విద్వేష ప్రసంగాలు, వ్యాఖ్యల కేసుల్లో నిందితుడిగా ఉన్న జాకిర్ నాయక్‌ను ఖతార్ ఫుట్‌బాల్ ప్రపంచకప్‌కు ఎందుకు ఆహ్వానించింది?

జాకిర్ నాయక్

ఫొటో సోర్స్, TWITTER

    • రచయిత, దీపక్ మండల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఇటీవల ఖతార్‌లో జరిగిన ఫుట్‌బాల్ ప్రపంచ కప్ ప్రారంభ వేడుకలకు భారత్‌ హాజరైంది. అయితే, ఇదే సమయంలో వివాదాస్పద ఇస్లాం ప్రబోధకుడు జాకిర్ నాయక్ కూడా అక్కడకు రావడంతో భారత్‌లో నిరసన వ్యక్తం అవుతోంది.

అసలు జాకిర్‌ను అక్కడికి ఆహ్వానించారో లేదో ఖతార్ అధికారికంగా ధ్రువీకరించలేదు. కానీ, ఆయన ఖతార్‌కు చేరుకున్నారని సోషల్ మీడియాలో పెద్దయెత్తున చర్చ జరుగుతోంది.

ఈ అంశంపై ఖతార్ అధికారిక స్పోర్ట్స్ ఛానెల్ అల్‌కాస్ ప్రతినిధి అల్‌హాజరీ ఒక ట్వీట్ చేశారు. ‘‘జాకిర్.. ఖతార్‌కు వచ్చారు. ప్రపంచ కప్‌ను వేడుకల్లో భాగంగా ఆయన కొన్ని మతపరమైన ప్రసంగాలు ఇవ్వబోతున్నారు’’అని ఆయన ట్వీట్ చేశారు.

మరోవైపు ఇక్కడ జాకిర్ నాయక్ ప్రసంగించబోతున్నారని మరికొంతమంది కూడా ట్వీట్లు చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 1

భారత్‌లో విద్వేష ప్రసంగాలు, వ్యాఖ్యల కేసుల్లో జాకిర్ నిందితుడిగా ఉన్నారు. ఆయన ఖతార్‌కు రావడంపై భారత్ నిరసన వ్యక్తం చేస్తోంది. తాజా పరిణామాలతో భారత్-ఖతార్‌ల మధ్య సంబంధాలు కూడా దెబ్బతినే అవకాశముందని కొందరు విదేశాంగ నిపుణులు చెబుతున్నారు.

ఈ విషయంపై భారత విదేశాంగ శాఖ అధికారికంగా స్పందించలేదు. కానీ, కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పురీని విలేకరులు ప్రశ్నించినప్పుడు, ఆయన ఆచితూచి స్పందించారు. ‘‘ఈ విషయం ఖతార్ ఎదుట భారత్ ప్రస్తావించే ఉంటుంది’’అని ఆయన అన్నారు.

మరోవైపు బీజేపీ అధికార ప్రతినిధి సావియో రోడ్రిగ్స్ మాట్లాడుతూ.. వరల్డ్ కప్‌ను భారత్ బహిష్కరించాలని డిమాండ్ చేశారు.

అతివాదంపై ప్రపంచ దేశాలు పోరాడుతుంటే.. మరింత విద్వేషాన్ని వెదజల్లేందుకు జాకిర్ నాయక్‌కు అవకాశం ఇస్తున్నారని ఎన్‌డీటీవీతో సావియో చెప్పారు.

జాకిర్ నాయక్

భారత్ ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తోంది?

అసలు జాకిర్ నాయక్ ఖతార్ వెళ్లడంపై భారత్ ఎందుకు అభ్యంతరాలు వ్యక్తంచేస్తోందనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.

ఇటు భారత్‌తోపాటు బంగ్లాదేశ్‌లోనూ విద్వేషాన్ని ప్రచారం చేస్తున్నారని జాకిర్ నాయక్‌పై వరస కేసులు నమోదయ్యాయి. అతివాదాన్ని ప్రోత్సహిస్తున్నారని కూడా ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.

ఆ తర్వాత జాకిర్ మలేసియాకు మకాం మార్చారు. ఇప్పుడు ఆ దేశ పౌరుడిగా ఆయన అక్కడే ఉంటున్నారు.

అక్కడ కూడా ఆయనపై విద్వేష వ్యాఖ్యల కేసులతోపాటు అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆయన బహిరంగంగా ప్రసంగాలు ఇవ్వకుండా అక్కడ ఆంక్షలు కూడా అమలులో ఉన్నాయి.

జాకిర్ ప్రసంగాలను ప్రసారంచేసే ద పీస్ టీవీ నెట్‌వర్క్‌పై భారత్, బంగ్లాదేశ్, కెనడా, శ్రీలంక, బ్రిటన్‌లలో ఆంక్షలు అమలులో ఉన్నాయి.

ఇదివరకు మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో నూపుర్ శర్మ విషయంలో ఖతార్ నిరసన వ్యక్తంచేసింది. దోహాకు అప్పటి భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు వెళ్లినప్పుడే, భారత రాయబారిని పిలిపించి ఖతార్ నిరసన వ్యక్తంచేసింది. తాజా పరిణామాల నేపథ్యంలో ఖతార్ తీరుపై చాలా మంది ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 2

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 3

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 4

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 5
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 5

నూపుర్ శర్మ

ఫొటో సోర్స్, HINDUSTAN TIMES

నూపుర్ శర్మ వివాదంలో ఖతార్ ఏం చేసింది?

నూపుర్ శర్మ వివాదాస్పద వ్యాఖ్యల విషయంలో ఖతార్ తీవ్రంగా నిరసన వ్యక్తంచేసింది. దోహాలోని భారత రాయబారి దీపక్ మిత్తల్‌ను విదేశాంగ కార్యాలయానికి పిలిపించి తమ నిరసన తెలిపింది.

ఈ విషయంలో ఖతార్ నిరసనను తెలియజేస్తున్న పత్రాన్ని మిత్తల్‌కు ఖతార్ విదేశాంగ మంత్రి సుల్తాన్ బిన్ సద్ అల్-మురైఖీ ఇచ్చారు.

అదే సమయంలో నూపుర్ శర్మపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) చర్యలు తీసుకోవడాన్ని ఖతార్ తర్వాత స్వాగతించింది. మరోవైపు భారత ప్రభుత్వం కూడా బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని ఖతార్ డిమాండ్ చేసింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 6
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 6

జాకిర్ నాయక్

ఫొటో సోర్స్, Getty Images

జాకిర్‌పై ఆరోపణలు ఏమిటి?

దుబాయ్ నుంచి ప్రసారాలు చేసే పీస్ టీవీ చానెల్‌ను జాకిర్ మొదలుపెట్టారు. దీని ద్వారా ఇస్లాంను ఆయన ప్రబోధించేవారు.

ఆ తర్వాత ఆయన పీస్ టీవీ ఉర్దూ, బంగ్లాలను కూడా మొదలుపెట్టారు.

అయితే, వివాదాస్పద ప్రసంగాల నేపథ్యంలో జాకిర్‌కు చెందిన ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఐఆర్ఎఫ్)పై ఐదేళ్లపాటు భారత హోం శాఖ 2016లో నిషేధం విధించింది. అక్రమ కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద కేంద్రం ఈ చర్యలు తీసుకొంది.

దేశ భద్రతకు ముప్పు కలిగించే కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో జాకిర్ నాయక్‌పై కేసు కూడా నమోదైంది. ముఖ్యంగా ముస్లిం యువత అతివాదంవైపు వెళ్లేలా తన ప్రసంగాల ద్వారా ఆయన ప్రోత్సహిస్తున్నారని ఆయనపై ఆరోపణలు మోపారు.

బిన్ లాడెన్

ఫొటో సోర్స్, Getty Images

జాకిర్ వివాదాస్పద వ్యాఖ్యలు

రెచ్చగొట్టే ప్రసంగాలు, వివాదాస్పద వ్యాఖ్యలతో తన అనుచరులకు జాకిర్ చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని యాంటీ-టెర్రర్ ట్రైబ్యునల్ ఎదుట సోలిసిటర్ జనరల్ చెప్పారు.

జాకిర్ నాయక్‌కు చెందిన ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్.. గల్ఫ్ దేశాల నుంచి నిధులను సమీకరించేందుకు ఎన్‌జీవోలు, డొల్ల కంపెనీలను ఏర్పాటుచేసిందని ఆరోపణలు మోపారు. ఆ నిధులన్నీ ముఖ్యంగా యువతను అతివాదం వైపు మళ్లించే దిశగా ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు.

అయితే, ఈ ఆరోపణలు జాకిర్ నాయక్ ఖండించారు. తన ప్రసంగాలు, వ్యాఖ్యలను సందర్భంతో సంబంధంలేకుండా చూడటం వల్లే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు.

మరోవైపు జాకిర్ ప్రసంగాలను అన్ని ముస్లిం దేశాలు ఒక కంట కనిపెడుతుంటాయి. ఆయన తన ప్రసంగాల్లో షియాలు, అహ్మదీలను విమర్శిస్తుంటారని విమర్శకులు చెబుతుంటారు.

సున్నీ ఇస్లాంను అనుసరించే సౌదీ అరేబియా 2015లో జాకిర్‌కు కింగ్ ఫైసల్ ఇంటర్నేషనల్ అవార్డు ప్రదానం చేసింది.

అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్‌ను ‘‘వైట్ కాలర్ టెర్రరిస్టు’’గా తన ప్రసంగాల్లో జాకిర్ వ్యాఖ్యానించారు. మరోవైపు ఒసామా బిన్ లాడెన్‌ను తాను అటు ఉగ్రవాది లేదా ఇటు ప్రబోధకుడిగా గుర్తించనని జాకిర్ అన్నారు.

వీడియో క్యాప్షన్, ఇరాన్ చట్టాలు మగాళ్ళ మీద కూడా ఆంక్షలు విధించాయి... అవేమిటో తెలుసా?

శాంతి రాయబారిగా చెప్పుకొంటున్న జాకిర్

‘‘నేను ప్రబోధించే విషయాలను నేర్చుకొని ఒకరికైకా ముక్తి లభిస్తే అంతకంటే సంతోషం ఏముంటుంది?’’అని జాకిర్ చెబుతుంటారు.

దక్షిణాఫ్రికా ముస్లిం ప్రబోధకుడు షేక్ అహ్మద్ దీదత్‌ నుంచి స్ఫూర్తి పొంది తను ప్రబోధకుడిగా మారాలని అనుకున్నట్లు ముంబయిలో జన్మించిన జాకిర్ వెల్లడించారు.

జాకిర్ తండ్రి సైకియార్టిస్టు. సోదరుడు కూడా వైద్యుడే. జాకిర్‌ను హృద్రోగ నిపుణుడిగా చూడాలని వారు భావించారు.

అయితే, దీదత్‌ను కలిసిన తర్వాత తను డాక్టరుతోపాటు ప్రబోధకుడిగా కూడా మారాలని ఆయన నిర్ణయించుకున్నారు. వైద్య విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత ఆయన ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్‌ను మొదలుపెట్టారు.

వీడియో క్యాప్షన్, ఇరాన్ మహిళలకు మద్దతుగా జుత్తు కత్తిరించుకుంటున్న మహిళలు

ఎలా గుర్తింపు?

2000లో జాకిర్ ప్రసంగాలపై చర్చ మొదలైంది. ఇతర మతాల కంటే ఇస్లాం ఉన్నతమైనదని, ఇతర మతాలు మంచివికాదని ఆయన చెబుతుంటారు.

2016లో ఇస్లామిక్ అతివాదుల దాడిలో 29 మంది మరణించారు. అయితే, ఈ దాడికి పాల్పడిన వారు జాకిర్ ప్రసంగాలు వినే స్ఫూర్తి పొందినట్లు వెల్లడించారని పోలీసులు తెలిపారు.

ఆ తర్వాత ముంబయి పోలీసులు కూడా దీనిపై విచారణ చేపట్టారు. జాకిర్‌కు చెందిన ఐఆర్ఎఫ్‌పై నిషేధం కూడా విధించారు.

ఆ తర్వాత జాకిర్.. భారత్‌ను విడిచిపెట్టి మలేసియాకు వెళ్లిపోయారు. అతడిని దేశం విడిచి పరారైన నేరస్థుడిగా భారత్ గుర్తించింది.

శ్రీలంకను 2019లో కుదిపేసిన ఈస్టర్ బాంబు దాడుల నిందితులు కూడా జాకిర్ నుంచే స్ఫూర్తి పొందినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో శ్రీలంక కూడా ఆయన చానెల్‌ను మూసివేసింది.

వీడియో క్యాప్షన్, హిజాబ్‌ తమ హక్కు అని కర్ణాటకలో అంటుంటే, ఇరాన్‌లో వ్యతిరేకిస్తున్నారెందుకు?

భారత్ ఏం చేయాలి?

ఖతార్‌కు జాకిర్ చేరుకోవడంపై భారత్ పెద్దగా స్పందించకూడదని ఖతార్-భారత్ సంబంధాల నిపుణులు చెబుతున్నారు.

ఇది చాలా సున్నితమైన అంశమని ఖతార్‌కు భారత్ రాయబారిగా పనిచేసిన కేపీ ఫాబియన్ చెప్పారు. ఈ విషయంలో భారత్ కాస్త ఆచితూచి వ్యవహరించాలని ఆయన అన్నారు.

‘‘భారత్-ఖతార్ మధ్య సంబంధాలను మనం దృష్టిలో పెట్టుకోవాలి. అక్కడ దాదాపు ఎనిమిది లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు. అక్కడి నుంచి మనకు ఎల్ఎన్‌జీ వస్తోంది. మన దేశానికి చెందిన చాలా కంపెనీలు అక్కడ వ్యాపార లావాదేవీలు కొనసాగిస్తున్నాయి. అందుకే ఈ విషయానికి మనం అంత ప్రాధాన్యం ఇవ్వకూడదు’’అని ఏఎన్ఐ వార్తా సంస్థతో ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)