ప్రాణాలు నిలుపుకోడానికి.. వేరే మార్గం లేక మతం మారుతున్నారు!
మతం ఓ విశ్వాసం. కానీ ప్రాణాలు కాపాడుకోవడానికి ఆ విశ్వాసాన్ని మార్చుకోవాల్సొచ్చింది. బలవంతంగా మరో మతాన్ని తమపై ఆపాదించుకోవాల్సి వచ్చింది!
ఇదీ.. ఇండొనేషియాలోని 'సుమత్ర’ అడవి బిడ్డల ఆవేదన. వీరంతా ‘ఒరంగ్’ తెగకు చెందిన ప్రజలు.
గూడునిచ్చే తల్లి.. కడుపు నింపే తల్లి.. అన్నీ ఆ అడవే వారికి. అడవి వారికి దైవంతో సమానం. అలాంటి అడవే ఇప్పుడు ప్రమాదంలో ఉంది.
ఆయిల్ పామ్‌ను సాగు చేసేందుకు ప్రైవేట్ ప్లాంటేషన్ కంపెనీలు అడవిని నరికేస్తున్నాయి.

అడవి నిదానంగా మాయమవుతోంది.. దాంతోపాటే అడవి జంతువులూ వెళ్లిపోతున్నాయి.
ఒరంగ్ ప్రజలకు గూడు కరువయ్యింది.. గూడుతోపాటు కడుపుకు తిండీ కరువయ్యింది.
వేట వీరి ప్రధాన ఆహారం. గతంలో జంతువులను వేటాడుతూ జీవించేవాళ్లు ఇప్పుడు పస్తులతో జీవిస్తున్నారు.
తమ ప్రాణాలు నిలుపుకోవడానికి వేరే గత్యంతరం లేక ఆయిల్ పామ్ పళ్లను తింటున్నారు.

ఫొటో సోర్స్, EPA
‘‘ఈ పళ్లను తింటే తల తిరుగుతుంది. పిల్లలు తింటే ప్రాణాల మీదకు వస్తుంది. ఏం చేయాలి? తినకపోతే పస్తులుండాలి.’’ అంటూ చెప్పుకొచ్చారు సిగున్‌గాన్గ్ -
‘‘ప్లాంటేషన్ కంపెనీ వాళ్లు అడవులను నరికేస్తున్నారు. దీంతో మాకు కూడుగూడు కరువయ్యింది. గతంలో జంతువులు సులభంగానే దొరికేవి. కానీ ఇప్పుడు జంతువులను వేటాడటం కష్టమైంది. వేట దొరక్కపోతే పస్తులుండాలి. లేకపోతే మాకు ఆ ఆయిల్ పామ్ పళ్లే గతి.’’

చుట్టుపక్కల ఉన్న మెజారిటీ ముస్లిం ప్రజలు వీరి విశ్వాసాలను అస్సలు గుర్తించరు. అడవి నుండి బయటకు వెళ్లి జీవించాలంటే మతం మారడం తప్పనిసరి. లేకపోతే అడవిలోనే జీవితం అంతమవుతుంది.
తప్పనిసరిగా ఇస్లాం మతాన్ని స్వీకరించేలాచేసింది వీరి పరిస్థితి.

‘‘మాకు వేరే గత్యంతరం లేదు. మేం మనుగడ సాగించాలన్నా, మా పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా మేం ఇస్లాం మతాన్ని స్వీకరించక తప్పదు.’’ అని ముహమ్మద్ యూసఫ్ చెబుతున్నారు.
మా ఇతర కథనాలు
- ‘చనిపోతాం.. అనుమతివ్వండి’
- యెమెన్: ఆకలి, కలరా కోరల్లో లక్షలాది చిన్నారులు
- మతాబులకి మతానికి సంబంధం ఉందా?
- తిరుమలలో తన మతం గురించి సోనియా ఏం చెప్పారు?
- హిందూమతం స్వీకరించి, ఆవుల్ని ఆదుకుంటున్న జర్మన్ మహిళ
- రోహింజ్యా ముస్లింలు క్రైస్తవులుగా ఎందుకు మారుతున్నారు?
- ముస్లిం పాలకులు విదేశీయులైతే మరి మౌర్యులు?
- శివాజీకి ముస్లింల పట్ల ద్వేషం నిజమేనా?
- గుడికోసం ముస్లిం లేఖ: 24 గంటల్లో స్పందించిన ఆర్ఎస్ఎస్
- జిహాద్: దేశాన్ని డైలమాలో పడేసిన చిన్నారి
- 'ముస్లింలు పాకిస్తానీలు, ఉగ్రవాదులా?'
- ‘ముస్లింలపై దాడులను అడ్డుకోవడంలో భారత్ విఫలం’
- 2002 అల్లర్ల తర్వాత గుజరాత్ ముస్లింలలో మార్పొచ్చిందా?
- ముస్లిం కూలీ కావడమే ఆయన చేసుకున్న పాపం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









