అర్జెంటీనా: అబార్షన్ హక్కు కోసం పోరాడుతున్న మహిళలు

ఫొటో సోర్స్, Getty Images
లాటిన్ అమెరికా దేశాలలో ఒకటైన అర్జెంటీనా పార్లమెంటులో ఈరోజు ఓ చరిత్రాత్మక బిల్లుపై ఓటింగ్ జరిగింది. గర్భధారణ తర్వాత పధ్నాలుగు వారాల్లో చేసే అబార్షన్‌ను చట్టబద్ధం చేసే బిల్లుకు వ్యతిరేకంగా సెనెటర్లు ఓటేశారు.
ప్రస్తుతం అక్కడ అబార్షన్ చట్టవిరుద్ధం. కేవలం అత్యాచార సంఘటనల్లో లేదా గర్భం ధరించిన మహిళ ప్రాణానికి ఏదైనా ప్రమాదం ఉంటేనో అబార్షన్ చేయొచ్చు.
ఒకవేళ ఈ బిల్లును ఆమోదిస్తే, అబార్షన్‌ను చట్టబద్ధం చేసిన లాటిన్ అమెరికా దేశాల్లో నాల్గవ దేశంగా అర్జెంటీనా అవతరించేది. ఈ బిల్లుకు అనుకూల, వ్యతిరేక వర్గాలు రోడ్ల మీదకు వచ్చి తమ గళాన్ని బలంగా వినిపించాయి.
భారతదేశంలో 1971లోనే అబార్షన్లకు చట్టబద్ధత లభించింది.
మరోవైపు, ఐర్లండ్ రిపబ్లిక్‌లో.. సరిగ్గా రెండు నెలల క్రితం, రెఫరెండం ద్వారా ఓటింగ్ ప్రక్రియను చేపట్టి, అబార్షన్‌కు చట్టబద్ధత కల్పించారు.
అయితే, అబార్షన్‌పై నిషేధాన్ని కొనసాగించేందుకు మద్దతుగా నిలవాలని కేథలిక్ చర్చి ప్రజలను కోరింది.
అర్జెంటీనాలోని కఠినమైన అబార్షన్ చట్టాలు ఎంతో మంది మహిళల్ని నేరస్తుల్ని చేస్తున్నాయి. అలాంటివారిలో ట్యాక్సీ డ్రైవర్ అదా, ఆమె ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు. వీరు చట్ట వ్యతిరేకంగా గర్భం తొలగించుకున్నారు. ఇప్పుడు అబార్షన్ హక్కు కోసం పోరాడుతున్న మహిళలకు మద్దతు ఇస్తున్నారు.
‘‘వద్దని అనుకున్నా తల్లిగా మారటం బాధాకరం. దానితో పోలిస్తే అబార్షన్ చేయించుకోవటం అంత బాధాకరమేమీ కాదు. ఒక మహిళ తన గర్భాన్ని తొలగించుకునేందుకు సూదిని తీసుకుంటోందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు’’ అని అదా బీబీసీతో అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
జెనీనా ఏడు వారాల గర్భవతి. గర్భనిరోధక మాత్ర విఫలం కావటంతో ఆమె గర్భవతి అయ్యారు. ఇప్పుడు ఇంట్లో పిల్ (గర్భనిరోధక మాత్ర) వాడటంపై ఆమె అవగాహన పెంచుకుంటున్నారు.
‘‘నేను ఎలాంటి సహకారం లేని మహిళగా మిగిలిపోయాను. చట్టాన్ని అతిక్రమించాను. పరిష్కారం కోసం అన్వేషిస్తున్నాను. అదేమీ సులభం కాదు. మందుల షాపుకు వెళ్లి పిల్ అడగాలంటే చాలా సిగ్గేస్తుంది" అన్నారు.
ప్రస్తుత పోప్.. పోప్ ఫ్రాన్సిస్‌కు జన్మనిచ్చిన అర్జెంటీనాలో మతాచారాలకు చాలా ప్రాముఖ్యతనిస్తుంటారు. పోప్ ఫ్రాన్సిస్‌కు.. అర్జెంటీనాలోని ఫాదర్ పెపె సన్నిహితులు. అబార్షన్ తప్పు అని ఆయన ప్రకటించారు. ఈ అంశం రాజకీయ చర్చగా మారిందన్నారు. కానీ, ఆయన ఉపదేశాలకు మధ్యతరగతి ప్రజల్లో కనిపించే స్పందన మురికివాడల్లోని ప్రజల్లో కనిపించట్లేదు.
తమ గళాన్ని బలంగా వినిపించే మత సంస్థలు ఉన్నచోట మార్పు అంత తేలిగ్గా రాదు. కానీ, నాణేనికి మరోవైపు.. అడ్డంకులు అధిగమిస్తూ, మార్పు దిశగా పయనమిస్తున్నారు అర్జెంటీనా మహిళలు.
ఇవి కూడా చదవండి:
- ఐర్లాండ్: ‘అబార్షన్లపై ఉద్యమానికి భారతీయ మహిళ మరణమే కారణం’
- ఐర్లాండ్ అబార్షన్ రెఫరెండం: ఆమె ప్రాణాలు కోల్పోయింది.. ఈమె చరిత్ర తిరగరాసింది
- సూర్యుడు సరిగ్గా మీ ఎదురుగా ఉదయించడం ఎప్పుడైనా చూశారా?
- ఇచట పెళ్లి కొడుకుల్ని అద్దెకివ్వబడును!
- చెర్రీ: హైదరాబాద్‌లో పుట్టిన అతి చిన్న పసిపాప.. ప్రిమెచ్యూర్ బేబీల జీవితాలకు కొత్త ఆశ
- న్యూజిలాండ్: ప్రసూతి సెలవు ముగించుకుని పనిలో చేరిన ప్రధానమంత్రి
- #HerChoice: పెళ్లి కాకుండానే తల్లిగా ఉండాలనుకున్నాను!
- ప్రసవం: సిజేరియన్ కన్నా సహజకాన్పుతోనే శిశువుకు మేలు
- #UnseenLives: బాలింతలైతే 3 నెలలు ఊరి బయటే: ఇదేం ఆచారం?
- జోల పాటలు, లాలి పాటలతో తల్లికి కూడా లాభమే!
- బైక్ అంబులెన్స్: రాదారిలేని కొండ కోనల్లో ఆపద్బంధువు
- తల్లిపాలు ఎంతకాలం ఇస్తే మంచిది.. రెండేళ్లా? ఐదేళ్లా?
- పీరియడ్స్ సమయంలో సెక్స్ తప్పా? ఒప్పా?
- నెదర్లాండ్స్: గర్భిణులకు వయాగ్రా, 11 మంది శిశువులు మృతి
- సెరెనా విలియమ్స్: నిరుడు గర్భవతిగా ఒక ఫైనల్లో.. నేడు అమ్మగా మరో ఫైనల్లో
- యూట్యూబ్ వీడియోలు చూసి కాన్పు, గర్భిణి మరణం: ఇంటి దగ్గర ప్రసవం మంచిదేనా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









