విజయవాడ గొల్లమూడిలో శ్మశానానికెళ్లాలంటే శవంతో సహా నది దాటాలి
విజయవాడలోని గొల్లమూడి గ్రామంలో చనిపోయిన వారికి అంత్యక్రియలు నిర్వహించడానికి కనీసం శ్మశానం కూడా లేదు. దాంతో మృతదేహాన్ని పడవలో నది అవతలి ఒడ్డుకి చేర్చి అక్కడ అంతిమ సంస్కారాలు పూర్తిచేస్తున్నారు.
గతంలో ఓసారి నదీ ప్రవాహం పెరగడంతో ఊళ్లోని శ్మశానం మునిగిపోయింది. అప్పట్నుంచీ చనిపోయిన వారికి అంత్యక్రియలు చేయడం గ్రామస్తులకు కష్టంగా మారింది. ముస్లింలు నాలుగు మైళ్లు నడిచి పొరుగూరు రుద్రవరంలో ఆ క్రతువు పూర్తి చేస్తున్నారు.
తోటి వారికి సాయపడే ఉద్దేశంతో ఊళ్లోని ఇద్దరు వ్యక్తులు మరు భూమిగా వాడుకునేందుకు తమ స్థలాన్ని అందించారు. ప్రభుత్వం ఎంతో కొంత ఆర్థిక సహకారం చేస్తుందని వారు ఎదురుచూస్తున్నారు.
బీబీసీ తెలుగు షూట్ ఎడిట్ నవీన్‌తో కలిసి రిపోర్టర్ దీప్తి బత్తిని అందిస్తున్న కథనం.
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)