పురాతన అస్థిపంజరం: ఇది 2 వేల ఏళ్ల నాటి మర్డర్ మిస్టరీలా ఉందంటున్న శాస్త్ర వేత్తలు

ఫొటో సోర్స్, HS2
బకింగ్‌హామ్‌షైర్‌లోని వెన్దోవర్ దగ్గర వెల్ విక్ వ్యవసాయ భూముల ప్రాంతంలో హెచ్ఎస్ 2 రైల్వే ప్రాజెక్టులో పని చేస్తున్న పురాతత్వ శాస్త్ర శాస్త్రవేత్తలకు 2000 సంవత్సరాల పురాతనమైన పురుష అస్థిపంజర అవశేషాలు లభించాయి. తిరగబడిన ముఖంతో, చేతులు వెనక్కి కట్టినట్లుగా ఉన్న అస్థి పంజరం లోహ యుగానికి చెందినదిగా భావిస్తున్నారు.
మర్డర్ మిస్టరీలా కనిపిస్తున్నఈ అస్థిపంజరానికి సంబంధించిన మరిన్ని వివరాలు లభించాలంటే ఇంకా విశ్లేషణ చేయాలని ప్రాజెక్ట్ ఆర్కియాలజిస్ట్ డాక్టర్ రేచెల్ వుడ్ అన్నారు.
ఇదే ప్రదేశంలో ప్రాచీన రాతి కట్టడాలను పోలిన ఒక చెక్క నిర్మాణం, రోమన్ అవశేషాలు కూడా లభించాయి.
గంటకు 225 మైళ్ళు ప్రయాణించే విధంగా 362 కిలోమీటర్ల రైల్వే లైన్ నిర్మాణ పనులు చేపడుతున్న ప్రాంతంలో నియోలిథిక్ యుగం నుంచి మధ్య యుగానికి సంబంధించిన అనేక అవశేషాలు శాస్త్రవేత్తలకు లభించాయి.

ఫొటో సోర్స్, HS2

ఫొటో సోర్స్, HS2
"4000 సంవత్సరాల క్రితం నాటి మానవ జీవనానికి సంబంధించిన ప్రదేశాన్ని కనిపెట్టడం ఆశ్చర్యకరంగా ఉంది” అని ఫ్యూజన్ జె వి లో పని చేస్తున్న డాక్టర్ వుడ్ అన్నారు.
నియోలిథిక్ యుగానికి చెందిన 65 మీటర్ల (213 అడుగుల) ఎత్తులో ఉన్న చెక్క స్తంభాలతో కూడిన అతి పెద్ద కట్టడం కూడా ఇక్కడ కనిపించింది. ఇది 3000 బిసి నుంచి 43 ఏడి మధ్య కాలంలోది అయి ఉండవచ్చు. వలయాకారంలో ఉన్న ఒక ఇల్లు, జంతువుల కోసం తవ్విన గుంతలు కూడా ఉన్నాయి.
రోమన్ యుగంలో ఈ గుంతలను మృత దేహాలను సమాధి చేయడానికి వాడేవారు. సీసపు లోహంతో తయారు చేసిన ఖరీదైన శవ పేటికలో ఉన్నత స్థాయి వ్యక్తి అస్థి పంజరం కూడా బయట పడింది.
కొన్ని యుగాలుగా ఉన్నత స్థాయి వ్యక్తులను సమాధి చేయడానికి వాడటమే ఈ స్థలం విశేషం అని డాక్టర్ వుడ్ అన్నారు.
ఇనుప యుగానికి చెందిన అస్థి పంజరం ఇక్కడ దొరకడం కాస్త భిన్నంగా ఉందని అన్నారు.
"వెల్ విక్ పొలాలలో దొరికిన అస్థిపంజరం ఒక రహస్యంలా కనిపిస్తోంది. ఈ మనిషి ఎలా చనిపోయారనేది అంతుబట్టట్లేదు. చేతులు కట్టేసి, తిరగబడిన తలతో పడి ఉండటానికి పెద్దగా మార్గాలేవీ ఉండవు’’ అని అన్నారు.
"ఈ దారుణమైన మృత్యువు గురించి మా ఆస్టియోలాజిస్టులు చెప్పగలరు" అని ఆయన అన్నారు.
ఎచ్ఎస్ 2 హై స్పీడ్ రైల్ లింక్ లండన్ నగరాన్ని బర్మింగ్‌హామ్, మాంచెస్టర్, లీడ్స్ తో కలుపుతుంది.
యూరోప్ లో ఇది అత్యంత భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్. దీని రవాణా మార్గం నిర్ణయం కావడంలో జాప్యం, పెరుగుతున్న బడ్జెట్ వ్యయంలో చోటు చేసుకున్న మార్పు రీత్యా , ప్రాజెక్ట్ మొదలు పెట్టడం ఆలస్యం అయింది.
2015లో అధికారికంగా ఈ ప్రాజెక్ట్ వ్యయం 56 బిలియన్ పౌండ్లు (సుమారు 53,08,20,93,28,240 రూపాయిలు ). ప్రస్తుతం దీని వ్యయం 106 బిలియన్ పౌండ్లు (సుమారు 10047681942740 రూపాయిలు) అయి ఉండవచ్చని అంచనా.
ఇవి కూడా చదవండి:
- వాస్కోడిగామా: భారతదేశాన్ని వెతకాలనే కోరిక వెనుక అసలు కారణం ఇదీ..
- అమెరికా, నెదర్లాండ్స్‌లో రాముని కరెన్సీ: ఈ వార్తల్లో నిజమెంత, రాముని కరెన్సీ చరిత్ర ఏమిటి
- నూర్ జహాన్: ఏకైక మొఘల్ సామ్రాజ్ఞి
- ‘ఏసుక్రీస్తును అలా భావించలేను.. మీ స్టాంపును వాడలేను’
- క్రిస్మస్: 'నేను క్రీస్తును పెళ్లాడాను... నా శరీరాన్ని అర్పిస్తాను'
- జీసస్ గురించి ఖురాన్ ఏం చెబుతోంది?
- తొలి భారతీయులు ఎవరు.. ఆఫ్రికా నుంచి వలసొచ్చినవారి వారసులా?
- ఇరానీ చాయ్‌తో సమోసా ఎందుకు తింటారంటే..!
- చైనా నుంచి టీ రహస్యాన్ని ఆంగ్లేయులు ఎలా దొంగిలించారు?
- జాతీయ పతాక రూపకర్తగా పింగళి వెంకయ్య పేరు ‘అధికారికంగా’ కనిపించదెందుకు?
- కరోనావైరస్ మృతులను జేసీబీలతో ఎందుకు ఖననం చేస్తున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








