Penny Challenge: అమెజాన్ అలెక్సా పదేళ్ల చిన్నారికి ఏం చెప్పింది?

ఫొటో సోర్స్, Getty Images
అలెక్సా! పాత హిందీ పాటలు కావాలి. అలెక్సా! ఈ రోజు వాతావరణమెలా ఉంది? ఈ రోజు వార్తలేంటి అని చాలామంది అడుగుతుంటారు. వారి జీవితాల్లో వ్యక్తిగత అసిస్టెంట్‌లా పని చేస్తున్న అలెక్సా ఒక ప్రమాదకరమైన సవాలును విసిరింది. ఆ సవాలుతో పొంచి ఉన్న ముప్పును సరిదిద్దేందుకు అమెజాన్ అప్పటికప్పుడు అలెక్సాను అప్‌డేట్ చేసింది.
అలెక్సా చాలా మంది జీవితాల్లో ఒక భాగమైపోయింది. ఒక 10 ఏళ్ల అమ్మాయి తల్లితో కలిసి శారీరక వ్యాయామాలు చేస్తూ మధ్యలో బోర్ కొట్టి, అలెక్సా కొత్తగా ఏమన్నా సవాలు విసురుతావా అని అడిగింది.
అలెక్సా విసిరిన ఆ సవాలు ప్రాణానికే ప్రమాదకరంగా అనిపించింది. ఇంతకీ ఆ సవాలేంటి?
ఎలక్ట్రిక్ సాకెట్‌లో సగ భాగం మాత్రమే తగిలించిన ప్లగ్ మొనలకు ఇనుప కాయిన్‌ను తాకించి చూడమని చెప్పింది.
ఈ విషయాన్ని ఆ చిన్నారి తల్లి తల్లి క్రిస్టిన్ లివ్‌డాల్ వివరిస్తూ ట్వీట్ చేశారు.
"ఫోన్ చార్జర్ సగం మాత్రమే పెట్టిన ప్లగ్‌కు కాయిన్‌ను తాకించమని సూచించింది" అని అలెక్సా చెప్పినట్లు ఆమె ట్వీట్‌లో పేర్కొన్నారు.
"మేం వ్యాయామం చేస్తున్నాం. యూట్యూబ్‌లో వీడియోలు చూస్తూ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ దగ్గర పడుకుని, దొర్లుతూ కాలికి ఉన్న షూను తాకడం లాంటి పనులను నేర్చుకుంటున్నాం. బయట వాతావరణం బాగులేదు దాంతో, పాప మరొకటి చేయాలని అనుకుంది" అని ఆమె తల్లి ట్వీట్‌లో రాశారు.
వెంటనే అలెక్సా సహాయం ఆశించగానే, వెబ్‌లో దొరికిన సవాలు చేయమని సూచించింది.
"ఈ ప్రమాదకరమైన చర్యను 'పెన్నీ చాలెంజ్ 'అని పిలుస్తారు. ఇది టిక్‌టాక్‌తో సహా ఇతర సోషల్ మీడియా వెబ్ సైట్లలో ఒక సంవత్సరం కింద బాగా ప్రాచుర్యం పొందింది.
ఆ పాప ఆ సవాలును స్వీకరించిందా?
అలెక్సా ఆ సవాలు చేయగానే, "అలెక్సా వద్దు, వద్దు" అని ఆ పాప తల్లి గట్టిగా అరిచినట్లు చెప్పారు.
"ఆ చిన్నారి కూడా అలాంటి పనులు చేసే ముందు ఒకటికిరెండుసార్లు ఆలోచించే అమ్మాయి" అని ఆమె అన్నారు.
అయితే, అమెజాన్ అలెక్సాను వెంటనే అప్‌డేట్ చేసింది. ఇటువంటి సవాళ్లు చేయమని ఇకపై చెప్పకుండా అలెక్సాను అప్‌డేట్ చేసినట్లు అమెజాన్ బీబీసీకి తెలిపింది.
"లోహాలకు విద్యుత్ గ్రాహక శక్తి ఉంటుంది. వాటిని ఎలక్ట్రికల్ సాకెట్లకు తగిలించడం వల్ల కరెంట్ షాక్ తగలడం లేదా అగ్ని ప్రమాదాలు వాటిల్లడం లేదా ఇతర రకాలైన నష్టం వాటిల్లడం జరుగుతుంది. దీని వల్ల వేళ్ళు, చేతులు, అరచేతులు కూడా పోయే అవకాశం ఉంది" అని కార్ లైల్ ఈస్ట్ ఫైర్ స్టేషన్ మేనేజర్ మైకేల్ క్లస్కర్ 2020లో ది ప్రెస్ న్యూస్ పేపర్‌కు చెప్పారు.
"ఇలాంటి వాటి వల్ల ఎవరికైనా తీవ్రమైన హాని జరగవచ్చు".
ఇటువంటి సవాళ్లను వ్యతిరేకిస్తూ అగ్ని మాపక అధికారులు కూడా మాట్లాడారు.
ఈ విషయం గురించి తెలియగానే, అలెక్సాలో అంతర్గతంగా ఉన్న ఈ తప్పిదాన్ని సరి చేసినట్లు అమెజాన్ చెప్పింది.
"మేం చేసే ప్రతి పనికీ వినియోగదారుల నమ్మకం కేంద్రంగా ఉంటుంది. మా వినియోగదారులకు నమ్మశక్యమైన, అనుచితమైన, సహాయకర సమాచారాన్ని అందించేందుకు అలెక్సాను రూపొందించాం" అని అమెజాన్ ఒక ప్రకటనలో పేర్కొంది.
"ఈ తప్పు గురించి సమాచారం అందగానే, దానిని సరి చేసేందుకు సత్వర చర్యలు తీసుకున్నాం" అని అమెజాన్ ఆ ప్రకటనలో తెలిపింది.
ఇవి కూడా చదవండి:
- SCAM ALERT: ‘24 గంటల్లో డబ్బు రెట్టింపు.. 50 వేలు పెట్టుబడి పెడితే ఆరు లక్షలు’
- వికలాంగుడి పట్టుదలకు ఆశ్చర్యపోయి జాబ్ ఆఫర్ చేసిన ఆనంద్ మహీంద్రా
- కోవిడ్-19: పెరిగిన పాజిటివిటీ రేటు, దిల్లీలో ఎల్లో అలర్ట్ జారీ చేసిన ప్రభుత్వం
- హరిద్వార్ 'ధర్మ సంసద్' ప్రసంగాలపై భారత్‌కు సలహాలు ఇచ్చిన పాకిస్తాన్
- స్పూన్లు వంచి, గడియారం ముళ్లను పరుగులు పెట్టించి భయపెట్టిన మాంత్రికుడి కథ
- 2021లో తీవ్రంగా విరుచుకుపడిన ప్రకృతి వైపరీత్యాలకు మానవ తప్పిదాలే కారణమా?
- సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ 'చివరి సైనికుడు' ఎహసాన్ ఖాదిర్ కథ
- చుండ్రు పోవడం ఎలా, తెలుసుకోవాల్సిన 5 విషయాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












