షెడిట్ రన్: మహిళల్లో చైతన్యం కోసం స్పోర్ట్స్ బ్రాతో జాగింగ్

"మహిళలూ... మీ మనసుకు ఏ పని చేయాలనిపిస్తే, ఆ పనిచేయండి. మీకు ఏ దుస్తులు నచ్చితే వాటిని ధరించండి. ధైర్యంగా ఉండండి" అంటున్నారు దిల్లీలోని కొందరు మహిళలు.
మహిళల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు వీళ్లు 'షెడిట్‌రన్' పేరుతో ఓ ప్రచార కార్యక్రమం ప్రారంభించారు. ఆ ప్రచారంలో భాగంగా ప్రతిరోజూ స్పోర్ట్స్ బ్రాలు ధరించి జాగింగ్ చేస్తున్నారు.
మహిళలను వెనక్కి లాగుతున్న ఆలోచనలను, అభిప్రాయాలను పారదోలేందుకు కృషి చేసే వారిని ఏకతాటిపైకి తీసుకొచ్చే ఉద్దేశంతో ఈ ప్రచారాన్ని ప్రారంభించామని వారు చెబుతున్నారు.
ప్రస్తుతం ఈ బృందంలో ఉన్న మహిళలంతా తల్లులే. ఇంటి పనులు చేసుకుంటారు. ఉద్యోగాలు చేస్తారు.
"అమ్మాయిలు నిండుగా బట్టలు ధరిస్తేనే మంచిదనే అభిప్రాయం భారత్‌లో ఉంది. ఒక్కొక్కరు ఒక్కో విధంగా అంటుంటారు. బిగుతైన దుస్తులు వేసుకోవద్దని కొందరు అంటారు. నేను మాత్రం జాగింగ్ కోసం బిగుతైన స్పోర్ట్స్ బ్రా వేసుకుంటున్నాను" అని చెప్పారు హర్షితా కౌల్.

"నేను జాగింగ్ మొదలుపెట్టినప్పుడు వదులుగా ఉండే దుస్తులు వేసుకునేదాన్ని. పొట్ట, ఇతర శరీర భాగాలు బయటకు ఎత్తుగా కనిపించకుండా ఉండేందుకు అలా చేసేదాన్ని. కానీ, కొన్నాళ్లకు నా శరీరాన్ని నేను దాచుకోవడంలో అర్థం లేదనిపించింది. దాంతో ఇప్పుడు స్పోర్ట్స్ బ్రా ధరించి ఉదయాన్నే జాగింగ్ చేస్తున్నా" అన్నారు వినీత జైన్.
"నేను తల్లిని. నేను ఉదయాన్నే జాగింగ్‌కి వెళ్తున్నాను. ప్రచారంతో పాటు నా ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుంటున్నాను. నన్ను చూసి వ్యాయామం ఎంత అవసరమో నా పిల్లలకు కూడా అర్థమవుతుంది" అని వివరించారు తాన్యా అగ్రవాల్.
ఇవి కూడా చూడండి:
- ఆఫ్రికా నుంచి బానిసలుగా వచ్చారు.. భారత్‌లో బాద్‌షాలయ్యారు
- బ్యాగరి మహిళలు: శవాల మధ్య బతుకు పోరాటం
- సన్నీ లియోని ఇంటర్వ్యూ: 'రోడ్డు మీద నుంచున్న వేశ్యకు - పోర్న్ స్టార్‌కి తేడా ఏమిటి?'
- 'గ్లామర్ ప్రపంచంలో అడుగెయ్యాలంటే యవ్వనంగా కనిపించాల్సిందే'
- ఇండియా VS పాకిస్తాన్: దాయాది దేశాల క్రికెట్ శత్రుత్వం చరిత్ర
- C/o కంచరపాలెం: తెలుగు సినిమా ఎదుగుతోంది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









