అమరావతిలో అంతర్జాతీయ పవర్ బోట్ రేసింగ్

ఫొటో సోర్స్, andhrapradeshtourism/fb
- రచయిత, వి.శంకర్
- హోదా, బీబీసీ కోసం
విజయవాడ కృష్ణా తీరంలో అంతర్జాతీయ స్థాయి పవర్ బోట్ రేసింగ్ పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి.
ఎన్1హెచ్2ఓ బోట్ రేసింగ్‌కి ఈసారి ఆంధ్రప్రదేశ్ ఆతిథ్యం ఇస్తోంది.
ఈ ప్రపంచస్థాయి పోటీలలో మొత్తం 7 రౌండ్లు ఉంటాయి. ఒక్కో రౌండ్ ఒక్కో దేశంలో నిర్వహిస్తారు. ఇప్పటికే 4 రౌండ్లు ముగిశాయి. ఇప్పుడు 5వ రౌండ్ పోటీలకు కృష్ణా నది వేదికైంది.

ఫొటో సోర్స్, andhrapradeshtourism/fb
నవంబర్ 16 నుంచి 18 వరకు మూడు రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో 9 దేశాల బృందాలు పాల్గొంటున్నాయి.
అమరావతి బృందం కూడా పాల్గొంది. చైనాలో జరిగిన 4వ రౌండ్‌లో అమరావతి బోట్ నాలుగో స్థానంలో నిలిచింది.
ఈ రేసులో మొత్తం 19 బోట్లు పోటీపడుతున్నాయి. 2.7 కిలోమీటర్ల మేర రేస్ సాగుతోంది.
550 కిలోల బరువుండే కార్బన్ ఫైబర్‌తో తయారైన బోట్లు ఈ రేసులో పాల్గొంటున్నాయి. గంటకు 130 మైళ్ల వేగంతో దూసుకుపోయే సామర్ధ్యం ఈ బోట్ల సొంతం.

ఫొటో సోర్స్, andhrapradeshtourism/fb
400 హెచ్‌పి సామర్ధ్యం కలిగిన ఇంజన్లతో రెండు సెకన్లలోనే ఏకంగా 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడం వీటి ప్రత్యేకత.
ఈ రేసింగ్ జరిగే మూడు రోజులూ సాయంత్రం 4 గంటల నుంచి బెర్మ్ పార్కులో 'అమరావతి గ్లోబల్ మ్యూజిక్ అండ్ డాన్స్ ఫెస్టివల్' నిర్వహిస్తున్నారు. విభిన్న వంటకాలతో ఫుడ్ ఫెస్టివల్‌ను కూడా ఏర్పాటు చేశారు.

ఫొటో సోర్స్, andhrapradeshtourism/fb
డిఫెండింగ్ ఛాంపియన్ ఇటలీకి చెందిన అలెక్స్ కాలేలా, అంతకు ముందు వరుసగా మూడు సార్లు విజేతగా నిలిచిన ఫ్రాన్స్ రేసర్ ఫిలిఫ్స్ ఛాయ్‌ప్స్ కూడా ఈ పోటీల కోసం అమరావతి వచ్చారు.

ఫొటో సోర్స్, andhrapradeshtourism/fb
ఈ పోటీలు ప్రత్యక్షంగా వీక్షించేందుకు వీలుగా 12 జోన్లుగా ఘాట్ ప్రాంతాన్ని విభజించారు. పటిష్ట భద్రత నడుమ పోటీల నిర్వహణకు ఆటంకాలు లేకుండా, ట్రాఫిక్ రద్దీ నిర్వహణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేలా ఏర్పాట్లు చేశారు.
ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఈ పోటీలు జరుగుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
- అఫ్రిది: ‘ఉన్న నాలుగు ప్రావిన్సులనే పాకిస్తాన్ చూసుకోలేకపోతోంది.. కశ్మీర్ అక్కర్లేదు’
- ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గులాబీ వజ్రం ఇది
- అమరావతి బాండ్లు: అప్పులు వరమా? శాపమా?
- కొత్త రాజధానిలో జనాలు కరవు
- విజయవాడ గొల్లమూడిలో శ్మశానానికెళ్లాలంటే శవంతో సహా నది దాటాలి
- చంద్రబాబు సాధిస్తారా? జగన్ అస్త్రంగా మలుచుకుంటారా?
- అమరావతి రైతుల సింగపూర్ యాత్రతో ఉపయోగం ఎంత?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









