పెంగ్విన్ సినిమా రివ్యూ: కీర్తి సురేశ్ అద్భుత నటనతో సాగిన క్రైమ్ థ్రిల్లర్

ఫొటో సోర్స్, Passion Stdios/FB
- రచయిత, వందనా విజయ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఒక నేరం జగడం, తరువాత క్రిమినల్ పట్టుకోవడం...ఇదీ థ్రిల్లర్ సినిమాల్లో ఉండే నిజమైన థ్రిల్. కానీ క్రైమ్‌థ్రిల్లర్ పెంగ్విన్ మూవీలో సినిమా ప్రారంభం కావడానికి ముందే ఆ నేరం జరిగిపోతుంది. ఆ సీరియల్ కిల్లర్‌ను పట్టుకోవడానికి చేసే ప్రయత్నాలలోనే రియల్ గేమ్ మొదలవుతుంది.
ఈ సినిమాలో రిథమ్ (కీర్తిసురేశ్) ఒక రహస్యాన్ని ఛేదించే పనిలో ఉంటుంది. తన కొడుకుతోపాటు నగరంలోని పలువురు చిన్నారులను కిడ్నాప్ చేసిన ఒక గొడుగు మనిషి కోసం వెతుకుతుంటుంది.
తన ప్రయత్నంలో ఏది అడ్డువచ్చినా ఆమె లెక్కచేయదు. చివరకు తాను ఏడు నెలల గర్భిణి అని, జాగ్రత్తగా ఉండాలన్న విషయాన్ని కూడా ఆమె పట్టించుకోదు. ఎవరైనా అడిగితే ''నేను కేవలం గర్భవతిని, అంతేకాని మెదడు పని చేయనిదానిని కాదు'' అంటుంది.
తన మొదటి పెళ్లి ద్వారా కలిగిన సంతానం కిడ్నాప్ గురైతే, తాను ఏడు నెలల గర్భవతి అయి కూడా, కిడ్నాపర్‌ను వెతకడానికి ప్రతి క్షణం ప్రయత్నిస్తూ ఉంటుంది రిథమ్. చివరకు పోలీసులు కూడా తమవల్ల కాదని చేతులెత్తేసిన ఈ కేసులో ఆరు సంవత్సరాలు గడిచినా ఆమె మాత్రం వదిలిపెట్టదు. ఆమె ఆలోచనలన్నీ నిందితుడిని పట్టుకోవడంపైనే ఉంటాయి.
కమ్ముకొచ్చే మేఘాలు, చిక్కటి అడవులు, పొంగమంచు, అప్పుడప్పుడూ కనిపించే మిస్టీరియస్ చార్లీ చాప్లిన్...ఇలా సినిమాలోని ప్రతి ఫ్రేమ్‌ను ఆకర్షణీయంగా చూపిస్తారు దర్శకుడు.
మొదటిసారి డైరక్టర్‌గా పని చేస్తున్న ఈశ్వర్ కార్తీక్ పెంగ్విన్ తొలి అర్ధభాగాన్ని అద్భుత కథనంగా మలుచుకుంటూ వెళ్లారు. తన నటనతో కీర్తి సురేశ్ ఈ సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోశారు. మిగతా నటులు లింగా, రంగరాజ్ ఏదో రెండు పాత్రలుగా కనిపిస్తారు.

ఫొటో సోర్స్, Passion Studios/FB
కీర్తి తన నటనతో సినిమా తొలి అర్ధభాగాన్ని పండించారనే చెప్పాలి. దీనికి సంతోష్ నారాయణన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, కార్తీక్ పళని సినిమాటోగ్రఫీ దీనికి అదనపు హంగులు చేకూర్చాయి.
తన కొడుకు ఎక్కడున్నాడో కనుక్కోగలగడం, తిరిగి అతన్ని మామూలు మనిషిని చేయడం, ఆ సమయంలో పొంగుకొచ్చే ఎమోషన్లలో అద్భుతంగా నటించారు కీర్తిసురేశ్.
చిన్నచిన్న అంశాలను కథలో అద్భుతంగా సంలీనం చేయగలిగారు దర్శకుడు. తినడానికి చిన్నారి ముందు బ్రెడ్, జామ్ పెట్టినప్పుడు దానికి కన్నీళ్లు రాలడం కనిపిస్తుంది. గతంలో ఏం జరిగిందో చూపకపోయినా, ఈ సీన్ ద్వారా ఆ చిన్నారి అప్పటిదాకా అనేక కష్టాలు అనుభవించాడన్నది దర్శకుడు ఆ సీన్ ద్వారా చెప్పించారు.
ఇంటర్వెల్ సమయానికి ఒక అద్భుతమైన సీన్‌తో ఆసక్తిని పెంచుతూ బ్రేక్ ఇవ్వడం డైరక్టర్లకు బాగా తెలుసు. థియేటర్లో అదో అద్భుతమైన అనుభవం. కానీ ఇక్కడ ఆ ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇది అమెజాన్‌లో రిలీజయింది.
ఇక ముగింపు విషయానికి వస్తే ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో సహజంగానే ఒక అనుమానితుడు ఉంటాడు. కానీ ఆఖర్లో నిజమైన కిల్లర్ వస్తాడు. ప్రేక్షకులు నమ్మలేకపోతారు.

ఫొటో సోర్స్, Passion Studios/ FB
కీర్తి సురేశ్ క్యారెక్టర్‌ను చాలా జాగ్రత్తగా నిర్మించినట్లు కనిపిస్తుంది ఈ చిత్రంలో. ఆమె పాత్ర మరీ సినిమాను ఊపేసేలా ఉండదు.ఎంత సీరియస్‌గా కనిపిస్తింతో అంతే సహనశీలిగా, ఆలోచనరురాలిగా ఉంటుంది.
అయితే క్లైమాక్సులో ఓ లెక్చర్‌లాగా కనిపించే ప్రసంగాలు మాత్రం కాస్త బోర్ కొట్టిస్తాయి. ఏదేమైనా ఎమోషనల్ థ్రిల్లర్‌లాగా సాగే సినిమాను చూసి తీరాల్సిందే. కీర్తి సురేశ్ ఈ సినిమాతో మరోసారి తానేంటో నిరూపించుకున్నారు.
రిథమ్ అనే తన పేరులాగానే తన జీవితంలో రిథమ్‌ను వెతుకుతూ ఉంటారు ఆమె. మాస్టర్ అద్వైత్ కిడ్నాప్‌కు గురైన బాలుడిగా, అమాయకుడైన చిన్నారిగా మనల్ని ఆకట్టుకుంటారు.
హంతకుడు ఎందుకు అలా ప్రవర్తిస్తాడో చెప్పకుండానే సినిమా కథను ముగించడం ప్రేక్షకులకు నిరాశను కలిగిస్తుంది. క్రైమ్ థ్రిల్లర్లలో మనం విలన్ ద్వేషించడానికి కారణాలు వెతుక్కుంటాం. కానీ పెంగ్విన్‌లో అది సాధ్యం కాదు.
ఈ సినిమాకు వెళితే కీర్లి సురేశ్ కోసం వెళ్లాలి. మాతృభావనను చాదస్తంలా, అరిగిపోయిన రికార్డు డైలాగులతో కాకుండా విభిన్నంగా మలచడం సినిమా ప్రత్యేకత అని చెప్పాలి.
ఇవి కూడా చదవండి:
- ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా రివ్యూ
- ప్రభాస్ 'సాహో' సినిమా ఏం చెప్పాలనుకుంది?
- జార్జి రెడ్డి - 'ది ఫైటర్' - సినిమా రివ్యూ
- హిప్పీ సినిమా రివ్యూ: శృతి మించిన రొమాన్స్
- సీతను విలన్ దగ్గరకు పంపే రఘురాముడి కథ
- అల వైకుంఠపురములో సినిమా రివ్యూ:
- భారత్‌లో పెరుగుతున్న కోవిడ్ కేసులు: ఐదు ప్రశ్నలు
- కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్, హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటో మీకు తెలుసా?
- కరోనావైరస్: ప్రజారోగ్యం విషయంలో ప్రభుత్వం పిసినారితనం చూపిందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








