సెక్స్ వర్కర్లు ఆ దేశంలో రెయిన్ కోట్ ఎందుకు వేసుకుంటున్నారు?

ఫొటో సోర్స్, Gaston Brito
లాటిన్ అమెరికా దేశం బొలీవియాలో చాలా మంది సెక్స్ వర్కర్లు తాము తిరిగి పనులకు వెళ్తున్నామని చెబుతున్నారు. చెబుతున్నారు. కానీ బయటకు వెళ్తున్నప్పుడు గ్లౌజులు, బ్లీచ్, పారదర్శకంగా ఉండే రెయిన్ కోట్లు వేసుకుంటున్నామని అంటున్నారు.
సెక్స్ వర్కర్ల కోసం పనిచేస్తున్న ఆర్గనైజేషన్ ఆఫ్ నైట్ వర్కర్స్ ఆఫ్ బొలీవియా సంస్థ(ఓటీఎన్-బీ) సూచనల ప్రకారమే తాము అలా చేస్తున్నామని వారు చెప్పారు. దానివల్ల తాము సురక్షితంగా ఉడవచ్చని అంటున్నారు.
బొలీవియాలో వ్యభిచారం చట్టబద్ధం. కానీ లైసెన్స్ ఉన్న వేశ్యాగృహాల్లో చాలా నిబంధనల ప్రకారం దానిని అనుమతిస్తున్నారు.
కరోనా మహమ్మారి వల్ల ఇక్కడ కూడా మార్చి నుంచి లాక్‌డౌన్ అమలవుతోంది. కానీ ఇప్పుడు దానికి కొన్ని మినహాయింపులు ఇచ్చారు.
కానీ, ఇప్పటికీ పగటిపూట సెక్స్ వర్కర్లపై చాలా రకాల ఆంక్షలు ఉన్నాయి. రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తున్నారు.

ఫొటో సోర్స్, Gaston Brito
పోల్ డాన్స్-శానిటైజేషన్
వెనెసా కూడా ఒక సెక్స్ వర్కర్. ఆమెకు ఇద్దరు పిల్లలు. తన పిల్లల చదువు కోసం ఆ పనిచేయక తప్పడం లేదని ఆమె చెప్పారు.
“మా కస్టమర్లు భద్రత విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. మేం తీసుకుంటున్న ఈ ముందు జాగ్రత్తలు మా కోసమే కాదు. వారి భద్రత కోసం కూడా అని వారు అర్థం చేసుకోగలరు” అన్నారు.
పేపర్ ఫేస్ మాస్క్, ప్లాస్టిక్ విజర్, గ్లౌజులతోపాటూ, తమ శరీరం బయటికి కనిపించేలా రెయిన్ కోట్ వేసుకుంటున్నానని మరో సెక్స్ వర్కర్ ఆంటోనియెటా చెప్పారు.
వేశ్యాగృహంలో వినియోగదారుల ముందు డాన్స్ చేసే ఆమె, అక్కడి పోల్స్ మీద బ్లీచ్ కొడుతూ వాటిని శానిటైజ్ కూడా చేస్తుంటారు.
“బయో-సెక్యూరిటీ సూట్ వేసుకోవడం వల్ల మన పనికూడా పూర్తవుతుంది. సురక్షితంగా కూడా ఉంటాం” అన్నారు ఆంటోనియెటా.
ఓటీఎన్-బీ కార్యకర్తలు జూన్‌లో ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులను కలిశారు. సెక్స్ వర్కర్ల భద్రతకు సంబంధించి వారికి 30 పేజీల మాన్యువల్ కూడా అందించారు.

ఫొటో సోర్స్, Gaston Brito
మహమ్మారి ఉన్నా తప్పదు
బొలీవియాలో ఇప్పటివరకూ 50 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మహమ్మారి వల్ల దాదాపు 1900 మంది చనిపోయారు.
గత వారం బొలీవియా తాత్కాలిక అధ్యక్షురాలు జీనిన్ ఆనెజ్ షావెజ్ తనకు కూడా కరోనా వచ్చిందని ట్వీట్ చేశారు.
కానీ, బొలీవియాలో కరోనా పరీక్షలు ఎక్కువగా చేయడం లేదనే ఆందోళన కూడా వ్యక్తం అవుతోంది. లాటిన్ అమెరికాలోని అతి పేద దేశాల్లో బొలీవియా ఒకటి.

ఫొటో సోర్స్, Gaston Brito
గణాంకాల ప్రకారం 10 లక్షల మందికి ఇక్కడ అతి తక్కువ కరోనా పరీక్షలు జరెగుతున్నట్లు తెలుస్తోంది.
కానీ, దీనిని పొరుగు దేశం బ్రెజిల్‌తో పోల్చలేం. అక్కడ కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. బ్రెజిల్‌లో కరోనా కేసుల సంఖ్య 20 లక్షలు దాటాయి. 75 వేల మందికి పైగా చనిపోయారు.
“ఇది అందరికీ చాలా కష్టకాలమే. కానీ మహిళలపై ఉన్న ఆంక్షల వల్ల వారికి చాలా సమస్యలు ఎదురవుతున్నాయి” అని బొలీవియాలో సెక్స్ వర్కర్ల యూనియన్‌కు చెందిన సభ్యురాలు లిలీ కోర్ట్స్ చెప్పారు.
“బొలీవియా సమాజంలో మేం కూడా ఒక భాగం. మేం సెక్స్ వర్కర్లం. మహిళలం. మాలో తల్లులు, పిన్నిలు, అమ్మమ్మలు, నాన్నమ్మలు ఉన్నారు. మాకు ఇచ్చిన పని గంటల గురించి మేం కూడా ఆందోళన చెందుతున్నాం. కానీ దురదృష్టవశాత్తూ వేశ్యలు పనికోసం రోడ్ల మీదకు వెళ్లాల్సి ఉంటుంది. దాని ఫలితం చాలా ఘోరంగా ఉంటుంది” అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ హాట్ స్పాట్‌గా మారిన తూర్పు గోదావరి
- సైనికులు సోషల్ మీడియా యాప్‌లు ఉపయోగిస్తే ప్రమాదం ఏంటి?
- మహిళలు గర్భం దాల్చినప్పుడు రకరకాల ఆహార పదార్ధాలు తినాలని ఎందుకనిపిస్తుంది?
- కారంచేడు దాడికి 35 ఏళ్లు: 'చుట్టూ చేరి కర్రలతో కొట్టారు... మమ్మల్ని తగలబెట్టాలని చెత్త అంతా పోగేశారు'
- ఆల్ఫ్స్ పర్వతాలపై భారతీయ పత్రికలు, 1966 విమాన ప్రమాదం నాటివేనా
- ఈ ఫొటోతో చైనాను అమెరికా మంత్రి ఆటాడుకున్నారా? జిన్‌పింగ్‌ను ఇబ్బంది పెట్టారా?
- సూర్యుడిపై ‘క్యాంప్ ఫైర్’.. ఇంత దగ్గరగా సూర్యుడిని ఫొటోలు తీయడం ఇదే తొలిసారి
- చైనా, ఇరాన్‌ల సీక్రెట్ డీల్: భారత్‌కు ఎంత నష్టం
- చైనా - భారత్ మధ్య 45 ఏళ్లుగా లేనంత గొడవలు ఇప్పుడెందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








