క్రిస్మస్ 2021: ఒమిక్రాన్ భయంతో తగ్గిన వేడుకలు.. మార్కెట్లలో కొనసాగుతున్న షాపింగ్ రద్దీ

ఫొటో సోర్స్, Getty Images
ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దేశంలో లక్షలాది మంది ప్రజలు క్రిస్మస్ సంబరాలను మందకొడిగా జరుపుకుంటున్నారు. కరోనావైరస్ కారణంగా క్రిస్మస్ వేడుకలు పూర్తి స్థాయిలో జరుపుకోలేకపోవడం ఇది రెండవ సారి. గతేడాది కూడా కోవిడ్ వల్ల క్రిస్మస్ వేడుకలు భారీగా చోటు చేసుకోలేదు.
భారతదేశంలో 2.4 కోట్ల మంది క్రైస్తవ మతాన్ని అనుసరించేవారున్నారు. ఇది దేశంలో మూడవ పెద్ద మతం. ఈ ఏడాది కూడా కోవిడ్ వల్ల చర్చిలకు హాజరయిన వారి సంఖ్య తక్కువగా కనిపిస్తోంది.
భక్తులకు స్వాగతం పలికేందుకు చర్చీలను లైటింగ్‌తో అలంకరించడంతో కొంత వరకు పండుగ వాతావరణం నెలకొంది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో సోర్స్, Getty Images
క్రిస్మస్ సంప్రదాయాలైన కారోల్ పాటలు లాంటివి కొనసాగుతున్నప్పటికీ, దేశ వ్యాప్తంగా ప్రజలు మాత్రం క్రిస్మస్‌ను ఇళ్ల దగ్గరే జరుపుకుంటున్నట్లు కనిపిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
ఇన్ఫెక్షన్‌లను నియంత్రించేందుకు కొన్ని రాష్ట్రాలు ప్రజలు భారీగా గుమిగూడటం పట్ల నిబంధనలు విధించాయి.

ఫొటో సోర్స్, Getty Images
కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ దీపాల కాంతులు విరజిమ్ముతున్నాయి. మహమ్మారి సమయంలో ఉత్సాహాన్ని నింపేందుకు వీధులను విద్యుత్ దీపాలతో, క్రిస్మస్ చెట్లతో అలంకరించారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో సోర్స్, Getty Images
ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్త వహించాలని నిపుణులు, అధికారులు హెచ్చరించారు.
ఇప్పటి వరకు భారతదేశంలో 358 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వం లాక్‌డౌన్ విధించే సూచనలేమి ఇవ్వలేదు. కానీ, హైరిస్క్ ఉన్న దేశాల నుంచి ప్రయాణం చేస్తున్న ప్రయాణీకులకు కొన్ని ప్రయాణ నిబంధనలను మాత్రం విధించింది.
ఒమిక్రాన్ వ్యాప్తి పట్ల అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, కోవిడ్ నిబంధనలు విధించాలని స్థానిక ప్రభుత్వాలకు సూచించింది.

ఫొటో సోర్స్, Getty Images
సెకండ్ వేవ్ సృష్టించిన భయం నుంచి ఇంకా తేరుకోని భారతీయులను ఒమిక్రాన్ వ్యాప్తి భయపెడుతోంది.
భారతదేశంలో సెకండ్ వేవ్ సమయంలో కేసులు పెరిగి, ఆసుపత్రుల్లో బెడ్స్, ఆక్సిజన్, ఔషధాల కొరత ఏర్పడింది.
దేశంలో నెమ్మదిగా సాధారణ స్థితి నెలకొంటోంది. రోజుకు 10,000-12,000 కేసులు నమోదవుతున్నాయి. మే నెలలో 400,000 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు అర్హులైన జనాభాలో 60 శాతం మందికి రెండు డోసుల వ్యాక్సీన్ ఇవ్వడం పూర్తయింది.
కానీ, వ్యాక్సినేషన్ డ్రైవ్ మందగించడం, ఒమిక్రాన్ కేసుల వ్యాప్తి మూడవ వేవ్ తలెత్తుతుందేమోననే భయాలను కలుగచేస్తున్నాయి. ఒకవైపు ఒమిక్రాన్ భయం చుట్టుముడుతున్నప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో సెలవుల్లో చేసే ప్రయాణాల రద్దీ కూడా కనిపిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
బహిరంగ వేడుకలు తగ్గినప్పటికీ.. ప్రముఖ ప్రదేశాలు, మార్కెట్లలో మాత్రం క్రిస్మస్ షాపింగ్ రద్దీ ఎప్పట్లాగే కొనసాగుతోంది.
కోల్‌కతా, దిల్లీ లాంటి నగరాల్లోక్రిస్మస్ షాపింగ్ కోసం వచ్చిన జనాలతో మార్కెట్లు కిక్కిరిసి కనిపిస్తున్నాయి.
దిల్లీలో భారీగా గుమిగూడే కార్యక్రమాలను నిషేధించారు. అయినప్పటికీ సరోజినీ నగర్ వంటి పలు ప్రముఖ మార్కెట్లకు.. నిలబడేందుకు కూడా చోటు లేనంత మంది ప్రజలు షాపింగ్‌కు వస్తున్నారు. దీంతో కోవిడ్19 నిబంధనలను అమలు చేయడం పోలీసులకు కూడా కష్టంగా మారుతోంది.
ఇవి కూడా చదవండి:
- ఒమిక్రాన్‌ను గుర్తించడమెలా? లక్షణాలేంటి
- ఆంధ్రప్రదేశ్‌లో తొలి ఒమిక్రాన్ కేసు.. విశాఖపట్నంలో ఐసోలేషన్‌లో 30 మంది
- ఒమిక్రాన్ సోకిన వారిలో కనిపించే లక్షణాలు ఏంటి, ఈ లక్షణాలు కనిపిస్తే ఏం చేయాలి?
- ఒమిక్రాన్: ‘బూస్టర్ డోస్’పై ఐసీఎంఆర్ నిపుణులు ఏమన్నారంటే..
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనూ నైట్ కర్ఫ్యూ తప్పదా... ఒమిక్రాన్ ఆంక్షలు ఎప్పటి నుంచి?
- కోవిడ్ -19తో మగవాళ్ల స్పెర్మ్ కౌంట్ తగ్గుతోందా... ఈ ప్రభావం నుంచి తప్పించుకోవడం ఎలా?
- చైనా: ప్రపంచ ఆయుధ పోటీలో డ్రాగన్‌దే విజయమా?
- శ్యామ్ సింగరాయ్ రివ్యూ: అన్నీ ఉన్న కథలో ఆ ఒక్క ఎలిమెంట్‌ను దర్శకుడు ఎలా మిస్సయ్యారు?
- 83: ‘‘అప్పట్లో క్రికెట్ పిచ్చోళ్ళు తక్కువ.. కలలో కూడా ఊహించని విజయం.. ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో తెలియలేదు’’
- హిందూ రాజ్యం: హరిద్వార్ ధర్మ సంసద్‌లో వివాదాస్పద ప్రసంగాలపై కలకలం.. ఎవరెవరు ఏమన్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













