బిహార్ రైల్వే స్టేషన్లో విషాదం: శ్రామిక్ రైల్లో మహిళ మృతి.. తల్లి చనిపోయిందని తెలియక మృతదేహం దగ్గర ఆడుకున్న చిన్నారి

ఫొటో సోర్స్, PANKAJ KUMAR/BBC
- రచయిత, సీటూ తివారి
- హోదా, బీబీసీ కోసం
ముజఫర్‌పూర్ రైల్వే స్టేషన్లో తీసిన ఒక వీడియో బుధవారం వైరల్ అయ్యింది.
ఈ వీడియోలో ఒక మహిళ మృతదేహం స్టేషన్లో నేలమీద పడి ఉండడం కనిపిస్తుంది. ఆమె చనిపోయిందని తెలీని రెండేళ్ల బిడ్డ ఆ శవంపై కప్పిన గుడ్డను కప్పుకుంటూ, తీస్తూ ఆడుకుంటూ ఉంటాడు.
ఆ తర్వాత సోషల్ మీడియాలో ఈ వీడియో రోజంతా ఎన్నోసార్లు షేర్ అయ్యింది. జనం దీనిపై ఎన్నో కామెంట్లు పెట్టారు. ఎంతోమందిని కలచివేసిన వీడియో అది.
శ్రామిక్ స్పెషల్ రైళ్లలో కూలీల మరణాలు సంభవిస్తున్న సమయంలో, వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసి ఆ మహిళ ఆకలితో చనిపోయుండచ్చని అనుకుంటున్నారు.
బీబీసీ కూడా ఈ మహిళకు సంబంధించిన వాస్తవాలను తెలుసుకోడానికి ప్రయత్నించింది. చనిపోయిన మహిళతో కలిసి అదే రైల్లో ప్రయాణించిన ఆమె బంధువు వజీర్ ఆజంతో మాట్లాడింది.
ఆయన మాట్లాడుతూ.. “రైల్లో ఆహారానికి ఎలాంటి కొరతా లేదు. రైల్లో ఒక పూటే ఆహారం పెట్టారు. కానీ నీళ్లు, బిస్కట్లు, చిప్స్ లాంటివి అప్పుడప్పుడూ ఇస్తూనే ఉన్నారు. అయితే, ఆ నీళ్లు చాలా వేడిగా ఉండడంతో, మేం మూడు సార్లు కొనుక్కుని తాగాల్సి వచ్చింది” అన్నాడు.

ఫొటో సోర్స్, Twitter
పోస్టుమార్టం చేయలేదు
వజీర్‌తోపాటూ ఆయన మరదలు, అంటే 23 ఏళ్ల మృతురాలు అర్బీనా ఖాతున్, వజీర్ భార్య కోహినూర్, అర్బీనా ఇద్దరు పిల్లలు(రెండేళ్ల అర్మాన్, ఐదేళ్ల రహ్మన్) వజీర్ బిడ్డ ప్రయాణిస్తున్నారు.
అహ్మదాబాద్‌లో కూలి పనులు చేసుకునే వజీర్.. అర్బీనా, ఆమె భర్త ఏడాది క్రితమే విడాకులు తీసుకున్నారని బీబీసీతో చెప్పారు.
అబ్రీనా రైల్లోనే చనిపోయిందన్నారు.
ముజఫర్‌పూర్ డీపీఆర్ఓ కమల్ సింగ్ బీబీసీతో మాట్లాడుతూ.. చనిపోయిన మహిళ శవాన్ని అంబులెన్సులో కటిహార్ పంపించాం అని చెప్పారు.
అయితే మహిళ పోస్టుమార్టం గురించి అడిగిన ప్రశ్నకు ఆయన “ఆ మహిళ అనారోగ్యంతో చనిపోయింది కాబట్టి, పోస్టుమార్టం అవసరం లేదు” అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
తూర్పు మధ్య రైల్వే స్పందిస్తూ.. ‘‘09395 శ్రామిక్ స్పెషల్ రైలు మే 23న అహ్మదాబాద్ నుంచి కటిహార్ వచ్చింది. అందులో ప్రయాణిస్తున్న 23 ఏళ్ల మహిళ అర్బీనా అనారోగ్యంతో చనిపోయింది. ఆ సమయంలో అర్బీనా బావ వజీర్ ఆజం, అతడి భార్య కోహినూర్‌లతో కలిసి ప్రయాణిస్తోంది” అని తెలిపింది.
అయితే ముజఫర్‌పూర్ జంక్షన్లో స్థానిక జర్నలిస్టులకు వీడియో ఇంటర్వ్యూ ఇచ్చిన అర్బీనా సోదరి భర్త వజీర్ ఆజం ఆమెకు ఎలాంటి అనారోగ్యం లేదన్నారు.
కటిహార్ ఆజంనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మహేష్‌పూర్ పంచాయతీకి చెందిన వజీర్ ఆజం “ఆమెకు ఎలాంటి జబ్బూ లేదు, ఆమె హఠాత్తుగాచనిపోయింది అని బీబీసీతో కూడా చెప్పారు.
రాజకీయ నాయకుడు, సామాజిక కార్యకర్త యోగేంద్ర యాదవ్ ఈ వీడియోను రీట్వీట్ చేస్తూ.. ‘‘ఈ వీడియోను చూడండి. తల దించుకోండి’’ అని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
- మా ఇళ్లకు వెళ్లేదెప్పుడు? వలస కార్మికుల ప్రశ్న
- కరోనావైరస్: రోజూ నలుగురు వలస కార్మికులు చనిపోతున్నారు... లాక్డౌన్లో పెరుగుతున్న పేదల మరణాలు
- గుజరాత్ పంట పొలాలపై పాకిస్తాన్ మిడతల ‘సర్జికల్ స్ట్రైక్’... 8 వేల హెక్టార్లలో పంట నష్టం
- రెండు ఖండాల్లో, 28 మారు పేర్లతో 26 సంవత్సరాలుగా తప్పించుకు తిరిగాడు.. చివరికి ఎలా దొరికిపోయాడంటే
- సైకిల్ జ్యోతి: తినడానికీ సమయం దొరకట్లేదు, బిహార్‌లో రాజకీయ నాయకులు, అధికారులు, జర్నలిస్టులతో ‘పీప్లీ లైవ్’ను తలపిస్తున్న ఇల్లు
- గృహ హింస: ‘లాక్డౌన్ నాకు ఆలోచించుకునేంత సమయం ఇచ్చింది.. నా భర్త నుంచి నేను విడిపోవాలనుకుంటున్నా’
- భారత్-చైనాల మధ్య ఉద్రిక్తతలు ఎందుకు పెరుగుతున్నాయి? ‘సరిహద్దు’ తెర వెనుక ఏం జరుగుతోంది?
- వరంగల్ హత్యలు: ‘‘ఒక మహిళను చంపేసి.. అది బయటపడుతుందని మరో 9 మందిని చంపేశాడు’’
- ట్విటర్: డోనల్డ్ ట్రంప్ ట్వీట్‌కు ఫ్యాక్ట్ చెక్ హెచ్చరిక.. అమెరికా అధ్యక్షుడి ఆగ్రహం
- కరోనావైరస్ కేసులు: టాప్ టెన్ దేశాల్లో భారత్.. జూన్, జులై నెలల్లో దేశంలో పరిస్థితి ఎలా ఉంటుంది?
- తెలంగాణ: ‘రెండేళ్ల కిందట తప్పిపోయి, 2 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న నాన్నను టిక్‌టాక్ చూపించింది’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








