అండమాన్‌లో క్రైస్తవ మత ప్రచారకుడి హత్య: సెంటనలీస్‌కు ‘సువార్త బోధించేందుకే జాన్ అలెన్ చౌ అక్కడికి వెళ్లాడు’

ఫొటో సోర్స్, INSTAGRAM/JOHN CHAU
భారతదేశంలోని అండమాన్ నికోబార్ దీవుల్లోని ఆదిమజాతి ప్రజల బాణాలతో హత్యకు గురైనట్లు చెబుతున్న 27 ఏళ్ల అమెరికా మతప్రచారకుడి కుటుంబం అతడి హంతకులను క్షమిస్తున్నామని ప్రకటించింది.
"జాన్ అలెన్ చౌకు దేవుడంటే ఇష్టం, పేదలకు సాయం చేయాలని అనుకునే అతడు, సెంటినలీన్ ప్రజల ప్రేమను తప్ప వేరే ఏం కోరుకోలేదు" అని వారు తెలిపారు.
ఉత్తర సెంటినెల్ దీవికి చేరుకోడానికి అలెన్ చౌకు సాయం చేసిన ఏడుగురిని అరెస్టు చేశారు. చౌ మృతదేహం తీసుకురావడానికి మరికొన్ని రోజులు పట్టచ్చని భారత అధికారులు చెబుతున్నారు.
ఈ దీవిలో ఉన్న తెగను, వారి జీవనశైలిని రక్షించడానికి బయటివారు ఈ దీవిలోకి వెళ్లడం, వారిని కలవడం నిషేధించారు.
"చౌ తన ఇష్ట ప్రకారమే" ఆ దీవికి వెళ్లాడని అతడి కుటుంబ సభ్యులు ఇన్‌స్టాగ్రాంలో ఒక ప్రకటన విడుదల చేశారు.
ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of Instagram ముగిసింది
"అండమాన్ దీవుల్లో ఉన్న అతడి స్నేహితులను కూడా విడుదల చేయాలని మేం కోరాం. చౌ తన ఇష్ట ప్రకారమే అక్కడికి వెళ్లాడు. అతడు చేసిన ఆ పనికి సహకరించినందుకు వారిని పీడించడం భావ్యం కాదు" అని తెలిపారు.
"గుర్తు తెలియని వ్యక్తులపై హత్య కేసు నమోదు చేశాం. చౌ దీవికి చేరుకోడానికి సహకరించిన ఐదుగురు జాలరులతోపాటు ఏడుగురిని అరెస్ట్ చేశాం" అని పోలీసులు చెప్పారు.
అధికారులు ఈ ఘటన జరిగిన ప్రాంతానికి ఒక హెలికాప్టర్‌ను, తర్వాత ఒక నౌకను కూడా పంపించారు.
"మేం దీవికి దూరంగా ఉన్నాం. ఇప్పటివరకూ మృతదేహాన్ని కూడా గుర్తించలేదు. అదెక్కడుందో కనుగొనడానికి మరికొన్ని రోజులు పట్టచ్చు" అని అండమాన్ నికోబార్ దీవుల పోలీసులు ఏఎఫ్‌పీకి చెప్పారు.
ఈ కేసులో సాయం కోసం పోలీసులు ఆంత్రొపాలజీ శాస్త్రవేత్తలతోపాటు, ఆ ప్రాంతం గురించి తెలిసిన నిపుణులను, గిరిజన సంక్షేమ శాఖ, అటవీశాఖ అధికారులను సంప్రదిస్తున్నారు.
"మేం వారికి, వారి ప్రాంతానికి ఎలాంటి అంతరాయం కలిగించకూడదు. అది చాలా సున్నితమైన ప్రాంతం. దానికి కొంత సమయం పడుతుంది" అని తెలిపారు.
చౌ స్థానిక జాలరులతోపాటు ఒక పడవలో ఉత్తర సెంటినెల్ దీవి వరకూ వచ్చాడు. తర్వాత చిన్న పడవలో ఒంటరిగా తీరం వైపు వెళ్లారు. దీవిలో అడుగుపెట్టగానే ఆయనపై అక్కడి ప్రజలు బాణాలతో దాడి చేశారని చౌను అక్కడకు తీసుకువెళ్లిన జాలరులు చెప్పారు.

ఫొటో సోర్స్, CHRISTIAN CARON - CREATIVE COMMONS A-NC-SA
ప్రాణం తీసిన కల
ఇంటర్నేషనల్ క్రిస్టియన్ కన్‌సర్న్ సంస్థ అధ్యక్షుడు జెఫ్ కింగ్ ఈ సంఘటనపై 'బీబీసీ న్యూస్‌డే కార్యక్రమం'లో మాట్లాడారు. ఈ సంస్థతో అలెన్ చౌకు అనుబంధం ఉంది. అండమాన్ పర్యటన సందర్భంగా కూడా జెఫ్ కింగ్‌తో అలెన్ చౌ మాట్లాడారు.
''ఈ ప్రజలకు సువార్త బోధించేందుకే జాన్ అక్కడికి వెళ్లాడు. దీనిపై అతను మాట్లాడాడు. ఇందుకు కొంత కాలంగా ప్రణాళిక తయారు చేసుకున్నాడు. కాబట్టి ఇది ఎవరి ఆదేశమూ కాదు.. చంచలత్వంతో చేసిన పనీ కాదు'' అని జెఫ్ కింగ్ చెప్పారు.
"చౌ అక్కడి దీవులకు, ముఖ్యంగా ఆ దీవికి ఇంతకు ముందు కూడా వెళ్లాడు. ఆరోజు మాత్రం మూడు, నాలుగు సార్లు అక్కడికి వెళ్లాడు. మొదట వెళ్లినప్పుడు బాణాలు వేసి ఆయన్ను వెనక్కు పంపించేశారు. రెండోసారి వెళ్లినపుడు చౌ రెండు పెద్ద చేపలు బహుమతిగా తీసుకుని వెళ్లాడు".
"నాకు తెలిసి వాళ్లు బహుమతి అంగీకరించారు. అతడితో గంటపాటు కూచున్నారు. వాళ్లు తనతో గొడవపడ్డారని, తనపై బాణాలు వేశారని చౌ చెప్పాడు. తిరిగి పడవ దగ్గరకు వచ్చేశాడు. మూడోసారి తిరిగి అక్కడకు వెళ్లినప్పుడు ఆయన్ను చంపి దూరంగా తీసుకెళ్లారని బైనాక్యులర్స్‌లో నుంచి చూస్తున్న జాలరులు చెప్పారు."
"అది ఆయన చేస్తున్న ఉద్యోగం కాదు. అది ఆయన కల, దురదృష్టవశాత్తూ అది ఆయన ప్రాణాలే పోయేలా చేసింది" అని జెఫ్ కింగ్ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- హార్లిక్స్: విటమిన్ D కి మూలం శాకాహార పదార్థాలా, మాంసాహార పదార్థాలా?
- ఇతను ప్రపంచంలోనే అత్యంత ఒంటరి మానవుడు
- తిరుమలలో తన మతం గురించి సోనియా ఏం చెప్పారు?
- ప్రాణాలు నిలుపుకోడానికి.. మతం మారుతున్నారు!
- తెలంగాణ ఎన్నికలు 2018: మీ నియోజకవర్గ అభ్యర్థులు ఎవరో తెలుసుకోండి
- అడాల్ఫ్ హిట్లర్ - ఓ యూదు చిన్నారి: ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన స్నేహం
- మహారాష్ట్ర పులి పిల్లలు కూడా నరభక్షకులుగా మారతాయా?
- పెయిడ్ న్యూస్: ఎన్నికల వేళ వార్తల వ్యాపారం
- అమరావతిలో అంతర్జాతీయ పవర్ బోట్ రేసింగ్
- సీబీఐకి ఆంధ్రప్రదేశ్‌లో నో ఎంట్రీ... దీని పర్యవసానాలేమిటి?
- సింగర్ బేబీ: రెహమాన్ మెచ్చిన ఈ కోయిల పాట ఇలా మొదలైంది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








