అద్దె తక్కువని ఇంట్లో దిగారు.. కానీ అనుకోకుండా 8 సంవత్సరాల నాటి మర్డర్ మిస్టరీని ఛేదించారు

తండ్రి కొడుకు

ఫొటో సోర్స్, BBC News Brasil

    • రచయిత, వినిసియస్ లెమోస్
    • హోదా, బీబీసీ న్యూస్ బ్రెజిల్

2018 ఆగష్టులో ఫాతిమా, రాబర్టోలు (పేర్లు మార్చాం) తమ ఇద్దరు పిల్లలతో కలిసి బ్రెజిల్‌లోని సావో పాలోలోని ఉబాతుబాలో ఒక ఇంట్లో అద్దెకు దిగారు.ఆ ఇల్లు చాలా సౌకర్యవంతంగా ఉంది. విశాలంగా ఉంది. పైగా చాలా తక్కువ అద్దెకే దొరికింది.

ఆ చుట్టు పక్కల అంత తక్కువ అద్దెకు అలాంటి ఇల్లు దొరకడం కష్టం.

అందుకే ఆ ఇంట్లో అద్దెకు దిగాలని అనుకున్నారు.

అయితే, ఈ ఇంటికో గతం ఉంది. ఇదివరకు ఈ ఇంట్లో ఉన్న దాని ఓనర్ 2013 నుంచి కనిపించకుండా పోయారు.

ఆ ఇంట్లో అద్దెకు దిగడానికి ముందే ఫాతిమా, రాబర్టోలకు ఆ విషయం తెలిసింది.

కానీ మంచి ఇల్లు తక్కువ అద్దెకు దొరకడంతో ఇంట్లో దిగాలని డిసైడయ్యారు.

అనుకున్నట్లుగానే ఆ ఇంట్లోకి మారిపోయారు.

ఆ ఇంటి యజమాని లూజియా అదృశ్యమైనప్పుడు ఆమె వయసు 62 సంవత్సరాలు.

ఆమె ఆచూకీ కోసం పోలీసులు దర్యాప్తు చేసినా ఫలితం లేకుండా పోయింది.

ఒక కుటుంబం

ఫొటో సోర్స్, BBC News Brasil

ఇల్లు మొదట అంతగా నచ్చలేదు..

ఫాతిమా, రాబర్టోలు ఇదివరకు అపార్ట్‌మెంట్‌‌లో ఉండేవాళ్లు. ఆ తర్వాత మరో ఇంటికి మారారు. మరింత విశాలమైన ఇంటి కోసం వెతుకుతుండగా ప్రస్తుత ఇల్లు వారి కంటపడింది.

'యజమాని అదృశ్యం కావడం నాకు వింతగా అనిపించింది. ఇల్లు మొదట అంతగా నచ్చలేదు. కానీ రియల్ ఎస్టేట్ ఏజెంట్ పట్టుబట్టడంతో ఓకే చెప్పాము. ఎందుకంటే ఎవరైనా అక్కడ నివసించాలని అనుకోరు' అని ఫాతిమా చెప్పారు.

'మొదట్లో ఆమె ఎక్కడో ఓ చోట బతికే ఉండి ఉంటుందని అనుకునే వాళ్లం' అని రాబర్టో గుర్తుచేసుకున్నారు.

లూజియా ఇల్లు తమ కుటుంబ అవసరాలకు ఉత్తమ ఎంపిక అని ఈ జంట నిర్ణయించుకుంది.

వీడియో క్యాప్షన్, అద్దె గర్భం పొందడం ఇకపై సులువు కాదు

లూజియా అదృశ్యంతో ఆమె తమ్ముడికి ఇంటి బాధ్యతలు

లూజియా కనిపించకుండా పోవడంతో ఆ ఇంటి బాధ్యతలను ఆమె సోదరుడు చూసుకునేవాడు.

ఫాతిమా, రాబర్టోల కంటే ముందు, మరో కుటుంబం ఆ ఇంట్లో అద్దెకు ఉండి వెళ్లిపోయింది.

కొత్త ఇంట్లో దిగిన తొలిరోజుల్లో ఫాతిమా, ఆమె కుటుంబం లూజియా గురించి కొన్ని వివరాలను తెలుసుకున్నారు.

'చాలా మంది ఆమె గురించి అడిగేవాళ్లు. మాకు తెలియదని బదులివ్వడంతో, వారు లూజియా గురించి చెప్పడం ప్రారంభించేవారు' అని ఫాతిమా చెప్పారు.

ఇంటి పెరట్లో మొక్క

ఫొటో సోర్స్, Gentileza

డిప్రెషన్‌లో లూజియా

లూజియా రిటైర్డ్ టీచర్. ఆమెను చుట్టు పక్కల వాళ్లందరూ ఇష్టపడేవారు. ఆమెకు పిల్లలు లేరు. ఒంటరిగా ఉండేది. ఒంటరితనంతో డిప్రెషన్‌కు గురయ్యారు. దానికి ఆమె చికిత్స కూడా తీసుకున్నారంటూ ఇరుగుపొరుగు వాళ్లు చెప్పిన విషయాలను రాబర్టో గుర్తు చేసుకున్నారు.

నెలలు గడుస్తున్న కొద్దీ ఆమె గురించి అడిగేవారు తగ్గారు.

'ఈ ఇల్లు కొత్తది కాదు కానీ చాలా విశాలంగా ఉంది. లోకేషన్‌ కూడా బాగుంటుంది' అని ఫాతిమా చెప్పారు.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి, 1
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది, 1

పెరట్లో గుడ్డ ముక్కతో బయటపడిన అసలు రహస్యం

కొన్ని గదులలో వెంటిలేషన్‌ సరిగా లేకపోవడంతో పక్కనే ఉన్న పొడవాటి మొక్కలను తీసివేయాలని రాబర్టో భావించాడు.

'తొలుత, మొక్కల విషయంలో జోక్యం చేసుకోవటానికి ఇష్టపడలేదు. ఎందుకంటే ఇది మా సొంత ఇల్లు కాదు. కానీ మొక్కలు మరీ ఎక్కువగా ఉండటం, కుక్క పిల్లలు అక్కడున్న బురదలో దొర్లి అలానే వచ్చి ఇల్లు పాడు చేస్తుండటంతో మొక్కలను తొలగించాలని అనుకున్నాం' అని ఫాతిమా చెప్పారు.

ఈ ఏడాది జనవరి 13న పెద్ద కుమారుడితో కలిసి లిల్లీ మొక్కలను తీయడానికి రాబర్టో ప్రయత్నిస్తుండగా ఒక గుడ్డ ముక్క కనిపించింది.

దాన్ని లాగిన కొద్ది మట్టిలో ఇంకా ఉన్నట్లు అనిపించిందని ఆ నాటి విషయాలను రాబర్టో గుర్తు చేసుకున్నాడు.

ఒక పక్క రాబర్టో, మరో పక్క ఆయన కుమారుడు పట్టుకుని ఆ వస్త్రాన్ని గట్టిగా బయటకు తీసి చూడగా ఎముకలు బయట పడ్డాయి.

ఆ క్షణంలోనే ఈ ఎముకలు ఇంటి యజమానివి అయ్యింటాయని భావించానని రాబర్టో చెప్పారు.

మొక్క

ఫొటో సోర్స్, BBC News Brasil

ఇంట్లోనే ముక్కలు ముక్కలుగా చేసి ఉంటారా?

'ఇదంతా ఒక సినిమాలా అనిపించింది. నేను షాక్‌కు గురయ్యాను' అని రాబర్టో పెద్ద కుమారుడు అన్నారు.

'అసలు ఇక్కడ ఏం జరిగి ఉంటుంది. ఆమెను ఈ ఇంట్లోనే ముక్కలు ముక్కలుగా చేసి ఉంటారా? ఇలాంటి స్థలంలో ఇన్నేళ్లుగా మేము నివాసమున్నామా' అంటూ ఫాతిమా ఆందోళనకు గురయ్యారు.

వారు పోలీసులను పిలిచి జరిగింది చెప్పారు. రియల్ ఎస్టేట్ ఏజెన్సీ ప్రతినిధి లూజియా బంధువులకు సమాచారం అందించారు.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి, 2
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది, 2

మెటల్‌ ప్రొస్థెసిస్‌తో లూజియాగా గుర్తింపు

ఇంటి ఓనర్‌ ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఆమెను ఇక్కడే ఎక్కడో పూడ్చి పెట్టి ఉంటారని ఫాతిమా, రాబర్టోల పిల్లలు సరదాగా అనేవాళ్లు.

కానీ సరదాగా ఆ పిల్లలు చెప్పిన మాటలే నిజమయ్యాయి.

ఎముకల పక్కనే లభించిన ఒక పరికరం అది లూజియా మృతదేహమేనని ప్రాథమికంగా అంచనా వేయడానికి ఉపయోగపడింది.

అది వెన్నుముకకు శస్త్రచికిత్స చేసినప్పుడు వాడిన మెటల్‌ ప్రొస్థెసిస్ అని ఆమె స్నేహితులు ఒకరు తెలిపారు.

దంతాలను పరీక్షించిన తర్వాత అది ఖచ్చితంగా లూజియా మృతదేహమేనని నిర్ధారించారు.

అప్పటి వరకు లూజియాను ఆమె సొంత పెరట్లోనే ఖననం చేసి ఉంటారనే అనుమానం తమకు రాలేదని పోలీసులు తెలిపారు.

లిల్లీ మొక్కల కింద, ఇటుకల పక్కన ఆమెను పూడ్చిపెట్టడంతో అవశేషాలు కనిపెట్టడం సాధ్యపడదని భావించి ఉంటారన్నారు.

మొక్కలను తీసి శుభ్రం చేయాలని భావించకపోతే లూజియా ఆనవాళ్లు ఎప్పటికీ బయటపడేవి కాదేమోనని ఫాతిమా, రాబర్టోలు అనుకుంటున్నారు.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి, 3
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది, 3

2013లో దర్యాప్తులో ఏం తేలింది

లూజియా అదృశ్యంపై ఉబాతుబా సివిల్ పోలీసులు 2013లోనే దర్యాప్తు ప్రారంభించారు.

ఆ సమయంలో దొరికిన ఆధారాలలో ఒకటి లూజియా కారు. అది వేరే చోట లభించింది.

ప్రమాదం తరువాత దాన్ని అక్కడ వదిలేసి వెళ్లారు. అందులో లూజియా వ్యక్తిగత వస్తువులు లభించాయి.

ఆ సమయంలో పోలీసులు లూజియా ఇంట్లో సోదాలు చేసినా ఏమీ కనుగొనలేకపోయారు.

లూజియా చాలా మంచివారని, అందరూ ఆమెను ఇష్టపడతారని ఇరుగుపొరుగు వారు, పరిచయస్తులు చెప్పారు.

ఆమె రిటైర్డ్ టీచర్, ఒంటరిగా ఉండేది. లూజియా తరచూ తన ఫేస్‌బుక్‌ ఖాతాలో జంతువుల ఫొటోలను పోస్ట్‌ చేసేవారు. డ్యాన్స్, సముద్రమంటే ఇష్టమని చెప్పేవారు.

అదృశ్యమైననాటి నుంచి లూజియాకు తెలిసిన వారు మీరు ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు అంటూ ఆమె ఫేస్‌బుక్‌‌ ఖాతాకు మెసేజ్‌లు పంపేవారు.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి, 4
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది, 4

మిస్టరీగానే లూజియా అదృశ్యం కేసు

నాడు మిస్సింగ్‌ కేసులో పోలీసులు కొందరు అనుమానితులను గుర్తించారు.

'ఆమెకు హాని కలిగించాలనుకున్న వారికి ఏదైనా బలమైన కారణం ఉండవచ్చు. కానీ బలమైన ఆధారాలు ఏమీ లభించలేదు' అని సావో పాలో పబ్లిక్ మినిస్ట్రీ పేర్కొంది.

దోపిడీ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేశారు. కానీ అనుమానితులను దోషులుగా చూపించడానికి సరైన ఆధారాలు లభించలేదు. దీంతో 2020 జనవరిలో లూజియాకు చెందిన ఆనవాళ్లు లభించకపోవడంతో పబ్లిక్ మినిస్ట్రీ దర్యాప్తును మూసివేయాలని భావించింది. దీంతో ఆమె అదృశ్యం కేసు మిస్టరీగానే మిగిలిపోయింది.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి, 5
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది, 5

గొంతు కోసి హత్య?

లూజియా ఇంట్లోనే ఎముకలు లభించడంతో దర్యాప్తును తిరిగి ప్రారంభించాలని, కొత్త సాక్షులను విచారించాలని ప్రజా మంత్రిత్వ శాఖ పోలీసులను కోరింది.

'మృతదేహం దొరికిన తరువాత, చాలా విషయాల్లో స్పష్టత వచ్చింది' అని ప్రస్తుతం కేసు బాధ్యతలు చూస్తున్న పోలీస్ చీఫ్ బ్రూనో డి అజీవెడో అరగో చెప్పారు.

లుజియా తుపాకీ కాల్పుల్లో లేదా కత్తిపోట్లతో చనిపోయినట్టు ఎలాంటి ఆధారాలు లేవని నిపుణులు పేర్కొన్నారు.

ఆమెను గొంతు నులిమి లేదా కోసి, తరువాత తోటలో పాతిపెట్టారని అనుమానిస్తున్నారు. ఆమె గొంతును బలంగా నొక్కడం వల్ల చనిపోయి ఉంటుందని ప్రాథమిక అంచనాకు వచ్చారు.

అయితే అస్థిపంజరం మాత్రమే లభించడంతో ఫోరెన్సిక్‌ నిపుణులు ఎటూ తేల్చలేకపోతున్నారు.

'ఇంతకు ముందు సమయం లేకపోవడం వల్ల నిపుణులతో కేసు దర్యాప్తు చేపించలేకపోయాము. ఇప్పుడు ఇది మూసివేసిన కేసుకాదు' అని అజీవెడో అరగో తెలిపారు.లూజియా బంధువులు ఆమె అస్థికలను ఖననం చేశారు.

నేరానికి పాల్పడిన వారికి త్వరలోనే శిక్ష పడాలని లూజియా బంధువులు ఆకాంక్షిస్తున్నారు.

ఈ నేరం ఒంటరి వ్యక్తి చేశాడా లేక ఇతరుల ప్రమేయం ఉందా అనే విషయంలో కూడా పోలీసులకు స్పష్టత లేదు.

ఒక నెలలో ఈ కేసు దర్యాప్తు పూర్తి అవుతుందని, త్వరలోనే మరిన్ని వివరాలను వెల్లడిస్తామని పోలీసు చీఫ్ చెప్పారు.ఇక ఫాతిమా, రాబర్టో కుటుంబాన్ని ఈ ఘటన కలవరపాటుకు గురి చేసింది. ఆ ఇంటిని వదిలేసి వేరే ఇంటికి వెళ్లిపోయారు.

లూజియా హంతకులు ఎవరో నిగ్గు తేలాలని రాబర్టో అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)