కరోనావైరస్: 'పీపీఈ కిట్‌లోనే రక్త స్రావం అయిపోతోంది...' కోవిడ్ రోగులకు సేవలు చేస్తున్న నర్సుల కష్టాలు ..

ఫొటో సోర్స్, Renata Pietro
కృతి షా.. దిల్లీలోని ఓ ఆస్పత్రిలో ఇంటిన్సివ్ కేర్ యూనిట్లో నర్స్ గా పని చేస్తున్నారు. ఆమె వయసు 31 సంవత్సరాలు. తనను తాను ఓ ఆశావాదిగా ఆమె చెప్పుకుంటూ ఉంటారు.
“కానీ గత మూడు నెలలు చాలా కష్టంగా గడిచాయి” అని ఆమె అన్నారు. విధుల్లో భాగంగా ఆమె పీపీఈ కిట్, మాస్కు, కళ్ల జోడు, ఫేస్ షీల్డ్, గ్లౌజులు తప్పనిసరిగా ధరించాలి. అందుకోసం సుమారు 45 నిమిషాల సమయం పడుతుంది.
కానీ, ఒక మహిళగా ఆమె మరి కొన్ని జాగ్రత్తల్ని కూడా పాటించాల్సి ఉంటుంది. వదులుగా ఉండే గౌన్‌కు మాస్క్‌ను కట్టడం వల్ల మెడ భాగం బయటకు కనిపిస్తుంది. అలాగే కళ్ల జోడు పెట్టుకోవడం వల్ల ఆ శరీర భాగం ప్రాంతం కమిలిపోకుండా కళ్లజోడుకు-ఆమె ముక్కుకు మధ్యలో దూది ఉంచాల్సి వస్తుంది. అలాగే గ్లౌజులు వేసుకునే ముందు పొడవైన తన చేతుల్ని వెనక్కి మడచాల్సి ఉంటుంది.
చివరిగా మాస్క్ గట్టిగా బిగించి ఉందో లేదో చూసుకోవాలి. ఎందుకంటే, అందరికీ లార్జ్ సైజ్ మాత్రమే అందుబాటులో ఉంది. ఇవన్నీ ధరించిన తర్వాత కనీసం రెండు గంటల పాటు ఏమీ తాగకూడదు.
“మేం ఏమీ తినలేం. మంచి నీళ్లు కూడా తాగలేం. మా షిప్ట్ మొత్తంలో కనీసం వాష్ రూంకి కూడా వెళ్లే అవకాశం ఉండదు. దాంతో షిఫ్ట్ ముందు నుంచి నీళ్లను తాగడం వీలైనంతగా తగ్గించుకుంటున్నాం” అని కృతి చెప్పారు. కేవలం ఆరు గంటల షిఫ్ట్ ముగిసిన తర్వాత మాత్రమే ప్రొటెక్టివ్ గేర్(పీపీఈ కిట్)ను తీసే వీలుంది. అలా పీపీఈ కిట్‌ను శరీరం నుంచి విడిచి పెట్టే ప్రక్రియను డోఫింగ్ అంటారు.

పీపీఈ కిట్‌లోనే రక్త స్రావం
“నెల సరి సమయం వరకు ఎలాగోలా భరించగలిగాను. శరీరమంతా చెమట్లు, నా కళ్ల జోడు నిండా నీటి ఆవిరి తెరలు, నా పీపీఈ సూట్లోనే బ్లీడింగ్ కూడా అయిపోయేది” అని కృతి తన పరిస్థితిని వివరించారు.
షిప్ట్ మధ్యలో ఉన్నప్పుడు బ్లీడింగ్ జరిగి పీపీఈ కిట్‌పై మరకలు ఏర్పడితే అవి ఇతరుల కంట బడకుండా అడ్డంగా ఉండాలంటూ పురుషుడైన తన సహోద్యోగికి మనవి చేసిన సంఘటనను ఆమె గుర్తు చేసుకున్నారు. మున్ముందు మరిన్ని సమస్యలు రాకుండా పగటి సమయంలో రక్త స్రావం తగ్గాలంటే అవ్వాలంటే ఏం చెయ్యాలో తెలుసుకునేందుకు ఆమె ఇంటర్నెట్‌ను ఆశ్రయించారు. రోజూ వెచ్చని నీటిలో ఓ గంట స్నానం చెయ్యడం ద్వారా తన సమస్యకు పరిష్కారం ఉంటుందని ఆమెకు తెలిసింది.
“అయితే దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేదు. కానీ నాకు మరో దారి లేదు. ఈ ప్రొటెక్టివ్ గేర్‌ను డిజైన్ చేసే సమయంలో ఏ ఒక్కరూ నెలసరిలో ఉండే మహిళల అవసరాలేమిటన్న విషయాన్ని ఆలోచించరు” అని ఆమె అన్నారు.
పీపీఈ కిట్లను పురుషుల కోసమే డిజైన్ చేశారా?
స్త్రీ-పురుషులిద్దరూ ధరించే విధంగా రూపొందించిన పీపీఈ సూట్లపై అంతర్జాతీయంగా ఆందోళన రోజు రోజుకీ పెరుగుతోంది. పేరుకి స్త్రీ-పురుషులిద్దరికీ అనువైనవని చెబుతున్నప్పటికీ స్త్రీల విషయానికి వచ్చేసరికి వారికి అనువుగా ఉండటం లేదు.
చిన్న సైజు పీపీఈ కీట్ల కూడా కొంత మంది మహిళలకు వదులుగా ఉంటున్నాయని కొందరు ఆరోగ్య కార్యకర్తలు చెబుతున్నారు. అలా చెబుతున్న వారి సంఖ్య ప్రపంచ వైద్య వ్యవస్థలో సుమారు 70శాతం వరకు ఉంటుంది.
పీపీఈ సూట్ వదులుగా ఉంటే వైరస్ నుంచి కాపాడటంలో అది సమర్థవంతంగా పని చేయదు. అంతే కాదు వేసుకున్న వారికి కూడా చికాకుగా ఉంటుంది.
“నిజానికి ఈ సూట్లను ప్రాథమికంగా అమెరికా, యూరోపియన్ దేశాల పురుషుల్ని దృష్టిలో పెట్టుకొని తయారు చేసినవి” అని బ్రిటిష్ మెడికల్ అసోసియేషన్‌లో వైద్య సలహాదారుల కమిటీలో సభ్యుడైన డాక్టర్ హెలెన్ ఫిడ్లెర్ చెప్పారు.
పని చేసే సమయంలో కొన్ని సార్లు పీపీఈ కిట్ల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని 57శాతం మహిళలు చెప్పినట్లు 2017లో బ్రిటన్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ నిర్వహించిన సర్వేలో తేలింది.

ఫొటో సోర్స్, Getty Images
కేవలం 2 సైజుల్లోనే మాస్కులు
ఇది కేవలం యూకేకి మాత్రమే పరిమితం కాలేదు. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల మహిళలు పీపీఈ కిట్లపై తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. స్టాన్ ఫోర్ట్ విశ్వ విద్యాలయంలో స్కాలర్ అయిన డాక్టర్ అర్ఘవన్ సాలెస్ ప్రస్తుతం న్యూయార్క్‌లోని ఓ ఆస్పత్రిలో ఉన్న ఇన్సింటివ్ కేర్ యూనిట్లో విధులు నిర్వహిస్తున్నారు. ఈ సమస్యపై ఆమె ఇలా చెప్పుకొచ్చారు.
“N95మాస్కులు కేవలం రెండు సైజుల్లో మాత్రమే లభిస్తున్నాయి. ఇది చాలా విచారించదగ్గ విషయం. కేవలం రెండు సైజుల్లో మాత్రమే వస్తే ఎలా? ఈ భూమ్మీద మనుషులు ముఖాలన్నీ కేవలం రెండు సైజుల్లో మాత్రమే ఉంటాయా?” అని ఆమె ప్రశ్నించారు.
చిన్న సైజులో ఉన్న మాస్కులు తనకు సరిగ్గా సరిపోతున్నప్పటికీ వాటిని సంపాదించడం గగనమైపోతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
“ఓ సారి నాతో పాటు పని చేస్తున్న నా సహచరి వేసుకు N95మాస్కు తాడు తెగిపోయింది. ఆమెకు అవసరమైన చిన్న సైజు మాస్కులు దొరకలేదు. దీంతో ఆమె తన విధుల్ని మధ్యలోనే వదిలేసి వెళ్లిపోవాల్సి వచ్చింది” అని డాక్టర్ సాలెస్ తనకు ఎదురైన పరిస్థితిని వివరించారు.
చిన్న సైజులో ఉన్న గ్లౌజులు, కళ్లజోళ్లు కూడా తమకు వదులుగా ఉంటాయని ఆమె అన్నారు. “నా చేతుల సైజు నెంబర్ 6. కానీ నేను 6.5 సైజులో ఉన్న గ్లౌజుల్ని ధరించాల్సి వస్తోంది” నిజానికి కళ్ల జోళ్లు వైరస్ బారిన పడకుండా చాలా బాగా రక్షిస్తాయి. కానీ అవి నాకు సరిపోవు” అని అన్నారు.

ఫొటో సోర్స్, Renata Pietro
నిరంతరం మనం రాజీ పడిపోతునే ఉన్నాం
ఓ వైపు చాలా దేశాలు తమ ఆరోగ్య కార్యకర్తలకు పీపీఈ కిట్ల కొరత ఎక్కువగా ఉందని చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మహిళల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన పీపీఈ కిట్ల గురించి డిమాండ్ చెయ్యడం కష్టమవుతోందని కొందరు మహిళలు చెబుతున్నారు.
“పీపీఈ కీట్లను అందించడంలో తమకే తొలి ప్రాధాన్యమిస్తున్నట్లు చెప్పడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రాజీ పడాల్సి వస్తోంది” అని దిల్లీలోని ఓ ఆస్పత్రిలోని ఇన్సెంటివ్ కేర్ యూనిట్లో పని చేస్తున్న నర్స్ తెలిపారు. రోజులో కొన్ని గంటల పాటు మూత్ర విసర్జనకు వెళ్లకుండా ఆమె బలవంతంగా ఆపుకుంటూ వచ్చారు. అలా కొన్ని రోజులు గడిచే సరికి ఆమెకు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చింది. పీపీఈ కిట్లు అనువుగా లేకపోవడం వల్ల తనతో పాటు పని చేస్తున్న చాలా మంది సహచరులకు చర్మం, ముఖం కమిలిపోయాయని ఆమె చెప్పారు.

- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా

రెనటా పియెట్రో బ్రెజిల్‌లోని సావ్ పాలో నగరంలో ఓ ఆస్పత్రిలోని ఐసీయూలో పని చేస్తున్నారు. ఆమె బ్రెజిలియన్ అసోసియేషన్ ఆఫ్ క్రిటికల్ కేర్ నర్సస్ సంస్థ వ్యవస్థాపకురాలు కూడా. దేశ వ్యాప్తంగా నర్సులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఆమె పట్టించుకుంటూ ఉంటారు.
“నా పొడవు 5 అడుగుల ఒక అంగుళం. నేను వదులుగా ఉండే పెద్ద పెద్ద మాస్కులు ధరించి రోజుకు పది గంటలకుపైగా పని చేస్తున్నాను. నా రక్షణ కోసం నేను నాకు తగినట్టుగా వాటిని మార్చుకుంటూ ఉంటాను. నాకు పొడవైన జుట్టు ఉంది. అది మరింత సమస్యగా మారుతోంది. మాస్కు జారిపోకుండా ఉండేందుకు దాని తాళ్లను ఓ బ్యాండ్ ఎయిడ్‌తో పట్టి ఉంచేలా చేస్తాను. కానీ బ్రెజిల్లోని ఇతర ప్రాంతాల్లో ఉన్న నా స్నేహితులకు కనీసం మాస్కులు కూడా అందుబాటులో లేవు” అని ఆమె చెప్పారు.
తొలి మహిళా వ్యోమగాముల బృందం అంతరిక్షయాత్రను వారికి తగిన సైజులో చాలినన్ని సూట్స్ లేనందుకు నాసా రద్దు చేసింది

ఫొటో సోర్స్, NASA
కేవలం ఆరోగ్య సంరక్షణ కోసమే కాదు
మహిళల కోసం ప్రత్యేకంగా పీపీఈ కిట్లను తయారు చెయ్యాలన్న డిమాండ్లు కేవలం ఆరోగ్య రంగానికి మాత్రమే పరిమితం కాలేదు.
శాస్త్ర సంబంధ రంగాల్లోనూ పని చేసే మహిళలు మొదటిసారిగా దీనిపై స్పందించారు.
2019లో మహిళలకు తగిన సైజులో స్పేస్ సూట్లు లేకపోవడం వల్ల కేవలం మహిళలతో మాత్రమే స్పేస్ వాక్ నిర్వహించాలన్న తన ప్రణాళికను నాసా రద్దు చేసుకుంది. “ప్రాతినిధ్యం అన్నది ప్రతి చోటా ముఖ్యం” అని ప్రముఖ బయాలజిస్ట్ జెస్సికా మౌంట్స్ గతంలో బీబీసీతో అన్నారు. ఆమె నదులు, సరస్సులు, అన్ని రకాల వాతావరణాల్లోనూ చేపల తీరు తెన్నులు, వాటి సంఖ్యలో వృద్ధి తదతర అంశాలపై ఆమె ఎప్పటికప్పుడు సర్వేలు చేస్తూ ఉంటారు. తన వృత్తిలో భాగంగా తాను ఉపయోగించే అనేక పరికరాలు పురుషుల్ని దృష్టిలో పెట్టుకొని రూపొందించినవేనని ఆమె అంటారు. “వ్యక్తిగత రక్షణకు సంబంధించిన సమస్య కావడంతో ఒక్కోసారి కోపం వస్తుంటుంది. బాగా వదులుగా ఉన్న దుస్తుల్ని ధరించడం వల్ల కదిలే వస్తువుల్ని పట్టుకునే సమయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. వదులుగా ఉండే బూట్లను వేసుకోవడం వల్ల పట్టు జారి పడిపోయే ప్రమాదం ఉంటుంది” అని ఆమె తాను ఎదుర్కొనే సమస్యల్ని చెప్పుకొచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images
తీవ్రమైన అసమానతలు
ప్రముఖ రచయత్రి కరొలిన్ క్రైడో-పెరెజ్ తన ఇన్విజబుల్ వుమెన్ పుస్తకాన్ని రాసే సమయంలో ఇదే విషయంపై పరిశోధన చేశారు. సాధారణంగా మహిళలకు సంబంధించిన గణాంకాలను సేకరించమని అందుకే వారికి అనుగుణంగా వస్తువుల్ని తయారు చేయమని సంబంధిత సంస్థలు చెప్పినట్టు ఆమె గుర్తించారు.
“ఉదాహరణకు కత్తి పోట్ల నుంచి కాపాడుకునేందుకు ఉపయోగించే స్టాబ్ వెస్ట్‌లనే తీసుకుంటే పురుషులు ధరించే స్టాబ్ వెస్ట్‌లు మహిళలకు ఏ మాత్రం తగినవి కాదు. పైగా వాటిని ధరించడం వల్ల ఛాతికి తగిన రక్షణ లభించదు కూడా” అని ఆమె తెలిపారు.
వైద్య, ఆరోగ్యంలోని పీపీఈ కిట్ల విషయానికి వస్తే పురుషులతో పోల్చితే మహిళలు ఎంత మంది ఫిట్ టెస్ట్‌లలో విఫలమవుతున్నారో తెలుసుకునేందుకు తగిన గణాంకాలు అందుబాటులో లేవు.

ఫొటో సోర్స్, Getty Images
“పీపీఈలు స్త్రీ-పురుషులు ధరించేందుకు అనవుగా రూపొందించినవని, వాటిని ఎలా ధరించాలో తెలియకే మహిళలు ఎక్కువగా వాటి గురించి ఫిర్యాదులు చేస్తున్నారన్న వాదన కూడా బలంగా ఉంది” అని ఆమె చెప్పారు.
కరోనావైరస్ కారణంగా ఇప్పుడు వాటిపై ఫిర్యాదులు చేసే మహిళల సంఖ్య మరింత పెరిగింది. కానీ ఈప్రజారోగ్య సంక్షోభంపై తగినంతగా దృష్టిపెట్టడం లేదని కరోలిన్ అభిప్రాయపడ్డారు.
“ఈ మహమ్మారి సమయంలో సరఫరా వ్యవస్థ, పీపీఈ కిట్ల కొరత సహా అనేక అంశాలు చర్చకు వచ్చాయి. కానీ మహిళలకు సరిపోయే కిట్లను తయారు చెయ్యాలన్న డిమాండ్లపై చర్యలు తీసుకోవడంలో మాత్రం విఫలమయ్యారు. ఈ అసమానత నిజంగా షాక్‌నకు గురి చేస్తోంది” అని కరోలిన్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇంకా ఎంత కాలం?
అటు కృతి మాత్రం తనలోని సానుకూల దృక్పథాన్ని మరింతగా పెంచుకునేందుకు తన తాత్కాలిక వసతి గృహంలో రోజూ వ్యాయామం, ధాన్యం చేస్తున్నారు.
“నేను ప్రతి క్షణం ఏ శక్తి నన్ను ఇతరుల సంరక్షణలో ముందుంచింది? అని నేను నిరంతరం గుర్తు చేసుకుంటూ ఉంటాను” అని కృతి అన్నారు.
“కానీ ఎంత కాలం నేను దీన్ని ఇలా భరించగలను?”
(వ్యక్తిగత గోప్యత దృష్ట్యా ఈ కథనంలో మేం ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి పేరును మార్చాం.)
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007


ఇవి కూడా చదవండి
- ఇక టిక్ టాక్ పాఠాలు.. విద్యారంగంలోకి అడుగుపెడుతున్న చైనా యాప్
- జాన్ బోల్టన్ పుస్తకం: ‘డోనల్డ్ ట్రంప్ మళ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సహాయం కోరారు’
- డెక్సామెథాసోన్: కరోనావైరస్కు మంచి మందు దొరికినట్లేనా?
- వయసు 100.. సంతానం 1600కిపైగా.. 50 ఏళ్లుగా సంతానోత్పత్తిలోనే.. ఇప్పుడు విశ్రాంతి
- ‘‘నేను తల్లినే... కానీ కొందరు పిల్లల తల్లిదండ్రులను చంపేశాను’’
- ఆ ప్రాంతంలోకి సైన్యాన్ని పంపిస్తా.. ఉత్తరకొరియా లేడీ లీడర్ వార్నింగ్
- కరోనా వైరస్ సోకిన తల్లులు బిడ్డకు పాలివ్వొచ్చా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెబుతోంది
- హైడ్రాక్సీక్లోరోక్విన్: ‘కరోనావైరస్కు మలేరియా మందును వాడొద్దు’ అమెరికా ఔషధ సంస్థ ప్రకటన - భేషుగ్గా వాడవచ్చునన్న ట్రంప్
- కరోనావైరస్: 'మతం భవిష్యత్తు' ఎలా ఉంటుంది, ఆచారాలు పద్ధతులు ఎలా మారతాయి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








