ఇంటి పెరట్లో బావి తవ్వుతుంటే రూ. 745 కోట్ల విలువైన నీలమణులు దొరికాయి

ఫొటో సోర్స్, MR GAMAGE
- రచయిత, అన్బరసన్ ఎతిరాజన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
అదృష్టమంటే ఇదే. ఇంటి పెరట్లో బావి కోసం తవ్వుతుండగా అనుకోకుండా కోట్ల విలువైన నీలమణులు దొరికాయి.
ఒక పెద్ద రాయిలో అనేక చిన్న చిన్న ఇంద్రనీలపు రాళ్లు ఉన్నాయి. దీన్ని నీలమణుల క్లస్టర్ (Sapphire cluster) అని పిలుస్తున్నారు.
ఈ నీలపు రాయి బరువు 510 కేజీలు (2.5 మిలియన్ కేరట్లు) తూగింది.
ప్రపంచంలో ఇప్పటి వరకు దొరికిన నీలమణుల్లో ఇదే అత్యంత పెద్దదని అంటున్నారు.
వీటి విలువ బహిరంగ మార్కెట్లో దాదాపు 745 కోట్ల రూపాయలు (100 మిలియన్ డాలర్లు) ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఎక్కడ, ఎలా దొరికింది
శ్రీలంకలో మణులు, రత్నాలు అధికంగా దొరికే ప్రాంతమైన రత్నపురలోని ఓ రత్నాల వ్యాపారి ఇంటి పెరట్లో ఇది దొరికింది.
దీనికి "అనుకోకుండా దొరికిన నీలమణి" (సెరెండిపిటీ సాఫైర్) అని పేరు పెట్టారు.
"భూమి లోపల అరుదైన రాళ్లు ఉన్నట్లు అనిపిస్తోందని బావిని తవ్వుతున్న వ్యక్తి మమ్మల్ని అప్రమత్తం చేశారు. లోతుగా తవ్వుతుండగా ఈ నీలమణి బయటపడింది" అని దాని యజమాని గమాగే తెలిపారు.
భద్రతా కారణాల రీత్యా ఆయన పూర్తి పేరు, వివరాలు చెప్పలేదు.
రత్నాల వ్యాపారి అయిన గమాగే, ఆ రాయి దొరికిన వెంటనే ప్రభుత్వ అధికారులకు విషయాన్ని తెలియజేశారు.
అయితే, ఆ రాళ్ల గుళ్లను శుభ్రం చేసి, దాని విలువను అంచనా వేసేందుకు ఒక సంవత్సర కాలం పట్టింది.
శుభ్రపరిచే ప్రక్రియలో కొన్ని చిన్న చిన్న రాళ్లు విరిగిపడ్డాయని, అవి కూడా అధిక నాణ్యత కలిగిన నీలాలు అని గమాగే తెలిపారు.
రత్నాలకు పెట్టింది పేరు రత్నపుర
రత్నపురలో గతంలో అనేక విలువైన రత్నాలు, అరుదైన రాళ్లు బయటపడ్డాయి.
ఇంద్రనీలాలు, ఇతర విలువైన రత్నాల ఎగుమతిలో శ్రీలంక ముందు వరుసలో ఉంటుంది.
"ఇంత పెద్ద రత్నాల రాయిని నేనెప్పుడూ చూడలేదు. ఇది సుమారు 40కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడి ఉంటుంది" అని అని ప్రఖ్యాత జెమ్మాలజిస్ట్ డాక్టర్ గామిని జోయిసా అన్నారు.
అయితే, అందులో ఉన్న రాళ్లన్నీ అధిక నాణ్యత కలిగినవి కాకపోవచ్చని నిపుణులు అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
- ఈ గోల్కొండ వజ్రం ఖరీదు చెప్పగలరా?
- కోహినూర్ వజ్రాన్ని ఎలా కొట్టేశారు?
- ‘కేజీఎఫ్ గనుల్లో బంగారం కన్నా విలువైన లోహం.. వెలికితీతపై త్వరలో నిర్ణయం’
- నూర్ జహాన్: ఏకైక మొఘల్ సామ్రాజ్ఞి
- బంగారం, వజ్రాల గనులున్నా.. ఈ దేశంలో పేదరికం పోవట్లేదు
- తొలి భారతీయులు ఎవరు.. ఆఫ్రికా నుంచి వలసొచ్చినవారి వారసులా?
- జాతీయ పతాక రూపకర్తగా పింగళి వెంకయ్య పేరు ‘అధికారికంగా’ కనిపించదెందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










