Indian Sports Woman Of The Year అవార్డును ప్రారంభించిన బీబీసీ న్యూస్ ఇండియా

బీబీసీ 'స్పోర్ట్స్‌విమెన్ ఆఫ్‌ ద ఇయర్' అవార్డు

భారత ఉత్తమ మహిళా క్రీడాకారుల (పారా అథ్లెట్లు సహా) సేవలను గుర్తించేందుకు బీబీసీ మొదటిసారిగా ప్రతిష్ఠాత్మక క్రీడా పురస్కారాన్ని ప్రారంభిస్తోంది. 'బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ విమెన్ ఆఫ్‌ ద ఇయర్ 2019' విజేతను మార్చిలో ప్రకటించనుంది.

ఈ క్రీడా పురస్కారం విధివిధానాలు, ఇతర వివరాలను బీబీసీ ఇండియన్ లాంగ్వేజెస్ హెడ్ రూపా ఝా, ఆసియా-పసిఫిక్ బిజినెస్ హెడ్ ఇందు శేఖర్‌, ఈరోజు (2019 డిసెంబర్ 19న) దిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

"మహిళా క్రీడాకారుల విజయాలను వేడుకగా జరుపుకోవడం మనకు చాలా ముఖ్యం. అదే సమయంలో వారు ఎదుర్కొన్న క్లిష్టమైన సవాళ్లను కూడా ప్రముఖంగా ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. మహిళా క్రీడల స్థాయిని, ప్రాధాన్యాన్ని పెంచాలి" అని రూపా ఝా అభిప్రాయపడ్డారు.

"ప్రపంచవ్యాప్తంగా బీబీసీ వార్తలను చదివే లేదా చూసే వారు (ఏ ప్లాట్‌ఫాంలోనైనా) ప్రతి పది మందిలో కనీసం ఒకరు భారత్‌లో ఉన్నారు. మా పాఠకులతో మా అనుబంధానికి గుర్తుగా ఈ అవార్డును ప్రారంభిస్తున్నాం" అని ఇందుశేఖర్ తెలిపారు.

కరణం మల్లీశ్వరి

అవార్డు అధికారిక లోగోను కూడా మీడియా సమావేశంలో ఆవిష్కరించారు. ఒలింపిక్ మెడల్ సాధించిన తొలి భారతీయ మహిళ కరణం మల్లీశ్వరి ముఖ్య అతిథిగా విచ్చేసి మీడియా సమావేశానికి అధ్యక్షత వహించారు.

"మన సమాజం మహిళల్ని అబలలుగా చూస్తుంది. కానీ, స్పోర్ట్స్‌లో అందరూ సమానమే. ఆడుతున్నప్పుడు మన దేశం కోసం ఏదో చేశామన్న తృప్తి, గౌరవం లభిస్తాయి. ఇలాంటి అవార్డులు మా ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతాయి" అని కరణం మల్లీశ్వరి అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

"కాలం మారుతోంది. 1995లో నేను ప్రపంచ చాంపియన్ అయినప్పుడు మీడియా కవరేజ్ చాలా తక్కువ. కానీ ఇప్పుడు సింధు ప్రపంచ చాంపియన్ అయినప్పుడు పరిస్థితిని చూడండి. మీడియా కూడా స్పోర్ట్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. అప్పుడే యువతులు క్రీడలను తమ కెరీర్‌గా ఎంపిక చేసుకుంటారు" అని మల్లీశ్వరి సూచించారు.

"మీరాబాయ్ చాను ఈసారి టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌ గర్వపడేలా చేస్తుందనుకుంటున్నా. ఆమె చాల మంచి ఫామ్‌లో ఉంది. ఆమె పతకం గెలుస్తుందని ఆశిస్తున్నా" అని ఆమె అభిప్రాయపడ్డారు.

ఇందు శేఖర్, కరణం మల్లీశ్వరి, రూపా ఝా
ఫొటో క్యాప్షన్, ఇందు శేఖర్, కరణం మల్లీశ్వరి, రూపా ఝా

విజేతను ఎలా ఎంపిక చేస్తారు?

తుది పోటీ కోసం మహిళా క్రీడాకారుల జాబితాను బీబీసీ ఎంపిక చేసిన జ్యూరీ రూపొందించింది.

ఆ జ్యూరీలో దేశంలోని కొందరు ప్రముఖ క్రీడా జర్నలిస్టులు, నిపుణులు, రచయితలు ఉన్నారు.

జ్యూరీ ఎంపిక చేసిన ఆ అయిదుగురు మహిళా క్రీడాకారుల పేర్లను ఫిబ్రవరిలో వెల్లడిస్తాం.

ఆ తర్వాత అభిమానులు బీబీసీ భారతీయ భాషల వెబ్‌సైట్లలో దేనికైనా వెళ్లి ఆ జాబితాలోని తమకు నచ్చిన క్రీడాకారిణికి ఓటు వేయవచ్చు.

"ఇండియన్ స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్ 2019‌కు ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం ఇస్తారు. అభిమానులు తమకు నచ్చిన అథ్లెట్‌కు బీబీసీ స్పోర్ట్‌లో ఓటు వేస్తారని ఆశిస్తున్నాను" అని బీబీసీ స్పోర్ట్ ఆన్‌లైన్ ఎడిటర్ ఇయాన్ సింగిల్టన్ అన్నారు.

కరణం మల్లీశ్వరి

అత్యధిక ఓట్లు పొందిన క్రీడాకారిణి బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్‌ ద ఇయర్ అవుతారు. విజేతను సత్కరించేందుకు మార్చిలో దిల్లీలో బీబీసీ ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తుంది.

అలాగే, ఆ కార్యక్రమంలో భారత క్రీడా రంగానికి విశేష సేవలు అందించిన ప్రఖ్యాత క్రీడాకారిణికి 'జీవిత సాఫల్య పురస్కారం' ప్రదానం చేస్తుంది.

అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ముందు దేశంలోని పలు నగరాల్లో బీబీసీ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది.

వివిధ నగరాల్లోని విద్యార్థుల్లో, ప్రజల్లో భారతీయ మహిళా క్రీడాకారుల విజయాల గురించి అవగాహన పెంపొందించడం ఈ కార్యక్రమం ఉద్దేశం.

కరణం మల్లీశ్వరి, రూపా ఝా

ఈ పురస్కారం ఎందుకు?

మరింత ఎక్కువ మంది మహిళలు, యువత ఆటల్లో పాల్గొనేలా ప్రోత్సహించేందుకు, ప్రత్యేకించి 2020 టోక్యో ఒలింపిక్స్‌కు ముందు బీబీసీ చేస్తున్న ప్రయత్నంలో భాగమే ఈ అవార్డు.

"వార్తల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచేందుకు బీబీసీ కట్టుబడి ఉంది. ఈ లక్ష్య సాధనకు బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్‌ ద ఇయర్ 2019 అవార్డు తోడ్పతుందని చెప్పడానికి హర్షిస్తున్నాను. ఇది భారత్‌లో అన్ని రకాల క్రీడల్లోనూ మహిళలు సాధిస్తున్న విజయాలను వేడుకలా జరిపే అవకాశాన్ని మాకు కల్పిస్తోంది" అని బీబీసీ వరల్డ్ సర్వీస్ డైరెక్టర్, జేమీ ఆంగస్ అంటున్నారు.

రూపా ఝా
ఫొటో క్యాప్షన్, రూపా ఝా

విజేతలుగా నిలిచే ముందు మహిళలు అనేక అవరోధాలను అధిగమించాల్సి వస్తోందని బీబీసీ ఇండియన్ లాంగ్వేజ్ సర్వీసెస్ హెడ్ రూపా ఝా అన్నారు.

"నా మనసుకు దగ్గరైన ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. మన మహిళా క్రీడాకారులు సాధించిన అనేక అద్భుత విజయాల గురించి నొక్కిచెప్పడం మనకు చాలా అవసరం. అలాగే, వాళ్లు ఎదుర్కొన్న సవాళ్ల గురించి చెప్పడం, మహిళా క్రీడాకారులను ముందుకు తీసుకురావడం కూడా చాలా ముఖ్యం. ఈ చొరవకు ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలని, ఉత్తమ ఇండియన్ స్పోర్ట్స్‌‌వుమన్ ఆఫ్ 2019కి ఓటు వేయాలని కోరుతున్నాను" అని ఆమె చెప్పారు.

2000 సంవత్సరం తరువాత భారత్ మొత్తం 13 ఒలింపిక్ పతకాలను గెలుచుకుంది. అందులో మహిళలు సాధించినవి 5. దీనికి విరుద్ధంగా 20వ శతాబ్దంలో 1999 వరకూ భారత్ గెలిచిన మొత్తం 13 పతకాలూ పురుషులవే.

గత ఆసియా క్రీడల్లో భారత్ మొత్తం 57 పతకాలు గెలవగా, అందులో దాదాపు సగం (28) మహిళా అథ్లెట్లు సాధించినవే.

ఈ ఏడాది జరిగిన దోహా ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లోనూ అదే ధోరణి కనిపించింది. అందులో భారత్ మొత్తం 17 పతకాలు సాధిస్తే, అందులో 10 మహిళలవే.

కరణం మల్లీశ్వరి

భారత మహిళా అథ్లెట్ల కోసం ఆట మారుతోందన్న విషయాన్ని ఈ అంకెలు సూచిస్తున్నాయి. ఈ మార్పులో భాగమయ్యేందుకు బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌ విమెన్ ఆఫ్‌ ద ఇయర్ అవార్డు మీ ముందున్న ఒక అవకాశం.

కాబట్టి, ఫిబ్రవరిలో మీకు ఇష్టమైన బీబీసీ వెబ్‌సైట్‌లోకి వెళ్లడం మరచిపోకండి. మీకు నచ్చిన క్రీడాకారిణి బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌‌వుమన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలుచుకునేందుకు మీ సాయం అందించండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)