‘నేను బెంగాలీ.. నా బాయ్ ఫ్రెండ్ నల్ల జాతీయుడు - మా అమ్మ ఏం చేసిందంటే..’

ఒక బ్రిటిష్ బెంగాలీ అమ్మాయి తన నల్లజాతి బాయ్ ఫ్రెండ్ వలన గర్భం దాల్చారు. దీని వలన ఆమె కుటుంబం నల్ల జాతి వారిపై ప్రదర్శించిన పక్షపాత వైఖరిని ఆమె ఎదుర్కోవలసి వచ్చింది.
ఆమెను ఇంటి నుంచి బయటకు పంపేసారు. అప్పటికి ఆమె వయసు 21 సంవత్సరాలు, రెండు నెలల గర్భవతి. తల దాచుకోవడానికి చోటు లేదు. ఆమె నల్ల జాతి వ్యక్తితో ధరించిన గర్భాన్ని కొనసాగిస్తానన్న కారణానికి ఆమె ఈ పరిస్థితిని ఎదుర్కోవలసి వచ్చింది.
ఆమె సామాజిక వర్గంలో ఇతర వర్ణాల వారు, నల్ల జాతి వారు అనే విషయాలు పక్కన పెడితే, అమ్మాయిలు వివాహం కాకుండా పిల్లలను కనడాన్ని కూడా నేరంగానే చూస్తారు.
ఆమె బంధువు ఒకామె ఆమెను అబార్షన్ చేయించుకోమని ఒత్తిడి చేశారు. ఆమె గతంలో కూడా 18 ఏళ్లు రాక ముందు గర్భం దాల్చినప్పుడు అబార్షన్ చేయించుకున్నారు. అదే ఉదాహరణను చెబుతూ ఈ సారి సల్మాపై ఒత్తిడి తెచ్చారు. అయితే తన గురించి నిర్ణయం తీసుకునే హక్కు వారికేముందో సల్మాకి అర్ధం కాలేదు.
"కానీ, ఈ సారి నేను అబార్షన్ చేయించుకోదల్చుకోలేదు. ఇందుకోసం నా కుటుంబం, నా కెరీర్, మిగిలినవన్నీ వదులుకోవల్సి వచ్చింది. నాకు మరో మార్గం లేదు" అని సల్మా అన్నారు.
సల్మా ఇంట్లో నుంచి బయటకు వెళుతున్నప్పు డు ఆమె తల్లి కళ్ళ నుంచి వచ్చిన కన్నీరు ఆమె కంట పడింది.
"అదే నేను ఒక బెంగాలీ వ్యక్తి వలన గర్భవతిని అయి ఉంటే వెంటనే ఆ అబ్బాయి కుటుంబాన్ని పిలిచి, నా వివాహం నిశ్చయించి ఈ మొత్తం సమస్యనంతా చట్టబద్ధం చేసేసి ఉండేవారు. కానీ ఇప్పుడు నాకు పుట్టబోయే బిడ్డకు తండ్రి నల్ల జాతీయుడు" అని అన్నారు.
మిగిలిన బంధువులంతా వచ్చి తన జీవితం గురించి మంచి చెడులు నిర్ణయించే లోపు సల్మా తన నోకియా ఫోను తీసుకుని ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టారు. ఆమె అబార్షన్ చేయించుకోకూడదని నిర్ణయించుకున్నారు. అలాగే తన నిర్ణయాన్ని సమర్ధించని కుటుంబంతో కలిసి ఉండటానికి కూడా ఆమె సమ్మతంగా లేరు.
సల్మా ప్రేమ కథలో అబ్బాయి పొరుగింట్లో ఉండేవారు. ఆమె ఏమీ తెలియని తనంతో ప్రేమలో పడిపోయిన ప్రేమికురాలు. అయితే, బాలీవుడ్ లో నల్ల జాతి హీరోలు ఉండరు.

దక్షిణాసియా ప్రజలు జాత్యహంకారాన్ని కొన్ని శతాబ్దాలుగా చవి చూసినప్పటికీ, నల్ల జాతీయుల పట్ల పక్షపాత ధోరణి ఈ వర్గాలలో కూడా బాగా పేరుకుపోయి ఉంది.
"నల్ల జాతీయులంతా చెడ్డ వారు" అని ఏ బెంగాలీ మహిళా నోరు విప్పి చెప్పకపోయినప్పటికీ, ఈ నలుపు పట్ల వారికుండే వ్యతిరేకత మాత్రం వారు ప్రతి రోజూ మాట్లాడే మాటల్లో, వ్యాఖ్యానాల్లో కనిపిస్తూ ఉంటుంది.
"ఎండలో బయటకు వెళ్ళకు, నల్లగా అయిపోతావు. లేదా తెల్లగా ఉన్న అమ్మాయికి చాలా వివాహ ప్రతిపాదనలు వస్తాయి" లాంటి మాటలు ఆమె తరచుగా వినేవారు.
శ్వేత వర్ణం పట్ల ప్రేమ, నల్లజాతీయులపై కొన్ని కచ్చితమైన అభిప్రాయాలు బంగ్లాదేశ్‌లో పెరిగిన ఆమె తల్లి మనసులో స్థిరపడిపోయాయి.
సల్మాకి 16 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆమె తల్లి "వాళ్ళు నీకు గర్భం తెప్పించి వదిలేస్తారు" అని చెప్పిన మాటలు గుర్తు ఉన్నాయి.
ఇవే మాటలు శ్వేత జాతి మహిళలు ఇంట్లోకి కోడళ్ళుగా వచ్చినప్పుడు వినిపించలేదు.
సల్మా కుటుంబం 30 సంవత్సరాల క్రితం బంగ్లాదేశ్ నుంచి లండన్‌కి వలస వచ్చారు. వారు అందరి వలసదారుల్లాగే చక్కటి భవిష్యత్తు గురించి కలలు కంటూ వచ్చారు.
"హరోడ్ స్టోర్ నుంచి తెచ్చిన సంచి శుభ్రంగా మడత పెట్టి వంట గదిలో దాచుకునేవారు. ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు మాత్రమే ఆ సంచీని బయటకు తీసేవారు. అయితే, ఆ సంచిని ఆ షాపులో అతి చవకగా లభించే వేరు శనక్కాయలకు వాడతారని మాకు తెలియదు" అని సల్మా చెప్పారు.

కానీ, ఒక రోజు సల్మా దగ్గరున్న తాళంతో ఇంటి తలుపు తెరుచుకోలేదు.
సల్మా, తల్లితో కలిసి సెలవులకు పర్యటనకు వెళ్ళినప్పుడు ఆమె తండ్రి ఆ ఇంటి తాళాలు మార్చేశారు. దాంతో సల్మా, ఆమె తల్లి రోడ్డున పడ్డారు. సల్మాతో పాటు ఆమె సోదరుడు కూడా ఉన్నారు.
దీని తరువాత ఆమె సొంత జాతి వారే ఆమె తల్లి విడాకులు తీసుకున్నందుకు గాను తక్కువగా చూసేవారు. దాంతో సొంత మనుషుల మధ్య కూడా ఆమె పరాయి గానే బ్రతకాల్సి వచ్చింది.
"నా జీవితం కూడా మా అమ్మ జీవితం లానే ముగుస్తుందేమో" అనే భయం మా అమ్మకి ఎక్కువగా ఉండేది అని సల్మా చెప్పారు.
"నన్ను నల్ల జాతీయుడు మోసం చేశారని తెలుసు. ఆయన నన్ను వివాహం చేసుకోరని తెలుసు. ఇప్పుడు ఆ వ్యక్తి వలన నేను ఒక కూతురిని కూడా కనబోతున్నాను. కానీ, ఆ వ్యక్తి కోసం నా సంస్కృతిని, కెరీర్ ని, సమాజాన్ని ఎదిరించాలనుకున్నాను.
నాకు పాప పుట్టిన ఒక వారం తరువాత, మళ్ళీ వెళ్లి మా ఇంటి తలుపు తట్టాను. క్రిస్మస్ లైట్ల కాంతి కిటికీలోంచి కనిపిస్తోంది.
వంటింట్లో వేగుతున్న చికెన్ వాసన ఘుమ ఘుమ లాడుతోంది. తన పాప గౌను సరి చేసి డోర్ బెల్ కొట్టారు.
సల్మా సోదరుడు తలుపు తీసి చేతిలో ఉన్న చిన్నారిని చూసి మురిసిపోయారు. భయం భయంగా సల్మా ఇంట్లో అడుగు పెట్టారు. ఈ వారం రోజుల పసి కందును చూసి ఆమె తల్లి ఎలా ప్రతిస్పందిస్తారో అనే భయంతో ఉన్నారు. ఇంట్లో ఆహారాన్ని ఇవ్వడం శాంతికి సంకేతంగా చూస్తారు.
'ఆమె పిరికిగా డిన్నర్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. పాపను మరో గదిలో నిద్రపుచ్చారు. ఆమె తల్లి సల్మా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడలేదు.
కానీ, ఆమెకు చికెన్ వడ్డించారు. ఇంతలో పాప ఏడుపు వినిపించింది. తను లేచి వెళుతుండగా ఆమె తల్లి ఆమెను వారించి, "నేను వెళ్లి చూసుకుంటాను" అని చెప్పి వెళ్లారు. ఇంతలో పాప ఏడుపు ఆపేసింది. పాప ఇప్పుడు అమ్మమ్మ చేతిలో ఉంది.
సల్మాకి కన్నీరు ఆగలేదు. ఆమె తల్లికి ఎన్ని పక్షపాతాలు ఉన్నా కూతురు అంటే మాత్రం ఎనలేని ప్రేమ. సల్మా ఇంటికి తిరిగి వచ్చారు.
సల్మా తల్లి, పిల్లలు పుట్టినప్పుడు చేసే ముస్లిం సంప్రదాయ క్రతువులన్నీ నిర్వహించారు అని సల్మా చెప్పారు.
అయితే, సల్మా ఇల్లు వదిలి వెళ్లిన సమయంలో జరిగిన విషయాలను మాత్రం ఎప్పుడూ చర్చకు తేలేదు.
మరో 5 వారాలకు మరో ఉత్పాతం సంభవించింది.
సల్మా ప్రేమికుడు మరో అమ్మాయితో గడుపుతూ ఉన్నాడని, ఆమె కూడా మరో బిడ్డకు జన్మనిచ్చారనే విషయం తెలిసింది. ఆమె తల్లి నల్ల జాతీయుల గురించి భయపడుతున్నట్లే జరిగిందని, ఆమెకున్న నిశ్చితాభిప్రాయాలకు ఈ సంఘటనలు ప్రాణం పోసినట్లయింది.
నిశ్శబ్దం, ఒత్తిడి, స్తబ్ధత సల్మా జీవితంలో నిండిపోయాయి. ఆమె తీవ్రమైన మానసిక ఒత్తిడిలో కూరుకుపోయారు.
మా అమ్మగారికి నన్ను, నా కూతురిని చూసుకునే బాధ్యత నెత్తిన పడినట్లయింది. మమ్మల్ని ఇద్దరినీ లేపడం, తినిపించడం, మా బాగోగులు చూసుకోవడం చేసేవారు. కానీ, మమ్మల్ని బయటకు కనిపించనిచ్చేవారు కాదు.
ఆ సమయంలో కవితలు రాయడం, చదవడం మొదలు పెట్టాను. పాప పుట్టిన ఏడు నెలలకి యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ పట్టా పుచ్చుకున్నాను. తల్లి సహాయం లేకుండా ఇదంతా జరిగి ఉండేది కాదని ఆమెకి తెలుసు. కాకపొతే ఈ విషయం ఆమెకి సల్మా ఎప్పుడూ చెప్పలేదు.
ఇప్పటికీ సల్మా జీవితం గురించి తీసుకున్న నిర్ణయాలను ఆమె తల్లి ఆమోదించలేదు. ముఖ్యంగా సల్మా తన భాగస్వామితో కలిసి జీవించాలని నిర్ణయం తీసుకున్న విషయాన్ని ఆమె అంగీకరించలేకపోయారు.
ఆమెకి యూనివర్సిటీ డిగ్రీ రాగానే, ఆమె తన భాగస్వామితో కలిసి జీవితం మొదలుపెట్టారు. కాకపొతే ఆమెకి తల్లి పట్ల ఉన్న గౌరవాన్ని మాత్రం వ్యక్తపర్చలేకపోయారు.
ఆ తరువాత సల్మా జీవితం అనేక మలుపులు తిరిగింది.

అదే వ్యక్తితో సల్మా మరో బిడ్డకు జన్మనిచ్చారు. కానీ, ఆ తరువాత ఆయన సల్మాని వదిలిపెట్టి వెళ్లిపోయారు.
కానీ, సల్మా తనను గతంలో దూరంగా పెట్టిన బంధువులందరితో తన సంబంధాలను పునరుద్ధరించుకోవడం మొదలు పెట్టారు. ఒకరు అయితే అబార్షన్ చేయించుకోమని చెప్పినందుకు క్షమాపణ కూడా చెప్పారు.
కానీ, ఎక్కడో ఒక చోట నల్ల జాతీయుల పట్ల వారికున్న వ్యతిరేకత మాత్రం కనిపిస్తూ ఉండేది. "కనీసం పిల్లలు నీలా ఉన్నారు" అని అనేవారని చెప్పారు.
"అతను నిన్ను వదిలేస్తారని నాకు తెలుసు" అని ఆమె తల్లి అనేవారు.
"నువ్వు లేత వర్ణం వారినెవరినైనా చూసుకుని ఉండాల్సింది’’ అని ఆమె కజిన్ సరదాగా అనేవారు.
"ఈ మాటలన్నీ చాలా బాధపెట్టేవి" అని సల్మా అన్నారు.
కానీ సల్మా పిల్లలు కాస్త పెద్దయ్యాక ఆమె తల్లి పడిన భయాలు ఆమెకు అర్ధం కావడం మొదలయ్యాయి.
"ఈ మాటలన్నీ ప్రేమ వలన పుట్టినవని అర్ధమయింది" అని ఆమె అన్నారు.
"తన పిల్లలు సంతోషంగా, ప్రేమగా ఉండటం కోసమే మా అమ్మ మా గురించి నిర్ణయాలు తీసుకోవాలని అనుకున్నారు".
కానీ, సల్మా మాత్రం ఆమె తల్లికి నల్ల జాతీయుల పట్ల ఉన్న వైఖరిని తొలగించాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు.
ఒక రోజు ధైర్యం తెచ్చుకుని, ‘‘అతను నల్ల జాతి వారు కావడం వలనే కదా, నువ్వు ఇష్టపడలేదు?’’ అని ప్రశ్నించారు.
ఆమె తల్లి, తనను తాను సమర్ధించుకుంటూ.. ‘లేదు’ అన్నారు. ‘‘అతను నల్లవారని కాదు, అతను ముస్లిం కాదు కదా. మనల్ని సరిగ్గా అర్ధం చేసుకోలేరు" అని అన్నారు.
తల్లికి మతం గురించి అంత పట్టింపు ఉందనే విషయం సల్మా వినడం అదే మొదటి సారి. అయితే, మరి మన కుటుంబంలో కొంత మంది ముస్లిమేతరులను కూడా ఆహ్వానించాం కదా అని సల్మా అనుకున్నారు.
నల్ల జాతీయుల పట్ల ఆమె తల్లికున్న వ్యతిరేకతను ఇలా ప్రదర్శించారని అర్ధమయింది.
"అయితే కేవలం శరీర వర్ణం గురించి పక్షపాతం కలిగి ఉండటం ఎంత అన్యాయమైన విషయమో మా అమ్మకి అర్ధమయ్యే ఉంటుంది. అందుకే ఆమె ఈ అంశాన్ని మతం వైపు మరల్చారు’’ అని సల్మా అన్నారు.
ఆ తరువాత కుటుంబంలో చాలా సంఘటనలు చోటు చేసుకున్నాయి.
సల్మా సోదరుడు ఒక నల్ల జాతి అమ్మాయితో ప్రేమలో పడ్డారు. ఆ బంధానికి సల్మా తల్లి ఆమోదం తెలిపారు.
అదే ఆమెలో జరిగిన పరిణితి అని సల్మా అంటారు.
"ఈ మార్పుని చూసి గర్వపడుతున్నాను. మేము ప్రయాణించాల్సింది ఇంకా చాలా ఉంది".
“ఆమె అలా ఆలోచించినందుకు ఆమెను నేను నిందించను. కానీ, నేను ఎదిరించాను. దీనిని సంఘటితంగా ఎదుర్కోవల్సిన సమయం దగ్గర పడింది”.
ఇవి కూడా చదవండి:
- నాన్‌లోకల్ లీడర్ల’ అడ్డాగా విశాఖ... నగరంలో 30 ఏళ్లుగా వారి హవా సాగుతుండటానికి కారణాలేంటి?
- తిరుమల తిరుపతి దేవస్థానం కీలక పదవుల్లో దళితులకు అవకాశం ఇవ్వరా?
- బొబ్బిలి అంటే వీరత్వమే కాదు వీణ కూడా.. తంజావూరు తరువాత ఈ తెలుగు వీణకే పట్టం
- మహిళల శరీరాలు ఎప్పుడంటే అప్పుడు సెక్స్‌కు సిద్ధంగా ఉంటాయా?
- సిబ్బంది బాగోగులు చూడటం భారతదేశంలో ఒక వ్యాపారంగా మారనుందా?
- కరోనావైరస్ - రంగస్థల కళాకారులు: "నాటకాలు వేయకపోతే మేం శవాలతో సమానం"
- యూరప్ అణు కేంద్రంలో నటరాజ విగ్రహం ఎందుకుంది, సోషల్ మీడియా దాని గురించి ఏమంటోంది?
- ఇల్లు, ఫర్నీచర్ అమ్మేసి ఓ వ్యాన్ కొనుక్కున్నారు... ఇప్పుడు ఆ వ్యానే వారి ఇల్లు
- టైటానిక్ ప్రమాదంలో 700 మంది ప్రాణాలను ఆ రేడియో ఎలా కాపాడిందంటే...
- ఘోస్ట్ ఐలాండ్: 'మానవజాతి అంతమైపోయాక భూమి ఇలాగే ఉండొచ్చు'
- వీరప్పన్ కేసుల్లో 31 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్నవారి కథేమిటి.. గంధపు చెక్కల స్మగ్లర్ నేరాల్లో వారి పాత్రేమిటి
- చైనా టిబెట్ ఆక్రమణకు 70 ఏళ్లు: అసలు హిమాలయాల్లో ఘర్షణ ఎందుకు మొదలైంది?
- ప్రపంచంలో అత్యంత అరుదైన కోతుల్ని కాపాడిన ఒక చిన్న ఐడియా
- ఇంగువ.. అనాదిగా భారతీయ వంటల్లో భాగం.. కానీ నేటివరకూ భారతదేశంలో పండలేదు...
- ‘బందిపోటు’ పోలీసులు.. హత్యలు, దోపిడీలతో చెలరేగిపోతున్నారు
- బెంగళూరులో పది లక్షల బావులు ఎందుకు తవ్వుతున్నారు?
- కరోనావైరస్: ప్రధాని మోదీ భారత్‌లో కోవిడ్ పరిస్థితిపై చెప్పిందంతా నిజమేనా? - BBC FactCheck
- మహిళల భావప్రాప్తి కోసం ఫ్రాన్స్ రాకుమారి మేరీ బోనపార్టీ చేసిన ప్రయోగాలేంటి?
- సోనూ పంజాబన్: ఈ మహిళకు వ్యభిచారం ‘ప్రజాసేవ’, 'కామం' ఒక భారీ మార్కెట్
- రివెంజ్ పోర్న్: అసభ్యకర చిత్రాలకు చెక్ పెట్టనున్న ఫేస్‌బుక్
- ఉత్తర కొరియా: 'వాళ్లు మమ్మల్ని సెక్స్ టాయ్స్‌లా భావించారు'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








