అలెక్సీ నావల్నీ: పుతిన్ ఆదేశాల మేరకే ఆయనను చంపేశారా, విమర్శకులు ఏమంటున్నారు?

ఫొటో సోర్స్, REUTERS
- రచయిత, జేమ్స్ గ్రెగోరి
- హోదా, బీబీసీ న్యూస్
అలెక్సీ నావల్నీ మృతదేహాన్ని అతని తల్లి ఇప్పటిదాకా చూడలేకపోయారని, నావల్నీ సన్నిహితులైన రష్యా ప్రతిపక్ష నేతలు చెబుతున్నారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు బద్ధ వ్యతిరేకి అయిన అలెక్సీ నావల్నీ జైల్లో మరణించిన సంగతి తెలిసిందే.
పోస్ట్ మార్టమ్ పూర్తయిన తరువాతే శవాన్ని అప్పగిస్తారని ఆయన తల్లి చెప్పారని, నావల్ని ప్రతినిధి కైరా యార్మాషి తెలిపారు.
పుతిన్ ఆదేశాల మేరకే నావల్నీని చంపి ఉంటారని ఆయన టీమ్ నమ్ముతోంది.
నావల్నీకి నివాళులు అర్పించినందుకు 300మందిని అరెస్ట్ చేశారని హక్కుల బృందమొకటి చెప్పింది.
అలెక్స్ నావల్ని హఠాత్తుగా చనిపోవడంపై రష్యన్ అధికారులను పశ్చిమ దేశాల ప్రభుత్వాలన్నీ నిందిస్తున్నాయి.
జీ 7 దేశాల విదేశాంగ మంత్రులందరూ నావల్నీ మరణానికి కారణమేమిటో చెప్పాలని రష్యాను కోరుతున్నాయి.
ఎక్కడో మారుమూల ఉండే ఆర్కిటిక్ సర్కిల్లోని ఐకే 3 జైల్లో అస్వస్థతకు గురై అలెక్సీ నావల్నీ మరణించాడని రష్యన్ ప్రిజన్ సర్వీస్ ప్రకటించినప్పటి నుంచి ఇప్పటిదాకా పుతిన్ ఈ విషయంపై బహిరంగంగా ఎటువంటి వ్యాఖ్యా చేయలేదు.
అయితే ఈ ఘటన గురించి తమకు తెలుసుని, అధ్యక్షుడికి తెలిపామని క్రెమ్లిన్ ప్రకటించింది.
నావల్ని మృతి కారణాలపై అసహజమైన, వివక్షాపూరితమైన అంచనాలన్నింటినీ తిరస్కరిస్తున్నట్టు రష్యా విదేశాంగ మంత్రి చెప్పారు. బ్రిటీషు అధికారులతో శనివారం నాడు జరిగిన సమావేశం సందర్భంగా ఆయన ఇలాంటి అంచనాలను తోసిపుచ్చుతున్నట్టు తెలిపారు.
‘సడన్ డెత్ సిండ్రోమ్’ కారణమా?

ఫొటో సోర్స్, REUTERS
నావల్ని రష్యా ప్రతిపక్ష ముఖ్యులలో ఒకరు. రాజకీయ ప్రేరేపిత అభియోగాలతో ఆయనకు 30 సంవత్సరాల జైలు శిక్ష విధించారు.
మాస్కోకు 1200 మైళ్ళ (1,900 కిలోమీటర్ల) దూరంలో ఉన్న ఖార్ప్‌లోని ‘పోలార్ ఊల్ఫ్’ పీనల్ కాలనీలో ఆయన శిక్ష అనుభవిస్తున్నారు.
నావల్నీ శుక్రవారంనాడు వాకింగ్ చేస్తుండగా అస్వస్థతకు గురై అపస్మారక స్థితిలోకి జారుకుని మరణించినట్టు ఆయన తల్లి ల్యూడ్మిలా నావల్నయకు జైళ్ళ సర్వీసు అధికారులు చెప్పినట్టు కథనాలు వచ్చాయి.
ల్యూడ్మిలా నావల్నయ శనివారం పీనల్ కాలనీకి వెళ్ళారని, నావల్ని స్థానిక కాలమాన ప్రకారం 2 గంటల 17 నిమిషాలకు మృతి చెందినట్టు అధికారకంగా ఆమెకు తెలిపారని యార్మిష్ తెలిపారు.
నావల్నికి మరో సన్నిహితడైన ఇవాన్ జద్నోవ్ మాట్లాడుతూ ‘సడెన్ డెత్ సిండ్రోమ్’ కారణంగా నావల్ని మరణించినట్టుగా ల్యూడ్మిలా తెలిపారని చెప్పారు.
ఎటువంటి కారణం కనిపించకుండా హఠాత్తుగా గుండెపోటు వచ్చి ఆకస్మికంగా చనిపోయినప్పుడు వాడే ఓ అస్పష్టమైన పదమే ఈ ‘సడెన్ డెత్ సిండ్రోమ్’.
అలెక్సీ నావల్ని మృతదేహాన్ని సలేఖర్డ్ పట్టణానికి తీసుకువెళ్ళారని, అయితే ఆయన తల్లి అక్కడికి చేరుకునే సమయానికే మార్చురీని మూసివేశారని, నావల్ని టీమ్ తెలిపింది.
నావల్ని మృతదేహానికి తొలిదశ పోస్టుమార్టమ్ పూర్తయిందని, మలివిడత పరీక్షలు కూడా చేయాల్సి ఉన్నట్టు జైలు అధికారులు ల్యూడ్మిలా నావల్నయకు తెలిపారు.
రష్యన్ అధికారులు ఉద్దేశపూర్వకంగానే నావల్ని మృతదేహాన్ని అప్పగించడం లేదని ఆయన సన్నిహితులు ఆక్షేపిస్తున్నారు.
తక్షణమే కుటుంబ సభ్యులకు నావల్ని మృతదేహాన్ని అప్పగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
మరోపక్క రష్యా అంతటా నావల్ని మృతికి సంతాపంగా బయటకు వచ్చిన మూడు వందలకుపైగా ప్రజలను అరెస్ట్ చేసినట్టు రష్యన్ మానవ హక్కుల మానిటరింగ్ గ్రూప్ – ఓవిడి తెలిపింది.
మొత్తం 32 నగరాలలో ఈ అరెస్ట్‌లు జరిగాయని, మాస్కో, సెయింట్ పీటర్స్ బర్గ్‌లో పెద్ద సంఖ్యలో అరెస్ట్ చేశారని ఓవీడీ తెలిపింది.
సోవియట్ కాలంలో సాగిన దమనకాండకు బలైన వారి జ్ఞాపకార్థమైన ‘వాల్ ఆఫ్ గ్రీఫ్’ వద్ద శనివారం నివాళులర్పించిన 15 మందిని పోలీసులు నిర్బంధించారు.
అలెక్స్ నావల్ని మృతికి నిరసనగా అనేక దేశాలలో రష్యన్ ఎంబసీల వద్ద ప్రదర్శనలు జరిగాయి.
మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ లో జీ7 విదేశాంగ మంత్రులు అలెక్స్ నావల్ని మృతికి సంతాపంగా ఒక నిమిషం పాటు మౌనం వహించారు.
బ్రిటన్ విదేశాంగ మంత్రి లార్డ్ కామెరున్ మాట్లాడుతూ యూకే దీనిపై చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
‘‘ఇలాంటి భయంకరమైన మానవహక్కుల ఉల్లంఘనలు జరిగినప్పుడు, బాధ్యతగా వ్యవహరించే వ్యక్తులు ఉన్నారా లేదా, ఏదైనా వ్యక్తిగతస్థాయులో చర్యలు తీసుకునే అవకాశం ఉందా అనే విషయాన్ని పరిశీలిస్తామని చెప్పిన కామెరున్ యూకే ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే విషయాన్ని ముందుగా చెప్పబోమననారు.
యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెస్కీ కూడా మునిచ్‌లో మాట్లాడుతూ పుతిన్‌ను రష్యన్ చట్టబద్ధమైన పాలకుడిగా గుర్తించడం అసంబద్ధమన్నారు.
యుక్రెయిన్‌పై రెండేళ్ళ కిందట రష్యా దండయాత్ర మొదలుపెట్టినప్పుడు నావల్నీ తీవ్రంగా వ్యతిరేకించారు.
ఇవి కూడా చదవండి :
- ‘నాది అప్పుడే పుట్టిన శిశువులను కాపాడే అరుదైన ‘నియో’ రక్తమని తెలిసిన రోజు ఎలా అనిపించిందంటే..
- కేజీ బేసిన్: కాకినాడ తీరంలో తొలిసారిగా చమురు వెలికితీత...భారతదేశపు చమురు అవసరాలను ఇది తీర్చగలదా?
- విశాఖపట్నం: దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఎందుకు కదలట్లేదు...
- ’తాజ్ మహల్ కంటే ముందే, ప్రియురాలి కోసం చోళరాజు నిర్మించిన ‘ప్రేమ చిహ్నం’ కథ తెలుసా?
- కొత్త మహాసముద్రం ఎక్కడ పుట్టుకొస్తోంది? భూమి గర్భంలో ఏం జరుగుతోంది?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















