ICYMI: ఈ వారం తప్పకుండా చదవాల్సిన కథనాలివి

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

ఫొటో సోర్స్, Komatireddy Raj Gopal Reddy/Facebook

ఈ వారం భారత్‌లో, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కీలక ఘటనలు జరిగాయి. వాటిలో ముఖ్యమైన 5 కథనాలివి. మీరు ఇవి చదవకపోతే వెంటనే చదవండి.

1. తెలంగాణ: కోమటిరెడ్డి రాజగోపాల్ చేరిక బీజేపీకి 'బూస్టర్ డోస్' అవుతుందా?

"తెలంగాణ భూమి దద్దరిల్లే సంఘటన గత ఏడాది నవంబర్ హుజూరాబాద్ ఎన్నికల్లో ఎదురైంది. పది నెలల తర్వాత ఇపుడు దాని ప్రభావం విశ్లేషకులకే పరిమితమైంది. అందువల్ల బీజేపీని మళ్లీ 2023 దాకా నడిపించే బూస్టర్ డోస్ అవసరం. దీన్నుంచి వస్తున్నదే మునుగోడు ఉప ఎన్నిక" అని ఆ పార్టీ సీనియర్ నాయకుడు రానున్న మునుగోడు ఎన్నికల మీద వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలి? కోమటిరెడ్డి రాజగోపాల్ చేరిక బీజేపీకి 'బూస్టర్ డోస్' అవుతుందా?

మునుగోడు ఉప ఎన్నిక పథకంలో భాగమా? పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

RRR

ఫొటో సోర్స్, FB/RRR

2. నిర్మాతలే సినిమా షూటింగులను నిలిపేసే పరిస్థితి ఎందుకు వచ్చింది?

ఆగస్టు ఒకటవ తేదీ నుంచి తెలుగు సినిమాల షూటింగ్ నిలిపివేయాలని యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్ణయించింది. దానికి తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మద్దతు తెలిపింది. దీంతో చాలా షూటింగులు ఆగిపోయాయి.

నిర్మాతలే సినిమా షూటింగులను నిలిపేసే పరిస్థితి ఎందుకు వచ్చింది, దీనివల్ల ఎవరికి లాభం?

ఇవి కూడా చదవండి

అంతరిక్ష శకలం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అంతరిక్ష శకలం

3. అంతరిక్షం నుంచి జారింది.. పొలంలో పడింది

మిక్ మైనర్స్ అనే రైతు తన పొలంలో నిలువుగా పాతినట్లు ఉన్న ఒక పెద్ద నల్లటి వస్తువును మొదట చూసినప్పుడు అదొక చెట్టని, మాడిపోయి ఉంటుందని అనుకున్నారు.

కానీ దగ్గరగా వెళ్లి పరిశీలించగా అది ఒక వస్తువుగా తేలింది. మిక్ మైనర్స్ ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్‌వేల్స్‌లో ఉంటారు. తర్వాత దీన్ని పరిశీలించిన నిపుణులు ఆ వస్తువు అంతరిక్షం నుంచి ఆయన పొలంలో పడినట్లుగా ధ్రువీకరించారు.

ఆకాశం నుంచి పడిన ఆ వస్తువు ఏంటి? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

cheetah

ఫొటో సోర్స్, Adrian Tordiffe

ఫొటో క్యాప్షన్, చీతా

4. ఇండియాలో 50 ఏళ్ల కిందట అంతరించిన మృగం మళ్లీ అడుగుపెడుతోంది

ఎట్టకేలకు వచ్చే వారం కొన్ని చీతాలు భారత్‌లో అడుగుపెట్టబోతున్నాయి.

ప్రపంచంలోనే అత్యంత వేగంగా దూసుకెళ్లే జంతువులుగా పేరుగాంచిన చీతాలు భారత్‌లో అంతరించిపోయి దాదాపు ఐదు దశాబ్దాలు గడుస్తున్నాయి.

ఇప్పుడవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎలా తీసుకొస్తున్నారు? పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

డబ్బు

ఫొటో సోర్స్, Getty Images

5. అప్పు తీర్చాలంటూ ఏజెంట్లు దురుసుగా ప్రవర్తిస్తే ఏం చేయవచ్చు?

ఇటీవల ఏపీ వ్యవసాయ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డికి లోన్ యాప్ నిర్వాహకులు అదే పనిగా ఫోన్లు చేయడం సంచలనంగా మారింది.

వివిధ బ్యాంకుల్లో అప్పుల రికవరీ కోసం ప్రైవేటు సంస్థలకు రికవరీ బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఆయా సంస్థల సిబ్బంది అప్పులు చెల్లించాల్సిన వారి పట్ల హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

అప్పు తీర్చాలంటూ ఏజెంట్లు దురుసుగా ప్రవర్తిస్తే ఏం చేయవచ్చు? పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)