అమ్మ పాలు... బాటిల్ రూ.250

ప్రకృతిలో అమ్మ పాల స్థానాన్ని మరేవీ భర్తీ చేయలేవు. కానీ వైద్య పరమైన కారణాల వల్ల కొందరు తల్లులు పాలివ్వలేరు. అలాంటివాళ్ల పిల్లలు ఇకపై తల్లి పాలకు దూరమవ్వాల్సిన అవసరం లేదు. దేశంలో కొత్తగా తల్లిపాలను సైతం అమ్మే సంస్థలు అందుబాటులోకి వస్తున్నాయి.
దిల్లీలోని ‘అమరా’ అనే సంస్థ కూడా అలాంటిదే.
పాలను దానమివ్వడానికి సిద్ధపడే తల్లుల నుంచి ఆ సంస్థ పాలను సేకరిస్తుంది. వాటిని భద్రపరిచి అవసరమైన వారికి అందిస్తుంది.
సునీత అనే మహిళ కొన్ని రోజులుగా అలా వేరే తల్లులు ఇచ్చిన పాలనే తన పిల్లలకు పడుతున్నారు. కొన్నాళ్ల క్రితం ఆమె నెలలు నిండని కవలలకు జన్మనిచ్చారు.
‘పాలను దానమిచ్చే తల్లులంటే నాకు చాలా గౌరవం. వాళ్లు కూడా నాలాంటి అమ్మలే. నాకు ఇద్దరు నెలలు నిండని పిల్లలు పుట్టారు. సిజేరియన్‌తో పాటు నా వయసు కారణంగా వాళ్లకు పాలివ్వడం సాధ్యపడట్లేదు. తరువాత ఆస్పత్రిలోనే తల్లిపాలు దొరుకుతాయని ఇంట్లో చెప్పా. ఇంట్లో వాళ్లు కూడా ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు.
మొదట్లో ఆ పాల నాణ్యతపైన అనుమానాలుండేవి. నా పిల్లలకు అవి సరిపడతాయో లేదో అని భయం వేసేది. కానీ నా పిల్లల ఎదుగుదలను చూశాక చాలా సంతోషమేసింది’ అంటారు సునీత.

మరో పక్క జ్యోతి అనే మహిళ చాలా కాలంగా తన పాలను ఇతర పిల్లల కోసం దానమిస్తున్నారు. తన వల్ల ఒక్క బిడ్డ ప్రాణం నిలబడినా చాలని ఆమె చెబుతున్నారు.
‘మా పాపకు నేరుగా నా చనుబాలు తాగడం సాధ్యం కాలేదు. కొన్న పాలను తనకు పట్టడం నాకు ఇష్టం లేదు. అందుకే ఎలక్ట్రానిక్ పంప్ సాయంతో నా చనుబాలను సేకరించడం మొదలుపెట్టా. కానీ నా పాప తాగేదానికన్నా ఎక్కువ పాలు బయటికొచ్చేవి. దాంతో చాలా పాలు వృథా అయ్యేవి.
ఆ పాలు వృథా కాకుండా అవసరమైన వారికి దానం చేయొచ్చని, పాలు రాని తల్లులకు అవి ఉపయోగపడాతయని మా డాక్టర్ సలహా ఇచ్చారు. నేనిప్పుడు అదే పని చేస్తున్నా. గత ఆర్నెల్లుగా పాలను దానమిస్తున్నా.
నా పాల వల్ల ఎక్కడో చోట ఒక్క చిన్నారి ప్రాణమైనా నిలబడి ఉంటుందని నా భర్తతో అప్పుడప్పుడూ అంటుంటా’ అని జ్యోతి చెప్పారు.

అమరా లాంటి చాలా పాల బ్యాంకులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అమరా బ్యాంకు రెండేళ్లలో దాదాపు వెయ్యి లీటర్ల పాలను సేకరించింది. ‘ముందు సేకరించిన పాలను మేం పరీక్షిస్తాం. తరవాత వాటిని శుద్ధి చేసి భద్రపరుస్తాం. ఫ్రీజ్ చేసిన పాలను ఆర్నెల్ల వరకు ఉపయోగించొచ్చు’ అంటారు అమరా మిల్క్ బ్యాంక్‌కు చెందిన వైద్యుడు రఘు.
ఒక బాటిల్ పాల ధర రూ.200-250 మధ్య ఉంటుంది. కానీ, దానమిచ్చే తల్లులు మాత్రం ఆ పాలకు డబ్బులు తీసుకోరు.
ఇవి కూడా చదవండి
- తల్లిపాలు ఎంతకాలం ఇస్తే మంచిది.. రెండేళ్లా? ఐదేళ్లా?
- న్యూజిలాండ్: ప్రసూతి సెలవు ముగించుకుని పనిలో చేరిన ప్రధానమంత్రి
- చర్చనీయాంశమైన 'పాలిచ్చే తల్లి' ఫొటో!
- తల్లిపాలకు టెక్నాలజీ అవసరమా?
- అర్జెంటీనా: అబార్షన్ హక్కు కోసం పోరాడుతున్న మహిళలు
- ఒసామా బిన్ లాడెన్ తల్లి: నా బిడ్డ చిన్నప్పుడు చాలా మంచివాడు
- రక్తదానం, అవయవదానాలు సరే.. అండదానం తెలుసా!
- జోల పాటలు, లాలి పాటలతో తల్లికి కూడా లాభమే!
- ‘సంప్రదాయ వైద్యంతో గర్భం’.. మోసపోయిన వందలాది మంది మహిళలు
- పుట్టిన మొదటి గంటలో బిడ్డకు తల్లిపాలు ఇవ్వకపోతే ఏమవుతుందంటే..
- అభిప్రాయం: 'ధర్మరాజుకూ మంచిచెడ్డలు ఉంటాయి'
- ఇచట వృద్ధులకు పెళ్లిళ్లు చేయబడును!
- ‘అవి వరదలు కాదు, కేరళ నదుల కన్నీళ్లు’
- ‘పీరియడ్స్‌కు ముందు ఆమె మూడ్ హఠాత్తుగా మారిపోయేది...’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)









