లైఫ్ హ్యాపీగా ఉండాలంటే ఈ 7 సూత్రాలు పాటించండి

ఫొటో సోర్స్, Getty Images
బలవర్థకమైన ఆహారం ఎంత అవసరమో మనందరికీ తెలుసు. చాలామంది ఇకపైన మంచి తిండి తినాలనే నియమం పెట్టుకునే ఉంటారు. కానీ నిజజీవితంలో ఈ నియమాన్ని అనుసరించాలంటే ఎంత కష్టపడాలో తేలికగానే అర్థమవుతుంది.
ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారం ఎంతో అవసరమైనది. దాని ప్రాముఖ్యం తోసిపుచ్చలేం.
అయితే ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే 7 సలహాలు పాటించాలని సూచిస్తున్నారు ప్రొఫెసర్ గ్రామే ఎల్. ఈయన లివర్‌పూల్ జాన్ మూర్స్ యూనివర్సిటీలో హ్యూమన్ ఫిజియాలిజీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
1. రోజూ కాసిన్ని కసరత్తులు
ఉదయాన్నే కొద్దిగా వ్యాయామాలు చేయడం వలన మీ శరీరంలో జీవక్రియలు మెరుగుపడతాయి. పైగా రోజంతా తాజాగా ఉన్న అనుభూతి కలుగుతుంది.
దీనికోసం మీరు ఏ జిమ్ముకో పరుగెత్తక్కరలేదు. లేదంటే చెమటలు కక్కేలా పరుగులు పెట్టనూ అక్కరలేదు. సింపుల్‌గా ఆయాసం కలిగించేవి కొన్ని, కలిగించనవి కొన్ని వ్యాయామాలు చేయండి. ఓ చిన్న ప్రయత్నం కూడా మిమ్మల్ని చురుకుగా ఉంచుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
2. కూరగాయలు ఎక్కువగా తినండి
కాయగూరలను భుజిస్తే ఎంతో సంతృప్తి లభించడంతోపాటు మరెన్నో ప్రయోజనాలూ ఉన్నాయి. పైగా మళ్ళీ భోజనం చేసేవరకూ ఈ అనుభూతి తాజాగా ఉంటుంది.
ఆమ్లెట్‌లో బచ్చలికూర, పుట్టగొడుగులు, తాజా టమోటాలు, ఎర్రమిరియాలు జోడించి తినండి.
సీజనల్ ప్రూట్స్, కాయగూరలు, ఉడకబెట్టిన గుడ్లను తినండి. లేదంటే హాయిగా కాయగూరల జ్యూసైనా తాగండి.

ఫొటో సోర్స్, Getty Images
3. ప్లానింగ్
మీరు ముందుగానే ఆహారాన్ని తయారు చేసుకుంటే మీకు ఆకలి తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది.
అదే మీకు బాగా ఆకలిగా ఉన్న వేళ ఆహారం తయారుచేసుకోవడం మొదలుపెడితే తప్పులు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పైగా ఆరోగ్యకరమైన ఆహారానికి బదులుగా ఏదిపడితే అది తినే అవకాశం కూడా ఉంటుంది.
అందుకే మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఏదైనా తినడానికి తీసుకువెళ్ళండి. దీని వల్ల రెండు ప్రయోజనాలు ఉంటాయి. ఒకటి మీరు బయట కొనాల్సిన పని ఉండదు. ఇంటినుంచి తీసకువెళతాం కాబట్టి కచ్చితంగా ఇది మంచి ఆహారం, చౌకైనది అవుతుంది.
4 . ప్రోటీన్లు తీసుకోండి
వయసు పెరుగుతున్న కొద్దీ చాలామంది స్వీట్లు, కార్పొహైడ్రేట్లు ఎక్కువగా ఉన్న పదార్థాలు తింటూ ఉంటారు. కానీ వీరికి కండరాలు క్షీణించకుండా ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం అవసరం అవుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
5. సూపర్ మార్కెట్‌లో నోరూరుతోందా?
పెద్ద పెద్ద దుకాణాలు, సూపర్‌మార్కెట్లు అనేక ఆహారపదార్థాలపై డిస్కౌంట్లు ఇస్తుంటాయి. అయితే తరచూ ఇలాంటివి మన శరీరానికి హాని చేస్తాయి. చాలా సందర్భాలలో ఇవి మిమ్మల్ని మీ నిగ్రహానికి దూరం చేస్తాయి.
అందుకే ఇలాంటి ప్రదేశాలలో మీ జేబులోంచి చేతులు అవసరమైనప్పుడు మాత్రమే బయటకు తీయాలి.
6. నిరుత్సాహపడకండి
మీరు సమతుల్య ఆహారం తీసుకుంటున్నారని బాధపడకండి. సంతోషంగా తినండి.
మీరు మీ డైట్‌కు అలవాటుపడేవరకూ కొంత ఇబ్బంది అనిపించినా, తరువాత అది మీ దైనందిన జీవితంలో భాగమైపోతుంది.
7. బాగా నీరు తాగండి
చల్లటి నీరు చౌకైన, ఉత్తమమైన ఆహారపు ఎంపిక.
జ్యూసులు, ఆల్కహాల్, లేదా కార్బొనేటేడ్ డ్రింక్స్‌లో మీరు ఊహించినదానికంటే కూడా ఎక్కువగా చక్కెర ఉంటుంది.
పోషకాలను రక్తం ద్వారా శరీరమంతటికి అందించేందుకు నీరు ఎంతో అవసరం. మానవ కణాలలో జరిగే రసాయన చర్యలకు నీరేంతో అవసరం.
ఇవి కూడా చదవండి:
- మహాత్మ జ్యోతిబా, సావిత్రిబాయి ఫూలే స్థాపించిన తొలి బాలికల పాఠశాల ఏడాదిలోనే ఎందుకు మూతపడింది, ఆ తర్వాత ఏమైంది?
- 2024: సూపర్ ఎల్ నినో అంటే ఏంటి? దీని ప్రభావంతో భారత్‌లో ఈ ఏడాది కరవు తప్పదా
- సద్దాం హుస్సేన్: ‘నల్ల ముసుగు కప్పకుండానే నన్ను ఉరి తీయండి... నా ధైర్యాన్ని మీరు చూడలేరా?’
- అయోధ్య: సోనియా గాంధీకి ఆహ్వానంపై వీహెచ్‌పీ వాదన ఏమిటి?
- పిల్లల భవిష్యత్తు కోసం వారితోనే పొదుపు చేయించే మూడు చిట్కాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














