టపాసుల నిషేధం హిందూమతంపై దాడిలాంటిదా?

ఫొటో సోర్స్, Reuters
దీపావళి వేళ దిల్లీలో బాణాసంచా అమ్మకాలపై నిషేధం విధిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అయితే ఈ నిషేధాన్ని కొందరు హిందూమతంపై దాడిగా భావిస్తున్నారు.
ప్రముఖ ఆంగ్ల నవలా రచయిత చేతన్ భగత్ వరుస ట్వీట్లతో ముందుగా దీనిపై సామాజిక మాధ్యమాల్లో చర్చలేవదీశారు.
''టపాసులు కాల్చకపోతే పిల్లలకు దీపావళి ఎందుకు? ఏడాదిలో దీపావళి జరుపుకునేది ఒక్క రోజే. అంటే సంవత్సరంలో 0.27 శాతం సమయం మాత్రమే. కానీ, 99.6 శాతం వాతావరణం కలుషితమవడానికి సరైన ప్రణాళిక లేకపోవడమే కారణం.'' అంటూ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1

పోస్ట్ of X ముగిసింది, 2
అయితే, మరికొందరు మాత్రం నిషేధం సరైందేనని అంటున్నారు. ఇది కొంతవరకైనా కాలుష్యాన్ని తగ్గిస్తుందని భావిస్తున్నారు.
ట్విటర్‌లో కూడా #Right2Breathe అనే హాష్‌ట్యాగ్‌తో బాణాసంచా నిషేధానికి మద్దతుగా సామాజికమాధ్యమాల్లో ప్రచారం కూడా చేస్తున్నారు.
బాణాసంచా నిషేధంపై అనుకూలంగా, వ్యతిరేకంగా సోషల్‌మీడియాలో ఇప్పటికే 7 వేలకు పైగా ట్వీట్లు చక్కర్లు కొట్టాయి.
ఈ దీపావళిని టపాసులు కాల్చకుండా జరుపుకుందాం అంటూ కాంగ్రెస్ నేత శశిథరూర్ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
'' ఏసీలు వాడతాం, ఫ్రిజ్‌లు వాడతాం, ప్రజా రవాణా వ్యవస్థను మాత్రం ఎప్పుడూ వినియోగించం. కానీ, ఒక్క దీపావళికి టపాసులు కాల్చితే మాత్రం ఉపన్యాసాలు దంచుతాం'' అంటూ ఓ నెటిజన్ నిషేధానికి వ్యతిరేకంగా ట్వీట్ చేశారు.
టపాసులపై నిషేధం విధించడం సబబుకాదని రాజస్థాన్ ప్రభుత్వ కార్యదర్శి సంజయ్ దీక్షిత్ అభిప్రాయపడ్డారు. ''గతకాలం నుంచి మనం సంస్కృతిని నేర్చుకోవాలా? లేక కోర్టులు మనకు నేర్పుతాయా?'' అని ప్రశ్నించారు. భారీ శబ్ధం చేసే టపాసులపై నిషేధం విధించడం మాత్రం సబబే అని పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, AFP
అయితే, శ్వాస సంబంధిత రుగ్మతలతో బాధపడేవారు, ఇంట్లో పసిపిల్లలు ఉండేవాళ్లు మాత్రం నిషేధం విధింపు సరైందేనని అంటున్నారు.
''టపాసులు కాల్చకుండా దీపావళి జరుపుకోవడం అనేది పర్యావరణ హితం కోసం మనం చేసే చిన్న త్యాగంలాంటిది'' అని నిషేధంపై సుప్రీం కోర్టులో వాదించిన న్యాయవాది పల్లవి ప్రతాప్ అభిప్రాయపడుతున్నారు. ''టపాసులు కాల్చడమే సంస్కృతి కాదు. నా మేనకోడలు శ్వాస సంబంధిత ఇబ్బందులతో బాధపడుతోంది. ముఖ్యంగా దీపావళి వేళ ఆ సమస్య ఎక్కువవుతుంది'' అని ఆమె పేర్కొన్నారు.
పల్లవి ప్రతాప్ కొన్నాళ్ల కిందట దీపావళినాడు బాణాసంచా పేలడంతో తీవ్రంగా గాయపడ్డారు.
నిషేధం వివరాలు ఇవీ...
- వాయు కాలుష్యాన్ని అదుపు చేసేందుకు నవంబర్ 1 వరకు దిల్లీ రాజధాని పరిధిలో టపాసుల అమ్మకంపై సుప్రీం కోర్టు నిషేధం విధించింది.
- దేశంలోని మొత్తం బాణాసంచా అమ్మకాల్లో 25 శాతం వాటా దిల్లీ మెట్రోపాలిటన్‌దే.
- నిషేధం వల్ల బాణాసంచా అమ్మకాలపై రూ.1000 కోట్ల వరకు ప్రభావం పడిందని ఎకనామిక్ టైమ్స్ పత్రిక పేర్కొది.
అయితే, దీపావళిన టపాసులు నిషేధించడాన్ని చేతన్ భగత్‌తో పాటు చాలా మంది నెటిజన్లు క్రిస్టమస్ ట్రీతో ముడిపెట్టారు.

ఫొటో సోర్స్, Getty Images
''ప్రాచీనకాలంలో దీపావళి ఎలా జరుపుకుంటారో తెలిపే ఆధారాలు లేవు. ఇప్పటికీ దేశంలో ఉత్తరాదిన ఒకవిధంగా, దక్షిణాదిలో మరో విధంగా ఈ పండగ జరుపుకుంటున్నారు'' అని కేంబ్రిడ్జ్‌లోని హిందూ స్టడీస్ ప్రొఫెసర్ అంకుర్ బారువా పేర్కొన్నారు. ''దీపావళికి భారీగా టపాసులు కాల్చడం గత 50 ఏళ్లుగా ఉత్తరాదినే ఎక్కువగా పెరుగుతోంది'' అని అన్నారు.
ఫ్లోరిడా యూనివర్సిటీ ప్రొఫెసర్ వసుధ నారాయణ్ మాట్లాడుతూ.. ‘‘హిందూమతం స్థిరంగా మారుతోంది. అప్పట్లో టపాసులు కాల్చకపోయి ఉండొచ్చు. అయితే, ఏసు జననంతో క్రిస్టమస్ ట్రీకి అసలు సంబంధమే లేదు. తర్వాత కాలంలో ఈ విధానం క్రిస్టమస్‌నాడు నిర్వహిస్తున్నారు. దీపావళి రోజు బాణాసంచా కాల్చడం కూడా ఇలాంటిదే’’నని పేర్కొన్నారు. విదేశాలకు దీపావళి అంటే బాణాసంచా కాల్చడమే గుర్తుకొస్తుంది అని చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
ది ప్రింట్ వెబ్‌సైట్ ఎడిటర్ ఇన్ చీఫ్ శేఖర్‌గుప్తా కూడా నిషేధానికి వ్యతిరేకంగా మాట్లాడారు. ‘‘పర్యావరణానికి దీని వల్ల ఎలాంటి హాని కలుగుతుందో వివరణ లేదు, కేవలం ఒక్క సిటీలోనే నిషేధం ఎందుకు విధించినట్లు, అమ్మకాల మీద నిషేధం విధించి, కాల్చడం మీద ఎందుకు స్పందించలేదు’’ అని ట్విటర్‌లో ప్రశ్నించారు.
దిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకరస్థాయిలో ఉంటోందని ఏయిర్ క్వాలిటీ ఇండెక్స్ రిపోర్టు హెచ్చరిస్తూనే ఉంది.
ముఖ్యంగా చలికాలంలో ఈ కాలుష్యం మరింత పెరుగుతోందని దిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ పేర్కొంది.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)