిన వీధులు.

నాలుగున్నర వేల ఏళ్ల క్రితం నిర్మించిన ఈ గ్రామం గాలికొదిలేసినట్లుగా కనిపిస్తుంది. అయితే ప్రతీ ఇంటి లోపల రెండు వస్తువులు మాత్రం ఇంకా కళ్లకు తాజాగా కనిపిస్తున్నాయి. అవి మంచాలు.

దక్షిణ స్కాట్లండ్‌లో ఉన్న స్కారాబ్రే గ్రామంలోని ఇళ్లలో దాదాపు ఒకే అమరిక కనిపిస్తుంది. దాదాపు 430 చదరపు అడుగుల్లో ఉండే మధ్య గదిలో పురాతన సామగ్రి ఉంది.

వస్తువుల్ని దాచుకునే అరలకు తోడు చిన్న చిన్న అరలు ఉన్న డ్రెస్సింగ్ టేబుళ్లు, మనిషి ఎత్తులో దీర్ఘ చతురాస్రాకారపు బీరువాలు ఉన్నాయి.

చెట్లు తక్కువగా ఉండే ఈ ద్వీపకల్పంలో లభించిన మిగిలిన కళాఖండాల మాదిరే ఈ పురాతన మంచాలను గట్టి రాయి, ఘనీభవించిన కాంక్రీటుతో తయారు చేశారు.

మంచానికి రెండువైపులా పెద్ద తలగడలు ఉన్నాయి.

వాటిని చూడగానే ఇవి మంచాలు, ఇవి దిండ్లు అని సులభంగా గుర్తించగలిగే ఆకారంలో ఉన్నాయి. కొన్ని ఇళ్లలో మంచాల పక్కనే పురాతన శిలాశాసనాలు కూడా ఉన్నాయి. మంచాల కింద కొన్ని అస్తిపంజరాలు ఉన్నాయి. బహుశా అవి ఇటీవలి కాలానివే అయ్యుండచ్చు.

మనుషులు వేల సంవత్సరాల నుంచి మంచాలు తయారు చేసుకుని వాటిపైనే నిద్రిస్తున్నారు.

మంచాలు ఎలా ప్రారంభం అయ్యాయనే దాని గురించి యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, శాంటాబార్బరాలో ఆంత్రోపాలజిస్టు బ్రయన్ ఫగన్, ఆర్కియాలజిస్టు నదియా దుర్రాని “వాట్ వి డిడ్ ఇన్ బెడ్: ఎ హారిజాంటల్ హిస్టరీ” అనే పుస్తకంలో రాశారు.

భూమి మీద మానవుల ప్రయాణం ప్రారంభమైన తర్వాత వారు నిద్రపోయే ప్రదేశాలు చాలా వరకూ మృదువైన తెగులు అంటని ఆకుల మీద మెత్తగా ఉండే ఆకులను వేసి ఉండేవని భావించారు.

తర్వాత కొంతకాలానికి బెడ్‌ఫ్రేమ్‌లు కనిపించడం మొదలైంది. స్కారాబ్రేలో కనుక్కున్న ఇసుకరాతితో చేసిన మంచాలు అన్నింటికంటే పురాతనమైనవి.

ఇవి ఇంగ్లండ్‌లోని స్టోన్‌హెంజ్ ప్రాంతం వద్ద ఉన్న డురింగ్‌టన్ వాల్స్ కాలం నాటివని భావిస్తున్నారు. తర్వాత కొంతకాలం క్రితం కనుమరుగైపోయిన చెక్క పెట్టె బెడ్లు కూడా ఈ వరుసలో ఉన్నాయి.

5వేల ఏళ్ల క్రితం నుంచే బెట్లు అనే కాన్సెప్ట్ ఆచరణలోకి వచ్చింది. మనిషి రాయడం నేర్చుకున్న తర్వాతే మంచాల మీద పడుకోవడం మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ నాగరికతల్లో ఒకే సమయంలో మంచాలు ఉన్నాయి.

మాల్టాలోని ఓర్క్నీ నుంచి 1700 మైళ్ల దూరంలో బయటపడిన శ్మశానాలలో మంచాలకు సంబంధించిన ఆధారాలు వెలుగు చూశాయి. ఒక స్త్రీ తన తలకింద ఒక చెయ్యి పెట్టుకుని, ఎత్తుగా ఉన్న ఫ్లాట్‌ఫామ్ మీద నిద్రిస్తున్న మట్టి బొమ్మ కూడా ఇందులో ఉంది.

అంటే ఆ కాలంలో మంచాలు కేవలం విశ్రాంతి తీసుకోవడానికి మాత్రమే కాదు. మరణానంతర జీవితంలో కూడా మనుషులకు వాటి అవసరం ఉందని ఆ కాలంలో నివశించిన వారు భావించినట్లు దుర్రానీ, ఫగన్ రాశారు.

వేల సంవత్సరాలుగా మంచం రకరకాలుగా రూపు మార్చుకుంటూ వచ్చింది. ప్రజల ఆలోచనలు, అవసరాలు, సంప్రదాయాలకు అనుగుణంగా ఈ మార్పులు జరిగాయి. పాశ్చాత్య ప్రపంచంలో పడగ్గదుల్లో మంచం చరిత్ర ఎలా మారుతూ వచ్చిందో సంక్షిప్తంగా చూద్దాం.

స్కారాబ్రే, తుపాను, గడ్డి మేటలు

ఫొటో సోర్స్, Alamy

ఫొటో క్యాప్షన్, స్కారాబ్రేను తొలిసారిగా 1850లో గుర్తించారు. వేలఏళ్ల నుంచి ఈ ప్రాంతాన్ని కప్పేసిన గడ్డి తుపానుకు కొట్టుకుపోవడంతో ఇది బయటపడింది.

పురాతన ఈజిప్టు- తలగడలు, మంచాలు

1922లో హొవార్డ్ కార్టర్ ఈజిప్టు రాజు టుటంకమన్‌ సమాధిని పగలగొట్టి లోపలకు వెళ్లి చూసినప్పుడు ఆయన పక్కన మెరుస్తున్న అనేక బంగారు వస్తువులు కనిపించాయి. అందులో ఆరు మంచాలు ఉన్నాయి. దొంగతనం చేసి దోచుకొచ్చిన వస్తువుల్ని చెల్లాచెదరుగా విసిరేసినట్లుగా ఆ వస్తువులు పడి ఉన్నాయి.

అందులో గోమాతగా భావించే మెహత్-వెరెట్ బొమ్మను అలంకరించిన మంచం, తాడుతో అల్లినట్లుగా కనిపించే మరో మంచం, రాజు క్యాంపుకు వెళ్లినప్పుడు పడుకోవానికి వీలుగా ఉన్న మడత మంచం ఉన్నాయి. అందులో ఉన్న వివిధ రకాల మంచాలలో అవే మొదటివి కావచ్చు.

టుటుంకమన్, ఈజిప్టు నాగరికత, ఫారోలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, టుటంకమన్ కొంతకాలమే అధికారంలో ఉన్నారు. ఆయన సమాధిలో ఆరు మంచాలతో సహా విలువైన సంపద చాలా లభించింది.

ఈజిప్టులో అనేక మంది సంపన్నుల కోసం తయారు చేసే మంచాల మాదిరిగానే టుటంకమన్ వద్ద కూడా చెక్క ఫ్రేముని కొసలతో అల్లిన మంచం ఉంది. అలాగే అప్పటి ప్రజలు కోరుకున్న సైజులోనే వీటిని తయారు చేశారు.

టుటుంకమన్ యువకుడిగా ఉన్నప్పుడు దిండు గలీబు మీద కాకుండా అతని తలను తలగడ మీద పెట్టుకుని పడుకునేవారు. వేడి వాతావరణంలో ఇలాగే పడుకోవడం వల్ల శరీరంలోకి గాలి దారాళంగా వెళ్లేది. అలాగే కేశాలంకరణకు కూడా ఇబ్బంది ఉండేది కాదు.

పురాతన ఈజిప్షియన్లలో టుటుంకమన్ నాయనమ్మ సహా అనేకమంది కొన్ని సార్లు రింగులు తిరిగిన, గుబురుగా ఉండేలా, జడలు వేసుకుని జుట్టుని అలంకరించుకునేవారు.

పరుపులు, నల్లులు, పేల సమస్యలు

ఫొటో సోర్స్, Alamy

ఫొటో క్యాప్షన్, గట్టిగా ఉండే తలగడల వల్ల ఆనేక లాభాలు ఉండేవి. మెత్తగా ఉండే పరుపుల వల్ల నల్లులు, పేల బాధను తప్పించుకోవచ్చు.

పురాతన రోమ్- ప్రతీ సందర్భం కోసం ప్రత్యేక మంచం

పురాతన రోమ్‌లో అనేక కమ్యూనిటీలు ఉండేవి. ప్రజలు తమ సామాజిక హోదాకు తగ్గట్టుగా మంచాలు చేయించుకుని నిద్రించేవారు. కొంతమంది బానిసలు ఎండిపోయిన ఆకులు, జంతు చర్మాల మీద లేదా నేల మీద నిద్రించేవారు. మిగతావారు కొంత సౌకర్యంగా ఉండే వాటిపై పడుకునేవారు.

రోమన్ సామ్రాజ్యపు పురాతన నగరం పాంపేయి శివార్లలోని సివిటా గులియానాలో పురావస్తు శాఖ 2021లో తవ్వకాలు జరిపింది. ఇందులో భాగంగా ఓ పురాతన విల్లాలో ఘనీభవించిన స్థితిలో ఉన్న ఓ బెడ్‌రూమ్ బయటపడింది. ఇది 2వేల ఏళ్ల నాటిది.

ఇందులో కొన్ని డబ్బాలు, చెక్క పెట్టెలు, ఇతర వస్తువులు, మూడు బెడ్లు చెల్లా చెదరుగా పడి ఉన్నాయి. ఈ మంచాలు చెక్కతో తయారు చేసిన వాటికి సన్నటి తాడు(నులక) అల్లి ఉంది. వాటి మీద పరువులు లేవు. పొడవాటి దుప్పట్లు ఉన్నాయి.

పాంపేయి, సివిటా గులియానా, బానిసలు

ఫొటో సోర్స్, Alamy

ఫొటో క్యాప్షన్, సివిటా గులియానాను లావా ముంచేసిన తర్వాత అలాగే ఉండిపోయిన మంచం. శిధిలావస్థకు చేరుకున్న దుప్పటి. దీనిని బానిసలు ఉపయోగించినట్లు అంచనా వేస్తున్నారు.
రోమన్లు, మంచాలు

ఫొటో సోర్స్, Alamy

ఫొటో క్యాప్షన్, రోమ్ ఉన్నత వర్గాల వారు డిన్నర్ కోసం కూడా మంచం దిగేవారు కాదు. మంచాన్ని రౌండ్ టేబుల్ గా మార్చుకుని దానిపై తినేవారు.

ఆధునిక యూరప్‌లో మంచాలు- పెద్ద పరుపులు, నల్లుల బాధ

17వ శతాబ్ధం నాటికి యూరోపియన్లకు విస్తృత స్థాయిలో బెడ్లను ఎంచుకునే అకాశం దక్కింది. అందులో చెక్క పెట్టెలతో చేసిన బెడ్లు, తాడుతో అల్లిన బెడ్లు, అలాగే నాలుగు వైపులా పెద్ద స్థంబాల మీద ఏర్పాటు చేసిన చెక్క బెడ్లు అందుబాటులోకి వచ్చాయి.

వీటిలో తాడుతో అల్లిన మంచం కారణంగానే స్లీప్ టైట్ అనే భావన వచ్చింది. అలాగే నాలుగు స్థంభాల మీద చెక్కతో రూపొందించిన గ్రేట్ బెడ్ ఆఫ్ వేర్ మీద 52 మంది పడుకునేవారు.

మంచాల రూపు ఎలా మారినా..మోడ్రన్ బెడ్డింగ్‌లో వచ్చిన కీలకమైన మార్పు మందంగా ఉండే పెద్ద పరుపు.

చిన్న గోతాల మాదిరిగా కనిపించే ఈ గలీబులు కొన్ని సందర్భాల్లో చాలా పెద్దవిగా మారేవి. అవి కూడా చాలా గట్టిగా, బిగుతుగా అల్లిన దుస్తుల్లో ఉండేవి.

వీటిని అప్పట్లో ‘టికింగ్’ అని పిలిచేవారు. అందులో జంతువుల ఈకల నుంచి మెత్తటి గడ్డితో సహా రకరకాల మెటీరియల్‌ను నింపేవారు. దాని మీద పడుకున్నప్పుడు హాయిగా నిద్రపట్టేలా మెత్తగా ఉండేలా వాటిని తయారు చేసేవారు.

ఎట్ డేస్ క్లోజ్: ఏ హిస్టరీ ఆప్ నైట్ టైమ్‌ అనే పుస్తకంలో ఒక ప్రయాణికుడు 1646లో స్విట్జర్లాండ్ గుండా వెళ్లేటప్పుడు ఓ రోజు తాను పడుకున్న పరుపు గురించి రాశారు.

ఆ పరుపు లోపల ఎండు ఆకులు ఉన్నాయని, వాటిపై పడుకోగానే అవి ముక్కలవుతున్న శబ్ధం వచ్చేదని అందులో కొన్ని ముళ్లలాంటివి గుచ్చుకున్నాయని రాశారు.

పరుపులు, దూది

ఫొటో సోర్స్, Alamy

ఫొటో క్యాప్షన్, 20వ శతాబ్ధంలో బాగా పెరిగిన మెత్తటి పరుపుల వాడకం

మందంగా ఉండే పరుపుల వాడకం పెరిగిన తర్వాత వాటిలో నల్లులు, పేలు చేరడం మొదలైంది. అప్పటి నుంచే మంచం మీద ఒకరి కంటే ఎక్కువ మంది పడుకోవడం కూడా మొదలైంది.

గుర్తు తెలియని వ్యక్తులను కూడా మంచం మీదనే పడుకోబెట్టుకునే వారు. దీని వల్ల అంటు వ్యాధుల సంక్రమణం కూడా జరిగేది.

కాఫిన్స్, లేబరర్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ‘శవపేటిక నివాసాలు’ లండన్‌లో ఇళ్లు లేని వారికి ఆహారం అందించడంతో పాటు పడుకునేందుకు చేసిన ఏర్పాటు.

విక్టోరియన్ ఇంగ్లండ్- మగత నిద్రలో ఉన్నవారు, ఇళ్లు లేనివారు

19వ శతాబ్ధంలో ఇంగ్లండ్‌లో సాంఘిక అసమానతలు రికార్డు స్థాయిలో పెరిగాయి. కొత్తగా అవతరించిన పారిశ్రామిక ఆర్థిక యుగంలో కార్మికులు రోజువారీ ఆహారం సంపాదించుకోవడానికే చాలా కష్టాలు పడాల్సి వచ్చేది.

దీనికి తోడు వేగంగా పెరుగుతున్న జనాభా పట్టణాలు, నగరాల్లో ఇళ్ల కొరతను తీవ్రం చేసింది. లండన్‌లో కొన్ని స్వచ్చంధ సంస్థలు అసంబద్ధమైన పరిష్కారాలతో ముందుకొచ్చాయి. అందులో ఒకటి ‘నాలుగు పెన్నీల శవపేటిక’.

శవపేటికలను పోలి ఉండే బాక్సులను వరుసల్లో అమర్చేవారు. ఇందులో ఒక రాత్రి పడుకోవాలంటే నాలుగు పెన్నీలు చెల్లించాలి.

మరొకటి రోప్ బెడ్. దీనికి రెండు పెన్నీలు చెల్లించాలి. రోప్ బెడ్‌లో పొడవాటి బెంచ్ మీద అనేక మంది కూర్చుని వీపు, తలను రెండు పొడవాటి తాళ్ల మీద ఆన్చి పడుకుని నిద్రపోయేవారు.

తెల్లారగానే ఈ తాడును రెండో చివర కోసేసేవారు. దీంతో నిద్ర పోతున్న వారు కిందపడి మేల్కొనే వారు. నిద్ర సరిపోని వాళ్లు, మగత నిద్రలో ఉన్న వారు రోడ్ల పక్కన అరుగుల మీద పడుకునేవారు.

ఆర్థిక వ్యవస్థలో రెండో చివరన ఉన్న వారు సౌకర్యవంతంగా నిద్రపోయేవారు. 1990లో ఓ జర్మన్ పరిశోధకుడు తొలిసారిగా స్ప్రింగ్ కాయిల్ పరుపు మీద పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.

అప్పటి నుంచి నిద్ర పోయేందుకు సౌకర్యం కొత్త పుంతలు తొక్కింది. గతంతో పోలిస్తే ప్రస్తుతం మంచాలు, పరుపుల విషయంలో అనేక ప్రత్యామ్నాయాలు ఉన్నాయి.

ఫోమ్ బెడ్స్, వాటర్ బెడ్స్, హీటెడ్ బెడ్స్, ఫ్యూటన్స్, బంక్ బెడ్స్, ఒట్టోమాన్ బెడ్స్, కనొపి బెడ్స్...ఇలా ఈ జాబితా చాలా పెద్దది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)