హైడ్రాక్సీక్లోరోక్విన్: ‘కరోనావైరస్‌కు మలేరియా మందును వాడొద్దు’ అమెరికా ఔషధ సంస్థ ప్రకటన - భేషుగ్గా వాడవచ్చునన్న ట్రంప్

ఫొటో సోర్స్, Reuters
కరోనావైరస్ సోకిన వారికి అత్యవసర పరిస్థితుల్లో మలేరియా ట్యాబ్లెట్ హైడ్రాక్సీక్లోరోక్విన్ వాడవచ్చంటూ గతంలో ఇచ్చిన అనుమతిని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) వెనక్కి తీసుకుంది.
ఈ మందు యాంటీ వైరల్ కణాలను ఉత్పత్తి చేస్తుందనడం వాస్తవంకాదని, ఇటీవల జరిగిన క్లినికల్ ట్రయల్స్ లో ఈ విషయం తేలిందని ఎఫ్‌డిఎ వెల్లడించింది.
అయితే హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను కోవిడ్ -19 చికిత్సలో వాడవచ్చని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బీష్మించారు.
గత మార్చిలో సీరియస్ కేసులకు హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను ఎమర్జెన్సీ డ్రగ్‌గా వాడటానికి ఎఫ్‌డీఏ అనుమతించింది. అయితే తాజాగా ఈ మందు వల్ల ఉపయోగం లేదని క్లినికల్ ట్రయల్స్‌లో తేలిందని, తమ ప్రయోగాల్లో ఇది యాంటీ వైరస్‌గా పని చేయలేకపోయిందని ఎఫ్‌డీఏ ప్రకటించింది.
ఎఫ్‌డీఏ నిర్ణయంపై స్పందిస్తూ, తాను గతంలో హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను తీసుకున్నానని, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీలేవని ట్రంప్ పేర్కొన్నారు.
‘‘నేను ఆ మాత్ర వేసుకున్నాను. నాకెలాంటి ఇబ్బంది కలగలేదు’’ అని ట్రంప్ సోమవారం నాడు ప్రకటించారు.
''దానిమీద (హైడ్రాక్సీక్లోరోక్విన్) నాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. రెండు వారాలపాటు వాడాను. ఇప్పుడు మీ ముందే ఉన్నాను'' అన్నారు ట్రంప్. ఈ మందు తమ ప్రాణాలను కాపాడిందని తనకు చాలామంది చెప్పారని కూడా ట్రంప్ వెల్లడించారు.

ఫొటో సోర్స్, Getty Images
అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో కొందరికి కరోనా వైరస్ సోకిందన్న విషయం తెలియగానే తాను హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను వాడటం మొదలుపెట్టానని మే నెలలో ట్రంప్ వెల్లడించారు.
ట్రంప్ ప్రకటన అటు సైంటిస్టులలోనూ, ఇటు సామాన్యులలోనూ వివాదాస్పదమైన చర్చను రేకెత్తించింది. ఈ మందుతో పాటు క్లోరోక్విన్ పనితీరు, వాడకంవల్ల కలిగే లాభనష్టాల మీద చర్చ నడిచింది.
ఈ మందు వాడకం వల్ల ప్రపంచవ్యాప్తంగా కొందరు రోగుల్లో మరణాలు పెరిగాయని, గుండె సంబంధమైన సమస్యలకు ఈ డ్రగ్ కారణమైందని ‘ది లాన్‌సెట్’ ఒక పరిశోధనా పత్రం వెల్లడించడంతో దీనిపై జరుగుతున్న క్లినికల్ ట్రయల్స్ తాత్కాలికంగా నిలిచిపోయాయి.
ఈ ఫలితాల కారణంగా ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు పలు సంస్థలు ట్రయల్స్ ను నిలిపేశాయి. అయితే తన పరిశోధనలో లోపాలున్నాయంటూ 'ది లాన్‌సెట్' తన స్టడీ పేపర్‌ను వెనక్కి తీసుకోవడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ట్రయల్స్ ను తిరిగి ప్రారంభించింది.

- కరోనావైరస్ గురించి ఇంకా మనకెవరికీ తెలియని 9 విషయాలు..
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ మీకు సోకిందని అనుమానంగా ఉందా? ఈ వ్యాధి లక్షణాలను ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత?
- కరోనావైరస్‌కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనావైరస్: సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- కరోనావైరస్: చైనా వస్తువులు ముట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా
- కరోనావైరస్: రైళ్లు, బస్సుల్లో ప్రయాణిస్తే ప్రమాదమా?
- కరోనావైరస్: ఇంక్యుబేషన్ పీరియడ్ ఏమిటి? వైరస్ - ఫ్లూ మధ్య తేడా ఏమిటి?
- సెక్స్ ద్వారా కరోనావైరస్ సోకుతుందా? కీలకమైన 8 ప్రశ్నలు, సమాధానాలు
- ఇంటెన్సివ్ కేర్ అంటే ఏమిటి? ఎలాంటి రోగులకు ఇది అవసరం?

ఏమిటీ క్లోరోక్విన్?
మలేరియా రోగులకు ఇచ్చే ఔషధానికి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరిగింది. కరోనావైరస్ బాధితులకు తక్షణ చికిత్స కావాలని ప్రభుత్వాలు ఆశించడమే అందుకు కారణం.
క్లోరోక్విన్‌తో పాటు, హైడ్రాక్సీ క్లోరోక్విన్ లాంటి ఔషధాలు కరోనావైరస్ చికిత్సకు పనిచేస్తాయని చెప్పేందుకు స్పష్టమైన ఆధారాలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) తెలిపింది. అయినప్పటికీ, ఈ ఔషధాలపై అందరి దృష్టీ పడింది.
మలేరియా చికిత్సలో భాగంగా జ్వరాన్ని, నొప్పిని తగ్గించేందుకు క్లోరోక్విన్ ఆధారిత మాత్రలను చాలాకాలంగా వాడుతున్నారు. ఆ మాత్రలే కరోనావైరస్‌ను కూడా నిరోధించగలవన్నది ఆశ.
"ప్రయోగశాలలో నిర్వహించిన అధ్యయనాల్లో కరోనావైరస్‌ను క్లోరోక్విన్ కట్టడి చేసినట్లు అనిపిస్తోంది. చికిత్స కోసం ఇది కొంతమేర సాయపడుతున్నట్లు కొన్ని ఆధారాలు కనిపించాయని కొందరు వైద్యులు తెలిపారు" అని బీబీసీ హెల్త్ కరస్పాండెంట్ జేమ్స్ గలాగర్ చెప్పారు.
క్లోరోక్విన్ ఆధారిత ఔషధాలను కోవిడ్-19 రోగులకు పూర్తిస్థాయిలో వాడొచ్చని చెప్పేందుకు ఇప్పటి వరకు పక్కా ఆధారాలు లేవు.
ఈ మందుల వల్ల మూత్రపిండం, కాలేయం దెబ్బతినడంతో పాటు మరికొన్ని తీవ్రమైన దుష్ప్రభావాలు కూడా తలెత్తే ప్రమాదాలు కూడా ఉన్నాయి.
"ఈ ఔషధాల ప్రభావాన్ని పూర్తిస్థాయిలో అంచనా వేసేందుకు ఇంకా విస్తృతంగా ర్యాండమ్ క్లినికల్ ట్రయల్స్ చేయాల్సిన అవసరం ఉంది" అని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన కోమ్ గిబినిగీ చెప్పారు.
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్ లక్షణాలు: ఏమిటి? ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
- భారత్‌లో పెరుగుతున్న కోవిడ్ కేసులు: ఐదు ప్రశ్నలు
- కరోనావైరస్: గుజరాత్లో కోవిడ్-19 మరణాలు ఎందుకు ఎక్కువగా ఉన్నాయి?
- కరోనావైరస్: సినిమా థియేటర్లు మళ్లీ హౌస్‌ఫుల్ అవుతాయా?
- కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్, హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటో మీకు తెలుసా?
- రాగి వస్తువులపై బ్యాక్టీరియా బతకలేదు.. మరి అన్నిచోట్లా రాగి పూత పూస్తే వైరస్‌లను ఎదుర్కోవచ్చా?
- సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చివరి గంటల్లో ఏం జరిగిందంటే..
- సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ 50 కలలు.. భౌతిక శాస్త్ర ప్రయోగాలు, విశ్వం, ప్రకృతి గురించి కన్న కలల్లో నెరవేరనివి ఎన్నంటే..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








