కరోనావైరస్ చికిత్స: రోగుల ప్రాణాలను కాపాడుతున్న అత్యంత చౌక మందు డెక్సామెథాసోన్

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మిషెల్ రాబర్ట్స్
- హోదా, హెల్త్ ఎడిటర్, బీబీసీ న్యూస్ ఆన్‌లైన్
మార్కెట్‌లో తక్కువ ధరకే, విస్తృతంగా దొరికే ఒక సాధారణ ఔషధంతో కరోనా వైరస్ రోగుల ప్రాణాలు కాపాడొచ్చని బ్రిటన్‌కు చెందిన పరిశోధకులు చెబుతున్నారు.
డెక్సామెథాసోన్ అనే ఆ మందును తక్కువ మోతాదులో వాడడం వల్ల ఫలితం ఉంటుందని తమ అధ్యయనంలో తేలినట్లు వారు తెలిపారు.
వెంటిలేటరుపై ఉండి కరోనాతో పోరాడుతున్న రోగులపై దీన్ని పరీక్షించగా మంచి ఫలితాలు వచ్చాయని.. మూడో వంతు మంది కోలుకున్నారని పరిశోధకులు వెల్లడించారు.
కరోనా బారినపడి ఆక్సిజన్ అందిస్తే కానీ బతికే పరిస్థితి లేని రోగులకు ఈ మందుతో చికిత్స చేయగా వారిలో అయిదో వంతు మంది ప్రాణాలు కాపాడగలిగారని తెలిపారు.
కరోనా విజృంభణ మొదలైనప్పటి నుంచి బ్రిటన్‌లో రోగులకు దీన్ని వాడినట్లయితే కనీసం మరో 5 వేల మంది ప్రాణాలు కాపాడగలిగేవారని చెబుతున్నారు.
నిజానికి కరోనా వైరస్ సోకిన ప్రతి 20 మందిలో 19 మంది ఆసుపత్రిలో చేరకుండానే కోలుకుంటారు.
ఆసుపత్రిలో చేరిన వారిలో చాలా మంది వైద్యం అందడంతో కోలుకుంటారు, కానీ కొందరు మాత్రం ఆక్సిజన్ కానీ వెంటిలేటర్ కానీ లేకపోతే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. అలాంటివారికి ఈ డెక్సామెథాసోన్ సహాయపడుతుంది.
శరీరంలోని రోగ నిరోధక శక్తి సన్నగిల్లినప్పుడు మనిషి ప్రాణాలకు ముప్పు రాకుండా ఇది కాపాడుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
శరీరం అధిక స్థాయిలో ప్రతిస్పందించడాన్ని సైటోకిన్ స్టార్మ్ అంటారు. ఇది ప్రాణాంతక పరిస్థితి.
ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న 2 వేల మంది కరోనా రోగులపై ఈ మందు ప్రయోగించారు. వీరిలో రికవరీ శాతాన్ని ఈ మందు వాడకుండా చికిత్స చేసిన 4000 మందిలో రికవరీ శాతంతో పోల్చి చూశారు.
దాని ప్రకారం వెంటిలేటర్‌పై ఉన్న రోగుల్లో మరణ ప్రమాదాన్ని 40 శాతం నుంచి 28 శాతానికి.. ఆక్సిజన్ అవసరమైన రోగుల్లో మరణ ప్రమాదాన్ని 25 నుంచి 20 శాతానికి తగ్గించినట్లు గుర్తించారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రధాన పరిశోధకుడు ప్రొఫెసర్ పీటర్ హార్బీ మాట్లాడుతూ.. ''కరోనా మరణాలను తగ్గించడంలో అత్యధిక ఫలితాలు ఇచ్చిన మొట్టమొదటి ఔషధం ఇది. మరణాల రేటును ఇది గణనీయంగా తగ్గిస్తుంది. చెప్పుకోదగ్గ పురోగతి సాధించాం'' అన్నారు.
పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ మార్టిన్ లాండ్రే ''వెంటిలేటర్‌పై ఉన్న ప్రతి 8 మంది కరోనా రోగుల్లో ఒకరి ప్రాణాలు కాపడొచ్చ''ని అన్నారు.
ఇక ఆక్సిజన్ అవసరమైన రోగుల్లో ప్రతి 20 నుంచి 25 మందిలో ఒకరి ప్రాణాలు కాపాడొచ్చని చెప్పారు.
''డెక్సామెథోసోన్ మందు పది రోజుల పాటు కొంచెంకొంచెం మోతాదులో ఇవ్వాల్సి ఉంటుంది. ఒక రోగికి ధర 5 పౌండ్లు(సుమారు రూ.450) ఖర్చవుతుంది'' అని లాండ్రే చెప్పారు. ఈ మందు ప్రపంచవ్యాప్తంగా దొరుకుతుందని చెప్పారు.
అయితే.. ప్రజలు ఎవరికి వారు దీన్ని కొనుగోలు చేసి సొంతం వైద్యం చేసుకోవద్దని వారు సూచించారు.
ఇవి కూడా చదవండి:
- డెక్సామెథాసోన్: కరోనా 'లైఫ్ సేవింగ్' మెడిసిన్‌కు, భారత్‌కు ఉన్న బంధం ఏంటి?
- కరోనావైరస్: డెక్సామెథాసోన్ ఏంటి? ఈ మందు ఎలా పనిచేస్తుంది? దీని ధర ఎంత?
- కరోనావైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత?
- కరోనా వైరస్: అన్ని దేశాలూ వణుకుతున్నా, థాయిలాండ్ మాత్రం చైనీయులకు తమ తలుపులు తెరిచే ఉంచింది.. ఎందుకు? ః
- కరోనావైరస్ ప్రపంచవ్యాప్త మహమ్మారిగా మారిందా? వైద్య నిపుణులు ఏమంటున్నారు?
- కరోనా వైరస్: పిల్లలపై ప్రభావం చూపలేకపోతున్న వైరస్.. కారణాలు చెప్పలేకపోతున్న వైద్య నిపుణులు
- కరోనావైరస్: చైనా వస్తువులు ముట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా
- కరోనా వైరస్: 'తుమ్మినా, దగ్గినా ఇతరులకు సోకుతుంది.. దగ్గు, జ్వరంతో మొదలై అవయవాలు పనిచేయకుండా చేస్తుంది'
- కరోనావైరస్ లక్షణాలు: ఏమిటి? ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








