ఆవులన్నీ కలిశాయి.. సింహాన్ని తరిమేశాయి..

వీడియో క్యాప్షన్, ఆవులన్నీ కలిశాయి.. సింహాన్ని తరిమేశాయి..

గుజరాత్‌లోని అమ్రేలీ జిల్లా జబాల్‌ గ్రామంలోకి ఓ సింహం ప్రవేశించింది. సింహం దాడి చేయడంతో ఓ ఆవు చనిపోయింది.

దీంతో.. మిగతా ఆవులన్నీ ఏకమయ్యాయి. ఒక్కసారిగా సింహంపై దాడికి దిగాయి.

ఆవులన్నీ కలసి రావడంతో సింహం అక్కడి నుంచి పారిపోయింది.

కొద్ది సేపటి తర్వాత ఆవులన్నీ వెళ్లిపోవడంతో.. సింహం మళ్లీ తిరిగి వచ్చి, చంపిన ఆవును నోటికి కరచుకుని దూరంగా తీసుకెళ్లింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)