న్యూజిలాండ్‌: ప్రసవం కోసం సైకిలుపై ఆస్పత్రికి వెళ్లిన మంత్రి

సైకిలుపై ఆస్పత్రికి వెళ్లిన మంత్రి

ఫొటో సోర్స్, JULIE GENTER/INSTAGRAM

మొదటి బిడ్డకు జన్మనివ్వడానికి న్యూజిలాండ్‌ మహిళా మంత్రి స్వయంగా సైకిల్ తొక్కుకుంటూ ఆస్పత్రికి చేరుకున్నారు.

గ్రీన్ పార్టీకి చెందిన జూలీ జెంటర్ 42 వారాలు.. అంటే 9 నెలల గర్భవతి.

కారులో ఎక్కువ మంది ఎక్కడానికి స్థలం లేకపోవడంతో, సైకిలుపైనే ఆస్పత్రికి వెళ్లాలని అనుకున్నట్టు ఆమె తెలిపారు.

తన భర్తతోపాటు ఉన్న ఫొటోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అందులో "అందమైన ఆదివారం(ఆగస్టు 19న) ఉదయం" అని పేర్కొన్నారు.

ఇదే ఏడాది జూన్‌లో ఆ దేశ ప్రధానమంత్రి 38 ఏళ్ల జసిండా ఆర్డెర్న్ పదవీకాలంలో బిడ్డకు జన్మనిచ్చిన రెండో ప్రపంచ నేతగా చరిత్ర సృష్టించారు.

ఆమెలాగే జూలీ జెంటర్ కూడా తమ బిడ్డకు జన్మనివ్వడానికి ఆక్లాండ్‌ సిటీ ప్రభుత్వ ఆస్పత్రిని ఎంచుకున్నారు.

38 ఏళ్ల జెంటర్ దేశ ట్రాఫిక్ సహాయ మంత్రి. ఆమెకు సైక్లింగ్ అంటే చాలా ఇష్టం.

పోస్ట్‌ Instagram స్కిప్ చేయండి, 1
Instagram ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of Instagram ముగిసింది, 1

మా సైకిలుకు మరో సీటు కావాలి

జూలీ జెంటర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్‌లో "మాకు శుభాకాంక్షలు అందించండి. నేను, నా భర్త సైకిలుపై వెళ్లాలని అనుకున్నాం. ఎందుకంటే కార్లో అందరం వెళ్లడానికి తగినంత చోటు లేదు. కానీ దానివల్ల నాకు మంచి మూడ్ వచ్చింది" అని రాశారు.

"ఎలక్ట్రిక్ సైకిల్‌పై వెళ్తుంటే వాలులో వెళ్తున్నట్టు ఉంది. బహుశా నేను ఇంతకు ముందు వారమే సైకిల్ తొక్కుండాల్సింది. అలా చేసుంటే నాకు ప్రసవం చాలా సులభం అయ్యుండేది" అన్నారు.

అమెరికాలో పుట్టిన జెంటర్ తాను గర్భవతి అయినట్టు కూడా ఇన్‌స్టాగ్రామ్‌లోనే పోస్ట్ చేశారు. ఆమె ఆ సమయంలో "మేం మా సైకిలుకు మరో సీటు బిగించాల్సి వస్తోంది" అని చెప్పారు.

పోస్ట్‌ Instagram స్కిప్ చేయండి, 2
Instagram ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of Instagram ముగిసింది, 2

జూలీ జెంటర్ తన బిడ్డ కోసం మూడు నెలలు మెటర్నిటీ లీవు తీసుకుంటున్నారు.

జెంటర్ ఇప్పుడు తన పదవీకాలంలో బిడ్డకు జన్మనిచ్చిన మహిళా నేతల్లో ఒకరు కానున్నారు.

న్యూజిలాండ్‌లో 1970లో మొదటిసారి ఒక మహిళా ఎంపీ తన పదవీకాలంలో బిడ్డకు జన్మనిచ్చారు. 1983లో మరో మహిళా నేత పనిచేస్తున్నప్పుడు బిడ్డకు పాలు తాగించడంతో వార్తల్లో నిలిచారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

ఆస్ట్రేలియా 2016లో దేశ నిబంధనల్లో మార్పులు తీసుకొచ్చింది. హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్‌లో ఉన్న మహిళా నేతలు పనిచేస్తున్నప్పుడు తమ పిల్లలకు పాలు తాగించడానికి అనుమతి ఇచ్చింది.

ఇటీవల ఐరోపా యూనియన్‌లో ఇటలీ, స్వీడన్ మహిళా సభ్యులు తన బిడ్డను ఎత్తుకుని ఓటు వేయడంతో వార్తల్లో నిలిచారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.