ప్రసవం తర్వాత మహిళల కుంగుబాటు లక్షణాలేంటి? ఎలా బయటపడాలి?

వీడియో క్యాప్షన్, వీడియో: ప్రసవం తర్వాత కుంగుబాటు లక్షణాలు...

బిడ్డకు జన్మనివ్వడం.. ప్రతి మహిళకు ఓ మరుపురాని అనుభూతి. కానీ ప్రసవం తర్వాత చాలా మంది మహిళలు కుంగుబాటుకు లోనవుతారు. సాధారణంగా ఈ పరిస్థితి మొదటి కాన్పు తర్వాత వస్తుంది. దీనినే ‘ప్రసవానంతర కుంగుబాటు’ అంటారు.

టెన్నిస్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్‌ కూడా ఈ సమస్య ఎదుర్కొన్నారు. దాదాపు 20-70 శాతం మహిళలు ఈ సమస్యను ఎదుర్కొంటారు.

కోపం, విసుగు, విచారం, ఆందోళన.. ఇవీ ప్రసవానంతర కుంగుబాటు లక్షణాలు. కొందరు మహిళల్లో తమను తాము హింసించుకునే లక్షణాన్ని కూడా వైద్యులు గమనించారు.

ఈ సమస్యకు మందులు ఉన్నాయా? ఈ సమస్యను అధిగమించాలంటే ఏం చేయాలి?.. పై వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)