కరోనావైరస్ లాక్ డౌన్: రోడ్డుపైనే మహిళా వలస కూలీ ప్రసవం, రెండు గంటల విరామంతో సొంతూరికి మళ్లీ నడక... సుమోటోగా స్వీకరించిన ఎన్‌హెచ్‌ఆర్సీ

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

మహారాష్ట్రలోని నాసిక్‌ నుంచి మధ్య ప్రదేశ్‌లోని సొంత ఊరు సత్నాకు తన భర్తతో కలసి కాలినడక బయల్దేరిన ఓ మహిళా వలస కూలీ మార్గమధ్యంలో నడి రోడ్డుపైనే ఓ బిడ్డకు జన్మనిచ్చారు. అయితే, బిడ్డను ప్రసవించాక కేవలం 2 గంటలు విశ్రాంతి తీసుకొని ఇంకా 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ ఊరికి నడక కొనసాగించారు.

లాక్ డౌన్ కారణంగా పేదలు, వలస కూలీలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న ఉదంతాలు నిత్యం మీడియాలో వస్తూనే ఉన్నాయి. వందల కిలోమీటర్ల దూరంలోని సొంతూళ్లకు కాలినడకనే ఎంతోమంది వెళ్లడం నిత్యం జరుగుతూనే ఉంది.

ఈ మహిళ తన భర్తతో కలిసి నాసిక్ నుంచి బయల్దేరారు. మే 12న మార్గమధ్యంలోనే పురిటి నొప్పులు మొదలయ్యాయి. వెంటనే రోడ్డుపైనే ఓ బిడ్డకు జన్మనిచ్చారు. సమీపంలోని ధూళే గ్రామంలో ఓ కుటుంబం అప్పుడే పుట్టిన ఆ శిశువుకు కావల్సిన బట్టలు, ఇతర వస్తువులను వారికి అందించింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

తమ ఊరు ఇంకా 150 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో తమకు నడక కొనసాగించక తప్పలేదని భర్త తెలిపినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి.

ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘం స్పందించింది. వలస కూలీలు.. ముఖ్యంగా మహిళలు, పిల్లలు, వృద్ధులు, గర్భిణుల వెతలు చూస్తే చాలా బాధగా ఉందని వ్యాఖ్యానించింది.

నెలలు నిండిన సమయంలో ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉండాల్సిన మహిళ ఇలా నడి రోడ్డుపై బిడ్డకు జన్మనివ్వడం, ఆపై పూర్తి విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో 150 కిలోమీటర్ల దూరంలోని ఊరికి నడుచుకుంటూ వెళ్లాల్సిరావడం అత్యంత దురదృష్టకరం అని వ్యాఖ్యానించింది.

ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యమేనంటూ కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధిత మహిళ హక్కులకు ఇది భంగం కలిగించడమేనని, పేద మహిళ గౌరవంగా జీవించే హక్కును కాలరాయడమేనని అభిప్రాయపడింది. ఈ విషయంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని కమిషన్ మండిపడింది. మాతృత్వానికే ఇది అవమానమని వ్యాఖ్యానించింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

ఈ కేసును సుమోటోగా స్వీకరించిన కమిషన్.. నాలుగు వారాల్లో పూర్తి వివరణ ఇవ్వాలంటూ మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులను ఆదేశించింది. అలాగే ఆ తల్లీబిడ్డల ఆరోగ్య పరిస్థితిని, ఆ కుటుంబానికి పునరావాసం, సౌకర్యాలు కల్పిస్తే ఆ వివరాలను కూడా రాష్ట్ర ప్రభుత్వాలు తమకు సమర్పించాలని ఆదేశించింది.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది

లాక్ డౌన్ సమయంలో రెండు రాష్ట్రాల్లోని వలస కూలీలు వేధింపులకు, కష్టాలకు గురికాకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నారన్న వివరాలను కూడా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తమకు సమర్పించాలని కోరింది. మహిళా వలస కూలీల విషయంలో మహిళా వలస కూలీల చట్టం ప్రకారం ప్రభుత్వ ఆదేశాలను పాటించకుండా నిర్లక్ష్యం వహించిన ప్రభుత్వాధికారుల విషయంలో ఎటువంటి చర్యలు తీసుకున్నారో కూడా తెలియచేయాలని సూచించింది.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)