WAN-IFRA ‘సౌత్ ఏసియా డిజిటల్ మీడియా అవార్డ్స్‌’లో బీబీసీకి 4 పురస్కారాలు

వ్యాన్-ఇన్‌ఫ్రా సౌత్ ఏషియా అవార్డులలో బీబీసీకి నాలుగు అవార్డులు లభించాయి.
ఫొటో క్యాప్షన్, వ్యాన్-ఇన్‌ఫ్రా సౌత్ ఏషియా అవార్డులలో బీబీసీకి నాలుగు అవార్డులు లభించాయి.

WAN-IFRA సౌత్ ఏసియా డిజిటల్ మీడియా అవార్డ్స్‌లో బీబీసీ ఒక వెండి పతకం, మూడు కాంస్య పతకాలు గెలుచుకుంది. బీబీసీ మరాఠీ అందించే డిజిటల్ బులెటిన్ ‘తీన్ గోష్టి’కి ‘బెస్ట్ ఇన్ ఆడియన్స్ ఎంగేజ్‌మెంట్‌’ విభాగంలో వెండి పతకం లభించింది.

ఇక సింఘూ సరిహద్దుల్లో రైతుల ఆందోళన జరుగుతున్న ప్రాంతంలో రూపొందించిన 'ఎ నైట్ ఎట్ ఇండియాస్ లార్జెస్ట్ ఫార్మర్స్ ప్రొటెస్ట్' అనే డాక్యుమెంటరీ 'బెస్ట్ యూజ్ ఆఫ్ ఆన్‌లైన్ వీడియో' విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకుంది.

వీడియో క్యాప్షన్, ఎముకలు కొరికే చలిలో ఈ రైతులంతా ఎలా పోరాడగలుగుతున్నారు?

ఈ డాక్యుమెంటరీని బీబీసీ ఇండియన్ లాంగ్వేజెస్ హెడ్ రూపా ఝా రిపోర్ట్ చేయగా, నేహా శర్మ కెమెరా వర్క్ చేశారు.

బెస్ట్ పాడ్‌కాస్ట్/డిజిటల్ ఆడియో ప్రాజెక్ట్ విభాగంలో 'వివేచనా' కార్యక్రమానికి అవార్డు లభించింది.

ఫొటో సోర్స్, WAN-IFRA SOUTH ASIA DIGITAL MEDIA AWARDS

ఫొటో క్యాప్షన్, బెస్ట్ పాడ్‌కాస్ట్/డిజిటల్ ఆడియో ప్రాజెక్ట్ విభాగంలో ‘వివేచనా’ కార్యక్రమానికి అవార్డు లభించింది.

బీబీసీ హిందీ నిర్వహించే పాడ్‌కాస్ట్ చర్చా కార్యక్రమం ‘వివేచనా’కు బెస్ట్ పాడ్‌కాస్ట్/డిజిటల్ ఆడియో ప్రాజెక్ట్ విభాగంలో కాంస్య పతకం లభించింది.

ఈ కార్యక్రమాన్ని బీబీసీ కరస్పాండెంట్ రేహన్ ఫజల్ సమర్పించారు. చరిత్ర అంశాలు, కీలక ఘట్టాలు, వ్యక్తిత్వం తదితర అంశాలపై ఈ కార్యక్రమం ప్రధానంగా దృష్టిసారిస్తుంది.

భారతదేశంలో కోవిడ్-19 మహమ్మారి కవరేజ్‌కు అందించే ‘బెస్ట్ స్పెషల్ ప్రాజెక్ట్ ఫర్ కోవిడ్-19’ విభాగంలో బీబీసీకి మరో కాంస్య పతకం లభించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)