40 హిందూ ఆలయాలను పునర్నిర్మించిన ముస్లిం!
ఆలయం కోసం మాఫియాతో పోరాటం చేసిన ముస్లిం ఇతను. పేరు కె.కె మొహమ్మద్. వృత్తిరిత్యా పురావస్తు శాఖలో ఉద్యోగి.
మధ్యప్రదేశ్‌లోని బతేశ్వర్ ఆలయం పునర్నిర్మాణం కోసం పురాతత్వ శాఖకు చెందిన ఈయన రాళ్ల మాఫియాతో పోరాడారు.
తొలుత బందిపోట్లు ఈయనకు మద్దతుగా నిలిచారు. అయినా మాఫియా ఆగడాలు అడ్డుకోలేకపోయారు. దీంతో ఆర్ఎస్ఎస్ సహాయం కోరారు.
’అయోధ్యలో ఆలయం కోసం పోరాడుతున్నారు కదా! ఈ గుడిని కాపాడండి‘ అని మొహమ్మద్ లేఖ రాసిన 24 గంటల్లోనే ఆర్ఎస్ఎస్ రంగంలోకి దిగింది.
8వ శతాబ్దం నాటి 200 ఆలయాల్లో 40 ఆలయాలను పునర్నిర్మించడానికి మొహమ్మద్ ఎంతో కృషి చేశారు.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

