హురున్: సంపన్న మహిళల జాబితాలో 12 మంది హైదరాబాద్ నుంచే

రోష్నీ నాదర్ మల్‌హోత్రా

ఫొటో సోర్స్, Getty Images

భారతదేశంలో సంపన్న మహిళల జాబితాను కొటక్ ప్రైవేటు బ్యాంకింగ్ - హురున్ బుధవారం విడుదల చేసింది.

దివీస్ డైరెక్టర్ నీలిమ మోటపర్తి నాల్గవ స్థానం సంపాదించుకుని మొదటి 10 మంది సంపన్న మహిళల జాబితాలో నిలిచారు. ఈమెతో పాటు హైదరాబాద్‌కు చెందిన మరో 11 మంది సంపన్నుల జాబితాలో ఉన్నారు.

టాప్ టెన్ జాబితాలో లేని 33 ఏళ్ల కనికా టేక్రీవాల్ పేరు కూడా చర్చలోకి వచ్చింది. ఆమె కూడా భారతీయ సంపన్న మహిళల జాబితాలో చేరారు.

ఈ నివేదికను డిసెంబరు 31, 2021 నాటికి ఆస్తుల విలువ ఆధారంగా రూపొందించారు.

వీడియో క్యాప్షన్, ఫెయిర్ అండ్ లవ్లీ పేరు మార్పు: ఈ పోరాటం వెనుక ఉన్నది ముగ్గురు పాకిస్తాన్ మహిళలు

టాప్ -10లో ఎవరెవరు...

అతి పెద్ద ఐటీ సంస్థ హెచ్‌సీఎల్ టెక్నాలజీకి చైర్ పర్సన్ రోష్నీ నాడార్ మల్హోత్రా భారతదేశంలో అత్యంత సంపన్నుల జాబితాలో మొదటి స్థానంలో నిలిచారు.

సౌందర్య ఉత్పత్తుల బ్రాండు నైకాను ప్రారంభించేందుకు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కెరీర్‌ను వదిలిపెట్టిన ఫల్గుణి నాయర్ దేశంలో సంపన్న మహిళల జాబితాలో రెండవ స్థానంలో ఉన్నారు.

రోష్నీ నాడార్ మొత్తం ఆస్తుల విలువ 54% - 84% పెరిగి రూ.84,330 వేల కోట్లకు చేరింది. ఫాల్గుణి నాయర్ ఆస్తుల విలువ రూ. 57,520 కోట్లకు చేరింది.

ఈ నివేదిక ప్రకారం నాయర్ ఆస్తుల్లో 963 శాతం పెరుగుదల కనిపిస్తోంది.

ఈ జాబితాను భారతదేశంలో పుట్టి పెరిగి సొంతంగా వ్యాపారం ప్రారంభించిన లేదా కుటుంబ వ్యాపారం నిర్వహిస్తున్న 100 మంది మహిళా వ్యాపారవేత్తలతో రూపొందించారు.

ఒక ఏడాదిలో ఈ 100 మంది మహిళల ఆస్తి మొత్తం 53 శాతం పెరిగింది. 2020లో వీరి ఆస్తి విలువ రూ.2.72 లక్షల కోట్లు ఉండగా 2021 నాటికి రూ.4.16 లక్షల కోట్లకు చేరింది. దేశ సగటు స్థూల జాతీయ ఉత్పత్తిలో ఈ మహిళల ఆస్తి వాటా 2% ఉంది.

భారతదేశంలో అత్యంత సంపద కలిగిన మహిళలు

ఫొటో సోర్స్, కొటాక్ ప్రైవేటు బ్యాంకింగ్ - హురున్

ఫొటో క్యాప్షన్, భారతదేశంలో అత్యంత సంపద కలిగిన మహిళలు

ఈ జాబితాలో ఎవరి పేర్లున్నాయి?

రోష్నీ నాదర్, ఫాల్గుణి నాయర్ తర్వాత బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా మూడవ స్థానంలో ఉన్నారు.

భారతదేశంలో అత్యంత సంపద కలిగిన మహిళలు

నాలుగో స్థానంలో దివీస్ ల్యాబరేటరీస్ డైరెక్టర్ నీలిమ మోటపర్తి నిలిచారు.

ఈ పది మంది జాబితాలో లేని కనికా టేక్రీవాల్ పేరు కూడా చర్చలోకి వచ్చింది. నిజానికి కనిక అతి చిన్న వయసులో సంపన్న మహిళల జాబితాలోకి చేరారు.

కనికా టేక్రీవాల్
ఫొటో క్యాప్షన్, కనికా టేక్రీవాల్

కనికా టేక్రీవాల్ ఎవరు?

కనికా టేక్రీవాల్ 'జెట్ సెట్ గో' అనే సంస్థను ప్రారంభించారు.

సాధారణంగా పురుషాధిపత్యం ఉందని భావించే వైమానిక రంగంలో ఆమె ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. ఆమె వయసు 33 సంవత్సరాలు. కనికా సంస్థలు వినియోగదారులకు ప్రైవేటు జెట్‌లను హెలికాఫ్టర్లను అందిస్తారు.

వీరి సంస్థ ద్వారా ఎవరైనా ప్రైవేటు ఎయిర్ క్రాఫ్ట్, హెలికాప్టర్ , అంబులెన్స్‌ను సులభంగా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు.

"మీ పై మీకు విశ్వాసం ఉండటమే" జీవన మంత్రం అని చెప్పే ఈమె ఆస్తులు 50 శాతం పెరిగాయి. ప్రస్తుతం ఆమె ఆస్తి విలువ రూ.420 కోట్లు.

17 ఏళ్ల వయసులో ఆమె ఒక వైమానిక సంస్థలో పని చేసి సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని స్ఫూర్తి పొందినట్లు దూరదర్శన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పారు.

"ఏదైనా జీవితంలో సులభంగా వస్తే అది సంపూర్ణం అయినట్లు లెక్క కాదు" అని ఆమె అన్నారు.

ఆమె వ్యాపార ఆలోచనను చాలా మంది అపహాస్యం కూడా చేశారు. "నా సంస్థను 24 ఏళ్ల వయసులో ఒంటరిగా ప్రారంభించాను. నా పేరు మార్చుకుంటూ వినియోగదారులతో మాట్లాడేదానిని. నా సంస్థ క్రమంగా అభివృద్ధి చెందింది" అని ఆమె చెప్పారు.

ఫాల్గుణి నాయర్

ఫొటో సోర్స్, PUNIT PARANJPE

ఫొటో క్యాప్షన్, ఫాల్గుణి నాయర్

ఫల్గుణి నాయర్ కేర్ ఫ్రీ గా ఉండే విద్యార్థి నుంచి సంపన్న మహిళగా ఎలా మారారు?

సంపన్న మహిళల జాబితాలో ఫాల్గుణి నాయర్ మొదటి స్థానంలో నిలిచారు. కానీ, సంపన్నుల జాబితాలోకి చేరాలనే ఉద్దేశ్యం ఆమెకు చిన్నతనం నుంచి లేదు.

కష్టపడకుండా ఒక మంచి స్కూలులో సీటు రావడంతో తనకు చదువు పట్ల నిర్లక్ష్యంతో పాటు జీవితంలో ఎటువంటి లక్ష్యం లేకుండా చేసిందని ఈ ఏడాది మహిళల దినోత్సవం నాడు జరిగిన ఒక చాట్ షోలో చెప్పారు.

గత ఏడాది ఫల్గుణి నాయర్ సౌందర్య ఉత్పత్తుల స్టార్ట్ అప్ నైకా మార్కెట్‌లో బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.

వీడియో క్యాప్షన్, అనసూయ కాంతిమతి ఇడ్లీలు ఎందుకంత ఫేమస్?

ఆమె 2012లో నైకా సంస్థను ప్రారంభించారు. అదే సమయంలో సంస్థ సౌందర్య ఉత్పత్తులతో మార్కెట్‌లో అడుగు పెట్టింది.

కానీ, ఫ్యాషన్‌కు సంబంధించి నైకాలో ప్రస్తుతం వివిధ ఉత్పత్తులున్నాయి.

ఆమె కుటుంబ నేపధ్యం గురించి చెబుతూ, "మా అమ్మ ఎప్పుడూ ముందుకు సాగమని చెప్పేవారు. మాకు 99 శాతం మార్కులు వచ్చినా కూడా ఆ ఒక్క మార్కు ఎందుకు తగ్గిందని అడిగేవారు. అందుకే ఏదైనా మెరుగ్గా చేయాలని ఉండేది. మా కుటుంబం పై భగవద్గీత ప్రభావం చాలా ఉంది. అందుకే నేను ఫలితాలను ఆశించకుండా పని చేశాను" అని చెప్పారు.

నీలిమ మోటపర్తి

ఫొటో సోర్స్, facebook

నీలిమ మోటపర్తి ఎవరు?

నీలిమ మోటపర్తి దివీస్ ల్యాబ్స్ డైరెక్టర్ గా ఉన్నారు. ఆమె గీతం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ నుంచి ఇంటర్నేషనల్ బిజినెస్ లో మాస్టర్స్, గ్లాస్ గో యూనివర్సిటీ నుంచి ఇంటర్నేషనల్ ఫైనాన్స్ చేశారు.

గతంలో హురున్ సంపన్న జాబితాలో చేరేందుకు ఆస్తి విలువ కనీస స్థాయి రూ.100 కోట్లు ఉండేది. కానీ, ఈ ఏడాది కనీసం రూ. 300 కోట్ల ఆస్తి ఉన్నవారికి మాత్రమే స్థానం లభించింది.

10 మంది టాప్ వ్యాపారవేత్తల్లో కనీస విలువ కట్ ఆఫ్ రూ. 6620 కోట్లు ఉంది. ఇది గత ఏడాది కంటే 10 శాతం పెరిగింది.

ఈ జాబితాలో 25 మంది పేర్లు దిల్లీ ఎన్‌సిఆర్ నుంచే ఉన్నాయి. 21 మంది ముంబయి నుంచి 12 మంది హైదరాబాద్ నుంచి ఉన్నారు. ఈ 12 మందిలో నలుగురు మహిళలు అపోలో హాస్పిటల్స్ గ్రూపుకు చెందినవారే ఉన్నారు.

సంగీత రెడ్డి

ఫొటో సోర్స్, SANGEETA REDDY/FACE BOOK

అపోలో హాస్పిటల్స్ గ్రూప్‌కు చెందిన సునీత రెడ్డి, ప్రీత రెడ్డి, శోభన కామినేని, సంగీత రెడ్డి ఈ జాబితాలో ఉన్నారు.

భారత్ బయోటెక్‌కు చెందిన సుచిత్ర ఎల్ల కూడా ఈ జాబితాలోచోటు సంపాదించుకున్నారు.

హైదరాబాద్ నుంచి ఈ జాబితాలోకి చేరిన వారిలో స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్ - పద్మజ గంగిరెడ్డి, యూనివర్సల్ స్పోర్ట్స్ బిజ్ - అంజనా రెడ్డి, విజయ డయాగ్నస్టిక్ సెంటర్ సుప్రీతా రెడ్డి, బయలాజికల్-ఈ నుంచి మహిమ దాట్ల, అపోలో హాస్పిటల్స్ - శోభన కామినేని, సంగీతా రెడ్డి, తాజ్ జీవీకే హోటల్స్ - షాలిని భూపాల్, ఇందిరా కృష్ణారెడ్డి, గ్రాన్యూల్స్ ఇండియా - ఉమాదేవి చిగురుపాటి, హెరిటేజ్ ఫుడ్స్ - నారా భువనేశ్వరి ఉన్నారు.

విశాఖపట్నానికి చెందిన దేవి సీ ఫుడ్స్ ఎన్.నవీన, పి రమా దేవి, తిరుపతి నుంచి పీఎల్ఆర్ ప్రాజెక్ట్స్‌కు చెందిన స్వర్ణలత గాలివీటి కూడా జాబితాలో చోటు సంపాదించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)