Kaali మాంసాహారం, మద్యం తీసుకునే దేవతగా కాళీమాతను ఊహించుకునే హక్కు నాకుంది - తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రా

కాళికాదేవి

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, కాళికాదేవి

తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా మంగళవారం ఒక వివాదంలో చిక్కుకున్నారు. మాంసాహారం, మద్యం సేవించే కాళికాదేవిని ఊహించుకునే హక్కు తనకు ఉందని మహువా మోయిత్రా వ్యాఖ్యానించారు.

దేవుళ్లను, దేవతలను తమకు నచ్చినట్టు పూజించుకునే హక్కు ప్రతి వ్యక్తికి ఉంటుందని ఆమె అన్నారు.

కాళికా దేవిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు ఆమెపై భోపాల్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. మత విశ్వాసాలను దెబ్బతీసినందుకు ఐపీసీ సెక్షన్ 295-ఏ కింద కేసు పెట్టారని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

కాళీమాతపై టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా చేసిన వ్యాఖ్యలను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఖండించారు.

"మహువా మోయిత్రా వ్యాఖ్యలతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. హిందూ దేవుళ్లను, దేవతలను అవమానించడం ఎంతమాత్రం సహించలేం" అని ఆయన అన్నారు.

మహువా వ్యాఖ్యలపై బీజేపీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, బెంగాల్ అధికార పార్టీ టీఎంసీ అభిప్రాయం కూడా ఇదేనా అంటూ ప్రశ్నించింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణానగర్‌ స్థానానికి లోక్‌సభ ఎంపీగా ఉన్నారు మహువా మోయిత్రా.

ఆమె మంగళవారం ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో మాట్లాడుతూ, తమ ఆరాధ్య దైవాలను ఏ రూపంలోనైనా ఊహించుకునే హక్కు ప్రతి వ్యక్తికి ఉంటుందని అన్నారు.

"ఉదాహరణకు, మీరు భూటాన్ లేదా సిక్కిం వెళితే, అక్కడ పూజలో భాగంగా దేవుళ్లకు విస్కీ ఇవ్వడం చూడవచ్చు. అదే ఉత్తరప్రదేశ్‌లో దేవుడికి నైవేద్యంగా విస్కీ ఇస్తే దైవదూషణగా పరిగణిస్తారు.

ప్రజలకు తమ ఆరాధ్య దైవాలను తమకు నచ్చిన రీతిలో ఊహించుకునే హక్కు ఉంటుందని ఆమె అన్నారు.

"నా వరకు కాళికాదేవి మాంసాహారం, మద్యం స్వీకరించే దేవత. మీరు తారాపీఠ్ (పశ్చిమ బెంగాల్‌లోని బీర్భూమ్ జిల్లాలోని ఒక శక్తి పీఠం)కి వెళితే, సాధువులు పొగ తాగడం కనిపిస్తుంది. అక్కడ ప్రజలు కాళికాదేవిని ఆ రూపంలో పూజిస్తారు. హిందూమతం పరిధిలోనే ఒక కాళికాదేవి ఆరాధకురాలిగా నా దేవతను నాకు నచ్చినట్టు ఊహించుకునే హక్కు నాకుంది. ఇది నా స్వేచ్ఛ" అని మహువా అన్నారు.

మహువా మొయిత్రా

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, మహువా మొయిత్రా

మహువా ఎందుకీ వ్యాఖ్యలు చేశారు?

ఫిల్మ్‌మేకర్ లీనా మణిమేకలై ఈమధ్యే తన కొత్త చిత్రం "కాళి" పోస్టరును ట్విట్టర్‌లో విడుదల చేశారు. అందులో కాళికాదేవి పొగ తాగుతున్నట్టు చూపించారు. ఇది వివాదాస్పదమైంది.

దీని గురించి ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో మహువా మొయిత్రా మాట్లాడుతూ, "శాకాహారం భుజించే, తెల్లటి దుస్తులు ధరించే దేవతను ఊహించుకుని, పూజించే స్వేచ్ఛ మీకు ఎంతుందో, మాంసాహారం భుజించే దేవతను ఊహించుకునే, పూజించే స్వేచ్ఛ నాకూ అంతే ఉంది" అన్నారు.

మహువా వ్యాఖ్యలు కొన్ని గంటల్లోనే వైరల్‌ అయ్యాయి. దీని తరువాత, ఆమె తన వ్యాఖ్యలకు వివరణ ఇస్తూ సంఘ్ పరివార్‌పై విరుచుకుపడ్దారు.

"సంఘీలందరికీ.. అబద్ధాలు ఆడితే మీరు మెరుగైన హిందువులు అయిపోరు. నేను ఏ సినిమా పోస్టరును సమర్థించలేదు. పొగ తాగడం అన్న పదమే వాడలేదు. తార్‌పీఠ్ ఆలయానికి వచ్చి మా కాళికాదేవిని ఒకసారి దర్శించమని నా సలహా. అక్కడ తీర్థప్రసాదాలుగా ఎలాంటి నైవేద్యం సమర్పిస్తున్నారో చూడండి. జై మా తారా" అంటూ ఆమె ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

మహువా వ్యాఖ్యలను బీజేపీ విమర్శించింది. దీనిపై టీఎంసీ అధినేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి వివరణ ఇవ్వాలని పేర్కొంది.

పశ్చిమ బెంగాల్ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రతీంద్ర బోస్ మాట్లాడుతూ, "టీఎంసీ నేతలు హిందూ దేవతల గురించి ఇలా మాట్లాడటం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా టీఎంసీ నాయకులు ఇలాగే మాట్లాడారు. ఓట్ల కోసం హిందువుల మనోభావాలు దెబ్బతీయడం అధికార టీఎంసీ వైఖరి" అన్నారు.

అయితే, టీఎంసీ, మహువా వ్యాఖ్యలకు దూరంగా ఉండడమే కాక, వాటిని ఖండించింది. ఆ మేరకు మంగళవారం ఒక ట్వీట్ చేసింది.

"ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో మహువా మోయిత్రా మాట్లాడిన మాటలు ఆమె వ్యక్తిగత అభిప్రాయాలు. పార్టీ ఏ రూపంలోనూ వాటిని బలపరచదు. తృణమూల్ కాంగ్రెస్ అటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తుంది" అంటూ స్పష్టం చేసింది.

కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గౌరవ్ వల్లభ్‌ను మహువా మోయిత్రా వ్యాఖ్యల గురించి, కాళీ సినిమా పోస్టర్ గురించి ప్రశ్నించగా, దానిపై తాను ఏమీ చెప్పదలచుకోలేదని అన్నారు. మహువా వ్యాఖ్యలు టీఎంసీ అంతర్గత వ్యవహారమన్నారు.

"మేం అన్ని మతాల దేవుళ్లను గౌరవిస్తాం. భారతదేశానికి భిన్నత్వమే అందం" అని ఆయన అన్నారు.

లీనా మణిమేకలై

ఫొటో సోర్స్, LEENA MANIMEKALAI

ఫొటో క్యాప్షన్, లీనా మణిమేకలై

సినిమాపై వివాదం ఏంటి?

లీనా మణిమేకలై కొత్త సినిమా పోస్టరులో కాళీమాత పాత్రధారి పొగతాగుతున్నట్టు ఉంది. దాంతో, వివాదం చెలరేగింది. లీనా ప్రస్తుతం కెనడాలో చదువుకుంటున్నారు.

తన సినిమాలో కనిపిస్తున్న కాళికాదేవి "మానవత్వానికి రూపమని, వైవిధ్యాలను గౌరవించే స్వరూపమని" ఆమె బీబీసీతో అన్నారు.

ఒట్టావాలోని భారత హైకమిషన్ కూడా దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఆ మేరకు ఒక ప్రకటన విడుదల చేస్తూ, "టొరంటోలోని ఆగాఖాన్ మ్యూజియం ఆధ్వర్యంలో 'అండర్ ది టెంట్' ప్రాజెక్టులో భాగంగా తీసిన ఒక చిత్రంలో హిందూ దేవతలను అవమానకరంగా చిత్రీకరించిన ఒక పోస్టర్‌పై కెనడాలోని హిందువుల నాయకుల నుంచి మాకు ఫిర్యాదులు అందాయి. ఈ ఆందోళనలను టొరంటోలోని భారత కాన్సులేట్ జనరల్ ఈ కార్యక్రమ నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కెనడాలోని చాలా హిందూ గ్రూపులు కూడా సంబంధిత అధికారులను ఆశ్రయించారని తెలిసింది. ఇలాంటి రెచ్చగొట్టే వాటిని అన్నింటినీ ఉపసంహరించుకోవాలని కెనడా ప్రభుత్వాన్ని, కార్యక్రమ నిర్వాకులను కోరుతున్నాం'' అని పేర్కొంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 4

లీనా గత శనివారం తన కొత్త సినిమా పోస్టర్‌ను ట్వీట్ చేశారు. ఇది ఒక పెర్ఫార్మెన్స్ డాక్యుమెంటరీ అని ఆమె చెప్పారు.

గతంలో కూడా ఆమె హిందూ దేవతలపై చిత్రాలు రూపొందించారు. 2007లో ఆమె తీసిన చిత్రం 'గాడెసెస్' ను ముంబై, మ్యూనిక్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించారు.

2019లో 'మాదాతి - యాన్ అన్‌ఫెయిరీ టేల్ ' చిత్రంలో ఒక దళిత అమ్మాయిని దేవతగా పూజించే కథను తెరకెక్కించారు.

వీడియో క్యాప్షన్, ఒక విగ్రహం, రెండు జెండాలు ఆ ప్రశాంత నగర చరిత్రను ఎలా మార్చేశాయంటే

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)