ఇస్లామిక్ చరిత్రలో అత్యంత తెలివైన అందాల మహరాణి జైనబ్... ఆమెను 'జాదూగర్' అని ఎందుకు అనేవారు?

ఫొటో సోర్స్, @ERIC_CALDERWOOD/X
- రచయిత, వాఖర్ ముస్తఫా
- హోదా, జర్నలిస్ట్, రీసెర్చర్
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌పై ఉత్తర ఆఫ్రికాలోని ఒక పాఠశాలకు చెందిన గోడపై అరబిక్‌లో రాసిన అక్షరాలు నన్ను ఒక్క క్షణం ఆ పోస్టు దగ్గరే ఆగేలా చేశాయి.
అరబిక్ భాషపై నాకున్న పరిమిత పరిజ్ఞానంతో ఈ పదాలు: జైనబ్ అల్-నఫ్జావియా సెకండరీ స్కూల్ ఫర్ గర్ల్స్ అని అర్థమవుతుంది.
ఈ బోర్డుకు దగ్గర్లో ఉన్న ఫోటోగ్రాఫ్‌లో, 1009 నుంచి 1106 మధ్యలో నివసించిన రాణిగా తెలిసింది. యూసఫ్ బిన్ తష్ఫీన్ భార్య ఆ రాణి.
తత్త్వవేత్త, చరిత్రకారులు ఇబ్నే ఖల్దూన్ చెప్పిన వివరాల ప్రకారం, తన అందం, నాయకత్వంతో ప్రపంచంలోనే అత్యంత ప్రభావంతమైన మహిళలలో ఒకరిగా జైనబ్ అల్-నఫ్జావియా నిలిచారని తెలిసింది.
యూసఫ్ బిన్ తష్ఫీన్ గురించి నేను చదివాను. అతను ఎడారి ప్రాంతపు యుద్ధ వీరుడు. బెర్బెర్ తెగకు చెందిన గొప్ప సేనాని. అతనెప్పుడూ నీలిరంగులో ఉండే ముండస అనే తలపాగను ధరించి ఉండేవారు. ఆఫ్రికాలోని ఒక చిన్న ప్రాంతం నుంచి వచ్చిన అతను నేటి మొరాకో, అల్జీరియా, స్పెయిన్ వరకు తన రాజ్యాన్ని విస్తరించారు.
జైనబ్ నాయకత్వం గురించి ఇబ్నే ఖల్దూన్ మాట్లాడటం ప్రారంభించినప్పటి నుంచి, ఆమె గురించి నేను మరింత సమాచారం తెలుసుకోవాలనుకున్నాను.
మీరు కూడా ఇస్లామిక్ చరిత్రలో ప్రముఖమైన మహిళా నాయకురాలు, రాణి జైనబ్ అల్-నఫ్జానియా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాారా..? అయితే నేను చెప్పే ఈ విషయాలను తెలుసుకోండి.
మొరాకో రచయిత ఫాతిమా మర్నిసి తన పుస్తకం ‘‘ది ఫర్గాటెన్ క్వీన్స్ ఆఫ్ ఇస్లాం’’లో జైనబ్‌కు ప్రముఖమైన స్థానం ఇచ్చారు.
‘‘జైనల్ అల్-నఫ్జావియా 1061 నుంచి 1107 మధ్య కాలంలో ఉత్తర ఆఫ్రికా నుంచి స్పెయిన్ వరకు విస్తరించిన పెద్ద సామ్రాజ్యానికి(సుల్తానేట్‌కు) పాలకురాలు. భర్త యూసఫ్ బిన్ తష్ఫీన్‌తో కలిసి ఆమె ఈ సామ్రాజ్యాన్ని పాలించారు’’ అని రాశారు.
భర్త సామ్రాజ్యంలో ఆమె ప్రధాన పాత్ర పోషించారని చరిత్రకారులు చెబుతుంటారు.

ఫొటో సోర్స్, @ERIC_CALDERWOOD/X
తెలివైన సలహాదారిని
దక్షిణాఫ్రికాలోని నఫ్జావా తెగకు చెందిన సంపన్న వ్యాపారవేత్త కూతురే జైనబ్. ఆమె అఘ్మత్(మొరాకో నగరం)లో ఆమె పుట్టారు. అక్కడే చదవడం, రాయడం నేర్చుకున్నారు. ఆఫ్రికా రాయల్ కుటుంబానికి చెందిన ఒక మహిళ ఆమెను పెంచారు. జైనబ్ మూలికా వైద్యం గురించి కూడా తెలుసుకున్నారు.
ఇబ్నే ఖల్దూన్ సమాచారం మేరకు, అఘ్మత్ అమిర్(అధినేత) లఖూత్ అల్-ముఘ్రావిని పెళ్లి చేసుకున్నారు జైనబ్. లఖూత్ ఒక యుద్ధంలో మరణించారు. ఆయన సంపదంతా జైనబ్‌ను వరించింది.
అల్-మురావి అబు బక్ర్ ఇబ్నే ఉమర్‌ను ఆమె రెండో వివాహం చేసుకున్నారు.
గిరిజన తిరుగుబాటును అణచివేసేందుకు ఆయన దక్షిణ ఎడారిలోకి వెళ్లేటప్పుడు, తనకు పశ్చిమాన ఉన్న దళాల కమాండ్ బాధ్యతలను తన కజిన్ యూసఫ్ బిన్ తష్ఫీన్‌కు అప్పజెప్పారు. సుదీర్ఘ కాలం యుద్ధం జరగనుందనే భయంతో, ఆయన జైనబ్‌కు విడాకులు కూడా ఇచ్చారు.
ఇద్దత్ పూర్తయిన తర్వాత(విడాకుల అనంతరం ఒక నిర్దేశిత కాలం ముగిశాక) జైనబ్ యూసఫ్ బిన్ తష్ఫీన్‌ను పెళ్లి చేసుకున్నారు. జైనబ్ కేవలం యూసఫ్ జీవిత భాగస్వామిగా మాత్రమే కాక, తెలివైన సలహాదారు కూడా మారారు.
అట్లాంటిక్ మహాసముద్రం నుంచి అల్జీరియా, సెనగల్, ముస్లిం స్పెయిన్ వరకు విస్తరించిన ఈ పెద్ద అల్-మురావి సామ్రాజ్యం(సుల్తానేట్) యూసఫ్ సైనిక సామర్థ్యాలతోనే ఏర్పాటైంది.
మరోవైపు జైనబ్ సలహాలు, రాజకీయ చతురత ఈ సామ్రాజ్య విస్తరణలో కీలక పాత్ర పోషించింది.
చాలా మంది చరిత్రకారులు చెప్పిన దాని ప్రకారం, జైనబ్ చాలా అందంగా ఉండేవారు. ఎప్పుడూ చురుకుగా కనిపించేవారు. అసాధారణమైన ప్రతిభతో వెలుగొందేవారని కూడా చరిత్రకారులు పేర్కొన్నారు.
విధానపరమైన విషయాలపై ఆమెకు విస్తృతమైన పరిజ్ఞానం ఉండేది. ఈ కారణంతోనే ఆమెను చాలా మంది చరిత్రకారులు ‘‘జాదూగర్’ అంటే ఇంద్రజాలికురాలు అని పిలిచేవారు.
యూసఫ్ బిన్ తష్ఫీన్ సైన్యాన్ని సిద్ధం చేయడంలో సాయం
పశ్చిమ ఆఫ్రికాలో 11వ శతాబ్దంలో అత్యుత్తమ వ్యక్తులలో ఒకరని జైనబ్‌ను వర్ణించారు చరిత్రకారులు ఇబ్నే హౌఖల్.
రాజకీయ విషయాలపై ఆమెకున్న అపరిమితమైన జ్ఞానంతో, మధ్యయుగ కాలంలోని ‘మగ్రిబ్’ చరిత్రలో ఆమె కీలకపాత్ర పోషించారు.
మగ్రిబ్ అరబ్ ప్రపంచంలోని పశ్చిమ ప్రాంతం. దీన్ని ‘అరబ్ మగ్రిబ్’గా, నార్త్-వెస్ట్ ఆఫ్రికాగా కూడా పిలుస్తుంటారు. ఇది పశ్చిమ, మధ్య ఉత్తర ఆఫ్రికా ప్రాంతం. దీనిలో అల్జీరియా, లిబియా, మౌరితానియా, మొరాకో, ట్యునీషియా, పశ్చిమ సహారాలోని వివాదాస్పద ప్రాంతాలుంటాయి.
ఆక్రమణను కొనసాగించేందుకు యూసఫ్ వద్ద బలమైన సైన్యం లేదు.
సైన్యాన్ని పునర్ వ్యవస్థీకరించడానికి జైనబ్ తన సంపదనంతా యూసఫ్‌కు ఇచ్చినట్లు రిచర్డ్ సీ పానల్ చెప్పారు. పలు ప్రాంతాల నుంచి పన్నులు సేకరించాలని యూసఫ్‌కు ఆమె సలహాలు ఇచ్చారు.
దీంతో, ఆయన వివిధ గ్రూప్‌లతో కలిసి సైన్యాన్ని సిద్ధం చేశారు.
జైనబ్ ఆదేశానుసారం పశ్చిమ ఆఫ్రికాను యూసఫ్ గెలుచుకున్నారని, సంప్రదింపుల పనులను జైనబ్ చేపట్టారని ఇబ్నే అబి-జార్ తన పుస్తకం ‘‘రౌజ్ అల్-ఖర్తాస్’’లో రాశారు. సంప్రదింపులలో ఆమెకున్న నిపుణతతో ఆమెను ‘మేజిషియన్’గా కూడా వర్ణించారు.
మరాకేశ్ నగరం(మొరాకో)ను యూసఫ్ నిర్మించారు. ఇది తర్వాత తమ ఆధిపత్యానికి రాజధాని నగరంగా మారింది. ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసింది కూడా జైనబ్‌ను అని తెలుస్తుంది.
ఆమె నివసించే ప్రాంతానికి ఈ కొత్త రాజధాని ఎంతో దూరంలో ఉండదు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
అబు బక్ర్ ఇబ్నే ఉమర్ తిరిగి వచ్చిన తర్వాత, జైనబ్ స్పందన
అబు బక్ర్ ఇబ్నే ఉమర్ తిరిగి వస్తున్నట్లు తన కజిన్ యూసఫ్‌కు తెలియజేశారు. తన అధికారాన్ని, భార్యను తిరిగి పొందాలని ఆయన ఆశించారు.
ఘనాకు చెందిన నల్లజాతి గార్డులతో అయిష్టంగా అబు బక్ర్‌కు స్వాగతం చెప్పమని యూసఫ్‌కు జైనబ్ సలహా ఇచ్చినట్లు అబుల్ హసన్ ఇబ్నే అబు జహార్ అల్-ఫాసి రాశారు.
యూసఫ్ గుర్రంపైన కూర్చుని, రాజులాగా ఆయనకు స్వాగతం చెప్పారు. అలాగే ఎన్నో రకాల బహుమతులను అందించారు.
అంతటి సంపదకు ఆశ్చర్యపోయిన అబు బక్ర్, యూసఫ్ ఔదార్యానికి గల కారణాన్ని అడిగారు. ‘‘ఈ ఎడారిలో మీకోసం వేచిచూస్తున్న కొత్త సాహసాలు వేటినీ మీరు కోల్పోకుండా ఉండేందుకే ఇది’’ అని యూసఫ్ సమాధానమిచ్చారు.
ఈ సందేశ వెనుకాలున్న విషయాన్ని అబు బక్ర్ అర్థం చేసుకున్నారు. బహుమతులను స్వీకరించడమే మంచిదని ఆయన భావించారు.
అఘ్మత్‌లో కొంతకాలం ఉన్న తర్వాత అధికారాన్ని బదిలీ చేస్తున్న పత్రాలను రాసి, ఘనా, సూడాన్‌లో ఆయన ఆక్రమించుకున్న ఎడారి ప్రాంతంలోకి వెళ్లిపోయారు.

ఫొటో సోర్స్, Getty Images
మహిళలకు సముచిత స్థానం కల్పించడంలో జైనబ్ పాత్ర
‘మగ్రిబ్’కు తిరుగులేని పాలకుడిగా యూసఫ్ బిన్ తష్ఫీన్ అవతరించారు. అతిపెద్ద సామ్రాజ్యానికి ఆయనే అధిపతి.
జైనబ్ శక్తిమంతమైన మహిళగా పేరొందడం వెనుకాల తనకు అనుకూలమైన ఎన్నో అంశాలున్నాయని చార్లెస్ నోయల్ అంటారు.
తొలుత జైనబ్ విద్యావంతురాలు. అరబిక్‌పై యూసఫ్‌కున్న పరిమితమైన పరిజ్ఞానం ఆమెకు అనుకూలంగా మారింది.
ఇక రెండో విషయం జైనబ్‌కున్న రాజనీతి ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. భర్త భరోసాతో నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెంపొందించుకున్నారు.
ఇక మూడోది, యూసఫ్ లేని సమయంలో ఆమెనే సైన్య కార్యకలాపాలు చేపట్టేవారు.
అల్-మురావి సామ్రాజ్యంలో మహిళల హోదా మరింత శక్తిమంతంగా మార్చే కుటుంబాన్ని, కుటుంబ ఆచారాలను జైనబ్ సృష్టించారు.
అల్-మురావి రాజవంశంలో మొరాకోలోని మహిళలకు అత్యున్నత స్థానం ఉండేది.
కార్యాలయ విషయాలను యువరాణి చూసుకునేవారు. దీంతో, మహిళల విద్య ఆ సామ్రాజ్యంలో సాధారణంగా మారింది.
ఇటీవల దశాబ్దాల్లో, జైనబ్ అల్-నఫ్జావియా జీవిత కథనం టీవీ, చలనచిత్ర అంశంగా మారింది. అమ్మాయిలు చదువుకునే పాఠశాలలో ఆమె వారసత్వం ఇంకా ప్రతిబింబిస్తూనే ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
- యశస్వీ జైస్వాల్: బేస్బాల్లా క్రికెట్ బంతిని బాదేస్తూ మరో డబుల్ సెంచరీ చేసిన 'జస్బాల్'
- గుల్బదన్: ఒట్టోమాన్ సుల్తాన్‌ను ఎదిరించిన మొఘల్ యువరాణి కథ...
- అలెక్సీ నావల్నీ: పుతిన్ ఆదేశాల మేరకే ఆయనను చంపేశారా, విమర్శకులు ఏమంటున్నారు?
- తాజ్ మహల్ కంటే ముందే, ప్రియురాలి కోసం చోళరాజు నిర్మించిన ‘ప్రేమ చిహ్నం’ కథ తెలుసా?
- కజఖ్‌స్తాన్: మీథేన్ గ్యాస్ మెగా-లీకేజి, కొన్ని నెలలుగా విస్తరిస్తున్న ప్రమాదాన్ని బయటపెట్టిన బీబీసీ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














