ఆదిమ మానవులలో నరమాంసం తినే అలవాటు ఎందుకు ఉండేది?

 ‘సొసైటీ ఆఫ్ ది స్నో’ సినిమా

ఫొటో సోర్స్, NETFLIX

    • రచయిత, జోస్ లూయిస్ గిల్ గుర్రెరో
    • హోదా, ది కన్వర్జేషన్

‘సొసైటీ ఆఫ్ ది స్నో’ సినిమాలో స్పెయిన్ డైరెక్టర్ జేఏ బయోనా నరమాంస భక్షణ అంశాన్ని మరోసారి తెలివిగా తెరపైకి తీసుకొచ్చారు.

గత ఏడాది చివర్లో విడుదలైన ఈ సినిమా ఆండీస్ పర్వత శ్రేణుల్లో జరిగిన ప్రమాదానికి సంబంధించిన వాస్తవిక కథనం.

ఉరుగ్వేలోని మాంటెవీడియో ఓల్డ్ క్రిస్టియన్స్ క్లబ్‌కి చెందిన రగ్బీ ఆటగాళ్లు టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు తమ స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి 1972వ సంవత్సరం అక్టోబర్ 13న చిలీ రాజధాని శాంటియాగో వెళ్తున్న సమయంలో ఆండీస్ పర్వత శ్రేణుల్లో విమాన ప్రమాదం జరిగింది.

విమాన ప్రమాదం తర్వాత బతికిన కొందరు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి చనిపోయిన వారి మృతదేహాలను తినాల్సి వచ్చింది.

అయితే, ఒక మనిషి మరో మనిషిని ఎలాంటి పరిస్థితుల్లో తినాల్సి వస్తుందనే ప్రశ్న ఆలోచింప చేస్తుంది.

మానవ పరిణామ క్రమంలో బహుశా అవసరం కోసం నరమాంస భక్షకులుగా జీవించి ఉండొచ్చన్న ఆధారాలున్నాయి.

ఆదిమానవులు

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, అమెరికా ఖండానికి కొలంబస్ చేరుకున్నప్పుడు అక్కడ ఉన్న ఆదిమానవులు నరమాంస భక్షకులు

కెన్యాలో 14.5 లక్షల ఏళ్ల కిందట మనుషులు ఇతర మనుషులనే తినేసేవారని కొన్ని ఆధారాలు చెప్తున్నాయి.

అప్పటి మనుషుల కాళ్ల ఎముకలపై కట్ మార్క్స్ ఉన్నట్లు పురాతత్వ శాస్త్రవేత్తలు గుర్తించారు.

మన ముందు తరాల వారు ఒకరినొకరు తిన్నారన్న విషయాన్ని చెప్పేందుకు ఇదే పురాతన ఆధారం.

కానీ, నరమాంస భక్షణ గురించి మరో పురాతన ఆధారం కూడా బయటికి వచ్చింది.

ప్లియో-ప్లీస్టోసీస్ కాలంలో అంటే 25 లక్షల నుంచి 15 లక్షల ఏళ్ల కిందట దక్షిణాఫ్రికాలో నివసించిన వారిలో నరమాంస భక్షణ అలవాటు ఉండొచ్చని తెలుస్తుంది.

హోమినిడ్స్ దవడపై కోసినట్లు ఉన్న గుర్తులు, కోసే పరికరాలు పురాతత్వ శాస్త్రవేత్తలు గుర్తించారు.

దీన్ని బట్టి చూస్తే, వివిధ సమాజాల్లో నివసించిన మానవ జాతికి సంబంధించిన వారు(హోమినిడ్స్) అంతా కూడా నరమాంస భక్షకులుగా ఉండేవారిని అనిపిస్తుంది.

ఉదాహరణకు.. అమెరికాలో కొలంబస్ కనుగొన్న ఆదిమ మానవులు నరమాంస భక్షకులనడానికి ఆధారాలున్నాయి.

కొన్ని పసిఫిక్ దీవులు, ప్రపంచంలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఇటీవల కాలాల వరకు నరమాంస భక్షణ ఉండేది.

శరీరానికి ఎక్కువ కొవ్వు అవసరమైనప్పుడు..

వేడి ప్రాంతాలతో పోలిస్తే ఆర్కిటిక్ ప్రాంతంలో ముఖ్యంగా అతిశీతల కాలాల్లో జంతువుల ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఆ ప్రాంతాల వారికి ప్రధానంగా శక్తి ఇచ్చేది జంతువుల కొవ్వే.

దీనికి భిన్నంగా, దక్షిణార్థ గోళంలో భూమిలో పండే ఆహారాన్ని, కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉన్న వాటిని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు.

మానవ జాతికి అత్యంత అవసరమైన, మనుషుల మెదుడు సక్రమంగా పనిచేసేలా సహకరించే ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ కావాల్సి ఉన్నందున్న కొవ్వుపై ఆధారపడటం ఎప్పటికీ ఉంటూనే ఉంది.

ఒమేగా-3 లోపం వల్ల పలు రకాల వ్యాధులు వస్తుంటాయి. రెయిన్‌ డీర్‌తో పోలిస్తే ఏనుగులు, గుర్రాలలో ఒమేగా-3 అత్యధికంగా ఉంటుంది.

మన పూర్వీకులు పోషకాహారాల విధానం ఎక్కువగా వారు వేటాడే దానిపై ఆధారపడి ఉంది.

రాతియుగ కాలంలోని హోమినిడ్స్(మానవ జాతికి చెందినవి) ఆహారం కోసం కొన్ని జంతువులపై ఆధారపడేవి.

అయితే, ఒమేగా-3లున్న జంతువుల కొరత ఏర్పడితే ఎలా? దానికి కూడా సమాధానం స్పష్టంగా ఉంది.

ఒమేగా-3 అధికంగా ఉన్న ఫ్లాక్స్ సీడ్స్, వాల్ నట్స్, ఇతర వాటిపై ఆధారపడాల్సి ఉంటుంది. ఇవి జంతువుల కొవ్వుకు సప్లిమెంట్‌గా ఉపయోగపడగలవు.

యూరేసియాలో ఎక్కువ కాలం పాటు అతిశీతల వాతావరణం కొనసాగినప్పుడు ఇలాంటి ఆహార వనరులు దొరకవు.

దీని వల్ల తీవ్రమైన ఒమేగా-3 లోపం వల్ల వచ్చే వ్యాధులు వస్తుంటాయి.

ఒమేగా-3 ఆహారం

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, మానవ పరిణామ క్రమంలో చాలా సార్లు ఒమేగా-3 కొరత ఏర్పడింది

ఒమేగా-3 లోపం, నరమాంస భక్షణ మధ్య సంబంధం ఉందా?

ఇప్పటి వరకు చెప్పుకొన్న కారణాలను చూస్తే రాతియుగంలో యూరేసియాలో ముఖ్యంగా అతి శీతల కాలాలలో జంతు సంబంధిత ఆహారం ప్రాధాన్యమైన స్థానాన్ని దక్కించుకుంది.

కార్బోహైడ్రేట్స్ కొరత వల్ల, వేటాడే జంతువుల నుంచి పొందిన కొవ్వు పదార్థాలతో ఎనర్జీ అవసరాలను తీర్చుకునేవారు.

ఈ కొవ్వు ఒమేగా-3, ఒమేగా-6 రెండింటిన్నీ అందజేస్తుంది. పూర్వ కాలంలో మానవజాతి ఎక్కువగా రెయిన్ డీర్ వంటి నెమరవేసుకునే జంతువులపైనే ఆధారపడేది.

అసాధారణమైన పరిస్థితుల్లో తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు అవసరమైన ఒమేగా-3 కోసం హోమినిడ్స్ ఒకదానినొకటి తినేవి.

40 వేళ ఏళ్ల క్రితం ఆదిమానవులు, ఆధునిక మనుషులు ఒకర్నినొకరు వేటాడుకుని తినే వారు.

ఒకే జాతికి చెందిన హోమినిడ్స్ ఒకదానికొకటి ఆహారంగా ఉండేవి.

అయితే ఒకరినొకరు తినేటప్పుడు శరీరం లోపలి అవయవాలను, కొవ్వును తీసుకునే వారు. అందువల్ల, మాంసాన్ని బయటికి తీసేటప్పుడు ఎముకలపై పడే కట్ మార్క్స్ చాలా తక్కువగా కనిపించేవి. దీంతో, పూర్వకాలంలో ఉన్న అసలైన నరమాంస భక్షణను తక్కువగా అంచనావేశారు పరిశోధకులు.

హోమినిడ్ బ్రెయిన్

ఫొటో సోర్స్, Getty Images

రాతియుగంలోని యూరేసియాలో పరిస్థితిని, మునపటి కాలాల్లో ఇతర పర్యావరణాల గురించి పైన చెప్పిన వివరాలను చూస్తే ఒమేగా-3కు చెందిన పుష్కలమైన వనరులు ఉండేవా? అనే సందేహం వస్తుంది.

దక్షిణార్థ గోళంలో ఒమేగా-3 పుష్కలంగా ఉండే ఆహార వనరులు దొరికేవి. కానీ, అవసరమైన స్థాయిలో అన్ని వేళలా అందుబాటులో ఉండేవి కావు.

న్యూట్రిషియల్ క్వాలిటీ పరంగా, తేలికగ్గా పోషకాలు పొందే విషయంలో మానవ శరీరం ఎప్పుడూ తన ఆకర్షణీయతను కోల్పోదు.

ఈ విధంగా హోమినిడ్స్ బతకడం కోసం ఒకదానినొకటి తినేవనే పరిశోధకులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)