కరోనా వైరస్ సోకిన తల్లులు బిడ్డకు పాలివ్వొచ్చా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెబుతోంది

ఫొటో సోర్స్, Getty Images
కరోనావైరస్ సోకిన తల్లి తన నవజాత శిశువులకు చనుబాలు ఇవ్వొచ్చని, దానివల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ డాక్టర్ టెడ్రోస్ అథనోమ్ అన్నారు.
“వైరస్ వ్యాప్తి ప్రమాదంతో పోలిస్తే, తల్లి తన శిశువుకు పాలు పట్టడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది అని ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిశోధనల్లో తేలింద”ని జెనీవాలో జరిగిన ఒక మీడియా సమావేశంలో పాల్గొన్న డాక్టర్ టెడ్రోస్ చెప్పారు.
“పెద్దలతో పోలిస్తే పిల్లల్లో కోవిడ్-19 ప్రమాదం తక్కువ ఉంటుందనే విషయం మనకు తెలుసు. కానీ పిల్లలకు ఎక్కువ ప్రమాదకరమైన వేరే రోగాలు ఎన్నో ఉన్నాయి. తల్లిపాలు అలాంటి వ్యాధులను అడ్డుకోగలదు. ప్రస్తుత ప్రమాణాలను బట్టి వైరస్ వ్యాపించే ప్రమాదం కంటే, తల్లి తన బిడ్డకు పాలు ఇవ్వడం వల్ల ప్రయోజనాలే ఎక్కువ ఉన్నాయని సంస్థ సూచిస్తోంది” అని తెలిపారు.
“ఎవరైనా తల్లులకు కరోనా వచ్చిందనే సందేహం ఉన్నా.. లేదంటే కరోనా పాజిటివ్‌గా నిర్ధరణయినా వారిని పిల్లలకు పాలు పట్టేలా ప్రోత్సహించాలి. తల్లి ఆరోగ్య పరిస్థితి బాగా క్షీణిస్తే తప్ప నవజాత శిశువును తల్లికి దూరం చేయకండి” అన్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ రీప్రొడక్టివ్ హెల్త్ అంశాల సలహాదారుడు డాక్టర్ అన్షు బెనర్జీ “ఇప్పటివరకూ మేం తల్లిపాలలో ఎలాంటి లైవ్ వైరస్ ఉన్నట్టు తెలుసుకోలేకపోయాం. చాలా కేసుల్లో స్తన్యంలో వైరస్ ఆర్ఎన్ఏ అవశేషాలు కనిపించాయి(కరోనా వైరస్ ఆర్ఎన్ఏ అంటే ఒక ప్రొటీన్ మాలిక్యూల్ తో ఏర్పడుతుంది.). కానీ నిజానికి తల్లి పాలలో మాకు ఇప్పటివరకూ ఎలాంటి లైవ్ వైరస్ ఆనవాళ్లు కనిపించలేదు. అందుకే తల్లి నుంచి పిల్లలకు కరోనా వ్యాపించే ప్రమాదం ఉంటుందనేది నిరూపితం కాలేదు” అని చెప్పారు.

ఫొటో సోర్స్, REUTERS/GLEB GARANICH
శిశువులకు అత్యుత్తమ ఆహారం తల్లిపాలే
అటు అమెరికా సెంటర్ ఆఫ్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షివ్(సీడీసీ) కూడా నవజాత శిశువుకు తల్లి పాలు అత్యుత్తమ ఆహారం అని చెబుతోంది.
అయితే తల్లి తన పాలు పట్టడం వల్ల బిడ్డకు వైరస్ వ్యాపిస్తుందా, లేదా అనేదానిపై ఇప్పటివరకూ ఎలాంటి సమాచారం లేదు అని సీడీసీ చెప్పింది. కానీ అందుబాటులో ఉన్న పరిమిత డేటాను బట్టి అలా జరిగే అవకాశం లేదని తెలిపింది.
కరోనా పాజిటివ్ వచ్చిన తల్లి నుంచి ఆ వైరస్ బిడ్డకు వ్యాపించకుండా తల్లికి తరచూ చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, మాస్కు వేసుకోవాలని సీడీసీ చెబుతోంది.
ఈ అంశంపై బ్రిటన్ ప్రభుత్వ ఆరోగ్య సేవ ఎన్‌హెచ్ఎస్ కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థలా కొన్ని సూచనలు చేసింది.
ఇప్పటివరకూ శిశువులకు తల్లి పాల నుంచి కరోనా వైరస్ వ్యాపిస్తుందనే విషయంలో ఎలాంటి ఆధారాలూ లేవని ఎన్‌హెచ్ఎస్ చెప్పింది.
బిడ్డకు పాలు తాగించే సమయంలో తల్లి, బిడ్డ దగ్గరగా ఉండడం వల్ల ప్రమాదం ఉండవచ్చని ఎన్‌హెచ్ఎస్ అంటోంది. అందుకే, కరోనా తల్లులు బ్రెస్ట్ ఫీడింగ్ గురించి డాక్టరుతో మాట్లాడాలని చెప్పింది.
ఐసీఎంఆర్ కూడా కరోనా పాజిటివ్ తల్లి, తన నవజాత శిశువుకు పాలు తాగించాలనుకుంటే బాగా చేతులు కడిగిన తర్వాత, మాస్కు వేసుకోమని అలా చేయాలని చెబుతోంది.
“బ్రెస్ట్ మిల్క్ లో కరోనా వైరస్ వ్యాపిస్తోంది అనడానికి ఎలాంటి ఆధారాలూ లభించలేదు” అని ఐసీఎంఆర్ చెబుతోంది.
ఇవి కూడా చదవండి:
- ప్రసవం తర్వాత మహిళల కుంగుబాటు లక్షణాలేంటి? ఎలా బయటపడాలి?
- తల్లిపాలు ఎంతకాలం ఇస్తే మంచిది.. రెండేళ్లా? ఐదేళ్లా?
- తొలి భారతీయులు ఎవరు.. ఆఫ్రికా నుంచి వలసొచ్చినవారి వారసులా?
- ఉత్తర ప్రదేశ్‌లో వైద్యం అందక గర్భిణి మృతి.. కరోనా పాజిటివ్ కేసుల్లో ఐదో స్థానానికి చేరుకున్న భారత్
- ఇకిగాయ్: జీవిత పరమార్థం తెలిపే జపాన్ ఫార్ములా
- భారత్-నేపాల్ సంబంధాలు: 1990ల్లో 13 నెలలపాటు నేపాల్‌ను భారత్ ఎందుకు దిగ్బంధించింది?
- కరోనావైరస్: కోవిడ్-19 సోకిన తల్లులకు పుట్టిన 100 మంది బిడ్డలు ఎలా ఉన్నారు...
- రోడ్డుపైనే మహిళా వలస కూలీ ప్రసవం, రెండు గంటల విరామంతో మళ్లీ సొంతూరికి నడక... సుమోటోగా స్వీకరించిన ఎన్హెచ్ఆర్సీ
- కరోనావైరస్: ప్రత్యేక రైళ్లలో ఏం చేయొచ్చు? ఏం చేయకూడదు?
- బిహార్ రైల్వే స్టేషన్లో విషాదం: తల్లి చనిపోయిందని తెలియక మృతదేహం దగ్గర ఆడుకున్న చిన్నారి
- ప్రభుత్వ క్వారంటైన్లో ఉండటానికి నిరాకరించిన రైలు ప్రయాణీకులు.. తిరిగి దిల్లీ పంపించిన కర్ణాటక
- ‘భారత్’ అనే పేరు వెనుక దాగిన శతాబ్దాల ‘నీరు’, ‘నిప్పు’ల కథ
- కరోనావైరస్: భార్యకు చెప్పకుండానే భర్తకు అంత్యక్రియలు చేసిన తెలంగాణ పోలీసులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








