క్రిస్మస్‌ను క్రైస్తవులే నిషేధించినప్పుడు ఏం జరిగింది? అసలు సిసలు క్రైస్తవులు ఎవరు?

Engraving depicts Puritans about to emigrate from England, dated 14th century

ఫొటో సోర్స్, Universal History Archive

ఫొటో క్యాప్షన్, ప్యూరిటన్లు కఠిన నైతిక నియమావళి ప్రకారం జీవించారు

ఒకప్పుడు క్రైస్తవానికి వ్యతిరేకంగా జరుగుతున్న కార్యకలాపాలపై చర్యలు తీసుకోవాలని బ్రిటిష్ వారు భావించారు.

ఏటా డిసెంబరులో ప్రజల తీరు హద్దులు మీరుతుండడంతో దానిని అదుపు చేయాలనుకున్నారు.

డిసెంబరు చివర్లో క్రిస్మస్‌ సమయంలో జనమంతా అతిగా సంబరాలు చేసుకునేవారు. క్రైస్తవుల జీవనశైలికి తలవంపులు తెచ్చేలా ప్రవర్తించేవారు.

అప్పట్లో పాన శాలలన్నీ ఉత్సాహంగా కేకలు వేస్తున్న జనాలతో నిండిపోయి ఉండేవి.

వ్యాపారులు తమ దుకాణాలు త్వరగా మూసేసి ఇళ్లకు చేరుకునేవారు. బంధువులు, స్నేహితులతో విందులు, వినోదాల్లో మునిగి తేలేవారు.

ఇళ్లను మొక్కల ఆకులతో అలంకరించి.. వీధుల్లో తిరుగుతూ ఆడిపాడేవారు.

ప్యూరిటన్లు దానిని పాపంగా భావించేవారు.

19th century English illustration about Christmas

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇంగ్లండ్‌లో క్రిస్‌మస్ వేడుకలు (19వ శతాబ్దం నాటి చిత్రం)

అసలు సిసలు క్రైస్తవులు ఎవరు?

1644లో బ్రిటన్‌లోని ప్యూరిటన్లు క్రిస్మస్‌ వేడుకలు రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

ప్యూరిటన్లు క్రైస్తవ ఆచారాలను కఠినంగా పాటించే ప్రొటెస్టంట్ క్రిస్టియన్లుగా ఉండేవారు.

ప్యూరిటన్ ప్రభుత్వం క్రిస్‌మస్‌ను బైబిల్‌లో చెప్పిన దానితో సంబంధం లేకుండా జరుపుకొనే ఒక అన్యమత పండుగలా భావించింది.

క్యాలెండర్ గురించి కూడా వారు ఒక అంశాన్ని లేవనెత్తారు. మనం తర్వాత దాని విషయానికి వద్దాం.

మా క్రిస్మస్‌ మాకు తిరిగివ్వండి

1660 వరకూ ఇంగ్లండ్‌లో క్రిస్మస్‌ వేడుకలన్నీ నిషేధించారు.

ఏటా డిసెంబరు 25న దుకాణాలు, మార్కెట్లు బలవంతంగా తెరిపించేవారు. ఆ సమయంలో చర్చిలను మూసివేసేవారు.

చర్చిల్లో క్రిస్మస్ సర్వీసులు నిర్వహించడం చట్టవిరుద్ధమని ప్రకటించారు.

కానీ, ఆ నిషేధాన్ని ప్రజలు అంత సులభంగా అంగీకరించలేదు.

క్రిస్మస్‌ రోజున వేడుక చేసుకోడానికి, తిని, తాగి, ఆడిపాడడానికి స్వేచ్ఛ కావాలనే ఆందోళనలు జోరందుకున్నాయి.

చార్లెస్-2 రాజు అయ్యేవరకూ ఇంగ్లండ్‌లో క్రిస్మస్‌ వ్యతిరేక చట్టం కొనసాగింది. తర్వాత ఆయన దాన్ని ఉపసంహరించారు.

Illustration called 'Christmas under the Commonwealth'

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, విగ్రహారాధన చేసిన పిల్లలను గద్దిస్తున్న ప్యూరిటన్('క్రిస్‌మస్ అండర్ ది కామన్‌వెల్త్‌'లో చిత్రం)

క్రిస్మస్‌ రోజున విందులు, వినోదాలను అమెరికాలోని ప్యూరిటన్లు కూడా వ్యతిరేకించారు.

అవును, అమెరికాలో కొన్నేళ్లు క్రిస్మస్‌ను నిషేధించారు.

ఇంగ్లండ్‌లో కనిపించిన కారణాలతోనే మసాచుసెట్స్‌లో కూడా 1659 నుంచి 1681 వరకూ క్రిస్మస్‌ వేడుకలను నిషేధించారు.

ఆ తర్వాత క్రిస్మస్‌ సంబరాలను నిషేధిస్తూ చేసిన చట్టం రద్దు చేశారు.

చాలామంది ప్యూరిటన్లు మాత్రం డిసెంబర్‌లో జరిగే వేడుకలను అన్యమత కార్యక్రమంగా భావించి అసహ్యించుకునేవారు.

ఏసుక్రీస్తు పుట్టిన అసలు తేదీ ఏది?

ఏసుక్రీస్తు సరిగ్గా ఎప్పుడు జన్మించాడనే విషయంలో కూడా ఏకాభిప్రాయం లేదు.

క్రీస్తు పుట్టినపుడు గొర్రెల కాపరులు తమ మందలను చూసుకుంటూ మైదానంలో ఉన్నట్లు ప్రస్తావించారు కాబట్టి అది వసంత రుతువులోనే అయ్యుంటుందని కొందరు చెప్పారు.

చలి ఎక్కువగా ఉండే డిసెంబర్‌లో కాపరులు తమ గొర్రెలకు ఆశ్రయం ఇవ్వడానికి చూస్తారు కాబట్టి అది శరదృతువు అని కొందరన్నారు.

ఆ కాలంలో అప్పటికే గర్భం ధరించిన గొర్రెలను మిగతా మందకు దూరంగా ఉంచుతారు.

కానీ బైబిల్‌లో ఏసుక్రీస్తు పుట్టిన తేదీ ఏదో ఇవ్వలేదు.

Bacchanalian Group, 1852, illustration by John Leech

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రోమన్లకు విందులు ఎంత ఇష్టమో చెబుతూ వేసిన వ్యంగ్య చిత్రం(1852)

పగన్ ఆచారాలు

కానీ పగన్ సంప్రదాయం పేరుతో రోమన్ కాలం నుంచీ డిసెంబర్ చివర్లో భారీగా సంబరాలు జరిగే ఒక పండుగ సీజన్ ఉండేదని మనకు తెలుసు.

దానిని పంటల పండుగగా చెప్పుకునేవారు. ఆ సమయంలో బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. ఇళ్లను దండలతో అలంకరిస్తారు.

ఆ సంబరాలలో రకరకాల ఆహార పదార్థాలు ఆరగిస్తూ, పీకలదాకా మద్యం తాగుతారు.

తొలినాళ్లలో క్రైస్తవులకు సమాజంలో జరిగే అన్యమత సంప్రదాయాలు, సంబరాలతో పోటీపడాల్సి వచ్చింది.

తర్వాత రోమన్లు దేవతారాధన విడిచిపెట్టి క్రమంగా క్రైస్తవం వైపు మళ్లారు. కానీ ఈ మార్పులో క్రిస్టియన్ క్యాలెండర్ క్రమంగా పాగన్ క్యాలెండరులా ఏర్పడింది.

కొంతకాలం పాటు రోమన్లు రెండు సంప్రదాయాల్లో సంబరాలు చేసుకున్నారు. 4వ శతాబ్దం చివర్లో పగన్ ఆచారాలు, క్రైస్తవమతం డిసెంబర్‌లో 14 రోజులపాటు కలిసిపోయాయి.

కానీ అలా జరగడానికి ముందు చాలా గొడవలు జరిగాయి.

Cartoon by George Cruikshank depicts a gluttonous man devouring a Christmas feast.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, క్రిస్‌మస్ విందులు ఎలా ఉంటాయో చెబుతూ వేసిన వ్యంగ్య చిత్రం (19వ శతాబ్దం)

క్రిస్మస్‌ కోసం యుద్ధం

చివరికి ఈ పోరులో క్రైస్తవమతమే విజయం సాధించింది.

17వ శతాబ్దంలో క్రిస్మస్‌ కోసం జరిగిన యుద్ధం, అప్పటివరకూ ఆ వేడుకలను అన్యమత సంస్కృతిగా భావించిన ప్యూరిటన్స్ దృష్టిని మార్చే ప్రయత్నంగా నిలిచింది.

కానీ క్రిస్మస్‌ సమయంలో మనకు చుట్టూ కనిపించేవాటిలో.. ఆ కాలానికి చెందిన ఏవీ కనిపించవు.

అంటే, అలంకరించిన ఒక చెట్టు పక్కనే కూచుని, కోడి మాంసం తింటూ, గ్లాసులో వైన్ నింపుతూ ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు ఇప్పుడు చేసుకునే ఈ సంబరాలకు రెండు వేల ఏళ్లకు పైగా చరిత్ర ఉందనే చెప్పుకోవాలి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)