కరోనావైరస్‌పై పోరులో వార్తల్లో నిలిచిన ఆసియా మహిళలు

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఉపాసన భట్
    • హోదా, బీబీసీ మానిటరింగ్

ఒక వైపు ప్రపంచం కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు సన్నాహాలు చేస్తుంటే, మరో వైపు కొంత మంది మహిళలు ఈ మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొంటూ ప్రశంసలు అందుకుంటున్నారు.

కేరళ ఆరోగ్య శాఖ మంత్రి, దక్షిణ కొరియాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అధిపతి, చైనా ఉప ప్రధాని పేర్లు ముఖ్యంగా వార్తల్లో వినిపిస్తున్నాయి.

చైనాలో కొంత మంది మహిళల పేర్లు వివాదాస్పదంగా కూడా మారాయి.

జంగ్ ఈయున్ కియోంగ్ , డైరెక్టర్, కొరియా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్

మహమ్మారి ప్రబలుతున్న సమయంలో గాబరా పడకుండా విధులు నిర్వహించినందుకు జంగ్ ఈయున్ కియోంగ్ ప్రశంసలు పొందుతున్నారు.

"ఈ మధ్య ఆమె విపరీతమైన పని ఒత్తిడి ఎదుర్కొన్నారు. అయినా, ఆమె నిశ్చలంగా ఉండటంతో తన బృందంలోని సభ్యులు ఒకరికొకరు సమన్వయంతో పని చేయడానికి సహకరించారు. జంగ్ పని తీరు దక్షిణ కొరియా ప్రజలు వైరస్‌ను ఎదుర్కొనేందుకు బాగా ఉపయోగపడింది" అని హెరాల్డ్ ఎకానమీ మార్చ్ 2న రాసిన వ్యాసంలో పేర్కొంది.

ఆమెకు సోషల్ మీడియాలో కూడా ప్రశంసల వర్షం కురిసింది.

జంగ్ ఈయున్ కియోంగ్

ఫొటో సోర్స్, KCDC WEBSITE

ఫొటో క్యాప్షన్, జంగ్ ఈయున్ కియోంగ్

"ఆమె ప్రజలని జాగ్రత్తగా ఉండాలని చెప్పారు తప్ప, ఈ మహమ్మారిని దక్షిణ కొరియా సమర్ధంగా ఎదుర్కొంటుందని ఎక్కడా ప్రకటన చేయలేదు. అందుకే ఆమె మాటలను నేను నమ్ముతాను. మరో వైపు ప్రభుత్వం, పాలక పార్టీ మాత్రం తాము చేయలేని పనుల గురించి తమను తాము ప్రశంసించుకున్నాయి. ఆమెను చూసి ప్రభుత్వం నేర్చుకోవాలి" అని ఒక ట్విటర్ యూజర్ మార్చ్ 10న ట్వీట్ చేశారు.

జంగ్ మాత్రం వ్యక్తిగత ప్రశంసలు మానుకుని ఆరోగ్య శాఖ సిబ్బంది, ప్రజలు చేసిన సేవలకు ధన్యవాదాలు తెలిపారు.

దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జె ఇన్ మార్చ్ 11న కేసిడిఎస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లి ఆమెను ప్రశంసించారు.

"స్వయంగా కలిసి మీకు, మీ సిబ్బందికి ధన్యవాదాలు చెప్పాలనుకున్నాను, కానీ మీ పనికి ఇబ్బంది కల్గించిన వాడినవుతానేమో అని కలవలేదు" అని పబ్లిక్ బ్రాడ్ కాస్టర్ సిబిఎస్ ప్రకటించారు.

ట్వీట్

ఫొటో సోర్స్, TWITTER

కె కె శైలజ, కేరళ ఆరోగ్య మంత్రి

కేరళ ఆరోగ్య మంత్రి కేకే శైలజ తాను ప్రదర్శించిన మానవతా దృక్పథానికి సోషల్ మీడియాలో ప్రశంసలు పొందారు.

శైలజ టీచర్‌గా పని చేసి పదవీ విరమణ చేశారు. ఆమెకు ప్రజల సంక్షేమమే ప్రధానం. ప్రజలను ఏ సమయంలో కలవడానికైనా ఆమె అభ్యంతరం చెప్పలేదు.

"కొంత మంది నాతో నేరుగా మాట్లాడి వారి జిల్లాలో ఆరోగ్య పరిస్థితిని వివరించాలనుకునేవారు. నాతో మాట్లాడటం వలన వారికి ధైర్యం వస్తుందనుకుంటే నాకు వారితో మాట్లాడటానికి ఎటువంటి అభ్యంతరం లేదని" ఆమె ఫిబ్రవరి 8వ తేదీన మింట్ న్యూస్ పేపర్‌‌కి చెప్పారు.

కేకే శైలజ

ఫొటో సోర్స్, KKSHAILAJA/FACEBOOK

ఫొటో క్యాప్షన్, కేకే శైలజ

ఆమె తన సహ ఉద్యోగుల సేవలని కూడా గుర్తించారు. "నేను మాత్రమే కాదు, నాతో పాటు పని చేస్తున్న మరెంతో మంది ఉద్యోగులు కూడా పగలు రాత్రి పని చేస్తున్నారు, అని ఆమె మార్చి 9న వనిత పత్రికకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు.

మలయాళ రచయత చంద్రిక కూడా ఆమెని ప్రశంసించారు.

"ఏ మంత్రీ కేవలం గారడీ చేసి ప్రజల హృదయాలను దోచుకోలేరు. ఆమె ప్రాధమిక ఆరోగ్యం, శిశు సంక్షేమం కోసం చేపట్టిన చర్యలే ఆమెకి ప్రజల మనసులో చోటిచ్చిందని" మధ్యమం వార్తా పత్రికలో ఆమె మార్చ్12న రాసిన వ్యాసంలో పేర్కొన్నారు.

కరోనా వైరస్ నియంత్రణకై పటిష్టమైన చర్యలు చేపట్టిన వారిలో భాగంగా చైనాలో కూడా కొంత మంది మహిళల పేర్లు వినిపించాయి.

సన్ చున్ లాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సన్ చున్ లాన్

సన్ చున్ లాన్, చైనా ఉప ప్రధాన మంత్రి

చైనాలో కరోనా వైరస్ ప్రబలడం మొదలైన దగ్గర నుంచి చైనా ఉప ప్రధాన మంత్రి సన్ చున్ లాన్ పేరు ప్రముఖంగా వినిపించింది. ఆమె 25 మంది సభ్యుల కమ్యూనిస్ట్ పార్టీ పొలిట్‌బ్యూరోలో ఉన్న ఒకే ఒక్క మహిళ. ఆమె వైరస్ వ్యాప్తి మొదలైన దగ్గర నుంచి మహమ్మారిని అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను పర్యవేక్షణ చేశారు.

వుహాన్, హుబె ప్రాంతాలలో పరిస్థితిని పర్యవేక్షించేందుకు నియమించిన జాతీయ పర్యవేక్షణ బృందానికి ఆమెని జనవరి 25న అధిపతిగా నియమించారు.

70 ఏళ్ల సన్ పొలిట్ బ్యూరో మొత్తంలో ఒక ధైర్యవంతమైన మహిళగా నిలిచి, విమర్శలని ధైర్యంగా ఎదుర్కొన్నారని హోంగ్ కాంగ్ పత్రిక సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ మార్చ్ 3న ప్రచురించిన వార్తలో పేర్కొంది.

మహిళా వైద్య సిబ్బంది తమ పనితో పాటు, ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు ఇచ్చిన సందేశంలో చెప్పారని మార్చ్ 9న సిన్హువా వార్తా సంస్థ ప్రచురించింది .

చైనా అధ్యక్షుడు కేసి జిన్పింగ్ మీడియాలో ఎక్కువగా కన్పించారు. సన్ మాత్రం ఎక్కువ ఫిర్యాదులను ఎదుర్కోవల్సి వచ్చేది.

స్వీయ నిర్బంధంలో ఉన్న కొంత మంది ప్రజలు వారికి కావల్సిన ఆహార సరఫరాలు కేవలం ఆమె సందర్శనకు ముందే లభిస్తున్నాయంటూ, "ఇదంతా అబద్ధం, ఇదంతా అబద్ధం " అంటూ మార్చ్ 5న విడుదల చేసిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రచారమయ్యాయి.

అయితే ఈ ఘటనలని స్టేట్ మీడియా మాత్రం సన్‌కి, పార్టీకి జరిగిన సానుకూల ప్రచారంగా పరిగణిస్తోంది. కోవిడ్ 19ని ఎదుర్కోవడంలో సమర్ధవంతంగా పని చేశారని సి సి టీవీ తమ ప్రసారాలలో సన్‌ని ప్రశంసించింది.

కరోనావైరస్ నుంచి మిమ్మల్ని మీరు ఇలా రక్షించుకోండి

చెన్ వి, ఎపిడెమియాలోజిస్ట్

వ్యాక్సిన్ పరిశోధనకు, వ్యాధికి కావల్సిన వైద్యం విషయంలో పరిశోధన చేసినందుకు గాను ఎపిడెమియాలోజిస్ట్ చెన్ వి పేరు చైనీస్ స్టేట్ మీడియాలో బాగా వినిపించింది.

ఆమె జనవరి 26న నిపుణుల బృందంతో వుహాన్ వెళ్లి ఒక టెంట్లో జనవరి 30న సంచార పరీక్ష ప్రయోగశాలని ప్రారంభించారు. ఫిబ్రవరి 7 నుంచి ఆ ప్రయోగ శాలలో పని మొదలయింది.

54 ఏళ్ల చెన్ 2003లో సార్స్ వ్యాధి ప్రబలినపుడు, 2008లో సిచుయాన్‌లో భూకంపం వచ్చినప్పుడు చేసిన పనికి గుర్తింపుగా అనేక అవార్డులను గెలుచుకున్నారు.

2014-16లో పశ్చిమ ఆఫ్రికాలో ఎబోలా తలెత్తినపుడు వ్యాక్సిన్ ని కూడా అభివృద్ధి చేశారు.

సార్స్ అరికట్టడం నుంచి ఎబోలాని ఎదుర్కోవడం వరకు ఆమె రోగులకు ఒక ఆశా దీపంలా నిలిచారని సథరన్ వార పత్రిక ఫిబ్రవరి 12న రాసిన ఒక వ్యాసంలో పేర్కొంది.

BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

లి లాన్ యుఆన్, ఎపిడెమియాలోజిస్ట్

73 ఏళ్ల ఎపిడెమియాలోజిస్ట్ లి లాన్ యుఆన్ కూడా తన సిబ్బందితో కలిసి ఫిబ్రవరి 1వ తేదీ నుంచి వుహాన్‌లో పని చేస్తున్నారు.

ఆమె గాగుల్స్ తీసేసిన తర్వాత ఎంత అలసటతో ఉన్నారో చూపించే ఫోటోలను బీజింగ్ డైలీ ప్రచురించింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ పత్రిక ఆమె కొన్ని సార్లు రోజుకు మూడు గంటలు మాత్రమే నిద్రపోయేవారని పేర్కొంది.

వుహాన్‌‌లో ప్రజలని నిర్బంధంలో ఉండాలని చైనా ప్రభుత్వం జనవరి 23 న నిర్ణయం తీసుకోవడానికి లి కూడా ప్రధాన పాత్ర పోషించారు. సమాజాన్ని, దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు

వుహాన్‌లో పరిస్థితి మెరుగుపడటం పట్ల కొంత ఊపిరి పీల్చుకున్నారని ఆమె చాంగ్ జియాంగ్ దిన పత్రికకి చెప్పారు.

ఐ ఫెన్ జి లింక

అధికారులను వైరస్ వ్యాప్తి గురించి అప్రమత్తం చేసిన వారిలో డాక్టర్ ఐ ఫెన్ జి లింక ఒకరు.

దానితో ఆమె పేరు కూడా వారల్లోకి వచ్చింది. సార్స్ లాంటి మహమ్మారి వ్యాపిస్తుందని ఆమె చెప్పినప్పుడు హాస్పిటల్ అధికారులు ఆమె నోటిని ఎలా మూయించారో ఆమె మార్చ్ లో చైనా పీపుల్స్ మ్యాగజైన్ కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో వివరించారు. అయితే ఈ ఇంటర్వ్యూ ని తర్వాత తొలగించారు.

BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

హెల్ప్ లైన్ నంబర్లు
కరోనావైరస్

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)