పాకిస్తాన్: ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి ఇన్ని కష్టాలా?

ఫొటో సోర్స్, @PAKPMO
పాకిస్తాన్ ప్రభుత్వం ముందు నుయ్యి-వెనక గొయ్యి అనే పరిస్థితిలో ఉంది. దేశాన్ని అప్పుల సమస్య నుంచి గట్టెక్కించాల్సి ఉండగా, దీని కోసం ప్రజలపై భారం మోపక తప్పేలా లేదు. ఎన్నికలు చేరువుతున్న వేళ రెండింటిలో ఏదో ఒకటి ఎంచుకోవాల్సిన దుస్థితిలో ఆ దేశ నాయకత్వం ఉందని ఆర్ధిక నిపుణులు అంటున్నారు.
ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) ప్రభుత్వం గురువారం జాతీయ అసెంబ్లీలో ఆర్థిక బిల్లును ప్రవేశపెట్టింది. ఇది సప్లిమెంటరీ ఫైనాన్స్ బిల్లు. ఇది పాకిస్తాన్ ప్రభుత్వానికి 360 బిలియన్ రూపాయలు( 36వేల కోట్లు) మేర పరోక్ష పన్నులు విధించే హక్కును ఇస్తుంది.
బిల్లు ఆమోదం పొందితే యంత్రాలు, ఫార్మా, దిగుమతి చేసుకున్న ఆహార పదార్థాలపై రూ. 34 వేల కోట్ల మేర సేల్స్ టాక్స్ మినహాయింపులను తొలగిస్తారు. అంటే ఈ వస్తువుల ధరలు పెరుగుతాయి. ఇది కాకుండా సర్వీస్ సెక్టార్‌లో ఎక్సైజ్ సుంకం, ఆదాయపు పన్ను, అమ్మకపు పన్ను రేట్లు పెరుగుతాయి.
ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ఐఎంఎఫ్(ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్)కు లొంగిపోయిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఐఎంఎఫ్, ఇమ్రాన్ ఖాన్ కుమ్మక్కు కు పాకిస్తాన్ ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చైర్మన్ బిలావల్ జర్దారీ భుట్టో అన్నారు.
ఐఎంఎఫ్ షరతులను నెరవేర్చేందుకు తీసుకొచ్చిన బిల్లు పాకిస్తాన్ ను దివాళా తీయకుండా చేస్తుందని బిలావల్ భుట్టో అన్నారు. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం పాకిస్తాన్‌ను తనఖా పెట్టబోతోందని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీకి చెందిన ఎంపీ షెర్రీ రెహ్మాన్ అన్నారు. ఈ బిల్లు దేశ భద్రతకు ముప్పు అని ఆయన అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రభుత్వంపై ఒత్తిడి
ప్రభుత్వం పన్నులు పెంచడానికి ఇష్టపడలేదు. అయితే అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) నుంచి 100 కోట్ల డాలర్ల రుణం ఆమోదం పొందాల్సి ఉంది.
జనవరి 12న ఐఎంఎఫ్ బోర్డు సమావేశం ఉంది. ఇందులో పాకిస్తాన్‌కు ఇవ్వాల్సిన రుణానికి ఆమోదం తెలపాల్సి ఉంది. బోర్డు సమావేశానికి ముందు పాకిస్తాన్ ఈ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
మరోవైపు ఐఎంఎఫ్ ఒత్తిడితో పాకిస్తాన్ మరో బిల్లును ప్రవేశపెట్టే అవకాశం కూడా ఉంది. దాని పేరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ అమెండ్‌మెంట్ బిల్.
ఈ బిల్లు ఆమోదం పొందితే, పాకిస్తాన్ సెంట్రల్ బ్యాంక్‌కు మరింత స్వయంప్రతిపత్తి లభిస్తుంది. ఈ సవరణల కారణంగా బ్యాంకు ప్రభుత్వానికి రుణం ఇవ్వడానికి నిరాకరించే అధికారం వస్తుంది. అయితే , బిల్లును ఆమోదానికి పంపుతారా లేక పెండింగ్‌లో ఉంచుతారా అనే దానిపై ప్రభుత్వం ఎటువంటి సంకేతాలు ఇవ్వలేదు.

ఫొటో సోర్స్, Getty Images
కష్టాల్లో ప్రజలు
ప్రభుత్వం రెండో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదిస్తే, పాకిస్తాన్ సెంట్రల్ బ్యాంక్‌కు స్వయం ప్రతిపత్తి లభిస్తుంది. అప్పుడు దేశానికి రుణాలు ఇచ్చే విషయంలో ప్రభుత్వ జోక్యం నుంచి ఆ బ్యాంక్ విముక్తి పొందుతుంది. అయితే ప్రస్తుత ప్రభుత్వ చర్యల వల్ల పరోక్ష పన్నులు అధికమై ద్రవ్యోల్బణం కూడా పెరుగుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అదే జరిగితే ప్రజలు ఆందోళనలకు దిగుతారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ ఘోర పరాజయాన్ని చవిచూడడంతో ప్రభుత్వం పరోక్ష పన్నును పెంచబోతోంది.
జాతీయ అసెంబ్లీలో ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వానికి మెజారిటీ ఉందని నిపుణులు చెబుతున్నారు. బిల్లు ఆమోదం పొందితే ఆయన ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న మిత్రపక్షాలు దూరం అయ్యే అవకాశం కూడా ఉంది. ఇదే జరిగితే ప్రభుత్వం పడిపోవడం ఖాయం.
డైలమాలో ప్రభుత్వం
''పార్లమెంట్‌లో బిల్లుపై ఓటింగ్ సమయంలో పీటీఐ, దాని మిత్రపక్షాల ఎంపీలు గైర్హాజరవుతారు. ఎందుకంటే 20 నెలల తర్వాత ఎన్నికలు ఉన్నాయి. ద్రవ్యోల్బణానికి దారితీసే బిల్లుకు ఏ నాయకుడూ మద్దతు ఇవ్వడానికి ఇష్టపడరు'' అని నిక్కీ ఏషియాకు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్ట్రాటజిక్ స్టడీస్, ఇస్లామాబాద్‌లో రీసెర్చ్ ఫెలోగా ఉన్న అహ్మద్ నయీమ్ సాలిక్ అన్నారు.
కానీ, ప్రభుత్వం ఆర్థిక బిల్లును ఆమోదించకపోతే, ఐఎంఎఫ్ నుంచి ఒక బిలియన్ డాలర్ల రుణం రాదు. ఐఎంఎఫ్ నుంచి పాకిస్తాన్ వచ్చే మూడేళ్లలో ఆరు బిలియన్ డాలర్ల రుణాన్ని పొందాల్సి ఉంది.
''ఐఎంఎఫ్ ఆర్ధిక సాయం చేయకపోతే పాకిస్తాన్ కష్టాల్లో ఉంటుంది. చైనా, సౌదీ అరేబియాల నుంచి సాయం అందే అవకాశం లేదు. ఈ పరిస్థితుల్లో పాకిస్తానీ రూపాయిపై తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. ఆర్ధిక అనిశ్చితి పెరుగుతుంది. దీని భారం అంతిమంగా పాకిస్తానీలపైనే పడుతుంది'' అని నిక్కీ ఏషియాకు చెందిన అట్లాంటిక్ కౌన్సిల్‌లో పాకిస్తాన్ నిషియేటివ్ డైరక్టర్‌గా పని చేస్తున్న ఉజైర్ యోనాస్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
పెరుగుతున్న అప్పులు
బడ్జెట్ లోటు, విదేశీ మారకద్రవ్య నిల్వలను కాపాడుకోవడానికి గత ఐదు నెలల్లో 4.6 బిలియన్ డాలర్ల రుణం తీసుకోవాల్సి వచ్చిందంటే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఎంత దుస్థితిలో ఉందో అంచనా వేయవచ్చు.
బిల్లు ఆమోదం పొందకపోతే పాకిస్తాన్ ప్రభుత్వానికి ప్రపంచ సంస్థల నుంచి అప్పులు పుట్టవు.
''ప్రజలను ఒప్పించడమే ప్రభుత్వానికి ఉన్న ఏకైక మార్గం'' అని యోనాస్ అన్నారు.
పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను క్రమశిక్షణలో పెట్టేందుకు ఐఎంఎఫ్ ప్రయత్నిస్తోందని, పాకిస్తాన్ ఈ బిల్లును ఆమోదించక తప్పకపోవచ్చని కొందరు నిపుణులు అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
- జార్ఖండ్: లీటరు పెట్రోలుకు రూ.25 తగ్గించిన రాష్ట్ర ప్రభుత్వం.. సబ్సిడీ నిబంధనలు ఏంటంటే..
- 2021 వైరల్ వీడియోలు: సోషల్ మీడియాను కదిలించిన 5 వీడియోలను ఇక్కడ చూసేయండి...
- పిల్లలకు కోవిడ్19 వ్యాక్సీన్: టీకా ఇచ్చే ముందు, ఇచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? - 7 ముఖ్యమైన ప్రశ్నలు - జవాబులు
- కోవిడ్ మహమ్మారి: 2021లో నేర్చుకున్న గుణపాఠాలేంటి, మున్ముందు ఏం చేయాలి ?
- ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొత్త కారు ధర ఎంత? రూ.12 కోట్లు కాదంటున్న అధికారులు
- మనిషి, మొసళ్ల మధ్య మనుగడ పోరాటం
- కొంపముంచిన అలెక్సా, పదేళ్ల చిన్నారికి ప్రమాదకరమైన చాలెంజ్
- గోవాలో క్రిస్టియానో రొనాల్డో విగ్రహ ఏర్పాటుపై వివాదం
- అంతరిక్షంలోకి వెళ్లిన వ్యోమగామిని భూమిపైకి తెచ్చేందుకు డబ్బుల్లేక ప్రభుత్వం అక్కడే ఉంచేసింది
- WAN-IFRA ‘సౌత్ ఏసియా డిజిటల్ మీడియా అవార్డ్స్’లో బీబీసీకి 4 పురస్కారాలు
- స్పైడర్ మ్యాన్ జోరుకు అల్లు అర్జున్ పుష్ప, రణ్వీర్ సింగ్ 83 తగ్గక తప్పలేదా? బాక్సాఫీస్ వద్ద మార్వెల్ సినిమా కలెక్షన్ల జోరుకు కారణాలేంటి?
- మీకూ ఇలాంటి మెసేజ్ వచ్చిందా?.. ‘24 గంటల్లో డబ్బు రెట్టింపు.. 50 వేలు పెట్టుబడి పెడితే ఆరు లక్షలు’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














