Kaali పోస్టర్‌‌పై వివాదం: నోటిలో సిగరెట్, చేతిలో ఎల్జీబీటీ జెండా.. డైరెక్టర్ లీనా మణిమేకలైపై పోలీసులకు ఫిర్యాదు

దర్శకురాలు లీనా మణిమేకలై

ఫొటో సోర్స్, @LeenaManimekali

    • రచయిత, నందిని వెళ్లిచామి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

దర్శకురాలు లీనా మణిమేకలై వివాదంలో చిక్కుకున్నారు. తన కొత్త డాక్యుమెంటరీ 'కాళి' పోస్టర్‌తో ఆమె హిందువుల మనోభావాలు దెబ్బతీశారని దిల్లీ పోలీసులకు సోమవారం (జూలై 4) ఫిర్యాదు చేశారు. దిల్లీకి చెందిన న్యాయవాది వినీత్ జిందాల్ ఆమెపై ఫిర్యాదు చేశారు. కాళి పోస్టర్ చాలా అభ్యంతరకరంగా ఉందని ఆయన అన్నారు.

వివాదాస్పద కాళి పోస్టర్ కలకలం సృష్టించింది. సోషల్ మీడియాలో దర్శకురాలు లీనా మణిమేకలైని అరెస్టు చేయాలనే డిమాండ్లు కూడా ఊపందుకుంటున్నాయి.

జూలై 2న లీనా షేర్ చేసిన వివాదాస్పద పోస్టర్‌కు సంబంధించి తన ఫిర్యాదులో పేర్కొన్న లాయర్ వినీత్ జిందాల్ ఆ డాక్యుమెంటరీ నుండి అభ్యంతరకరంగా ఉన్న ఫోటో, దృశ్యాలను నిషేధించాలని కోరారు.

కాళీ మాత వేషంలో ఉన్న ఒక మహిళ సిగరెట్ తాగుతున్నట్లు ఉన్న పోస్టర్‌ వల్ల హిందూ సమాజం మనోభావాలు, విశ్వాసాలు దెబ్బతింటాయని వినీత్ జిందాల్ అన్నారు.

రచయిత్రి, డాక్యుమెంటరీ చిత్ర నిర్మాత, దర్శకురాలులీనా మణిమేకలై లైంగిక, సామాజిక అణచివేతకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాలపై చిత్రాలు, డాక్యుమెంటరీలు తీశారు.

ఆమె నటించిన 'మాదతి', 'ఎర్ర సముద్రం' లాంటి సినిమాలు అంతర్జాతీయంగా ఎంతోమంది దృష్టిని ఆకర్షించాయి. అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో కూడా ఆమె చిత్రాలు ప్రదర్శితమయ్యాయి. లీనా మణిమేకలై పలు అంతర్జాతీయ అవార్డులు కూడా అందుకున్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

అసలు వివాదం ఏమిటి?

ఈ స్థితిలో ఆమె తాజాగా తాను దర్శకత్వం వహించిన 'కాళి' అనే డాక్యుమెంటరీ 'ఫస్ట్ లుక్' పోస్టర్‌ను తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ఇది ప్రస్తుత వివాదానికి కేంద్రంగా మారింది.

ఈ పోస్టర్‌లో కాళికా దేవి వేషంలో ఉన్న మహిళ నోట్లో సిగరెట్, చేతిలో ఎల్‌జీబీటీ జెండా పట్టుకుని కనిపిస్తుంటుంది. విడుదలైన కొన్ని గంటల్లోనే ఈ పోస్టర్‌కు స్పందనలు రావడం మొదలైంది.

ప్రస్తుతం భారత్ ట్విటర్‌లో 'అరెస్ట్‌ లీనా మణిమేకలై' అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఈ పోస్టర్ హిందూ మతాన్ని అవమానించేలా ఉందని, లీనా మణిమేకలైను అరెస్ట్ చేయాలని సోషల్ మీడియాలో పలువురు డిమాండ్ చేస్తున్నారు.

ముఖ్యంగా హరియాణా బీజేపీ రాష్ట్ర ఇంచార్జి అరుణ్ యాదవ్ ట్విట్టర్ లో ఓ వీడియో పోస్ట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

అందులో ఈ డాక్యుమెంటరీని నిషేధించాలని, హిందూ మనోభావాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని అన్నారు. చాలా మంది ఆమె కాళి వీడియోను రీట్వీట్ చేస్తున్నారు. అరెస్ట్ లీనా మణిమేకలై అనే హ్యాష్‌ట్యాగ్‌ పోస్ట్ చేస్తున్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

విశ్వహిందూ పరిషత్ నేతల్లో ఒకరైన ప్రాచీ సాధ్వి.. 'హిందువులారా.. మేల్కోండి.. హిందూ వ్యతిరేక దర్శకుడిని బాయ్‌కాట్ చేయండి' అంటూ తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేశారు.

అలాగే, దర్శకుడు అశోక్ పండిట్, హర్యానా బీజేపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ హరీష్ శర్మ ఇంకా చాలా మంది తమ అధికారిక ట్విట్టర్ పేజీలలో కాళి పోస్టర్‌ను ఖండించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 4

దిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి వినిత్ గొయెంకా ఒక ట్వీట్ చేస్తూ.. లీన మణిమేకలై ‘కాళి’ పోస్టర్‌తో చేసిన ట్వీట్ భారతీయులందరికీ అవమానకరమని పేర్కొన్నారు. కాళిని శక్తిగా పూజించే భారతీయులందరి మనోభావాలనూ ఈ ట్వీట్ దెబ్బతీస్తోందని, ఈ ట్వీట్‌ను ఇంకా ఎందుకు డిలీట్ చేయలేదని ప్రశ్నించారు.

నూపుర్ శర్మ కేసు, ఉదయ్‌పూర్‌లో జరిగిన హత్య సహా వివిధ ఘటనలపై భారతదేశంలో తీవ్రంగా చర్చ జరుగుతున్న సమయంలో దేశవ్యాప్తంగా ఎన్నో పేర్లతో, ఎన్నో రూపాల్లో పూజించే 'కాళి' వివాదాలకు కేంద్రంగా ఎందుకు మారారు?

కెనడాకు చెందిన దర్శకురాలు లీనా మణిమేకలై ఆ డాక్యుమెంటరీ, పోస్టర్ రిలీజ్ అనంతరం ఏర్పడిన వివాదం గురించి బీబీసీ తమిళ్‌తో మాట్లాడారు. ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.

దర్శకురాలు లీనా మణిమేకలై

ఫొటో సోర్స్, @LeenaManimekali/Twitter

మీ డాక్యుమెంటరీ 'కాళి' పోస్టర్‌లో దేవత చేతిలో సిగరెట్, చేతిలో ఎల్జీబీటీ జెండా పట్టుకుని ఉన్నారు. దీన్ని బట్టి 'కాళి' ఎలా ఉంటుందనుకోవాలి?

నా వరకు, కాళి అనేది ప్రతిష్టాత్మకమైన, ఎలాంటి హద్దులు లేని ఒక ఆదిదేవత., చెడును, రాక్షసత్వాన్ని, దారుణమైనవిగా భావించే అన్నింటినీ అణచివేసి, దుష్టుల తలలన్నీ నరికే అలాంటి మనిషి ఒక సాయంత్రానికి నాలోకి వచ్చి టొరంటో వీధుల్లో తిరుగుతుంటే ఏం జరుగుతుందో చూపించే సినిమా కాళి.

నేనొక పాలపిట్టను, సినిమాలకు దర్శకత్వం వహించే మహిళను, కాబట్టి నాపైకి దిగిన కాళీ, పాలపిట్ట జెండా, కెమెరా పట్టుకుంది. ఏం చేయాలి?

కెనడాలో ఆఫ్రికా, ఆసియా, యూదు, పర్షియన్ జాతుల వారందరూ కలిసి నివసించడం, మానవత్వంతో వ్యవహరించడం చూసి నన్ను ఆవహించిన కాళి సంతోషిస్తుంది. కెనడాలో గంజాయి చట్టబద్ధమైనా, ఖరీదైనది. పార్కులో నిద్రిస్తున్న కెనడాలోని నిరాశ్రయులైన పేద నల్లజాతివారి దగ్గర సిగరెట్ మాత్రమే ఉండడంతో కాళి దానిని ప్రేమతో స్వీకరిస్తుంది.

వీడియో క్యాప్షన్, ఆ దేశాల్లో స్వలింగ సంపర్కానికి పాల్పడితే మరణశిక్షే

ఈ పోస్టర్ హిందూ దేవతను అవమానించేలా ఉందని, హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందంటున్నారు. దీనిపై మీరేమంటారు.

నిరసన తెలుపుతున్న విద్యార్థులు, కళాకారులను అణిచివేసేందుకు వీధుల్లోకి వచ్చే సామాజిక కార్యకర్తలు, జర్నలిస్టులను అణచివేయడమే భారత ప్రభుత్వం పనిగా పెట్టుకుంది. ఇలా చేయడం ప్రజాస్వామ్యం కాదు, నియంతృత్వం. ఇది మైనారిటీలను అణచివేస్తుంది. మతం పేరుతో ప్రజలను విభజిస్తోంది.

దర్శకురాలు లీనా మణిమేకలై

ఫొటో సోర్స్, @LeenaManimekali/Twitter

పోస్టర్ వల్ల ఇంత వివాదం తలెత్తుతుందని అనుకున్నారా? డాక్యుమెంటరీని నిషేధించాలి అంటున్నారు. మీరేమంటారు.

నేను సృజనాత్మకంగా ఉన్న ఏ ఆలోచనను అడ్డుకోను. కళకు స్వీయ సెన్సార్‌షిప్ కంటే అధ్వాన్నమైనది వేరేదీ లేదు. నా సినిమాను చూస్తే ఈ హ్యాష్‌ట్యాగ్‌ల ఆలోచనలు మారే అవకాశం ఉంది. అందుకే వారు నిషేధించాలని కోరుతున్నారు. ఈ ఇంటర్నెట్ యుగంలో నిరంకుశత్వం ప్రభుత్వ రహస్యాలను రక్షించలేవు. కళ ఏదో ఒకవిధంగా ప్రజలను కలుపుతుంది. నా మునుపటి రచనలు, కవిత్వం, సినిమాలు ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్నాయి. అయినా, వాటిని ఎప్పుడూ చదవకుండా లేదా చూడకుండా ఉండలేదు.

ఈ పోస్టర్‌ని పోస్ట్ చేయడానికి ఇదే సరైన సమయమని మీరు భావిస్తున్నారా?

కెనడా యార్క్ విశ్వవిద్యాలయం నన్ను అంతర్జాతీయ వేదికపై సృజనాత్మక అందించమని నన్ను ఆహ్వానించింది. నాకు స్కాలర్‌షిప్, తదుపరి శిక్షణ కోసం ఒక వేదిక, మాస్టర్స్ డిగ్రీకి అవకాశం కల్పించింది. టొరంటో మెట్రోపాలిటన్ యూనివర్శిటీ "మల్టీకల్చరలిజం" గురించి సినిమా తీయాలని నన్న కోరింది. కాళి సినిమా కల్పిత కథ. ఈ సినిమాను అణచివేయాలనుకునే వారు కళనే కాదు, విద్యారంగాన్ని కూడా అవమానిస్తున్నారు. ఈ ప్రపంచం, ప్రజలు వీటిని ఎక్కువ కాలం భరించాల్సిన అవసరం ఉండదని నేను ఆశిస్తున్నాను.

వీడియో క్యాప్షన్, ఎల్‌జీబీటీ... తేడాలేంటి?

ఖండించిన భారత హైకమిషన్

కాళి సిగరెట్ తాగుతున్నట్లుగా ఉన్న పోస్టర్‌పై ఒట్టావాలోని భారత హైకమిషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఈ మేరకు ఒక పత్రికా ప్రకటనను విడుదల చేసింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 5
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 5

‘‘టొరంటోలోని ఆగాఖాన్ మ్యూజియం ఆధ్వర్యంలో ‘అండర్ ది టెంట్’ ప్రాజెక్టులో భాగంగా తీసిన ఒక చిత్రంలో హిందూ దేవతలను అవమానకరంగా చిత్రీకరించిన ఒక పోస్టర్‌పై కెనడాలోని హిందువుల నాయకుల నుంచి మాకు ఫిర్యాదులు అందాయి. ఈ ఆందోళనలను టొరంటోలోని భారత కాన్సులేట్ జనరల్ ఈ కార్యక్రమ నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కెనడాలోని చాలా హిందూ గ్రూపులు కూడా సంబంధిత అధికారులను ఆశ్రయించారని తెలిసింది. ఇలాంటి రెచ్చగొట్టే వాటిని అన్నింటినీ ఉపసంహరించుకోవాలని కెనడా ప్రభుత్వాన్ని, కార్యక్రమ నిర్వాకులను కోరుతున్నాం’’ అని పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)