ఫ్యాషన్ రంగంలో నవతరం మోడల్
అందంగా కనిపించాలని ఎవరికి మాత్రం ఉండదు… కానీ అసలైన అందం ఎక్కడుంటుందో తెలుసా? మిమ్మల్ని ఉన్నత స్థాయిలో నిలబెట్టే మీ ఆలోచనల్లో ఉంటుంది. మన చర్మం రంగు లేదా ముఖం మాత్రమే మన అందాన్ని ప్రతిబింబించలేదు అంటాడు మోడల్ కైడెన్.
ముఖంపై తెల్లటి మచ్చలతో కెమెరా ముందు తళుక్కుమని మెరుస్తున్న ఈ కొత్త మోడల్‌ను చూడండి..
ఇతడి పేరు కైడెన్. వయసు 13 ఏళ్లు. తనకు విటిలిగో అనే చర్మసమస్య ఉంది. మొదట్లో తన ముఖాన్ని దాచడానికి ఈ కుర్రాడు ప్రయత్నించేవాడు. కానీ ఇప్పుడు అదే ముఖం కెమెరా ముందు నవ్వుతోంది.
ఈ మధ్యనే ప్రిమార్క్ అనే మల్టీ నేషనల్ ఫ్యాషన్ రిటైలర్ సంస్థకు కైడెన్ మోడలింగ్ చేశాడు. సోషల్ మీడియాలో ఈ యాడ్స్ చాలా పేరు సంపాదించాయి.
''నేను దీన్ని దాచిపెట్టే రోజుల్లో నా చర్మం రంగుకు సరిపోయే క్రీమ్ కొనివ్వమని మా అమ్మను అడిగేవాణ్ని. అలా నా చర్మం మీద ఉన్న మచ్చలు కనిపించకుండా చేసే ప్రయత్నం చేసేవాణ్ని. కానీ ఇప్పుడు నేను దీన్ని పట్టించుకోను'' అని కైడెన్ అంటున్నాడు.
ఆత్మన్యూనతాభావంతో కుంగిపోకుండా, మోడలింగ్‌తో అడుగు ముందుకు వేస్తున్న కైడెన్‌ను పై వీడియోలో పలకరించండి..
ఇవి కూడా చదవండి
- అఘోరాలు ఎవరు... ఎందుకలా శవాల మధ్య గడుపుతారు...
- ఈ మహిళలు చైనాలో లైవ్ సెక్స్‌క్యామ్ రాకెట్ కోరల నుంచి ఎలా తప్పించుకున్నారంటే..
- డేటింగ్ చేయడానికి కూడా లీవులు ఇస్తారా...
- పదేళ్లుగా కోమాలో ఉన్న మహిళ ప్రసవం... మగ నర్సుని అరెస్ట్ చేసిన పోలీసులు
- ప్రియాంకా గాంధీని 'భయ్యాజీ' అని ఎందుకంటారు
- ఈ బాలుడు పడుకుంటే.. అతని ప్రాణానికే ముప్పు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





